పేరూరుకు కృష్ణా జలాలు.. ఇక కష్టాలు తీరినట్టే | MLA Thopudurthi Prakash Reddy Visit Perur Dam | Sakshi
Sakshi News home page

ఏడాదిలోపే నీళ్లిచ్చాం: ఎమ్మెల్యే తోపుదుర్తి

Published Sat, Jun 6 2020 10:07 AM | Last Updated on Sat, Jun 6 2020 10:17 AM

MLA Thopudurthi Prakash Reddy Visit Perur Dam - Sakshi

సాక్షి, అనంతపురం: పేరూరు జలాశయంలో కృష్ణా జలాలు పారించి..దివంగత మహానేత వైఎస్సార్‌ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేరూరుకు నీళ్లిస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హామీ ఇచ్చారని.. ఆయన మరణాంతరం తర్వాత వచ్చిన పాలకులు పేరూరును ఎన్నికల  వాగ్దానంగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. (‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’)

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పేరూరుకు నీళ్లు తీసుకువచ్చామని చెప్పారు. మడకశిర బ్రాంచి కెనాల్‌ నుంచి పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా జలాలు చేరడంతో.. డ్యామ్‌ వద్ద రైతులు గంగ పూజలు నిర్వహించారు. సాగు,తాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. (అమ్మ బతకాలని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement