సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు.
పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు.
తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment