
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు.
‘‘99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
‘‘టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తాం. టీడీపీ- జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు అధిగమిస్తాం. ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది ని ఉపయోగించటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే’’ అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: బ్రో.. ఇది దొంగ ఓటు!
Comments
Please login to add a commentAdd a comment