సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీని కొత్త భయం పట్టుకుంది. పార్టీని ముందు నడిపే నాయకుడు లేకపోవడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు సమాచారం.
చినబాబు భయంతో పాదయాత్రకు బ్రేక్..
► లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా
► యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని తెలుగుదేశం నిర్ణయం
► ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే పునఃప్రారంభించాలని నిర్ణయం
► అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని యోచిస్తోన్న లోకేష్
► రాజమండ్రికి వస్తే జైలుకు పోవడమొక్కటే మిగిలిందని లోకేష్‌కు సూచించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా టాప్ మేనేజ్‌మెంట్లు
► అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచన
► ఢిల్లీలో మంచి లాయర్లను ముందస్తు బెయిల్ కోసం మాట్లాడుకొమ్మని సలహా
► ఇప్పుడే పాదయాత్రకు వెళ్లాలనుకుంటే అరెస్ట్ అవుతారని సూచన
► టీడీపీ నాయకుల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్
► పాదయాత్ర సంగతి తర్వాత చూద్దాం, ఢిల్లీ హోటల్లోనే ఉంటానన్న లోకేష్.
రేపు టీడీపీ యాక్షన్ కమిటీ భేటీ..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపు(శుక్రవారం) నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ నుంచి నారా లోకేష్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా?. చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?. భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు?. ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా?. అనే దానిపై చర్చించనున్నట్లు తెలిసింది.
బాలయ్య హడావిడి అంతకే..
చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ .. తండ్రి కోసం న్యాయపరమైన, రాజకీయ మంతనాలు అంటూ ఢిల్లీకి చెక్కేశారు. ఒకట్రెండు రోజులు పార్టీ సమావేశాల పేరుతో చంద్రబాబు కుర్చీలో కూర్చుని హడావిడి చేశారు నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత ఆయన తెర మీద కనిపించింది లేదు. ప్రస్తుతం షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారనే సమాచారం. ఇక.. జైలులో ములాఖత్ అయిన జనసేన పవన్ కల్యాణ్, పొత్తు ప్రకటన చేస్తూనే వారాహికి సిద్ధమయ్యాడు. ఈ గ్యాప్‌లో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పార్ట్‌టైం రాజకీయాలతో బాబు అరెస్ట్‌ను వీళ్లే పట్టించుకోనప్పుడు.. మనకెందుకులే అని టీడీపీ ముఖ్యనేతలు అనుకుంటున్నారు. అందుకే పరిస్థితులపై మొక్కుబడి సమీక్షలు నిర్వహించడం లేదు. ఫలితంగానే.. దిశానిర్దేశానికి బదులు లోకేష్‌ను అయోమయంలోకి నెట్టేస్తున్నారు.
ఇది కూడా చదవండి: లోకేష్‌ను డైరెక్ట్ చేస్తోందెవరు? యెల్లో మీడియా ఎందుకు డీగ్రేడ్ చేస్తోంది?
Comments
Please login to add a commentAdd a comment