Thopudurthi Prakash Reddy
-
కాకమ్మ కథలు చెప్పొద్దు.. మీ ఇగో పక్కన పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయండి
-
ప్రజాస్వామ్యాన్ని డాకూగా బాలకృష్ణ దోపిడీ చేశాడు: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
పరిటాల శ్రీరామ్ కి తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్..
-
సీబీఐ విచారణకు సిద్ధమా?.. పరిటాల శ్రీరామ్‌కు తోపుదుర్తి సవాల్
అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్ చెప్పడం సరికాదు. ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్ ప్రకాష్ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. -
చంద్రబాబు, ఎలో మీడియాకు తోపుదుర్తి కౌంటర్
-
పవన్ సంచలన వ్యాఖ్యలు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్..
-
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. ఎలా పడితే అలా మాట్లాడితే..
-
చర్చి, మసీదు అనే వ్యాఖ్యలు ఎందుకొచ్చాయ్ పవన్
-
వంద రోజుల శాడిస్ట్ పాలన.. తోపుదుర్తి మాస్ కామెంట్స్
-
టీడీపీ, ఎల్లో మీడియాకు తోపుదుర్తి కౌంటర్
-
YSR విగ్రహాల కూల్చివేత
-
ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్...తోపుదుర్తి కౌంటర్
-
జగన్ సీఎం అయితే..లక్ష్మీదేవి ఇంటికి నడిచొస్తది
-
నిరూపిస్తే రాసిస్తా.. చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్
సాక్షి, అనంతపురం: తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా.. నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి’’ అని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ తోపుదుర్తి మండిపడ్డారు. ‘‘రాప్తాడు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా?. పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?. చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు. వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది’’ అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
చంద్రబాబు, ఎల్లో మీడియాకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
-
రాప్తాడు నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి
-
‘స్టాంప్ పేపర్‌పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పీచ్ కి దద్దరిల్లిన రాప్తాడు
-
మహాతల్లి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా..? పరిటాల సునీతకి కౌంటర్
-
చంద్రబాబు పెద్ద ఆర్థిక దొంగ.. ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్
-
రోగం వచ్చింది కనుకే బాబు బెయిల్‌పై విడుదల అయ్యారు: తోపుదుర్తి
-
బీసీ జనగణనపై అసెంబ్లీలో చర్చ
-
పవన్ పై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్
-
చంద్రబాబు ఓ గజదొంగ: ఎమ్మెల్యే తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: చంద్రబాబు ఓ గజదొంగ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు 40 వేల కోట్ల దోపిడీ కి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు.. చంద్రబాబు ఏరోజైనా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించారా? ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. బాబు శిలాఫలాకాలు వేయడం తప్పిస్తే ఏం చేశారు?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రశ్నించారు. ‘‘నీ దోపిడీలు గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతావా?. విజయ డెయిరీని చంపేసిన ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు. సహకార వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు సహకార వ్యవస్థను మేం గాడిన పెడుతున్నాం. చంద్రబాబు రైతుల రక్తాన్ని పీల్చిన రక్త పిశాచి. అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా మార్చావు. ఇళ్ల నిర్మాణం గురించి బాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు’’ అని మండిపడ్డారు. జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోంది. చంద్రబాబులా పేదలను దోచుకునే అలవాటు మాకు లేదు. బాబు బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారు. ప్రజలను దోచుకున్నదెవరో అందరికీ తెలుసు’’ అని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. -
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తు: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
-
కియా ఎలా వచ్చిందో తెలుసుకో లోకేష్ కు తోపుదుర్తి కౌంటర్..
-
రాయలసీమ రైతుల గొంతు కోసింది చంద్రబాబే
అనంతపురం టవర్‌క్లాక్: రాయలసీమ జిల్లాల్లోని రైతుల గొంతు కోసింది టీడీపీ అధినేత చంద్రబాబేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అడ్డగోలు వ్యవహారాల వల్లే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయన్నారు. అప్పట్లో ప్రాజెక్టుల ఎత్తు పెంచినా నోరు మెదపలేదన్నారు. రెండో విడత అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినా అభ్యంతరం చెప్పలేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడు అప్పర్ భద్రకు ఎలాంటి కేటాయింపులు, అనుమతులు రాలేదని గుర్తు చేశారు. 2010లో 9 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తే 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిందన్నారు. ఈరోజుకు కూడా అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు లేవన్నారు. 2017లో టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు కోసం స్టేజ్–2 అనుమతులు వచ్చాయన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు అధికార యావకు నేడు రాయలసీమలో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కపటనాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. తొలి నుంచి జలవనరుల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మాయ మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చాడని విమర్శించారు. -
‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’
అనంతపురం సప్తగిరి సర్కిల్: అసెంబ్లీకి గానీ, పంచాయతీ సర్పంచ్ స్థానానికి గానీ, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేశ్.. అలాంటి వ్యక్తి ‘యువగళం’ పేరుతో యాత్ర చేసినా వైఎస్సార్సీపీకి వచ్చే నష్టమేమీ లేదు’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన అనంతపురంలో జరిగిన వైఎస్సార్సీపీ కన్వీనర్ల సమావేశానికి ముందు మంత్రి ఉషశ్రీచరణ్‌తో కలిసి తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారన్నారు. ఫోర్ ట్వంటీ వ్యక్తులు టీడీపీకి నాయకత్వం వహిస్తున్నారని, ఫేక్ సర్వేలతో కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు చానళ్లు, నలుగురిని కూటమిగా పెట్టుకుని ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారన్నారు. అసలు రాష్ట్రంలో టీడీపీ ఉనికే లేదన్న విషయం గుర్తించాలన్నారు. 150 నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. అయినా అధికారంలోకి వస్తే తాము ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. వారిలా మేమూ అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. ప్రచార యావతో ప్రజలను చంపడమే మీ ధ్యేయమా అని టీడీపీ నేతలను ప్రకా‹Ùరెడ్డి ప్రశ్నించారు. భూములు, స్థలాలు ఆక్రమించడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం టీడీపీ నేతలకు అలవాటని విరుచుకుపడ్డారు. ఇప్పుడేదో సచీ్చలురు అన్నట్లు మాయమాటలు చెప్తూ.. వైఎస్సార్సీపీని ఓడించండని ప్రజలకు పిలుపునిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న భాషను మహిళలు చీదరించుకుంటున్నారని అన్నారు. -
తోబుట్టువుగా తోడుంటా చెల్లెమ్మా..!: ఎమ్మెల్యే తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ప్రతి ఇంటా ఆనందంగా ఉండాలన్నదే నాకోరిక ..మీకు ఏ సమస్య వచ్చినా తోబుట్టువుగా తోడుంటా అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అక్కచెల్లెమ్మలకు అభయమిచ్చారు. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో మూడురోజులుగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. శనివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆయన సతీమణి మనోరమ కలిసి తోపుదుర్తి గ్రామంలో ఆడపడుచులకు వడిబియ్యం పెట్టారు. పట్టు చీరలు, పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళా తనకు ఆడపడుచుతో సమానమని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా నిలిచారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో త్వరలోనే మహిళా సహకార డెయిరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గార్మెంట్స్ పరిశ్రమల ద్వారా ఎంతో మందికి త్వరలోనే మహిళలకు ఉద్యోగాలు అందిస్తామని తెలిపారు. ఆడపడుచుల ఆశీర్వాదాలు ఉన్నంత వరకూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని ఆపలేరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: (తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్) -
పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు
సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు. భాష తప్పే.. భావం కరెక్ట్ చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు. ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు.. పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి షాకింగ్ కామెంట్స్
సాక్షి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. కాగా, తోపుదుర్తి ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిటాల అనుచరుడు జగ్గుతో నా తల్లిని తిట్టించారు. తల్లిని తిడితే కొడుకులకు బాధ ఉండదా?. జగ్గు వ్యాఖ్యలను ఏ టీడీపీ నేత కూడా ఖండించలేదు. ఎవరిది తప్పో.. ఎవరికి ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికి ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి కుటుంబాలను పరిటాల రవి చంపించారు. మద్దెలచెర్వు సూరిని చంపించింది పరిటాల సునీతే. మా సోదరుడు చందుని పరిటాల రవి చంపుతా అన్నారు. నన్ను చంపుతానని పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారు. హింసా రాజకీయాలపై పరిటాల సునీత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పరిటాల ఫ్యామిలీపై తోపుదుర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ చర్యలు ఫ్యాక్షన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి. 2019 తర్వాత నెత్తురు చుక్క పడకుండా పాలన చేస్తున్నానమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, తోపుదుర్తి ప్రకాశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆధిపత్యం కోసం పరిటాల కుటుంబమే హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది. 25 ఏళ్లుగా పరిటాల కుటుంబం జిల్లాలకు చేసిందేమీ లేదు. టీడీపీ చర్యలు జిల్లాలో ఫ్యాక్షన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలతో అనంతపురం జిల్లాకు చెడ్డపేరు తీసుకురావద్దు. రాజకీయాలకు అతీతంగా రాప్తాడులో అభివృద్ధి చేశాము. చంద్రబాబు హెరిటేజ్ దోపిడీకి నష్టపోయిన పాడి రైతులకు డెయిరీ పెట్టి మరీ అడ్డుకున్నాము అని వ్యాఖ్యలు చేశారు. -
రాప్తాడు ఎమ్మెల్యే తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిటాల సునీత అనుచరుడు అరెస్ట్
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిపై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద ఆమె తనయుడితో కలిసి హల్చల్ చేశారు. చదవండి: (షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..) -
‘కిరాయి హంతకుడి తరుఫున ధర్నా చేస్తారా?.. సిగ్గుచేటు’
సాక్షి, అనంతపురం: పరిటాల సునీత ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరుపై మండిపడ్డారు. కిరాయి హంతకుడు గంటాపురం జగ్గు తరుఫున ధర్నా చేస్తారా?.. మహిళలను కించపరిచిన వ్యక్తిని మీరెలా సమర్థిస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. గంటాపురం జగ్గుకు అండగా నిలవడం సిగ్గుచేటు అని మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లి పై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునే బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్నా చేపట్టారు. దీన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఖండించారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన గంటాపురం జగ్గుకు మద్దతుగా ఆందోళన చేయడం పరిటాల సునీతకు తగదన్నారు. చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! -
ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు
సాక్షి, రాప్తాడురూరల్: ‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్‌విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? 1994లో నిన్ను (రామకృష్ణ) అనంతపురం ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నిన్ను నువ్వు అమ్మేసుకున్నావ్. పరిటాల కుటుంబానికి రాసిచ్చేశావు. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు. ఈ జిల్లాకు నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా నన్ను ఏవిధంగా విమర్శిస్తావ్. పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పది మందిని వెంటేసుకుని వచ్చి డ్రామా నడిపి పోతావా? సోము వీర్రాజు కూడా నా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు పత్రిక రాసిందల్లా నిజాలని భావించడం తగదు. అది లూటీ ఇండస్ట్రీస్ పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భూముల కోసం ప్రయత్నించింది. పెట్టుబడులు పెడతామని అనేక రాష్ట్రాలకు వెళ్లిన సంస్థ ఎక్కడా పెట్టింది లేదు. పై మూడు రాష్ట్రాల్లో వాటి జీఎస్టీ నంబర్లు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ వ్యాపారాల్లేవు. కానీ రాప్తాడు అడ్రెస్‌తో ఉన్న ఆ సంస్థ జీఎస్టీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆరోజుల్లో వంద కోట్ల విలులైన భూములు కేవలం మూడు కోట్ల రూపాయలకు కంపెనీకి కేటాయించడంతో తప్పుమంత్రి ముడుపులు ఆశించారు. ఈ క్రమంలోనే కాంపౌండ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. భూములు ఇచ్చింది మీరు..లంచం అడిగింది మీరు..ఎగ్గొట్టి పోయింది పేజ్ ఇండ స్ట్రీస్. మరి ఇందులోకి మేము ఎక్కడి నుంచి వచ్చాం? పేజ్ ఇండస్ట్రీస్‌ను రమ్మని పిలవండి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంగా లక్షా 50 వేల చదరపు అడుగుల ఫ్యాక్టరీని నేను నిర్మించి ఇస్తా. అప్పటికీ వారు రాకపోతే ఏమనుకోవాలి? వారు రాకపోయినా వేరే సంస్థలైతే కచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు 20 సంస్థల ప్రతినిధులతో మాట్లాడాం. డిపాజిట్లు రావని తెలిసీ పరారీ మంత్రం రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసే పరిటాల కుటుంబం పరారీ మంత్రం పఠిస్తోంది. ధర్మవరం, పెనుకొండ సీట్లు అడుగుతోంది. కానీ చంద్రబాబు ఆ సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నారు. మీరు రాప్తాడులోనే పోరాడాలి. ఇక్కడ మీరు గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టర్‌నైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పరిటాల కుటుంబం రాజ్యమేలినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో వేలాదిమంది వలసలు వెళ్లారు. ఈ రోజు చెరువుల నిండా నీళ్లున్నాయి. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. ఆయకట్టు కళకళలాడుతోంది. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. పది వేలమంది పాడి మహిళా రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీ నిర్మిస్తున్నా. రైతులకు ఉచితంగా ఆరు వేల బోర్లు వేయిస్తున్నాం. ఇది చూసే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. రైతుల పేరుతో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉంద’ని అన్నారు. సమావేశంలో రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ, నాయకులు ఆది, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జాకీని అడ్డుకుంది అప్పటి పప్పు, తుప్పు మంత్రులే
అనంతపురం: జాకీ ఇంటర్నేషనల్ కంపెనీని అడ్డుకున్నది అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పప్పు, తుప్పు మంత్రులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన సంస్థతో తనకు ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఎక్కడ జాకీ, ఎవరి జాకీ, ఎక్కడుంది జాకీ? ఈ సంస్థకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటైనా నిర్మాణం జరిగిందా’ అని ప్రశ్నించారు. అదో దోపిడీ ఒప్పందం ‘జాకీ దుస్తులు ఉత్పత్తి చేసే పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.2.80 కోట్లకే ఇచ్చారు. 2017లో భూమి కేటాయించి 2018లో సేల్ డీడ్ చేశారు. మూడేళ్లు నడిపితే సేలబుల్ రైట్స్ ఇచ్చారు. వారు ఉద్యోగాలు కూడా దశలవారీగా ఇస్తామన్నారు. తొలుత వెయ్యి మందికి, మూడేళ్లకు రెండు వేల మందికి, ఆ తర్వాత దశలవారీగా 6 వేలమందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్‌లో చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి విద్యుత్తు సరఫరా, తాగు నీటి సదుపాయానికి కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా క్యాపిటల్ సబ్సిడీ దాదాపు రూ.15 కోట్లు ఇచ్చేలా, వడ్డీ సబ్సిడీ ఆరు శాతం ఏడేళ్ల పాటు.. అంటే రూ.42 కోట్లు, భూమికి రూ.130 కోట్లు, ఇవి కాకుండా వారు చెబుతున్న ప్రకారం 6 వేల మంది ఉద్యోగుల జీతాలపై సబ్సిడీ ఏడేళ్లకు రూ. 130 కోట్లు కలిపి మొత్తం రూ.300 కోట్లకు పైగా దోచిపెట్టేలా ఒప్పందం జరిగింది. తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్ విలువ కేవలం రూ.40 కోట్లే. దాని డీపీఆర్ పెంచుకుని రూ.300కోట్లు దోచుకోవాలని పన్నాగం పన్నారు. ఆ సంస్థ 2017లో సివిల్ పనులు ప్రారంభించి, 2018 ఆగస్టు నాటికి ఫ్యాక్టరీ, బిల్డింగ్లు పూర్తి చేసి, 2018 అక్టోబరులో ఉత్పత్తి చేస్తామన్నారు. ఇంత హడావుడిగా షెడ్యూలు ఇచ్చిన ఆ సంస్థ ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదు? బేరాలు కుదరలేదా?’ అని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ‘ఆరోజు పప్పు మంత్రి నారా లోకేష్, తుప్పు మంత్రి పరిటాల సునీత చీకటి ఒప్పందం చేసుకున్నారు. తుప్పు మంత్రి కొడుకు, తమ్ముడు పోటీ పడి జాకీ కంపెనీ కాంపౌండ్ వాల్ నిర్మించాలని అనుకున్నారు. వారిద్దరూ కలిసి 2018 జూన్‌లో వంద మీటర్ల పనులు ప్రారంభించారు. మధ్యలోనే ఆపేశారు. హిందూపురంలో పది ఎకరాల్లో టెక్సో్పర్ట్ వచ్చింది. వారికి ప్రైమ్ ల్యాండ్ ఇవ్వలేదే? ఇక్కడేమో జాకీకి ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారు. అయినా ఎందుకు రాలేదు? మీ చేతగానితనానికి మాపై విమర్శలు చేస్తారా’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఎన్టీఆర్ కుమార్తెను చంద్రబాబు పెళ్లి చేసుకోకుంటే..’
రాప్తాడు(అనంతపురం జిల్లా): ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ చరిత్ర కలిగిన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాప్తాడులో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ పేద, దళిత, బడుగు బలహీన వర్గాల వారిని అంటరానివారిగా చూసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆయన మాట్లాడిన మాటలను ఇంకా ఎవరూ మరిచిపోలేదన్నారు. మోసగాళ్లు అని తెలుసుకుని ప్రజలు ఓట్లతో తరిమినా ఇంకా బుద్ధి రాకపోవడం శోచనీయమన్నారు. చదవండి: టీడీపీ నేత వంగలపూడి అనితకు బ్యాంకు నోటీసులు భారతమ్మ గురించి మీకేం తెలుసు..? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు,బలహీన, దళిత, గిరిజన వర్గాల వారికి రాజకీయంగా పదవులు కట్టబెట్టి అన్నింటా పెద్దపీట వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. లంచాలు, దళారులు లేకుండా పేదవాడి ఖాతాల్లోకే డబ్బు జమ చేస్తుండడం పచ్చ కళ్లు చూడలేకపోతున్నాయని విమర్శించారు. పేదల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎంను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన కుటుంబసభ్యులపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతిని దూషించడం భావ్యం కాదన్నారు. మంచి తల్లిగా, పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న భారతమ్మపై లేనిపోని అభాండాలు మోపుతుండడం దుర్మార్గమన్నారు. దైనందిన జీవితంలో తనకు ఎదురవుతున్న అన్ని అడ్డంకులు ఎదుర్కొని రాణిస్తున్న వైఎస్ భారతమ్మ మహిళలందరికీ ఆదర్శమని, అలాంటి మహిళ గురించి ఏం తెలుసని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆడవాళ్లతో రాజకీయం చేయడం మీకే చెల్లు.. జీవిత కాలం ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం టీడీపీ నాయకులకే చెల్లని ఎమ్మెల్యే అన్నారు. ‘ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చంద్రబాబు వెలుగులోకి వచ్చాడు. లేకపోతే ఎవరో కోన్ కిస్కా. పప్పు లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్తు కోసమే ఎన్టీఆర్ కుటుంబంలో పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా నాయన పేరు చెప్పడం, వంశం పేరు చెప్పడమో జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు అత్తగారి కుటుంబం గురించి చెప్పకుంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా అందరూ ఆమెను గౌరవిస్తారు. కానీ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబే తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రమంతా తిరిగినా ప్రజల నుంచి ఆదరణ లభించకపోవడంతో మీడియా ముందు దొంగ ఏడుపులు ఏడ్చాడు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసం కుటుంబంలోని మహిళలను బజారులోకి ఈడ్చుకున్న దౌర్భాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించావ్? వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఉనికి చాటుకునేందుకు నానా యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసిన ఘన కార్యమేంటో చెప్పాలని నిలదీశారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత మందికి ఇళ్లు కట్టారు, ఉపాధి కల్పించారు అనే విషయాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బంధువులు, టీడీపీ నాయకులు అమరావతిలో భూములు కొనుక్కొన్నారు కనుకనే రాజధాని అక్కడే కట్టాలంటూ రభస చేస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీని కాపాడుకునేందుకే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఆయన విమర్శించారు. సంక్షేమంలో మన రాష్ట్ర ఆదర్శం.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశస్థాయిలో పేరు సంపాదించారని ఎమ్మెల్యే కొనియాడారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా అర్హులందరికీ కుల, మత, పారీ్టలకతీతంగా సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద వాటిని నిర్మించుకునేందుకు రూ.15 వేలు ఇస్తే ఆ డబ్బును కూడా తిన్న సిగ్గు లేని వ్యక్తులు టీడీపీ నాయకులు అని విమర్శించారు. నీరు–చెట్టు పథకం ద్వారా వేల కోట్ల నిధులు మింగిన ఘనులు ఆ పార్టీ నేతలని దుయ్యబట్టారు. గడపగడపకూ ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్న తమకు టీడీపీ నాయకుల అరాచకాల గురించి ప్రజలు వివరిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీకుతాం, పొడుస్తామని ఓ తెలుగుదేశం నాయకుడు అంటున్నాడు. నేడు మా ప్రభుత్వమే ఉంది. ఈ పొద్దు మేం అనుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ మా నాయకుడు ఆదేశించినట్లుగా సంయమనంతో పోతున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంకోసారి సీఎం, ఆయన కుటుంబం గురించి అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. -
Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త
సాక్షి, అనంతపురం: ‘నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులపై నోరుపారేసుకోవద్దు. ఎన్నో ఏళ్లు నేరాలు చేస్తూ చట్టానికి చిక్కకుండా తిరిగిన ఎందరినో పోలీసులు కటకటాలపాలు చేశారు. జాగ్రత్తగా మసలుకో.. లేకుంటే నీకూ అదే గతి పడుతుంది’ అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. రామగిరి పోలీసులపై శ్రీరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా దౌర్జన్యం, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టి నిర్మించుకున్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చెప్పినట్టు టీడీపీ చరిత్ర కూడా మసకబారిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చేస్తాం.. ఏమైనా చేసేస్తాం అనే కలలు కనడం మాని.. వాస్తవంలోకి రావాలన్నారు. రామగిరి పోలీసులపై ‘కొడకల్లారా’ అంటూ అనుచితంగా మాట్లాడిన శ్రీరామ్‌ను పోలీసులు కూడా తిరిగి మాట్లాడితే.. అంతటి అవమానకరం మరొకటి ఉండదని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. పరిటాల కుటుంబ నియంతృత్వ, పెత్తందారీ పోకడలు చరిత్రలో కలిసిపోయాయని, ప్రస్తుతం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లిలో పోలీసులు నీతి, నిజాయితీతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత ప్రజల బానిస సంకెళ్లు తెగిపోయాయన్నారు. మీ వద్ద ఉన్న రౌడీషీటర్లు, హంతకులు, దౌర్జన్యపరుల ఆటలు ఇకపై సాగబోవన్నారు. పరిటాల సునీత తమ్ముడిపై కూడా రౌడీషీట్ ఓపెన్ చేసి పలక పట్టించిన పోలీసులు ఉన్నారన్నారు. జాగ్రత్తగా మసలుకోకుంటే నీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘పోలీసులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నీవు గన్మెన్లు లేకుండా తిరుగు.. అప్పుడు తెలుస్తుంది దమ్ము, ధైర్యం ఎంత ఉందో’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు గన్మెన్లను పెంచాం, మేము రక్షించుకునే ప్రాణాలు కనుక మిమ్మలను స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం. అది తెలుసుకొని మసులుకో శ్రీరామ్. మీరు చరిత్ర డప్పు కొట్టుకోవడం కాదు... మిమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయరు తెలుసుకో’ అని అన్నారు. మీరేం చేశారు.. మేమేం చేశామో తెలుసుకుంటాం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాము బిజీగా ఉన్నామని.. త్వరలోనే మీ ఊరికి కూడా వస్తామని.. అక్కడ మీరు ఏమి చేశారు.. మా ప్రభుత్వం ఏమి చేసింది.. ఏమి చేస్తోందో ప్రజల ద్వారానే తెలుసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 26వేల ఓట్ల తేడాతో ప్రజలు మిమ్మల్ని ఓడించినా ఆత్మావలోకనం చేసుకోలేకపోతున్నారని శ్రీరామ్‌ను ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు చతికిలపడ్డారని గుర్తు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టత ఇచ్చినా దిగజారుడు విమర్శలు చేయడం తగదన్నారు. రాబోవు రోజుల్లో టమాట రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిశ్రమలకు వేలాది ఎకరాలు కేటాయించి అభివృద్ధికి దోహదపడతామన్నారు. విలేకరుల సమావేశంలో అనంతపురం జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ నాయకత్వంలో ఇళ్ల ముగింటకే సంక్షేమం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు
-
‘రక్తం పారించిన చరిత్ర మీది.. నీళ్లు పారించిన చరిత్ర మాది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వర్గాలుగా విడగొట్టి ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు ప్రైవేటు సైన్యాలతో దాడులు చేయించారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని అంతమొదించడానికి కుట్రలు చేశారన్నారు. చదవండి: చంద్రబాబు సభలో ‘పరిటాల’ అనుచరులు రచ్చరచ్చ.. చంద్రబాబు నైజం నిన్న బయటపడింది. రక్తం పారించే చరిత్ర మీదైతే.. నీరు పారించిన చరిత్ర మాది. ఎలాగైనా గెలవాలి.. పౌరుషంగా పోరాడండని రెచ్చగొడుతున్నారు. దశాబ్దాల పాటు రక్తం పారిన ప్రాంతంలో నీరు పారించాం. మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశామని తోపుదుర్తి అన్నారు. ‘‘రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్లిపోయావ్.. కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇది చాలదా నిన్ను ఆర్థిక ఉన్మాది అనడానికి అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. -
మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తా: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, రాప్తాడు: పదవులు ముఖ్యం కాదు..నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమని, ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయవాడ నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యే వస్తుండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి 150 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా బయల్దేరి సాయంత్రం రాప్తాడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదని తాను ఎక్కడ బాధపడతానోనని అధైర్యపడొద్దు..మీ వెంట మేమున్నాం..అందరం కలిసి టీడీపీని సమాధి చేద్దాం అని చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. సామాజిక సమీకరణలు, అనుభవరీత్యా పెద్దలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జగన్మోహన్రెడ్డి మనసు నిండా ఎప్పటికీ తాను ఉంటానన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క...నేటి నుంచి ఒక లెక్క...మీరందరూ కోరుకున్నట్లే మీ అందరితో ఉంటా.. మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తానని అన్నారు. అభివృద్ధి విషయంలో తగ్గేదేలే.. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలేదని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో 2024 కల్లా మూడు రిజర్వాయర్లను పూర్తి చేసి, లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో గార్మెంట్స్ పరిశ్రమను రాప్తాడులో 12 ఎకరాల్లోనే స్థాపించి, 6 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. రూ.30 కోట్లతో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నారు. జూన్‌లో తోపుదుర్తి సహకార మహిళా డెయిరీని ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల సునీత 28 ఎకరాల్లో 6 వేల మందికి ఉపాధి అని చెప్పి, ప్రహరీ కూడా కట్టలేదన్నారు. నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని, ఇప్పటికి 14,800 ఇళ్లు మంజూరు చేశామన్నారు. 2024లో టీడీపీని భూస్థాపితం చేస్తాం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో నాకు అవకాశం దక్కపోవచ్చని, 2024 ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిస్తామన్నారు.టీడీపీ హయాంలో జాకీ వెళ్లిపోతే దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు మూడేళ్ల తర్వాత జాకీ పోయిందని అంటున్నారన్నారని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీకి జనం ఎప్పుడో జాకీలు ఇప్పేశారని, ఇంజిన్ కూడా కూలిపోయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు, టీడీపీకి ఉనికి ఉంటుందన్నారు. సోషల్‌మీడియా, ఎల్లో మీడియాను ఉపయోగించి, తమ కుటుంబంపై నిందలు వేస్తున్నారని, మీలాగా దోపిడీకి అధికారాన్ని అడ్డం పెట్టుకోలేదన్నారు. 30 ఏళ్లుగా వేలాది కోట్లు సంపాదించారని, ఆక్రమించిన భూమి ఎంతో..సర్వే నంబర్లతో సహా ప్రకటించినా సిగ్గురాలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పవన్ అవసరం రాష్ట్రానికి, రైతులకీ లేదు
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవసరం ఇటు రాష్ట్రానికి కానీ, అటు రైతులకు కానీ లేనేలేదని అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి పవన్‌తో చెప్పించుకోవాల్సిన అవసరంలేదని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నామని.. కాబట్టి అనంతపురం జిల్లాకు వచ్చి ప్రజలను మోసం చెయొద్దని పవన్‌కు ప్రకాష్‌రెడ్డి హితవు పలికారు. అలాగే, యువతనూ తప్పుదోవ పట్టించొద్దని, అభిమానుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడు అని స్పష్టంచేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని.. సీఎం వైఎస్ జగన్ వారికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. మూడేళ్లుగా వర్షాలూ సమృద్ధిగా కురుస్తున్నాయని.. రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. పవన్‌ది రాజకీయ పర్యటన ఇక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.30 లక్షల దాకా సపోర్టు మనీ అంటూ, వచ్చిన పవన్‌కళ్యాణ్ రాజకీయాల ప్రస్తావన లేదంటూనే రాజకీయాలు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ పవన్ పుట్టపర్తిలో ల్యాండ్ అయిన ప్రదేశానికి పక్కనే ఉన్న బుక్కపట్నం చెరువు నుంచి గ్రామసభ నిర్వహించిన మన్నీల వరకు ప్రతీ చెరువు నీటితో కళకళలాడుతోందన్నారు. అవేవీ పవన్‌కు కనిపించడంలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీలు కట్టలేక, పంటలకు గిట్టుబాటు ధరలేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఏ రోజూ పవన్ పరామర్శకు రాలేదని విమర్శించారు. పైగా అప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. కానీ, సీఎం జగన్ ఆనాడు వేల మందితో రైతుభరోసా యాత్రచేస్తే ప్రభుత్వం దిగొచ్చి హడావిడిగా చెక్కులు పంపిణీ చేసిన విషయాన్ని తోపుదుర్తి గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అనంతపురంలోనే ఆత్మహత్య చేసుకున్న 84మంది రైతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సీఎం అయ్యాక పరిహారం అందించారని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. టీడీపీ హయాంలో మీరు రూ.5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడితే, ఆ పరిహారాన్ని రూ.7 లక్షలు చేస్తూ, సీఎం జగన్ చట్టం చేశారని తెలిపారు. రైతులకు బాబు, పవన్‌లు ఏమి ఒరగబెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక.. గత ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసిందని, కానీ రైతులకు ఏం చేసిందని తోపుదుర్తి ప్రశ్నించారు. పైగా రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి, డిస్కమ్‌లకు రూ. 27వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టారన్నారు. కానీ, పవన్ ఇవాళ శ్రీరంగ నీతులు చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు బినామీ పవన్.. ఇక పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతీమాట టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టే అని ప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 21 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు గురించి పవన్ ఎనాడూ మాట్లాడరని.. బహిరంగంగా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన దాని గురించి మాట్లాడటానికి పవన్‌కు నోరు రాదన్నారు. -
టీడీపీ హయాంలోనే జరిగింది.. ఆ లేఖ ఎందుకు దాసిపెట్టారు:తోపుదుర్తి
-
అందుకే వివేకా అల్లుడు ఆదినారాయణరెడ్డితో స్నేహం చేశాడు: తోపుదుర్తి
సాక్షి, తాడేపల్లి: వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. వివేకా హత్య కేసు ద్వారా టీడీపీకి పునర్ వైభవం వస్తుందని కలలు కంటున్నారు. కేసు విచారణలో ఉండగానే నిందలు వేస్తున్నారు. వీలైతే జగన్మోహన్రెడ్డిపై కూడా నింద వేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆ మూడు నెలల కాలంలో ఏం తేల్చారు..? టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన హత్య ఇది. ఆ మూడు నెలల కాలంలో ఏమి తేల్చగలిగారు..?. ఎంతో మంది అధికారులు ఎన్ని విధాలుగా హింసించినా నిందితులు వాస్తవాలు చెప్పలేదు. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆదినారాయణ రెడ్డి జిల్లాలో మంత్రి. ఆయన ఆస్తులను రెండో కుటుంబానికి ఇస్తాడనే భయంతో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఆదినారాయణ రెడ్డితో స్నేహం చేశాడు. హత్య రోజు లభ్యమైన లేఖ విషయాన్ని టీడీపీ, పత్రికలు ఎందుకు ప్రస్తావించడం లేదు. దాన్ని దాచి ఉంచమని చెప్పింది ఎవరు. సీబీఐ ఆ లేఖను మరణ వాంగ్మూలంగా ఎందుకు తీసుకోలేదు..?. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఎందుకు విచారించడం లేదు. చదవండి: (నెల రోజుల్లో 13 పార్కులను ప్రారంభించబోతున్నాము: మంత్రి అనిల్) ఆ తీరు చూస్తుంటే అనేక అనుమానాలు టీడీపీ నాయకులు, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిల మధ్య జరుగుతున్న సంభాషణలు బయటకు రావాలి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తికి వారసుడు కావాలని భావించాడు. లోకేష్ మీ బాబాయిని మీరు ఎలా చూసుకుంటున్నారో.. అలానే సీఎం జగన్ వాళ్ళ బాబాయిని చూసుకుంటాడు అనుకుంటున్నారా..?. విచారణ సంపూర్తిగా బయటకు రావాలని ఆ రోజు సీబీఐ విచారణ కోరితే సిట్ వేసింది చంద్రబాబే. ఎప్పుడైతే సునీత తమ చేతల్లోకి వచ్చారో అప్పటి నుంచి చంద్రబాబు రాజకీయం మొదలెట్టాడు. హత్య చేయించింది చంద్రబాబా...? చేసింది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే అనుమానాలు ఉన్నాయి. వెంటనే వారిని విచారించాలని డిమాండ్ చేస్తున్నాం. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) వాళ్లే హత్య చేసి దాన్ని 2019 ఎన్నికలో వాడుకోవాలని కుట్ర చేసి ఉంటారు. సాక్షులను ముద్దాయిలా మారుస్తున్న తీరు చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆ రోజు జగన్‌పై సీబీఐ కేసులో చేసిన విధంగానే ఇప్పుడూ చేస్తున్నారు. జగన్‌ని ఎదుర్కోలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. వివేకా హత్యను వైఎస్ కుటుంబంపై నింద మోపి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వీటన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని' ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
లేఖను సిబిఐ ఎందుకు మరణ వాంగ్మూలంగా పరిగణించడం లేదు?
-
బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది:తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
-
బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ‘‘పరిటాల శ్రీరామ్.. జూనియర్ ఆర్టిస్ట్ బాబూ... బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది. మా నాన్న పుట్టుకతోనే శ్రీమంతుడు. మా పూర్వీకులకు 200 ఎకరాలు భూమి ఉండేది. మీలా మేము అవినీతి చేసి దోచుకోలేదు. ప్రజాసేవలో మా డబ్బే ఖర్చు చేశాం’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల శ్రీరామ్ అనే జూనియర్ ఆర్టిస్టుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. ఒకసారి రాప్తాడు అని, మరో సారి ధర్మవరం నుంచి పోటీ చేస్తానని చెప్పడం చూస్తే రానున్న ఎన్నికల్లో టికెట్ ఎక్కడ ఇస్తారో...ఆ పార్టీలో అతని స్థానం ఏమిటో తెలుస్తోందన్నారు. ‘‘బాబూ జూనియర్ ఆర్టిస్టు... నీ రాజకీయ ఎత్తుగడలు రాప్తాడులో నావద్ద చూపు... అంతేగానీ ధర్మవరం కేతిరెడ్డి వద్ద చూపావనుకో...ఆయన నా అంత మంచోడు కాదు. ముందు మీ పార్టీలో మీకు టిక్కెట్ ఇస్తారో లేదో మీ అధినాయకుడు వద్దకు వెళ్లి తెల్చుకో... అప్పుడు రాజకీయాలు చేయి’’ అని హితవు పలికారు. మీరు, మీ కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన ఆస్తులకు ప్రజా పోరాటం అని చెప్పడం తగదన్నారు. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే...వారికి అన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో లెక్క చెప్పాలని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్) తామేదో చేశామని పరిటాల శ్రీరామ్ చెబుతున్న ప్రాంతం రాప్తాడు నియోజకవర్గంలోకే రాదన్నారు. అక్కడ తమకు ఎలాంటి భూమి లేదన్నారు. తాము పరిటాల కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన భూమి, ఆస్తుల వివరాలు అడిగితే.. వాటిపై మాట్లాడకుండా అసత్యాలు, కల్ల్లబొల్లి మాటలు చెప్పడం తగదన్నారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై వారం వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతామన్నారు. తమ చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఉంటామనీ, పార్టీ అభివృద్ధికే శ్రమిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
బాబుది కుట్రపూరిత మనస్తత్వం
అనంతపురం సెంట్రల్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం హత్యా రాజకీయాలకు కూడా వెనుకాడరని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ గాల్లోనే కలిసిపోతాడంటూ వ్యాఖ్యానించడం చంద్రబాబు కుట్రపూరిత మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మల్లాది వాసు అనే వ్యక్తి వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులను హత్య చేయడానికి రూ.50 లక్షల సుపారీ ఇస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించినా ఒక్క టీడీపీ నాయకుడూ ఖండించకపోవడం శోచనీయమన్నారు. గతంలో పరిటాల రవిని ముందుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు చేశారని, ఇప్పుడూ అలాంటి వారిని తయారు చేయడానికి మల్లాది వాసు అభిమాన సంఘం అంటూ జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళా ఎమ్మెల్యే (లక్ష్మీపార్వతి)ని నిండు సభలో అవమానించి కౌరవ సభను నడిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మగౌరవ సభల పేరుతో నాటకాలాడుతున్నారని అన్నారు. మాది గౌరవసభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యున్నతి కోసం అనేక పథకాలు, చట్టాలను తీసుకొస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం నడుపుతున్నది గౌరవ సభ అని తోపుదుర్తి చెప్పారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ, వైఎస్సార్సీపీ కండువా వేయలేదన్నారు. అదీ తమ నైతికత అని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వంశీని ఆ పార్టీ నేతలే అనరాని మాటలు అంటుంటే కౌంటర్‌గా చేసిన వ్యాఖ్యలను శాసన సభలో మాట్లాడినట్లు చంద్రబాబు వక్రీకరించడం తగదన్నారు. భార్యను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న దుర్మార్గుడు బాబు అని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.3.57 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళితే.. వైఎస్ జగన్ ఒకవైపు ఖర్చులు తగ్గించుకుంటూ, మరోవైపు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. సుమారు 39 లక్షల మందికి రుణ విముక్తి కల్పించే ఓటీఎస్ పథకాన్ని కూడా బాబు తప్పుబడుతున్నారని విమర్శించారు. -
Badvel Bypoll: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపఎన్నికల అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, ఎన్నికల ఇన్చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మండల నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఐటీలో ‘అనంత’ వెలుగులు: తొలి ఐటీ పరిశ్రమ
అనంతపురం సెంట్రల్: జిల్లాలో తొలి ఐటీ పరిశ్రమ త్వరలోనే ఏర్పాటవుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం దాదులూరు సమీపంలో హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్లు నెలకొల్పేందుకు కార్బన్ సంస్థ చైర్మన్ సుర్ అసిజా, గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురం శివారులోని హార్మొనీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోల్డెన్ గ్లోబ్ కంపెనీ ఎండీ రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన శంఖారావ సదస్సు వేదికగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. హార్మొనీ సిటీని 120 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మరో ఐదు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఇది వరకే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. హార్మొనీ సిటీ కార్బన్ ఐటీ టవర్ పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా చూస్తామన్నారు. ఐటీ టవర్ల నిర్మాణం పూర్తయ్యాక దాదాపు ఐదు వేల మంది వరకు ఐటీ రంగ నిపుణులకు, పరోక్షంగా మరో ఐదు వేల మంది వరకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం హోటల్ కాంప్లెక్స్, మూవీ కాంపెక్స్‌లు, సూపర్ మార్కెట్ కాంప్లెక్స్, హెల్త్ క్లబ్‌లతో పాటు అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కంపెనీ ఎండీ రవికుమార్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో తమను భాగస్వాములు చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. -
ఆశావర్కర్ అనిత కేసు ఓ డ్రామా
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత బురద రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఆశావర్కర్ అనితను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సీఐ విజయభాస్కర్ వెల్లడించారు. చెర్లోపల్లిలో లైంగిక వేధింపులపై ఆశావర్కర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే, నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించారు. అనిత కేసు ఓ డ్రామాగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తారని అనిత అపోహ పడిందని సీఐ విజయభాస్కర్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో అనిత కేసు పెట్టిందని సీఐ పేర్కొన్నారు. అనిత ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా, ఆమె పాయిజన్ తీసుకోలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని సీఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. పరిటాల సునీత మహానటి.. సాక్షి, అనంతపురం: రాప్తాడు మండలం చెర్లోపల్లి ఆశావర్కర్ ఘటనను టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పరిటాల సునీత చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ పరిటాల వర్గమే అని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్ అనిత టీడీపీ ట్రాప్‌లో పడిందని తెలిపారు. పరిటాల సునీత మహానటి అనే విషయం అందరికీ తెలిసిందేనని, తాజాగా ఆశా వర్కర్ ఘటనను రాజకీయం చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఓ చిరుద్యోగిని అడ్డుపెట్టుకుని రాజకీయానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆశా వర్కర్ అనిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆశా వర్కర్ కుటుంబం వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, తమలో తమకే చిచ్చు పెట్టేందుకు సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల శ్రీరాంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తానేనని శ్రీరాం ఒప్పుకున్నా... ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర
పావగడ: పేరూరు డ్యామ్‌కు ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని కేటాయించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు చేపట్టిన 28 కి.మీ పాదయాత్రలో ఎంపీ మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తితో పాటు భారీ ఎత్తున రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చలువతోనే ‘పేరూరు’కు నీళ్లు ప్రభుత్వ నిర్ణయంతో అనంతపురం జిల్లా సరిహద్దులోని నాగలమడక ఉత్తర పినాకిని నది వద్ద కృష్ణా జలాలకు గురువారం మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. చంద్రబాబు హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలను నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు తరలించడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కృష్ణా నీటిని నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు చేర్చడానికి టీడీపీ అడ్డుపడిందని, అయినా ప్రకాశ్‌రెడ్డి కృత నిశ్చయంతో నీటిని తరలించారని కొనియాడారు. ఇదిలాఉండగా.. స్థానిక నాయకుల గంగపూజ కార్యక్రమం అనంతరం అధికారులు హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా తురకలాపట్నం మీదుగా నాగలమడక చెక్‌డ్యాం వరకు, అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. చదవండి: సిగ్గుంటే రాజీనామా చెయ్.. రోడ్ల మరమ్మతులకు రూ.2,205 కోట్లు మంజూరు -
దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?
-
అధికారంలోకి వస్తామని కల కంటున్నారా?
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు దేవినేని ఉమ, పరిటాల సునీత, శ్రీరామ్‌లు మూడు రిజర్వాయర్ల శంకుస్థాపనకు రాజకీయ రంగు పులుముతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీ నీవా పనులు ప్రారంభించారని, జీడిపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో చేపట్టారని చెప్పారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకి నీళ్లు ఇవ్వాలని తాను, అనేక మంది రైతులు కోరామని, అప్పటి సీఎం వైఎస్సార్‌ను కలిసి నివేదించామని తెలిపారు. ఆ వెంటనే స్పందించిన వైఎస్సార్ 2009 ఎన్నికల సభలో పేరూరు డ్యాంకు నీరిస్తామని ప్రకటించారన్నారు. ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. శుక్రవారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికలకి ముందు ఏడాది 2018లో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎన్నికలకు ఒక నెల ముందు పనులు ప్రారంభించారు. పేరూరు డ్యాంకి పైసా ఖర్చు లేకుండా నీరివ్వవచ్చని చెప్పినా పట్టించుకోలేదు. ఆనాడు అంచనాలు పెంచుకుని దోచుకునే ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక విచారణ చేయించాము. 200 కోట్ల రూపాయల మిగులు కనిపించింది. ఆ నిధులతో మరొక రిజర్వాయర్ చేపట్టాము. వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. దేవినేని ఉమా చిత్తశుద్ధితో మాట్లాడాలి. అంచనాలు పెంచుకున్నప్పుడు మీరెక్కడికి వెళ్లారు. దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?. సీఎం జగన్ నిధులు దుర్వినియోగం కాకుండా కరువు ప్రాంతానికి నీరిస్తున్నారు. ఆయన లక్ష ఎకరాలకు నీళ్లిస్తున్నారు. మీరు శంకుస్థాపనలు చేసిన వాటిని మా వైఎస్సార్ ముందుకు నడిపించారు. రాయలసీమకు సాగు నీరు అందించే దిశగా మేము ముందుకి వెళ్తున్నాం. పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైంది. అది ఏ విధంగా పరిటాల రవి కల అవుతుంది?’’ అని ప్రశ్నించారు. -
మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన
సాక్షి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. అదనంగా 3.3 టీఎంసీల కెపాసిటీ పెంచాం. హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాం కు నీరు తరలించేందుకు 803 కోట్లతో టీడీపీ అంచనాలు వేసింది. అదే డబ్బుతో మేము నాలుగు రిజర్వాయర్లు అదనంగా నిర్మించి పేరూరు డ్యాంకు నీరందిస్తున్నాం. 75,000 ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం. ప్రాజెక్టు కాస్ట్ పెంచకుండా ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ దోపిడీ చేసింది. టీడీపీ పాలనలో లంచాలు ఏస్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది. పేరూరు డ్యాం, ఇతర నాలుగు రిజర్వాయర్ల పరిధిలోని 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తాం. రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నాం' అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం) సీఎం జగన్‌కు రైతు ప్రయోజనాలే ముఖ్యం: తోపుదుర్తి రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా నుంచి పేరూరుకు నీరిస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. పేరూరు డ్యాం సహా నాలుగు రిజర్వాయర్లకు నీరివ్వటం వల్ల మా ప్రాంతంలో కరవు పోతుంది. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలి. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. సీఎం జగన్‌కు రైతు ప్రయోజనాలే ముఖ్యం. జగన్‌కు జిల్లా రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు' అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. చదవండి: (మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం) ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం
వర్గపోరు.. రక్తపుటేరులు.. ఆధిపత్యం కోసం సాగించిన మారణహోమంలో ఎంతో మంది బలయ్యారు. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. అంతా ఓ కుటుంబం కనుసన్నల్లోనే.. చెప్పినట్టు వినాలి.. కాదన్న వారి తలలు తెగిపడ్డాయి. ఇదంతా గతంలో రాప్తాడు నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్షన్ కు చరమగీతం పాడారు. అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు. కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లకు అహరహం కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ తనయుడు, సీఎం జగన్మోహన్రెడ్డి రక్తపుటేరులు పారిన ప్రాంతాల్లో కృష్ణా జలాలను పారించి కొత్త వెలుగులకు శ్రీకారం చుట్టారు. సీఎం అడుగుజాడల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘లక్ష ఎకరాలకు సాగునీరు’ యజ్ఞం చేపట్టారు. సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు 2009 వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేవి. రాజకీయ పెత్తనం, గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం ఈ మండలాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషించింది. పేదలు వ్యవసాయం చేసుకుంటే తమ పెత్తనానికి బ్రేక్ పడుతుందని కుట్ర చేసింది. గ్రామీణులు సాగువైపు వెళ్లకుండా ఆధిపత్య పోరుకు ఉసిగొలిపింది. తమ మాట కాదన్న వారిని వేటాడి అంతమొందిస్తూ వచ్చింది. ఫలితంగా కనగానపల్లి మండలంలో 8, రామగిరిలో ఐదు, చెన్నేకొత్తపల్లిలో ఆరు గ్రామాల్లో ఫ్యాక్షన్ తారస్థాయికి చేరింది. ఇందులో కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు, తగరకుంట, భానుకోట, రామగిరి మండలంలోని కుంటిమద్ది, గంతిమర్రి, నసనకోట, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, కనుముక్కల, నాగసముద్రం గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా మారిపోయాయి.. దౌర్జన్యం.. దుర్మార్గం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో కరుడుకట్టిన ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో నియంతృత్వ ధోరణి రాజ్యమేలింది. రక్తపుటేరులు ప్రవహించాయి. నక్సలైట్ల కదలికలు, పోలీసుల కూంబింగ్‌లు.. ఫ్యాక్షనిస్టుల దౌర్జన్యం.. దుర్మార్గాలతో జనం కంటి మీద కునుకు దూరమైంది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. 1994 నుంచి 2004 వరకూ సుమారు 120 మంది ఫ్యాక్షన్‌కు బలైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నా.. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపేనని స్థానికులు అంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్ హత్యలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చదవండి: (వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి) ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ఎంపీ మాధవ్ ఒక్కసారిగా మారిన పరిస్థితి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో చెరువులను నింపడమే కాక, పంటల సాగుకూ నీటిని వదలడంతో గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై దృష్టి పెట్టారు. నాటి ఫ్యాక్షన్ రాజకీయంతో విసిగిపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. వర్గ కక్షలకు దూరంగా.. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అందువల్లే 2019 తర్వాత ఫ్యాక్షన్ హత్యల ప్రస్తావనే లేకుండా పోయింది. ‘హంద్రీ–నీవా’ నీటితో సస్యశ్యామలం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా హంద్రీ–నీవా కాలువ గుండా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. కాలువ సరిహద్దు గ్రామాలైన కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని సుమారు 12 చెరువులు, 15 కుంటలను కృష్ణా జలాలతో నింపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతో కాలువ దిగువన వేల ఎకరాల్లో పంటల సాగుకు నీరు అందింది. కనగానపల్లి మండలంలోని తగరకుంట, తూంచర్ల, బద్దలాపురం, యలకుంట్ల, గుంతపల్లి గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చాయి. రామగిరి మండలంలోని కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రి గ్రామాల్లోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేపట్టారు. ఒక్క కుంటిమద్ది చెరువు కింద 500 ఎకరాల్లో వరిసాగులోకి రావడం గమనార్హం. మేడాపురం, కనుముక్కల, ఒంటికొండ తదితర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఫ్యాక్షన్ అనే పదం వినిపించకుండా పోయింది. వేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం ఆశలకు జీవం.. చెన్నేకొత్తపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సారునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయించారు. ఏర్పాట్ల పరిశీలన చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న మూడు రిజర్వాయర్ల భూమిపూజ పనులకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభాస్థలి, రిజర్వాయర్ల పైలాన్, వాహనాల పార్కింగ్, భోజన కౌంటర్లు, ఎల్ఈడీ స్క్రీన్స్ వంటి ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ నిశాంత్‌కుమార్, ఆర్డీఓ మధుసూదన్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. ‘ప్రజాసంకల్ప’ యాత్రలో నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే -
వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమోదం తెలిపార’ని అన్నారు. చదవండి: (ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు) ఈ నెల 9న ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులకు బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్‌కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు) కాగా, ‘బంగారం’లాంటి భూములు.. సిరులు పండే నేలలు.. అయితేనేం.. నీరులేక నోరెళ్లబెట్టాయి! పచ్చని పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఏడాదికి మూడు పంటలు పండించే సత్తా ఉన్న రైతులు ఉన్నా.. జల సిరి లేకపోవడంతో వ్యవసాయం నిర్వీర్యమవుతూ వచ్చింది. సీజన్ వస్తే ఆకాశం వైపు ఆశగా చూడడం తప్ప మరేమీ చేయలేని అసహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. ఇదంతా గతం. ‘నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తా’ అనే నినాదంతో ప్రజాభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అహర్నిశం శ్రమించారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు అందించారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం కూడా పొందారు. ఈ నెల 9న ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
రాప్తాడును కోనసీమగా మారుస్తాం
హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పేరూరు డ్యాంను సందర్శించి గంగ పూజ నిర్వహించారు. ఇదే సమయంలో ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాక్షి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. తొలిసారిగా హంద్రీనీవా కాలువ నుంచి పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా శనివారం రామగిరి మండలంలోని పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించారు. గంగపూజ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత వచ్చిన పాలకులు అలసత్వం ప్రదర్శించారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానేత ఇచ్చిన హామీ మేరకు హంద్రీనీవా కాలువ ద్వారా మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు నీరందించేందుకు జీఓ తీసుకొచ్చారన్నారు. కేవలం రూ.కోటిన్నర ఖర్చుతో పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులను దోచుకునేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత రూ.804 కోట్లతో జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కృష్ణా జలాల ద్వారా 10 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్షంగా, 40 వేల ఎకరాలకు పరోక్షంగా సాగు నీరందుతున్నారు. నియోకవర్గ పరిధిలో హంద్రీనీవా కింద మరో నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తామని, వీటి ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించి సస్యశ్యామలం చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ నాగేశ్వర రెడ్డి, నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకటరాముడు, పసుపుల ఆది, వెంకటేష్, అమరనాథరెడ్డి, గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, మీనుగ నాగరాజు, నాగముని, గోవిందురెడ్డి, బాలపోతన్న, తదితరులు పాల్గొన్నారు. చదవండి: భరత్ అనే నేను.. -
పేరూరుకు కృష్ణా జలాలు.. ఇక కష్టాలు తీరినట్టే
సాక్షి, అనంతపురం: పేరూరు జలాశయంలో కృష్ణా జలాలు పారించి..దివంగత మహానేత వైఎస్సార్ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేరూరుకు నీళ్లిస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హామీ ఇచ్చారని.. ఆయన మరణాంతరం తర్వాత వచ్చిన పాలకులు పేరూరును ఎన్నికల వాగ్దానంగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. (‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’) వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పేరూరుకు నీళ్లు తీసుకువచ్చామని చెప్పారు. మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా జలాలు చేరడంతో.. డ్యామ్ వద్ద రైతులు గంగ పూజలు నిర్వహించారు. సాగు,తాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. (అమ్మ బతకాలని..) -
‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’
సాక్షి, అనంతపురం: హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీరు తరలించాలన్న కల సాకారమైందని.. దివంగత మహానేత వైఎస్సార్ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా నీరు చేరటం హర్షణీయమన్నారు. కమీషన్ల కక్కుర్తితో పరిటాల సునీత హంద్రీనీవా పనులను నిర్లక్ష్యం చేశారని, అంచనాలు పెంచి పరిటాల కుటుంబం దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. 119 కోట్ల పనులను 1100 కోట్ల రూపాయలకు పెంచి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తక్కువ వ్యయంతోనే మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యామ్‌కు కృష్ణా జలాలను పేరూరు డ్యామ్‌కు తీసుకెళ్లామని.. రాప్తాడు అభివృద్ధిని చూసి పరిటాల సునీత ఓర్వలేకపోతున్నారన్నారు. (వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం) మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం.. మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలు అభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు 2007లో అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ 2015లో ప్రాజెక్టుకు ఆయన పేరును తొలగించింది. హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరును పునరుద్ధరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. -
అత్యధిక పరీక్షలతోనే కరోనా కట్టడి
సాక్షి, అనంతపురం : కరోనా విపత్కర సమయంలో ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేయటం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సహా ఇతర విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యతగా మాట్లాడాలని హితవుపలికారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేయటం వల్లనే కోవిడ్ నియంత్రణ సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉచిత రేషన్, వెయ్యి నగదు ఇచ్చి పేదలను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌దే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు సీఎం జగన్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కరోనా వల్ల రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
‘చంద్రబాబు విమర్శలు అర్థరహితం’
సాక్షి, ప్రకాశం : కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకి అండగా వుంటున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కరోనాపై పోరుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎమ్మెల్యే మధుసూధన్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుదూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలన చేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లాక్డౌన్ నెల వ్యవధిలో మూడుసార్లు రేషన్ సరుకులు, వెయ్యి రూపాయలు సాయం చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ఒక పక్క కరోనాను కట్టడి చేస్తూనే డ్వాక్రా మహిళలుకు సున్నా వడ్డీ రుణాలు, జగనన్న విద్యా దీవెన, ఫించన్లు వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. (గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు) అనంతపురం : కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. కరోనా పరీక్షల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోందన్నారు. పేద కుటుంబాలకు ఉచిత రేషన్, వెయ్యి నగదు అందిస్తున్న సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ ) ఆ హీరో అంటే చాలా ఇష్టం: విజయ్ దేవరకొండ -
సీఎం జగన్ విజన్ ఉన్న నాయకుడు
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, పక్కా ప్రణాళికతో కరోనాపై యుద్ధం చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రత్యేక కృషి వల్లే లక్ష కరోనా ర్యాపిడ్ కిట్లు ఏపీకి వచ్చాయన్నారు. ప్రతీ ఒక్కరికి మూడు మాస్కులు ఇవ్వాలన్న జగన్ ఆదేశాలు అభినందనీయమని పేర్కొన్నారు. పేదలు పస్తులు ఉండకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో కరోనా అదుపులోకి రావటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి పకడ్బందీ చర్యలు చూసి చంద్రబాబు తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. -
80 టన్నుల కూరగాయల పంపిణీ
-
హింసా రాజకీయాలకు శ్రీరామ్ కుట్రలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నాయుడు పరిటాల శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తండ్రి బాటలో హింసా రాజకీయ చేయాలని పరిటాల శ్రీరామ్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు నరుకుతామంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యాల వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. రామగిరిలో వైఎస్సార్ విగ్రహన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్ స్వయంగా అంగీకరించరన్నారు. మా జోలికొస్తే తలలు నరుకుతామని శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ‘చంద్రబాబుకు కరోనా వైరస్ సోకిందా..!) ఏపీలోకరోనా వైరస్ లేదని, ఎల్లో వైరస్ ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైరస్ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేష్ చౌదరి కూతురుకి చంద్రబాబు ఆర్థిక మండలి డైరెక్టర్ పదవి ఇచ్చారని, రమేష్ చౌదరి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ అరికట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ. 5000 కోట్లు రాకూడదనే బాబు కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని ప్రశ్నించారు.(‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’) పది చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం స్థానిక ఎన్నికలపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఆరోపించారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 10 చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.(ఫలించిన తోపుదుర్తి కృషి) బాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉందని పార్లమెంటు వాయిదా వేయలేదని, లక్షల మంది కలిసే జాతరలు వాయిదా వేయలేదని అన్నారు. అలాగే ‘కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5000 కోట్లు అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. గ్రామాలు, పట్టాణాలకు నిధులు రాకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. ఏపీ అభివృద్ధికి సహకరించాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలి. స్థానిక ఎన్నికలు వెంటే జరపాలి’ అని టీడీపీపై విమర్శలు సంధించారు. -
చంద్రబాబు.. అప్పుడు ఎందుకు జోలె పట్టలేదు?
సాక్షి, అనంతపురం : గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడులో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏమి చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రూ. లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నకాలంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, ఆయన సీమ ద్రోహి అని విమర్శించారు. రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, లక్షలమంది వలసలు వెళ్లినప్పుడు జోలె పట్టని చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు జోలె పట్టి అడుకుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా కోటీశ్వరులైనప్పుడు చంద్రబాబు ఎందుకు జోలె పట్టారని ఎద్దేవా చేశారు. అమరావతి ఓ భ్రమరావతి అని, చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల రాజధాని వద్దని.. సాగునీటి ప్రాజెక్టులే ముద్దని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై శుక్రవారం సాయంత్రం అనంతపురంలో సభ నిర్వహిస్తామని చెప్పారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు చెబుతున్నా మాటలు విని రైతులు మోసపోవద్దని కోరారు. -
చంద్రబాబుపై తోపుదుర్తి ఫైర్!
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ఫైర్ అయ్యారు. బాబు జాతీయ నాయకుడు కాదని, ఓ గల్లీ లీడర్ అని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గం కోసం చంద్రబాబు పోరాడుతున్నారని అన్నారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని, అదే డబ్బుతో ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయవచ్చన్నారు. అమరావతిలో టీడీపీ ఓడిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని, బాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. ‘చంద్రబాబు! నీకు ఏపీ ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. -
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, అమరావతి : తన బినామీలకు నష్టం జరుగుతుందన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాజధానిలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, చంద్రబాబు, లోకేష్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారని ప్రసంసించారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలు కూడా అధికార వికేంద్రీకరణకు మొగ్గు చూపాయని గుర్తు చేశారు. -
మేం అండగా ఉంటాం: తోపుదుర్తి
సాక్షి, తాడేపల్లి: ఉద్యమాల పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలను చంద్రబాబు పట్టించుకోలేదని... నారాయణ కమిటీ పేరుతో తాను చేయాలనుకున్నది చేశారని మండిపడ్డారు. గురువారమిక్కడ ఆయన వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి ప్రకటనకు ముందే టీడీపీ నేతలు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అదే విధంగా అసైన్డు భూముల రైతులకు చంద్రబాబు అండ్ కో అన్యాయం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అండగా ఉంటాం.. రాజధాని రైతులను మోసం చేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎక్కడ కూడా అమరావతి భూములను లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రాజధాని రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామని.. అదే విధంగా రాయలసీమ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకాశ్‌రెడ్డి భరోసానిచ్చారు. -
వెంకయ్య అప్పుడెందుకు స్పందించలేదు..?
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని విమర్శించారు. సింగపూర్ కంపెనీలు వస్తాయని రైతులను మభ్యపెట్టారని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిలో రైతులను చూసి భావోద్వేగానికి గురయ్యానన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వలసలు వెళ్తున్న కూలీలపై భావోద్వేగం కలగలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. ‘ఒంగోలు ఫ్లొరైడ్ బాధితుల గురించి వెంకయ్య ఎందుకు స్పందించలేదు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ఇస్తామన్న ప్యాకేజీ ఏమైంది?. కేంద్ర నుంచి వెంకయ్యనాయుడు ఎందుకు ఇప్పించలేకపోయారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు రూ. 30వేల కోట్ల పునారావాస ప్యాకేజీ ఇంకా ఎందుకు మంజూరు కాలేదు. ఆ ప్రాంత రైతులది త్యాగం కాదా?. ఏ ప్రాంత ప్రజలైనా అభివృద్ధినే కోరుకుంటారు. లక్ష కోట్లతో నిర్మించాల్సిన రాజధానికి గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్రం కలిసి ఖర్చు చేసింది కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే. ఈ విధంగా చేస్తే అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలంటే వందేళ్ల పడుతుంది. వెనుకబాటుతనంతోనే శ్రీకాకుళం, రాయలసీమలో ఉద్యమాలు వచ్చాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్క్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు’ అని అన్నారు. -
‘నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది’
సాక్షి,అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి వైఎస్ జగన్ అని, ఒకో మనిషి దగ్గర ఒకో మాట చెప్పే నీచమైన వ్యక్తిత్వం చంద్రబాబుదని విమర్శించారు. హోదా కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని, హోదా కోసం రాజీనామా చేస్తామంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన మాటలు అర్థం కావు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు వైఖరి పట్ల ఆ పార్టీ శాసనసభ్యులే విసిగిపోయి, పక్క చూపులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశం గర్వించే దిశగా సీఎం జగన్ పాలన జరుగుతోందన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీ ఓర్వలేక పోతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రజలు కొనియాడుతుంటే...ప్రతిపక్షం మాత్రం అక్కసు తో విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పై చంద్రబాబు మాట్లాడుతున్న భాష సరైనది కాదన్నారు. చంద్రబాబు పార్టీ లో పట్టుకోల్పోయారని.. ఆయనను సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదన్నారు. ఆయనకు ఉనికి కోల్పోతున్నామనే భయం పట్టుకుంది.. మహిళా బిల్లుపై సభలో చర్చ జరుగుతుంటే ఉల్లి పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు లొల్లి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. సభా సమయాన్ని వృథా చేసి.. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్‌తో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోందన్నారు. సీఎం జగన్ చేస్తోన్న ప్రజారంజక పాలనతో.. ఉనికిని కోల్పోతున్నామన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాయలసీమలో చిచ్చు పెట్టి తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ సమక్షంలో నాపై కామెంట్లు చేసిన వ్యక్తి.. టీడీపీ నేతల అనుచరుడని పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. -
ఆ ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుంది
సాక్షి, అమరావతి: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని దుయ్యబట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం 2వేల క్యూసెక్ నీటి సామర్థ్యం ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టును 6వేల క్యూసెక్కుల పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అవుకు రిజర్వాయర్‌కు లైనింగ్ చేయని కారణంగా.. నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేక పోతున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి అభిప్రాయపడ్డారు. తెలుగుగంగ కాలువకు ఇప్పటికే సీఎం జగన్ టెండర్లను ఆహ్వానించారని అన్నారు. అలానే గండికోట పునరావాసం ప్యాకేజీని కూడా సీఎం సిద్ధం చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ పూర్తిస్థాయిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమ ప్రాజెక్టులపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సాగునీటి(ఇరిగేషన్) ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ నివేదికతో టీడీపీ బాగోతాలు బయట పడతాయని అభిప్రాయపడ్డారు. -
పరిటాల మైనింగ్ మాఫియాపై సీఎంకు ఫిర్యాదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ నిర్వాహకులు ‘వడ్డెర్ల బండ’ ద్వారా రూ.250 కోట్లు దోపిడీ చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి, అక్రమంగా కంకర తరలించి సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు మండలం కుర్లపల్లి సమీపంలోని కంకర క్రషర్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ బండపై ఆధారపడి 200 వడ్డెర కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అయితే పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ వారు క్రషర్ పేరిట లీజుకు తీసుకుని, అక్రమంగా మరికొంత బండను ఆక్రమించుకున్నారని విమర్శించారు. మూడో ప్యాకేజీ కింద హంద్రీ–నీవా కాలువ నిర్మాణం కోసం 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయికి బిల్లు తీసుకున్నారన్నారు. వాస్తవానికి కాలువపై ఆ మేరకు రాయి కనిపించడం లేదన్నారు. మరో 30 లక్షల టన్నుల రాయిని కంకరగా మార్చి అక్రమ మార్గంలో అమ్మేసుకున్నారన్నారు. వడ్డెర్ల బండకు సంబంధించి 24 ఎకరాలకు గాను 18 ఎకరాల్లో 35 లక్షల టన్నుల బండను క్రషింగ్ చేశారన్నారు. అంతేకాకుండా బండపైన, కాలువకు పైన ఉన్న రాయిలో దాదాపు 50 లక్షల టన్నుల రాయిని అమ్ముకున్నారన్నారు. మూడు ఎకరాలు బండ లీజు తీసుకుని, అంతకు మించి ఆక్రమించి బండ కొడుతున్నారని తెలిపారు. యరపతినేని మైనింగ్ మాఫియా తరహాలోనే ఇక్కడ కూడా మాఫియా చెలరేగిపోయిందన్నారు. క్రషర్ నిర్వాహకులు ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు పంచాయతీ రూ.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు కంకర మిషన్ ద్వారా వెలువడే దుమ్ము సమీప పొలాలను కప్పేస్తుండటంతో పంటలు పండటం లేదని, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్టు వ్యవహరించారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఫిర్యాదు చేసిన రైతులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని హితవు పలికారు. ఇదివరకే మైనింగ్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే ఈ మైనింగ్ మాఫియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆత్మకూరు, కృష్ణమరెడ్డిపల్లి, నసనకోట, సుబ్బరాయునిపల్లి వద్ద మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అవినీతి అక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆత్మకూరు వడ్డెర్లకు జీవనోపాధిగా ఉన్న బండను తిరిగి అప్పగించాలని ఆయన సూచించారు. -
పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వారిపై పరిటాల అనుచరులు దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగుతున్న పరిటాల వర్గీయులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. నసనకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు దాడులకు పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని ప్రకాశ్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చదవండి: పరిటాల వర్గీయుల బరితెగింపు -
‘అభినవ కాటన్ దొర వైఎస్ జగన్’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ఆయన భగీరథ యత్నం చేస్తున్నారని తెలిపారు. గోదావరి-కృష్ణా జలాల సద్వినియోగం కరవు ప్రాంతాలకు మేలు చేస్తుందని చెప్పారు. ముఖ్యమత్రి జగన్, తెలంగాణ సీంఎం కేసీఆర్ చర్చలు తెలుగు ప్రజల నీటి కష్టాలు తీరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోపిడీ పాలన సాగించారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. టీడీపీ అవినీతి పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్‌కు సహకరించాలని హితవు పలికారు. గోదావరి నది నుంచి ప్రతి ఏటా మూడువేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని గుర్తు చేశారు. వృథా నీటిని రైతులకు ఇస్తామంటే టీడీపీ నేతలకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. -
జనాన్ని చూసి బేజారు.. పరిటాల వర్గీయుల దాడి..!
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేక పోతున్నారు. రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆమె సొంత మండలమైన రామగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించగా..అక్కడి ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారు. దీంతో ఆమె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. ముత్యాలంపల్లి వద్ద ప్రకాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఇంత జరగుతున్నా అక్కడున్న పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప టీడీపీ గూండాలను అడ్డుకునే యత్నం చేయలేదు. ఈ క్రమంలో డీఎస్పీ వెంకటరమణకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాప్తాడులో సునీత దౌర్జన్యాలపై ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, గత 25 ఏళ్లుగా పదవుల్లో ఉన్నా రామగిరి ప్రజల సమస్యలను పరిటాల కుటుంబం తీర్చలేకపోయిందని అన్నారు. ఐదేళ్లుగా రామగిరి మండలంలో పర్యటించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ఇదంతా మంత్రి కుట్రేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రామగిరి, కొత్తపల్లి, నసనకోట, పేరూరు గ్రామాల్లో ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. -
పరిటాల వర్గీయుల బెదిరింపులు..
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో పోలీసులు వైస్సార్సీపీ అభ్యర్థికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చంపుతామని మంత్రి పరిటాల సునీత వర్గీయులు బహిరంగంగానే ప్రకటిస్తున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. తోపదుర్తి గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్న ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు.. మదిగుబ్బ- బి.యాలేరు మధ్య చేపట్టిన కల్వర్టు నిర్మాణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో పోలీసు గస్తీ ఏర్పాటు చేయించాలని, వారం కిందటే జిల్లా కలెక్టర్, ఎస్పీలను వైఎస్సార్సీపీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై రాప్తాడు వైఎస్సార్సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన రాజశేఖర్ యాదవ్, కురుబ నాగిరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని, కొడుకు శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు దేనికైనా తెగిస్తున్నారని తెలిపారు. తోపుదుర్తి బ్రదర్స్‌కు ప్రాణహాని ఉందని, అనుమానస్పద ప్రాంతాలపై ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మంత్రి పరిటాలకు కొందరు అధికారులు, పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు