perur dam
-
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
పేరూరుకు కృష్ణా జలాలు.. ఇక కష్టాలు తీరినట్టే
సాక్షి, అనంతపురం: పేరూరు జలాశయంలో కృష్ణా జలాలు పారించి..దివంగత మహానేత వైఎస్సార్ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేరూరుకు నీళ్లిస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హామీ ఇచ్చారని.. ఆయన మరణాంతరం తర్వాత వచ్చిన పాలకులు పేరూరును ఎన్నికల వాగ్దానంగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. (‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’) వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పేరూరుకు నీళ్లు తీసుకువచ్చామని చెప్పారు. మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా జలాలు చేరడంతో.. డ్యామ్ వద్ద రైతులు గంగ పూజలు నిర్వహించారు. సాగు,తాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. (అమ్మ బతకాలని..) -
నీళ్ల కోసం కాదు..నిధుల దోపిడికే! పేరూరు
రాప్తాడు నియోజకవర్గ రైతుల కల పేరూరు ప్రాజెక్టు. 70 ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఈ ప్రాంతాల ముందు కోనసీమ దిగదుడుపే. ఎటు చూసినా పచ్చని పంట చేలతో వ్యవసాయాన్ని పండుగలా చేసేవారు. అలాంటి పేరూరు ప్రాజెక్ట్‌కు నీటి వనరులు లేకుండా పోయాయి. సాగునీళ్లు అందుతాయని, బీడు భూముల్లో పంటలు పండి తమ బతుకులు మారుతాయని వేల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ వచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ పేరూరు ప్రాజెక్ట్‌ను నీటితో నింపుతామంటూ నాయకులు లబ్ధి పొందుతూ వచ్చారు. రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పరిటాల సునీతనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ పేరూరు ప్రస్తావనే ఆమెకు ఓట్లు పడేలా చేశాయి. కానీ నీళ్లవ్వలేదు. తాజా ఎన్నికల్లో సునీత తనయుడు శ్రీరాం బరిలో నిలిచారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పేరూరు ప్రస్తావనే తెరపైకి తీసుకువచ్చారు. అసలు ప్రాజెక్ట్‌ను తామే తెచ్చామని, దానికి నీళ్లు రావాలంటే తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణంలో పరిటాల కుటుంబానికి రాజకీయ కోణం మినహా మానవీయ కోణం లేదనేది అక్షర సత్యం. ప్రకాష్‌రెడ్డి పోరాటాలు.. పేరూరు ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు పోరాటాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చొరవ తీసుకుని ప్రకాష్‌రెడ్డి అందించిన ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా రూ.119కోట్లతో ప్రాజెక్టుకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. హంద్రీ–నీవాలో భాగంగా ‘పేరూరు బ్రాంచ్‌కెనాల్’ ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని భావించారు. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రణాళికను చెత్తబుట్టలో పడేశారు. తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా తురకలాపట్నం నుంచి నీళ్లిస్తే పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లివ్వొచ్చని విపక్షపార్టీల నేతలను కలుపుకుని ప్రకాష్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా నాలుగేళ్లుగా పేరూరు ప్రాజెక్టును మంత్రి సునీత పట్టించుకోలేదు. ప్రణాళిక ప్రకారమే నిధుల దోపిడీ పేరూరు ప్రాజెక్ట్‌కు నీరు ఇవ్వాలనే అంశాన్ని ఎన్నికలకు ముందు మంత్రి సునీత తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం డీపీఆర్ ప్రకారం బోరంపల్లి లిప్ట్ నుంచి రూ.119 కోట్లతో ఈ ప్రాజెక్టుకు నీళ్వివ్వొచ్చు. ఈ అంచనా వ్యయాన్ని రూ.803కోట్లకు పెంచేలా సునీత పావులు కదిపారు. కేవలం అడ్డగోలు గా నిధులు దోచుకోవడంలో భాగం గానే అంచనా వ్యయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిధిలో పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఇందులో 0.6 టీఎంసీలతో 26లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణంలో పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మించి నీళ్లివ్వాలని అప్పటి ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న పుట్టకనుమ సామర్థ్యం కూడా 0.6టీఎంసీలే! అయితే విస్తీర్ణం మాత్రం 26లక్షల నుంచి 76లక్షలకు పెంచారు. అంటే 50లక్షల క్యూబిక్ మీటర్ల పనిని పెంచారు. నిల్వ సామర్థ్యం పెరగనప్పుడు ప్రాజెక్టు విస్తీర్ణం పెరగడం దోపిడీకి అద్దం పట్టింది. దోపిడీపై న్యాయ పోరాటం.. పేరూరుకు నీళ్లిచ్చేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నా, తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే మార్గాలు ఉన్నా,కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు రూ.803కోట్లతో ప్రభుత్వం పాలన అనుమతులు ఇవ్వడంపై ఆయకట్టు రైతులు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, పి.నల్లపురెడ్డి తదితరులు లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 59లోని లోపాలు, నిపుణుల కమిటీ వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్‌లోని లోపాలు, ఆయకట్టు పరిస్థితి తదితర అంశాలను ససాక్ష్యాలతో వివరించారు. పేరూరుకు నీళ్లిచ్చే పేరుతో సోమరవాండ్లపల్లి, పుట్టకనుమ రిజర్వాయర్లను పొందుపరిచారని, నిజానికి ఆ రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు లేదని, కేవలం కాస్ట్బెనిఫిట్ రేషియో ప్రకారం పాలన అనుమతులు వచ్చేందుకే వాటిని పొందుపరిచారని పిటీషన్లో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్ల పరిధిలో పేర్కొన్న గ్రామాలకు హంద్రీ–నీవా, పీఏబీఆర్ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. కేవలం పెంచిన అంచనాలకు ఆమోద ముద్ర వేయించుకుని, ప్రజాధనాన్ని దోచుకునేందుకే ఈ రిజర్వాయర్లను డీపీఆర్‌లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పేరూరు ప్రాజెక్టును 1950–58లో నిర్మించారు. 1.82 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.1.69 కోట్లు ఖర్చు చేశారు. 3.5 కిలో మీటర్లున్న ప్రాజెక్టు పరిధిలో 10,048 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కుడికాలవ పరిధిలో 9,448, ఎడమకాలవ పరిధిలో 600 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. గత 60 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో 14 సార్లు నీళ్లు వచ్చాయి. 75 శాతం ఒకసారి, 25 శాతం ఒకసారి వచ్చాయి. దాదాపు 34 ఏళ్లు ఈ ప్రాజెక్ట్‌కు చుక్కనీరు చేరలేదు. 25 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చిన పరిటాల కుటుంబీకులు ఈ పాతికేళ్లలో ఏనాడూ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రాజెక్టుపై ఆధారపడిన భూములన్నీ బీళ్లుగా మారాయి. బతికే మార్గం లేక రైతులు వలసబాట పట్టారు. గుడ్‌విల్ కింద రూ.47 కోట్లు? పేరూరుకు నీటిని తరలించే పనులను మెయిల్ అనే నిర్మాణసంస్థ దక్కించుకుంది. ఈ సంస్థకు టెండర్ దక్కేలా సునీత ముందే పథకం రచించారు. దీంతో ‘గుడ్‌విల్’ కింద రూ.47కోట్లను మంత్రి కుటుంబీకులకు ఆ సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో పరిటాల కుబీంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు రాప్తాడు ఎమ్మెల్యేగా ఇన్నేళ్లుగా ఎవరు కొనసాగుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు? ఇందులో ఎవరి వైఫల్యం ఉంది? పేరూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీ ఎలా జరిగింది? రైతులకు ఏతీరున అన్యాయం జరిగింది? అనే అంశాలపై నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. పొలాన్ని బలవంతంగా లాక్కొన్నారు కేఎన్ పాళ్యం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336–1లో ఐదు ఎకరాల భూమికి 1976లో నా భర్త మంగల ముత్యాలప్ప పేరున ప్రభుత్వం డి–పట్టా ఇచ్చిం ది. 4 నెలల క్రితం పేరూరు డ్యాంకు కాలువ పనులకంటూ మా భూమిని ఇతరుల పేరుమీద మార్చి బలవంతంగా లాక్కొన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం మాకు న్యాయం చేయలేదు. – మంగల నరసమ్మ, మద్దెలచెరువు, కనగానపల్లి మం‘‘ -
పేరూర్ డ్యామ్‌కు నీరందే దాకా ఉద్యమిస్తాం
అనంతపురం అర్బన్ : పేరూర్ డ్యామ్‌కు నీరు వచ్చే వరకు ఉద్యమిస్తామని జలసాధన కమిటీ సభ్యులు మల్లెల గంగాధర్, కె.శ్రీనివాసులు, హుసేన్, మెహరున్‌బీ, మునీర్, బోయశ్రీనివాసులు, జాఫర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జలసాధన కమిటీపై చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. పేరూర్ డ్యామ్‌కు 2015, 2016లో కేటాయించిన రూ.840 కోట్లు ఎక్కడికి వెళ్లాయని వారు ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్లో రూ.840 కోట్ల నుంచి రూ.640 కోట్లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందన్నారు. కేటాయించిన నిధులకు అనుమతి ఎప్పడిస్తారు? పనులు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసి డ్యామ్‌కు నీరు తీసుకొస్తారో టీడీపీ నాయకులు స్పష్టంగా చేయగలరా అని ప్రశ్నించారు. ఆ ధైర్యం ఉంటే మంత్రులతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. -
మాట నిలబెట్టుకుంటే రాజీనామా చేస్తారా?
