కరువు, చంద్రబాబు కవలపిల్లలు | Sridhar Reddy comments over Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కరువు, చంద్రబాబు కవలపిల్లలు

Published Sun, Jan 28 2024 3:59 AM | Last Updated on Mon, Feb 5 2024 11:10 AM

Sridhar Reddy comments over Chandrababu Naidu - Sakshi

పుట్టపర్తి: కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన హయాం మొత్తం కరువు రాజ్యమేలిందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన తొమ్మిది రోజులపాటు చేపట్టిన ‘వైఎస్సార్‌ రైతు విజయ  సంకల్ప పాదయాత్ర’ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించారు.

ఈ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోయారన్నారు. వైఎస్సార్‌ చలువతో హంద్రీ–నీవా కాలువ తవ్వ­­డంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం అనేక చెరువులకు నీరందుతుండడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపితే రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా సుమారు రెండు లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయ­ణ మాట్లాడుతూ సీఎం జగన్‌ పాలనలో రైతులకు అన్ని విధా­లా మేలు జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్ల­మెంట్‌ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement