Hindupuram Assembly Constituency
-
హిందూపురంలో బాలకృష్ణకు ఎదురీత తప్పదా?
ఎన్నికల వేళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. హిందూపురం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత నలభై సంవత్సరాలుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. అయితే ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు హిందూపురం ఓటర్లు గట్టిగానే గుణపాఠం చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినీ హీరో బాలయ్య హిందూపురంలో ఎదురీదుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 2,49,174 మంది ఓటర్లు ఉండగా. 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఎన్ దీపిక పోటీ చేయగా..ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. నందమూరి కుటుంబానికి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గానికి పేరుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 1985 నుంచి వరుసగా మూడు సార్లు, ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఒకసారి హిందూపురం నుంచే గెలిచారు.2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మా బ్లడ్ వేరు..మా బ్రీడ్ వేరు అంటూ డప్పు కొట్టుకునే బాలకృష్ణకు బీసీ మహిళ అయిన కురుబ దీపిక చుక్కలు చూపించారు. నియోజకవర్గం అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లారు. తాను హిందూపురం కోడలినని.. తనకు ఓటు వేస్తే హిందూపురంలోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. తనను రెండుసార్లు అసెంబ్లీకి పంపించిన హిందూపురం ప్రజల బాగోగులను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు.తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ..హిందూపురంలో తన తరపున పీఏలను ఏర్పాటు చేసి ప్రజాగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ. అందుకే ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో బాలకృష్ణకు వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్లు చర్చ జరుగుతోంది. హిందూపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలు పెద్దసంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోంది. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందో అని సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ టెన్షన్ కు గురవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఖచ్చితంగా హిందూపురంలోనూ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.మూడోసారి గెలవాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఆపసోపాలు పడ్డారు. పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండి..నియోజకవర్గం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి..ఇప్పుడు తనను ఈసారి గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తానంటూ చెప్పిన కబుర్లు ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీయే విశ్వసనీయత కోల్పోగా..ఆయన బావమరిదిగా బాలకృష్ణ కూడా అదే బాటులో పయనించి ప్రజలకు దూరమయ్యారు. అందుకే ఈసారి హిందూపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగిందని చెబుతున్నారు. -
బాలయ్యకు ఎదురుదెబ్బేనా?
1985 నుంచి హిందూపురంలో టీడీపీ హవా కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మూడు సార్లు హిందూపురం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ మూడోసారి గెలవాలని ఆపసోపాలు పడ్డారు. కానీ రెండుసార్లు గెలిపించిన ప్రజల్ని పట్టించుకోని బాలయ్యకు హిందూపురం ఓటర్లు ఈసారి గట్టిగా గుణపాఠం చెప్పారనే టాక్ నడుస్తోంది. పోటెత్తిన ఓటర్ల మనోభావాలు గమనిస్తే ఈసారి ఫ్యాన్ గిర్రున తిరిగిందనే చెబుతున్నారు.హిందూపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటమి అంచుకు చేరారు. 2019లో రెండోసారి గెలిచిన తర్వాత గడచిన ఐదు సంవత్సరాలలో కేవలం 57 రోజులు మాత్రమే హిందూపురంలో గడిపారు. చుట్టపు చూపుగా పెళ్లిళ్లకు, పేరంటాలకు వచ్చి వెళ్లే బాలకృష్ణ అప్పుడప్పుడు తన అభిమానులపై చేయి చేసుకోవడం తప్ప హిందూపురం అభివృద్ధిపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గళం విప్పలేకపోయారు. గెలిచిన అనంతరం పీఏలకు పెత్తనం అప్పగించడం, బాలయ్యకు హిందూపురం నియోజకవర్గం పట్ల ఏమాత్రం అవగాహన లేకపోవడం, సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేశారు. తాజా ఎన్నికల్లో పోలైన ఓట్లను బట్టి చూస్తే కచ్చితంగా బాలకృష్ణ ఓడిపోతాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం నియోజకవర్గం అభివృద్ధి మీద గట్టిగా కేంద్రీకరించింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన తాబేదార్లకు పెత్తనం ఇవ్వడంతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవడానికి అధికార పార్టీ రంగంలోకి దిగింది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ పార్టీలతో నిమిత్తం లేకుండా అందించారు.ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు చేరాయి. పైగా ఈసారి బాలకృష్ణ మీద కురుబ దీపిక అనే మహిళను బరిలో దించారు. స్థానికురాలైన దీపిక నియోజకవర్గంలోని ప్రతీ గడపకు వెళ్ళారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని భరోసా ఇచ్చారు. అటు ఎమ్మెల్యే కంటికి కనిపించకపోవడం.. ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిత్యం ప్రజల్లోనే ఉండటంతో ప్రజలకు ఎవరేంటో పూర్తిగా అర్థమైంది.టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుతో అక్కడి పార్టీ కేడర్ కూడా విసిగిపోయింది. ఆరు నెలలకోసారి వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయే వ్యక్తి అవసరమా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గంతో సంబంధం లేని బాలకృష్ణను గెలిపించడం వల్ల స్థానిక నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని.. పైగా తమకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నారనే అసంతృప్తి కూడా బాగా పెరిగింది. బాలకృష్ణ భార్య వచ్చి ప్రచారం చేసినా, బాలకృష్ణే స్వయంగా ప్రచారం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలు కూడా సరిగా పనిచేయలేదు. నియోజకవర్గంలోని కేడర్ అంటీముట్టనట్లుగా ఉండటంతో బాలకృష్ణ ఓటమికి బాటలు వేసినట్లైంది.మొత్తంగా అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమ పథకాలతో హిందూపురంలో ఫ్యాన్ స్పీడ్‌కు ఎదురు లేకుండా పోయింది. తనకు హ్యాట్రిక్ విజయం సాధ్యం కాదని బాలకృష్ణకు కూడా బాగానే అర్థమైంది. అందుకే ఆఖరులో ఎమ్మెల్యే కూడా అంత యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొనలేదని టాక్ నడుస్తోంది. మొత్తం మీద 1985 నుంచి హిందూపురంలో తిరుగుతున్న సైకిల్‌కు ఈసారి పంక్చర్ తప్పదని అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా చెబుతున్నారు. -
CM Jagan In Hindupuram: మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
-
హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. ‘‘99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ‘‘టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తాం. టీడీపీ- జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు అధిగమిస్తాం. ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది ని ఉపయోగించటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే’’ అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బ్రో.. ఇది దొంగ ఓటు!