Sri Satya Sai Assembly Constituencies
-
బలైపొవాలంటే.. బాబే 'కేర్ ఆఫ్ అడ్రస్'!
చంద్రబాబు రాజకీయ క్రీడలో బలైన నేతలు ఎందరో ఉన్నారు. ఆయన చరిత్ర చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం.. జెండా మోసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతి ఎన్నికల సమయంలో తన స్వార్థ బుద్ధిని చాటుకున్న ఆయన.. ఈ ఎన్నికల్లోనూ తన నైజాన్ని చాటారు. జిల్లాకు చెందిన సీనియర్లకు శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లూ వాడుకుని అర్ధంతరంగా తమను బలిపీఠం ఎక్కించడంతో వారంతా నైరాశ్యంలో మునిగిపోయారు. చివరి నిమిషం వరకూ టికెట్ ఆశచూపి ఆఖరున రూ.కోట్లకు పడగలెత్తిన వారికి పెద్దపీట వేయడంతో నాయకులు ఒక్కసారిగా కుదేలై పోయారు. బాబును నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని వాపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేసినా ఫలితమేది? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి రెండున్నర దశాబ్దాలుగా పార్టీకి కష్టపడి పనిచేశారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన కుమారుడు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేసినా ఆయన్ను దూరం పెట్టి కాంట్రాక్టర్ అమిలినేనికి సీటు ఇవ్వడంతో ఉన్నం రాజకీయ నిరుద్యోగి అయ్యారు. మరో నేత ఉమామహేశ్వరనాయుడుకూ మొండి చేయి చూపడంతో ఆయన చంద్రబాబును నమ్ముకోవడం సరికాదని, ఇక్కడ భవిష్యత్తు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జితేందర్ గౌడ్‌కూ మొండిచేయి గుంతకల్లు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామ్‌కు టికెట్ ఇవ్వడం జిల్లా మొత్తం బాబు నైజాన్ని చాటింది. మొన్నటివరకూ తిట్టిపోసిన గుమ్మనూరుకు టికెట్ ఇచ్చారు. దీంతో బాబు ఎంతటి మోసానికైనా సమర్థుడే అంటూ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు రాజకీయ క్రీడలో జితేందర్‌గౌడ్ పరాజయం పాలయ్యారని నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారు. గుమ్మనూరు చేరిక జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తోందని టీడీపీ కేడర్ భావిస్తోంది. వైకుంఠం శకం ముగిసినట్టే.. రెండు దశాబ్దాలుగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని భావిస్తున్నారు. పార్టీ అంతా నాదే అని భావించే ఆయనకు మొండిచేయి చూపి దగ్గుబాటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. ప్రసాద్ రాక వెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు చర్చ జరుగుతోంది. దీంతో ప్రభాకర్ చౌదరి రాజకీయ శకం ముగిసినట్టేనని, చేసేదేమీ లేదని ఆయన వర్గం భావిస్తోంది. నిమ్మలకు నమ్మక ద్రోహం.. ఓట్లకోసం కులం కావాలి.. డబ్బు కోసం కొత్త నేతలు కావాలి.. ఇదీ చంద్రబాబు తీరు. బీసీ వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో రెండు దఫాలు నిమ్మల ఎంపీగా చేశారు. అలాంటి వ్యక్తికి ఈ సారికి టికెట్ ఇవ్వలేదు. దీంతో చేనేత వర్గానికి చెందిన ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇక రాజకీయ శకం ముగిసినట్టేనని తెలుస్తోంది. చంద్రబాబుపై ఆయన కత్తులు నూరుతున్నారు. త్రుటిలో తప్పించుకున్న ఆ ఇద్దరు.. మరో ఇద్దరు సీనియర్ నేతలు బాబు వెన్నుపోటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఇద్దరే బీకే పార్థసార«థి, పల్లె రఘునాథరెడ్డి. చివరి వరకూ ఇద్దరికీ టికెట్లు లేవు. చివరన ఇక తప్పని స్థితిలో బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ సీటు ఇవ్వగా.. పల్లె రఘునాథరెడ్డి కోడలికి పుట్టపర్తి టికెట్ ఇచ్చారు. అయితే, ఈ ఇద్దరూ చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా చంద్రబాబు వలలో నుంచి బయటపడ్డారని పార్టీలోని నాయకులే అంటుండడం గమనార్హం. ఇవి చదవండి: మళ్లీ పలికిన బాబు చిలక -
టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్‌కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది. పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది. పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది. ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్‌ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు. పోటీలో తల్లా.. కొడుకా? రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గ్రూపులు వెంటాడుతున్నాయి పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్‌గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. -
కరువు, చంద్రబాబు కవలపిల్లలు
పుట్టపర్తి: కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన హయాం మొత్తం కరువు రాజ్యమేలిందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన తొమ్మిది రోజులపాటు చేపట్టిన ‘వైఎస్సార్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర’ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోయారన్నారు. వైఎస్సార్ చలువతో హంద్రీ–నీవా కాలువ తవ్వడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం అనేక చెరువులకు నీరందుతుండడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపితే రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా సుమారు రెండు లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. -
ఓర్వలేకే కుట్రపూరిత రాతలు
ధర్మవరం: అబద్ధాల పునాదులపై నిలబడ్డ ఈనాడు దినపత్రిక అవాస్తవాలు ప్రచురిస్తూ, అమాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న కుట్రలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చులకన చేసి, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నిరాధార కథనాలు రాస్తున్న ఈనాడు అంతు చూస్తానని, పరువు నష్టం దావా వేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం ధర్మవరం మండలం దర్శినమల గ్రామంలో వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈనాడు కథనంలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలంటూ ఆధారాలతో సహా వివరించారు. ప్రతిరోజూ ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ పేరిట తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిలో ఒకడిగా మమేకం అవుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2008 సంవత్సరం నుంచి తాను నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నప్పటి నుంచి చేస్తున్నానన్నారు. దీన్ని ఓర్వలేక స్థలాలు, భూములు కబ్జా చేసేందుకు తిరుగుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేశ్, నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో చెప్పాలన్నారు. తనపై ఏఒక్క బాధితుడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబును గద్దె ఎక్కించేందుకు రామోజీరావు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. గతంలోనూ తాను ఈనాడులో రాసిన కథనాలు తప్పుడు రాతలని కోర్టులో నిరూపించానన్నారు. పదేపదే తప్పుడు రాతలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని, తగిన బుద్ధి చెబుతానని ఆయన హెచ్చరించారు. మా పాఠశాలంటే ప్రభుత్వ పాఠశాల ధర్మవరం పట్టణంలోని కార్పొరేట్ స్కూళ్లపై ఫిర్యాదులు రాగా.. నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు తొమ్మిది నెలల సమయం ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. అప్పటికీ వారి తీరు మారకపోవడంతో కార్పొరేట్ పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. అంతేతప్ప టీడీపీ వాళ్లలాగా ఏ ఒక్కరితోనూ లాలూచీ పడలేదన్నారు. తాను ‘గుడ్‌మారి్నంగ్ ధర్మవరం’లో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎదురైతే ‘మా స్కూల్లో చదవండి’ అని చెబుతానని, మా స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాల అని వివరించారు. దీంతో తనకేవో పాఠశాలలున్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందన్నారు. అలాగైతే శ్రీరాం, సూరి రూ. 200 కోట్ల పనులు చేసేవారా? తన క్వారీలోనే కంకర కొనాలని ప్రజలను బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. అదే నిజమైతే తన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్‌కు చెందిన సిద్ధార్థ కంపెనీ, బీజేపీ నేత సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రూ. 200 కోట్ల వరకూ విలువైన రైల్వే, బైపాస్‌రోడ్డు పనులు చేసేవా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా తన వద్ద కంకర కొనడం గానీ, పర్సంటేజీలు గానీ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. కబ్జా చేసినట్లు ఒక్క ఆధారమైనా ఉందా? నియోజకవర్గంలో ఎక్కడైనా తాను సెంటు భూమి కబ్జా చేసినట్లు ఒక్కరైనా ఆరోపించారా అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. తాను రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి తుంపర్తి వద్ద ఫాంహౌస్ కట్టుకున్నానని తెలిపారు. దాన్ని కూడా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన ఫాంహౌస్‌లో ఆక్రమణలు లేవంటూ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టును ఆయన ఈ సందర్భంగా చూపించారు. నియోజకవర్గంలో ఇసుకను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే ఇందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. గతంలో గరుడంపల్లి వద్ద సోలార్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన వారు వస్తే.. అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి డబ్బులు భారీగా డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఏర్పాటు చేయకుండానే వారు పారిపోయారన్నారు. ఆ తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీ ఢిల్లీ వారి నుంచి భూములు కొనుగోలు చేసిందని, ఏడాది తర్వాత తాను మార్కెట్ ధర చెల్లించి ఆ భూములు కొన్నానని వివరించారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. -
హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. ‘‘99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ‘‘టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తాం. టీడీపీ- జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు అధిగమిస్తాం. ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది ని ఉపయోగించటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే’’ అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బ్రో.. ఇది దొంగ ఓటు!