Ananthapur Assembly Constituencies
-
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల సమావేశంలో పుత్రోత్సాహం చూపించారు. కలెక్టరేట్లో అభివృద్ధి, సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ కుమారుడు వీక్షిత్ హాజరయ్యారు. వీక్షిత్కు ఏ పదవీ లేకపోయినా అధికారులు పెద్దపీట వేశారు. సమావేశంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వీక్షిత్ హాజరవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నామినేషన్ల పర్వం షురూ..
అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు కాస్త మందకొడిగా సాగింది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కేవలం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్ఓ వినోద్‌కుమార్ వద్ద సోషలిస్టు యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థిగా బి.నాగముత్యాలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థిగా శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన శ్రీరంగరాజులు గోపినాథ్ నామినేషన్ వేశారు. ఆ ఒక్క అసెంబ్లీ స్థానం మినహా.. జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆ పార్టీ నేతలు ఆర్ఓకు పత్రాలు అందజేశారు. ఎస్‌యూసీఐ (సీ) పార్టీ అభ్యర్థిగా డి.రాఘవేంద్ర నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సాకే రాజేష్‌కుమార్ నామినేషన్ వేశారు. రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.బి. చిన్నప్పయ్య నామినేషన్ దాఖలు చేశారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగరాజుల గోపినాథ్ నామినేషన్ వేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తామని అనంతపురం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయన కలెక్టరేట్లోని ఆర్ఓ చాంబర్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు ఉంటుందన్నారు. 26న పరిశీలన నిర్వహిస్తామన్నారు. ఉపసంహరణకు 29వ తేదీ ఆఖరన్నారు. ఎన్నికల పోలింగ్ మే 13న ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న నిర్వహిస్తామన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్‌తో పాటు జత చేయాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించి చెక్‌లిస్ట్ ఇస్తారన్నారు. ఆ ప్రకారం పత్రాల్లోని అన్ని గడులు తప్పక పూరించాలన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచించారు. నామినేషన్ దాఖలు క్రమంలో ఏదైనా సందేహం వస్తే సిబ్బందిని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ల సందర్భంగా ఆర్ఓ కార్యాలయం వద్ద ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇవి చదవండి: టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే.. -
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. తక్షణమే ఆర్థిక సహాయం!
అనంతపురం, ఫిబ్రవరి 19: "రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో భాగంగా రాప్తాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఇద్దరు బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు." 1. అనంతపురం నగరంలోని కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్‌ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 2. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాచూరి ఝాన్సీ మాట్లాడుతూ.. తాను వికలాంగురాలినని, తనుకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు రాచూరి ఝాన్సీకి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్‌కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్‌కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది. పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది. పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది. ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్‌ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు. పోటీలో తల్లా.. కొడుకా? రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గ్రూపులు వెంటాడుతున్నాయి పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్‌గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. -
వసూళ్లు ‘కాలువై’ పారాయి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు. డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్‌కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్‌లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో భారీగా దందా.. ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
అధికారం 'టీడీపీ'దే నని పచ్చ పత్రికల్లో రాతలు : ఎమ్మెల్యే అనంత
అనంతపురం: జిల్లాకు కృష్ణా జలాల రాక ఆలస్యం కావడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. హంద్రీ–నీవా గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1985లో హంద్రీ–నీవాకు ఓడీసీ వద్ద ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే.. 1995లో చంద్రబాబు ఉరవకొండలో 40 టీఎంసీలుగా శంకుస్థాపన చేసి నాలుగేళ్లు ఏమీ చేయకుండా 1999లో దాన్ని 5 టీఎంసీలకు కుదించారని, అప్పట్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఫౌండేషన్ ఖర్చులు కూడా ఇవ్వలేని చరిత్ర బాబుదని ధ్వజమెత్తారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హంద్రీ–నీవా పనులు వేగవంతం చేశారన్నారు. అప్పట్లో తాను ఎంపీగా ఉన్నానని, 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి నీరు తీసుకువచ్చామన్నారు. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయని, అది మహానేత వైఎస్సార్ చలవేనన్నారు. హంద్రీ–నీవాను 3,850 క్యూసెక్కుల నుంచి 6వేలకు పెంచుతామని చెప్పి కనీసం గంపెడు మట్టి తీయని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీ పాలనలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరువు విలయతాండవం ఆడడంతో వలసలు పెరిగాయన్నారు. రెయిన్గన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్లకు అధిపతి అయిన చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారన్నారు. 2019లో ఉమ్మడి అనంతపురంలో రెండు సీట్లు టీడీపీకి వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వస్తుందని పచ్చ పత్రికల్లో రాతలు రాసుకుని భ్రమల్లో బతుకుతున్నారన్నారు. ఇవి చదవండి: విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరండి: సుప్రీంకోర్టు -
ఓర్వలేకే కుట్రపూరిత రాతలు
ధర్మవరం: అబద్ధాల పునాదులపై నిలబడ్డ ఈనాడు దినపత్రిక అవాస్తవాలు ప్రచురిస్తూ, అమాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న కుట్రలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చులకన చేసి, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నిరాధార కథనాలు రాస్తున్న ఈనాడు అంతు చూస్తానని, పరువు నష్టం దావా వేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం ధర్మవరం మండలం దర్శినమల గ్రామంలో వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈనాడు కథనంలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలంటూ ఆధారాలతో సహా వివరించారు. ప్రతిరోజూ ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ పేరిట తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిలో ఒకడిగా మమేకం అవుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2008 సంవత్సరం నుంచి తాను నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నప్పటి నుంచి చేస్తున్నానన్నారు. దీన్ని ఓర్వలేక స్థలాలు, భూములు కబ్జా చేసేందుకు తిరుగుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేశ్, నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో చెప్పాలన్నారు. తనపై ఏఒక్క బాధితుడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబును గద్దె ఎక్కించేందుకు రామోజీరావు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. గతంలోనూ తాను ఈనాడులో రాసిన కథనాలు తప్పుడు రాతలని కోర్టులో నిరూపించానన్నారు. పదేపదే తప్పుడు రాతలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని, తగిన బుద్ధి చెబుతానని ఆయన హెచ్చరించారు. మా పాఠశాలంటే ప్రభుత్వ పాఠశాల ధర్మవరం పట్టణంలోని కార్పొరేట్ స్కూళ్లపై ఫిర్యాదులు రాగా.. నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు తొమ్మిది నెలల సమయం ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. అప్పటికీ వారి తీరు మారకపోవడంతో కార్పొరేట్ పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. అంతేతప్ప టీడీపీ వాళ్లలాగా ఏ ఒక్కరితోనూ లాలూచీ పడలేదన్నారు. తాను ‘గుడ్‌మారి్నంగ్ ధర్మవరం’లో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎదురైతే ‘మా స్కూల్లో చదవండి’ అని చెబుతానని, మా స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాల అని వివరించారు. దీంతో తనకేవో పాఠశాలలున్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందన్నారు. అలాగైతే శ్రీరాం, సూరి రూ. 200 కోట్ల పనులు చేసేవారా? తన క్వారీలోనే కంకర కొనాలని ప్రజలను బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. అదే నిజమైతే తన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్‌కు చెందిన సిద్ధార్థ కంపెనీ, బీజేపీ నేత సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రూ. 200 కోట్ల వరకూ విలువైన రైల్వే, బైపాస్‌రోడ్డు పనులు చేసేవా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా తన వద్ద కంకర కొనడం గానీ, పర్సంటేజీలు గానీ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. కబ్జా చేసినట్లు ఒక్క ఆధారమైనా ఉందా? నియోజకవర్గంలో ఎక్కడైనా తాను సెంటు భూమి కబ్జా చేసినట్లు ఒక్కరైనా ఆరోపించారా అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. తాను రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి తుంపర్తి వద్ద ఫాంహౌస్ కట్టుకున్నానని తెలిపారు. దాన్ని కూడా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన ఫాంహౌస్‌లో ఆక్రమణలు లేవంటూ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టును ఆయన ఈ సందర్భంగా చూపించారు. నియోజకవర్గంలో ఇసుకను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే ఇందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. గతంలో గరుడంపల్లి వద్ద సోలార్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన వారు వస్తే.. అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి డబ్బులు భారీగా డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఏర్పాటు చేయకుండానే వారు పారిపోయారన్నారు. ఆ తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీ ఢిల్లీ వారి నుంచి భూములు కొనుగోలు చేసిందని, ఏడాది తర్వాత తాను మార్కెట్ ధర చెల్లించి ఆ భూములు కొన్నానని వివరించారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. -
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్‌గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. -
‘అలా చేస్తే పయ్యావుల కూడా టీడీపీలో మిగలడు’
అనంతపురం, సాక్షి: ఎన్నికలొచ్చినప్పుడే పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఒక్కరైనా ఉండేవారా?.. ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. ..ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు అని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా అని విశ్వేశ్వర్‌రెడ్డి తన ప్రసంగం ముగించారు. -
అనంత టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
అనంతపురం: అనంతపురం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది. జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ వర్గీయులు ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదీ చదవండి: NTR Ghat-Jr NTR Banners: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు.. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు -
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్‌లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
‘స్టాంప్ పేపర్‌పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
డబ్బుకు బాబు దాసోహం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త క్యాండిడేట్ల కోసం టీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ఓట్లను డబ్బుతోనైనా కొని గెలవాలని నిర్ణయించుకుని దండిగా డబ్బున్నవారికోసం వలవేస్తోంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు వంటి వారిని బరిలోకి దింపాలని చూస్తోంది. అనంతపురం జిల్లాలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేందుకు కొందరు సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు, నాయకులకు శరాఘాతంగా మారాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి, కనకమేడల, టీజీ వెంకటేష్ వంటి బడావ్యాపారులకు సీట్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అనుసరించబోతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బడా కాంట్రాక్టర్‌ను దించాలని యోచిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అక్కడ పార్టీకి పనిచేస్తున్న వారిని ఈసారి పక్కన పెట్టొచ్చని విశ్వసనీయంగా తెలిసింది. గుంతకల్లు నియోజకవర్గంలో ఇప్పటివరకూ పనిచేసిన అభ్యర్థులను కాదని, ఒక సీఐ స్థాయి పోలీసు అధికారిని నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రెండుసార్లు పరిటాల సునీత పోటీ చేశారు. ఇప్పుడు బాగా డబ్బున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెరమీదకు వచ్చారు. ఈయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈయనకు టికెటిస్తే రూ.50 కోట్లయినా ఖర్చు చేయగలరని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఈసారి రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వకుండా దీపక్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అగ్రకులాల చేతిలో రిజర్వుడు స్థానాలు మడకశిర, శింగనమల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు మొత్తం ఆర్థిక బలమున్న అగ్రకులాల చేతుల్లోకి వెళ్లింది. పార్టీకి పనిచేసిన వాళ్లకు కాకుండా డబ్బున్న వాళ్లు ఎవరికి చెబితే వారికే దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకూ శింగనమలకు బండారు శ్రావణి, మడకశిరకు ఈరన్న పేర్లను ఖరారు చేయకుండా నాన్చుతున్నారు. రూ.10 కోట్లయినా ఖర్చు చేయగలిగే వాళ్లకే ఇక్కడ టికెట్లు ఇవ్వాలనేది బాబు యోచన. మిగిలిన స్థానాల్లోనూ ఆర్థిక బలమున్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నారు. -
గుంతకల్లులో బడుగు, బలహీనవర్గాల విజయ యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో బడుగు, బలహీన వర్గాల ప్రజలు విజయ యాత్ర చేశారు. వైఎస్సార్సీపీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్ర పట్టణంలో పండగ వాతావరణాన్ని నింపింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సాధికార నినాదంతో గుంతకల్లు హోరెత్తింది. పట్టణ ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. యువత కేరింతలతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు యాత్రకు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రంలా కనిపించింది. సభ ఆద్యంతం ‘జై జగన్.. జైజై జగన్’, ‘గిరగరా తిరగాలి ఫ్యాన్’ అంటూ నేతలతో కలిసి నినాదాలు చేశారు. అణగారినవర్గాల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ : ఎంపీ సురేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించి, తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం జగన్ చేసిన మేలు వల్లేనని అన్నారు. సంక్షేమంలో, అన్ని పదవుల్లో అగ్రస్థానం ఈ వర్గాలకే కేటాయించారని తెలిపారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేసి, సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్ ఆదర్శనీయుడని, ఈరోజు దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే మరోమారు నట్టేట ముంచుతారని, ఆయన్ని నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్న సీఎం వైఎస్ జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది విజయ యాత్ర: ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రాష్ట్రంలో విజయయాత్ర చేస్తున్నారని, ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవేనని ప్రభుత్వ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ చెప్పారు. మనల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి న సీఎం వైఎస్ జగన్‌కు మనం ఇచ్చే గిఫ్ట్ ‘వై నాట్ 175’ అని అన్నారు. గత ఎన్నికల్లో గుంతకల్లు ప్రజలు 50 వేల మెజార్టీతో వెంకటరామిరెడ్డిని గెలిపించారని, ఈసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వెంటే నడుద్దాం: మాజీ మంత్రి ఎం. శంకరనారాయణ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సామాజిక న్యాయం సాధించిన సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ చెప్పారు. మనందరినీ అభివృద్ధిలోకి తెచ్చి , సమాజంలో గౌరవ స్థానం కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారని చెప్పారు. అదే వర్గాలను సీఎం జగన్ ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగింది: ఎంపీ తలారి రంగయ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చి న ప్రాధాన్యతతో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగిందని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ. 1,500 కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంతటి మేలు చేసిన వైఎస్ జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. -
ఉరవకొండలో ఉరిమిన ఉత్సాహం
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కల్పించిన సముచిత స్థానాన్ని తెలియజేసేందుకు చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ జైత్రయాత్రలా సాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సభా వేదిక ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ ప్రాంతమంతా జన సంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు తరలివచ్చి బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని వక్తలు పేర్కొనడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్సీపీకి అండగా ఉందాం: హఫీజ్‌ఖాన్ ఓట్ల కోసం రాజకీయాలు చేసే వాళ్లు వద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేద వర్గాలను వంచించారన్నారు. ఆయన హయాంలో కనీసం ఆరు హామీలు కచ్చితంగా అమలు జరిగాయని ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానన్నారు. పేద వర్గాలను ఎప్పుడూ బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగనన్నకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. జగనన్న అవసరం మనకు ఉందని, ఆయన్ను ఎప్పటికీ మరచిపోవద్దని హఫీజ్‌ఖాన్ చెప్పారు. మోసగాళ్ల వైపు చూడొద్దు: తలారి రంగయ్య రా.. కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోందని, అయితే.. ఇప్పటికే వచ్చి తాము (బడుగు, బలహీనవర్గాలు) ఇక్కడ కూర్చున్నామని, ఇంకెవరు వస్తారు.. ఎక్కడికి కదులుతారు అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. మోసగాళ్ల వైపు చూడొద్దని, సింహం లాంటి జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ మొదలుకుని స్థానిక సంస్థల వరకు జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన జగనన్నను ఎలా మరచిపోగలమన్నారు. బలమైన వర్గాలుగా మార్చిన ఘనత జగన్‌దే : మాజీమంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీమంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రీ సామాజిక సాధికారతకు కృషిచేయలేదన్నారు. 70 శాతం బలహీన వర్గాల వారే పదవుల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. సాధికారత కోసం జగన్ తపన : వై.విశ్వేశ్వరరెడ్డి అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల సాధికారత కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరితపించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయా వర్గాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. పెత్తందారుల వద్ద చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంగా నిలబడే స్థాయికి తెచ్చారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు, పెత్తందారుల మధ్య పోటీ ఉంటుందని, పేద వర్గాలే గెలుస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈనాడు ఫొటోగ్రాఫర్‌కు జనం మందలింపు.. ఇక ఉరవకొండలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీల ఫొటోలు తీస్తున్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌ను జనం మందలించారు. ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే.. సభ ముగిసి జనం వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఖాళీగా కన్పించిన కుర్చీలను ఈనాడు ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తుండగా అక్కడున్న కొందరు దీనిని గమనించారు. సభ ముగిసిపోయిన తర్వాత ఎందుకు ఫొటోలు తీస్తున్నావంటూ ప్రశ్నించారు. ఇందుకు అతను దురుసుగా ప్రవర్తించడంతో జనం మందలించారు. దుష్ప్రచారం చేసేందుకు ఇలాంటి కుయుక్తులు మంచివి కాదని హితవు పలికారు. దీంతో ఫొటోగ్రాఫర్ అక్కడి నుంచి జారుకున్నాడు. -
కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో ఐ-టీడీపీ కార్యకర్త సతీశ్ లైంగిక వేధింపులు
-
మాటల్లేవ్.. ఇది చేతల ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం
వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించిన నేతలు అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి..విజయయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. ‘బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అణిచివేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకుని అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఆయన తెచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయి’ అని చెప్పారు. రాప్తాడు సాధికార మహోత్సవం అపూర్వం సాక్షి,అమరావతి/రాప్తాడు రూరల్: ఫ్యాక్షన్‌ను తోసిరాజని అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నియోజకవర్గం అయిన రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం అపూర్వ రీతిలో ఉత్సవంలా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ ప్రజలు విజయయాత్ర చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం. సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు పోటెత్తారు. సీఎం జగన్ నామస్మరణతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగనే గెలవాలి .. జగనే కావాలి’ అంటూ ఒకే గళమై నినదించారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు : కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ దేశ చరిత్రలో సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. సీఎం జగన్ అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఇక్కడికి వచ్చిన జనాలే సాక్ష్యమన్నారు. మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి.. లేదంటే వద్దని ధైర్యంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను మరింతగా అణచివేసిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు పార్టీకే గ్యారంటీ లేదు కానీ ప్రజలకు ష్యూరిటీ ఇస్తాడట అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నతంగా బతుకుతున్నారు: మంత్రి మేరుగు ‘మంత్రివర్గంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్ పర్సన్ ఈ వర్గాల వారే. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లోనూ ఈ వర్గాలకే ప్రాధాన్యం. నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్ద పీట. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఈ వర్గాలు ఉన్నతంగా బతుకుతున్నాయి. ఇదే అసలైన సామాజిక సాధికారత’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అవహేళనకు, హింసకు గురైన ఈ వర్గాలు ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతున్నాయని వివరించారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోక కత్తిరిస్తా, బీసీలు జడ్జీలుగా పనికి రారంటూ రకరకాలుగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. బాబు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ కాల రాశారన్నారు. అన్ని వర్గాలను ఆదరించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం: ఎంపీ నందిగం సురేష్ జగనన్న సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం నడుస్తోందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ప్రతి కులానికీ దన్నుగా నిలిచారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, పార్టీ పదవుల్లో 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారని, సీఎం వైఎస్ జగన్ దేవుడు పంపిన వ్యక్తి అని అన్నారు. మనల్ని ఆదుకున్న జగనన్నకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. నేడు రాయదుర్గంలో బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సాధించిన అభివృద్ధిని, సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో యాత్ర అద్భుత రీతిలో జరిగింది. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
‘అడ్డంకులెన్నొచ్చినా ఏపీలో సంక్షేమం ఆగలేదు’
సాక్షి,అనంతపురం:ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ‘టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. తన ముగ్గురు భార్యలకు పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం సాధ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టి మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు’ అని సురేష్ గుర్తు చేశారు. ‘ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు. జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి’ అని సురేష్ తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’ అని ఎంపీ మాధవ్ కొనియాడారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ ‘ఎస్సీ ఎస్టీ బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం లభించింది’ అని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శంకర్ నారాయణ, డాక్టర్ తిప్పేస్వామి, అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, డీసీసీబీ చైర్మన్ లిఖిత, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..