ఆత్మకూరు : రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు లోపు పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని మంత్రి పరిటాల సునీతఅందివ్వలేకపోయారని, అయితే ప్రస్తుతమున్న ఖర్చులకు అనుగుణంగా రూ. 10 కోట్ల వ్యయంతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా జలాలను తాను తీసుకెళతానని, ఇది వాస్తవ రూపం దాలిస్తే మంత్రి పదవికి సునీత రాజీనామా చేయగలరా అంటూ వైఎస్ఆర్ సీపీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. పేరూరు డ్యాంకు హంద్రీనీవా జలాలను చేర్చడంపై ఆదివారం ఆత్మకూరులో ఆయన రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాది లోపు హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేసి పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామంటూ 2012లో ప్రజలకు చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీని చంద్రబాబుతో సహా జిల్లా మంత్రి సునీత నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రూ. 10 కోట్లతో పూర్తి అయ్యే పనికి రూ. 850 కోట్లు మంజూరు చేయించుకుని అభివృద్ధి్ద పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి పేరూరు డ్యాంకు నీళ్లు అందించాలన్న ఆశయంతో 2008లో స్వయంగా తానే పది రోజుల పాటు సర్వే చేయించి అంచనాలు రూపొందించానని, ఈ మేరకు అప్పట్లో రూ. 85 కోట్లతో పనులు పూర్తి అయివుండేవని గుర్తు చేశారు. తాను రూపొందించిన ప్లాన్ ప్రకారం అక్కంపల్లి, బోరంపల్లి వద్ద ఉన్న లిఫ్ట్‌లను ఉపయోగిం చుకుంటూ కంబదూరు మండలం ఐపార్స్పల్లికి నీరు తీసుకెళ్లవచ్చు అక్కడ ఓ లిఫ్ట్ ఏర్పాటుచేయడం ద్వారా పేరూరు డ్యాంకు నీటిని చేర్చవచ్చు. పేరూరు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆత్మకూరు వరకు పొడగించి రూ. 40 కోట్ల వ్యయంతో ఆత్మకూరు మండలంలోని హంద్రీనీవా ఎగువ గ్రామాల్లోని 12 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చునని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేయు దినాలను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరించారు. -
చిత్తశుద్ధి ఉంటే పేరూరుకు నీళ్లివ్వండి
మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రూ.10 కోట్ల ఖర్చుతో నీళ్లివ్వచ్చు నామమాత్రంగా అయ్యే ఖర్చులను రూ.850 కోట్లకు పెంచడం దోచుకునేందుకే... వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజం రొద్దం: పేరూరు డ్యాంకు నీళ్లిస్తామని ఆర్భాట ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డిసెంబరులోపు కృష్ణానీటితో పేరూరును నింపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా ఫేజ్–2లోని బక్సంపల్లి సమీపంలో సాగుతున్న హంద్రీ–నీవా పనులను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్యాంకు నీళ్లివ్వాలనే చిత్తశుద్ధి ఉంటే మడకశిర బ్రాంచ్‌కెనాల్ 6వ లిప్ట్ తర్వాత 26 కిలోమీటర్ నుంచి తురకలాపట్నం, పెద్దకోడిపల్లి చెరువుల మీదుగా వంక ద్వారా 25 కిలోమీటర్లు నీరు పంపితే పేరూరు డ్యాంలోకి చేరుతుందని వివరించారు. దీనికి కేవలం రూ.10కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఇంత తక్కువ ఖర్చుతో నీరిచ్చే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టుకు రూ.850 కోట్లు ఖర్చు పెట్టడం చూస్తే కేవలం దోచుకునేందుకు అంచనా వ్యయానికి భారీగా పెంచారనేది స్పష్టమవుతోందన్నారు. తమ అస్మదీయులకు ఆర్థికంగా లబ్దిచేకూర్చడం తప్ప డ్యాంకు నీరిచ్చే ఉద్దేశం కన్పించడం లేదన్నారు. 2015 ఆగష్టులోనే గొళ్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లిస్తామని ప్రకటించిన సునీత 2016 ఆగస్టు వచ్చినా ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు. అనంతపురం,హిందూపురంకు సంబంధించి 2.50 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటే వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ పెన్నా, జయమంగళి నది దాటినప్పుడు పరిగి,రోద్దం మండలాలకు సబ్ సర్పేజ్ డ్యాంను ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్నానదిని అనుసంధానంచేసి నియోజక వర్గంలో ఉన్న చెరువులన్నింటికి నీళ్లు ఇవ్వాలన్నా రు. పచ్చచొక్కాలకు కమిషన్ల కోస మే రెయిన్గన్లు పెట్టారని ఆరోపించారు. -
'హెచ్ఎల్సీ'లో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్చల్
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్ఎల్సీ కార్యాలయంలో మంగళవారం ఉదయం హల్చల్ చేశారు. ఈనెల 17వ తేదీలోగా చాగల్లు రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయాలని, లేకుంటే వేలాదిమందితో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నీటి కోసం ఆత్మహత్యకైనా సిద్ధమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 'మా వాటా మాకివ్వకుండా పేరూర్ డ్యామ్‌కు నీళ్లు ఎందుకిస్తారంటూ' ఆయన ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు.