అనంత టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు | Political Differences In Anantapur TDP | Sakshi
Sakshi News home page

అనంత టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

Published Thu, Jan 18 2024 1:28 PM | Last Updated on Fri, Feb 2 2024 8:13 PM

Political Differences In Anantapur TDP  - Sakshi

అనంతపురం: అనంతపురం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది. జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

జేసీ దివాకర్ రెడ్డి,  ప్రభాకర్ వర్గీయులు ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. 

ఇదీ చదవండి: NTR Ghat-Jr NTR Banners: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు.. జూ.ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement