anatapur district
-
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడా వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. శనివారం అర్ధరాత్రి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో నేలకొరిగిన అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు. -
మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు
అనంతపురం నగరంలో బీకాం చదువుతున్న ఓ యువకుడికి వారం రోజుల క్రితం మతి మరుపు సమస్య వచ్చింది. తల్లిదండ్రులు అతడిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా.. తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. మొబైల్ ఫోన్‌కు బానిసై అన్నీ మరచిపోయాడని తెలిపారు. ఇటీవల గుంతకల్లుకు చెందిన ఓ యువతి మూడు దఫాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లగా.. మానసికంగా కుంగిపోయి ఉందని ఆయన తెలిపారు. చదువులో ఒత్తిడి భరించలేక ఇలా అయిందని చెప్పారు. వీరిద్దరే కాదు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీగా పెరిగింది. గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాల్లో ఎన్హెచ్ఎం (జాతీయ హెల్త్ మిషన్) అధికారులు చేపట్టిన పరిశీలనలో ‘మతి’పోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి అనంతపురం జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా జబ్బులకు అడ్డాగా మారుతున్నట్టు తేలింది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా మూడో యముడు అన్నట్టు మానసిక రుగ్మతలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకూ పట్టణాలకే పరిమితమైన మానసిక రుగ్మతలు పల్లెటూళ్లకూ పాకాయి. ఈ జబ్బు బారిన పడుతున్న వారు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. 15 వేల మంది బాధితులు.. బీపీ, మధుమేహం కంటే కూడా మానసిక రుగ్మతను అత్యంత ప్రమాదంగా పరిగణిస్తారు. అలాంటి తీవ్ర మానసిక రుగ్మత బాధితులు ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉన్నట్టు అంచనా. మరో లక్ష మంది వరకూ సాధారణ, మోస్తరు మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే కౌన్సెలింగ్ లేదా మందులు ఇప్పిస్తే తీవ్ర రుగ్మతగా మారే అవకాశం ఉండదు. కానీ బాధితులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరే వరకూ వైద్యులను సంప్రదించకపోవడం గమనార్హం. 15 వేల మందికి మందులే లేవు.. గతంలో ‘వైఎస్సార్ ఆరోగ్య సురక్ష’, ఏఎన్ఎంల ఇంటింటి సర్వే, 104 వాహనాల్లో పరీక్షలు తదితర కార్యక్రమాల వల్ల వ్యాధుల బాధితులను వేగంగా గుర్తించేవారు. ఇంటి వద్దే ఉచితంగా మందులిచ్చే వారు. అయితే, గత ఆరు మాసాల నుంచి మెంటల్ హెల్త్ పేషెంట్లకు ఒక్క మాత్ర కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులు మందులు వాడక, జబ్బు ముదిరి పూర్తి మానసిక వైకల్యానికి గురవుతున్నారు. రుగ్మతలకు కారణాలివే.. మితిమీరిన ఒత్తిడి కారణంగా చాలామంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కావడంతో ప్రపంచమే అదే అనుకుని దాని మత్తులోకి వెళ్లిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రకరకాల రీల్స్, న్యూస్ చూస్తూ తమలో తామే ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నారు. కొంతమంది విద్యార్థులు చదువుల ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి జారుకుంటున్నారు. రకరకాల బెట్టింగ్‌లు, ఆర్థిక కారణాలతో తీవ్ర మానసిక రోగానికి గురవుతున్నారు.ఇటీవల కాలంలో లోన్‌యాప్‌ల ఒత్తిళ్లతో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.చాలా మందికి అవగాహన లేదు వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. కానీ చాలామందిలో అవగాహన లేక జబ్బు ముదిరే వరకూ జాగ్రత్త పడటం లేదు. ఆల్కహాల్, డ్రగ్స్‌కు బానిసలవుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఇటీవల ఎక్కువయ్యారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ఎన్హెచ్ఎం (చదవండి: ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్‌తో..) -
అనంతపురం జిల్లాలో పచ్చనేతల బరితెగింపు
-
విద్యార్థినిల గోడు పట్టించుకోని బాబు సర్కార్
-
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్థరాత్రి ఉద్రిక్తత
-
బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. ‘పచ్చ’నేత ఒకరు ఓ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. యర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న సదరు బాలికపై కన్నేశాడు. వివాహితుడైనప్పటికీ ఉచ్ఛనీచాలు మరిచి నాలుగు నెలలుగా ఆమెను వేధించసాగాడు.ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంటబడేవాడు. ‘ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నా వెంట పడొద్దు’ అని ఆ బాలిక చాలాసార్లు చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా.. ‘నా వెంట రావడానికి నీకెంత కావాలి? చెప్పు.. డబ్బులు పడేస్తా’ అంటూ నీచంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్‌కెళ్లకుండా హెచ్చెల్సీ కాలువ వైపు వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్కూల్‌కెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావని ఆరా తీయగా.. జరిగిందంతా చెప్పి బోరున విలపించింది. నాలుగు నెలల నుంచి అతను వేధిస్తున్నాడని, స్కూల్ ఎక్కడ మాన్పిస్తారోనన్న భయంతో చెప్పలేకపోయానని, ఇప్పుడతని మాటలతో చచ్చిపోదామనుకున్నానని కన్నీరు పెట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న ముక్కన్నను పట్టుకుని చితకబాదారు. అనంతరం గ్రామస్తులు అతన్ని ఊళ్లోకి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు.కామాంధుడికి పోలీసుల వత్తాసు?మరోవైపు.. కామాంధుడు టీడీపీ నాయకుడు కావడంతో అతన్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో నిందితుని నుంచి కూడా కౌంటర్ ఫిర్యాదు తీసుకుని అతనిని రక్షించాలని చూస్తున్నట్లు తెలిసింది. -
అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు: మంత్రి పయ్యావుల
ఉరవకొండ: ‘నీతిఆయోగ్(NITI Aayog) దేశంలోని 18 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో మన రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. ఏపీకి అప్పు తీసుకునే శక్తితోపాటు తీర్చే శక్తి కూడా లేదని తేల్చి సున్నా మార్కులు వేసింది’ అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) అన్నారు. గురువారం అనంతపురం జిల్లా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తమ్మీద అప్పు తీసుకునే అర్హత లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాత్రమేనని నీతిఆయోగ్ తేలి్చందన్నారు. అయితే తాము అప్పులు ఉన్నాయని సాకు చూపి తప్పించుకోలేమని, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్థిక భారం ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతామన్నారు. రాయలసీమ బాగుపడాలంటే నీళ్లు రావాలని, నీళ్లు రావాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాగానే జిల్లాల మధ్య నీటి యుద్ధాలు ఆగిపోయాయన్నారు. రాయలసీమలో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రైల్వే ప్రాజెక్టులపై రూ.90 వేల కోట్లు, జాతీయ రహదారులకు రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. ఇవన్నీ పూర్తయితే సంపద సృష్టి జరిగి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. సంపద సృష్టి అంటే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు పథకాలు ముందుకు తీసుకుపోవడమేనని చెప్పారు. -
ఆన్ లైన్ లో రమ్మీ ఆడుతూ దొరికిన అనంతపురం డీఆర్వో మలోల
-
పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ పోరుబాటపై అక్రమ కేసులు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపుతో వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.అనంతపురం జిల్లాలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కూటమి నేతల మెప్పు కోసం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడంతో తగ్గించాలని వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఘన విజయాన్ని అందుకుంది. పోరుబాటలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఇక, అనంతపురంలో ఉరవకొండ మాజీ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతల ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి సహా 16 మంది పోలీసులు కేసులు పెట్టారు. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.అయితే, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారని పచ్చ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఇదే సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా కేసులు పెట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై పోలీసుల కేసులు పెట్టడంపై సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడితోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక, అంతకుముందు.. వైఎస్సార్సీపీ పోరుబాటకు వెళ్లొద్దని మూడు రోజులుగా పోలీసుల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల దాష్టీకం
-
అనంతపురంలో YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
అనంతపురం జిల్లాలో బీజేపీ కార్యకర్తను హత్యచేసిన టీడీపీ కార్యకర్త
-
ఏపీలో అఘాయిత్యాలు పెరిగాయి.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయంటూ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు పోలీసులకు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్‌ను పటిష్ఠం చేయాలి. మా ముందు చాలా టాస్క్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నామని అనిత అన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ‘‘పోలీసులు మరిచిపోకండి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం. పదే పదే ఈ విషయాన్ని మాతో చెప్పించుకోకూడదు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది?. ఏదైనా తెగే వరకు లాగకూడదు. బయటకు వస్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. డీజీపీ దీనికి బాధ్యత తీసుకోవాలి’’ అని చెప్పారాయనఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
అనంతపురం ఎంపీ పుత్రోత్సాహం..
-
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
ఆ విషయంలో ఎందుకు స్పందించరు?: అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం: రైతు భరోసా కింద ఒక్కొ రైతుకు రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.‘‘కరవు రైతులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. హంద్రీనీవా, తుంగభద్ర జలాలను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరున్నా ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడం దారుణం. రాయలసీమకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించరు?. రైతుల సమస్యల కన్నా మద్యం, ఇసుక నుంచి కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్న ధ్యాసే ముఖ్యమా?’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. -
అనంతపురం నగరపాలక సంస్థలో సత్తా చాటిన YSRCP
-
పెట్రేగిపోతున్న టీడీపీ నేతలు...
-
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్‌కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు. -
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్‌కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
సామాజిక సాధికార యాత్ర: పోటెత్తిన ‘అనంత’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శుక్రవారం) అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకూ సాగింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. 17 మంది ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు?, రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి జరిగుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి’అని విజ్ఞప్తి చేశారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్ వంటి వారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు ఉంటాయి. అభివృద్ధి విషయంలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే, సీఎం జగన్ రెండు అడుగులు వేస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
ఈ నెల 8న అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం
-
కోర్టు సిబ్బందిని కొట్టిన సీఐపై విచారణ
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్, అతనికి సహాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులను అనంతపురం జిల్లా హిందూపురం వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్ కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా మలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ, సీఐ ఇస్మాయిల్ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణ కోసం వెళ్లగా.. హిందూపురానికి చెందిన దేవాంగం గిరీష్ అనే వ్యక్తిని అక్కడ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హిందూపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సదరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఉదయ్సింహారెడ్డిని అడ్వొకేట్ కమిషనర్‌గా నియమించింది. గిరీష్ అక్రమ నిర్బంధంలో ఉంటే తీసుకురావాలని అడ్వొకేట్ కమిషనర్‌కు స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 21న ఉదయ్‌సింహారెడ్డి హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అతనికి సహాయకులుగా కోర్టు సిబ్బంది, గిరీష్ తరఫు న్యాయవాది, అతని కుటుంబ సభ్యులు వెళ్లారు. గిరీష్ పోలీసుల నిర్భంధంలో ఉన్నారని, అతన్ని పోలీసులు కొట్టినట్టు అడ్వొకేట్ కమిషనర్ గుర్తించారు. అతనికి తక్షణమే చికిత్స అవసరమని, కోర్టుముందు హాజరుపరిచేందుకు తనవెంట పంపాలని ఇన్స్పెక్టర్ను ఉదయ్‌సింహారెడ్డి కోరారు. ఇందుకు నిరాకరించిన ఇస్మాయిల్, అడ్వొకేట్ కమిషనర్‌తో పాటు అతని వెంట ఉన్న వారిపై చేయి చేసుకున్నారు. దీనిపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సదరు ఇన్స్పెక్టర్ను వివరణ కోరారు. అయితే, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో జడ్జి ఈ విషయాన్ని డీఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా జడ్జి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా జడ్జి సైతం హైకోర్టుకు ఓ నివేదిక పంపారు. ఈ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ దీనిపై డీజీపీ వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున దీనిని సుమోటో పిల్‌గా పరిగణించాలని, తగిన ఉత్తర్వుల నిమిత్తం సీజే ముందుంచాలని జస్టిస్ దేవానంద్ రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాత డీజీపీ స్పందిస్తూ.. బాధ్యుౖలెన పోలీసులకు శిక్ష విధించామని, రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేశామని కోర్టుకు నివేదించారు. జిల్లా జడ్జి నివేదికను పరిశీలించిన హైకోర్టు దీనిని సుమోటోగా పిల్‌గా పరిగణించాలని నిర్ణయించింది. ఆ మేరకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన) -
అనంతపురం మహిళకు బాంబే బ్లడ్ గ్రూపు రక్తదానం
కర్నూలు(హాస్పిటల్): లక్షల్లో ఒకరికి ఉండే బాంబేబ్లడ్ గ్రూపు రక్తాన్ని కర్నూలులో ఓ దాత ఇవ్వగా.. దానిని అనంతపురంలోని ఓ మహిళకు దానంగా పంపించారు. అనంతపురంలో ని జయలక్ష్మి అనే గర్భిణి ఆరోగ్యం విషమించి రక్తం అవసరమైంది. ఆమెది బాంబే బ్లడ్ గ్రూ పు కావడంతో స్థానికంగా లభించడం కష్టమైంది. ఈ పరిస్థితిల్లో ఆమె కుటుంబ సభ్యులు కర్నూలులోని డేనియల్ రాజు ఫౌండేషన్ ఫౌండర్ సుమన్‌కు ఫోన్ చేసి సాయం కోరారు. వెంటనే ఆయన నగరంలోని కర్నూలు బ్లడ్ బ్యాంక్‌కు ఫోన్ చేసి అక్కడ నిల్వ ఉన్న బాంబే బ్లడ్ గ్రూపు రక్తాన్ని అనంతపురానికి పంపించారు. అనంతపురంలో ఆ రక్తాన్ని జయలక్ష్మికి ఎక్కించిన అనంతరం ఆమె కోలుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలో ఇద్దరు రోగులకు బాంబే బ్లడ్ గ్రూపు రక్తాన్ని అందించినట్లు సుమన్ చెప్పారు. -
అనంతపురంలో విషాదం.. వారం కిందటే పెళ్లి.. ఏం జరిగిందో ఏమో!
పెళ్లి వేడుక సందడి.. తీపి జ్ఞాపకాల్లోంచి బంధువులు, ఆత్మీయులు ఇంకా బయటకురానేలేదు. పైళ్లె పట్టుమని వారం రోజులు కూడా గడవలేదు.. కట్టుకున్న భర్తతో మూడు రోజులు కలసి లేదు. ఏం కష్టమొచ్చిందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఓ యువతి అయినవాళ్లను శోకంసంద్రంలోకి నెట్టింది. పెళ్లి సందడిగా జరగడంతో మొక్కు తీర్చుకుందామని తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లిన తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త హతాశులయ్యారు. విగతజీవిగా పడిఉన్న కుమార్తె మృతదేహం వద్ద వారు రోదించిన తీరు కలచి వేసింది. సాక్షి, అనంతపురం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు అనుమానస్పద స్థితిలో తనువు చాలించింది. త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. బళ్లారి జిల్లా, కూడ్లిగి తాలూకా, చిరుమనెహళ్లికి చెందిన శశికళ నగరంలోని స్థానిక ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో పనిచేసేది. ఆత్మకూరు మండలం, పంపనూరు తండాకు చెందిన రమేష్‌నాయక్‌కు ఈ నెల 12న ఈమెతో వివాహం జరిగింది. 13న కొత్త దంపతులు శశికళ పుట్టింటికి వెళ్లారు. ఈ నెల 14న అనంతపురం వచ్చారు. ఇల్లు ఇంకా ఎక్కడా సరిపోలేదని రెండు రోజులు శశికళను హాస్టల్లో ఉంచిన రమేష్‌నాయక్ 16న నాల్గవరోడ్డు సమీపంలోని ఎస్వీఎన్ఆర్ అపార్టుమెంటుకు తీసుకెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు గాని మరుసటి రోజు అంటే 17వ తేది రాత్రి శశికళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. భర్త ప్రవర్తనపై అనుమానాలు.. కొత్త దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి శశికళకు ఆమె భర్త రమేష్‌నాయక్‌కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శశికళ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘర్షణ జరిగిన కొద్దిసేపటికే తనను లోపలి గదిలో పెట్టి బయట తలుపులకు శశికళ తాళం వేసినట్లు రమేష్‌నాయక్ చెబుతున్నాడు. బయట వాళ్ల సాయం కోసం గట్టిగా కేకలు వేస్తే వచ్చి తలుపులు విరగ్గొట్టారని తెలిపాడు. అయితే, అపార్ట్మెంట్లోని రెండో ఫ్లోర్‌లోకి వచ్చి తలుపులు తీసిన వారెవరో చెప్పడంలేదు. పైగా శశికళ ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ఎత్తు కోసం ఎలాంటి చైర్గాని ఉపయోగించలేదు. దీంతో రమేష్‌పై బాధిత కుటుంబ సభ్యులకు మరింత అనుమానం పెరుగుతోంది. ఇంత జరిగినా శశికళ కుటుంబ సభ్యులకు ఉదయం 10.30 వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 11 గంటల సమయంలో ఫోన్ చేసి మీ పాప ఉరివేసుకుంది, కొన ఊపిరితో ఉందని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో శశికళ చనిపోయిందని తెలిపాడు. పోలీసులకు కూడా ఉదయం 10.30 వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. హతమార్చాడని బంధువుల ఆరోపణ రమేష్‌నాయక్ వ్యవహారంపై శశికళకు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. అతనికి మరొకరితో సంబంధాలున్నాయిన ,ఈ విషయం శశికళకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను హతమార్చి ఉండవచ్చని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కన్నీరు మున్నీరైన కన్నవారు.. నాలుగు రోజుల క్రితం నవ్వుతూ అత్తారింటికి వెళ్లొస్తానని చెప్పిన కూతురుని గుర్తు చేసుకుని తండ్రి ఠాగూర్‌నాయక్ రోదించిన తీరు అందరిని కలచి వేసింది. ఠాగూరునాయక్ది అతి పెద్ద కుటుంబం. ఏడుగురు అన్నదమ్ములు. అంతా కలసే ఉంటున్నారు. ఠాగూర్నాయక్కి ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. అందరిలో చిన్నదైన శశికళంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం. తిరుమల వెంకన్న స్వామి దయతో చిన్నబిడ్డ పెళ్లి కూడా బాగా జరిపించానని సంబరపడ్డానని తెలిపారు. నా బాధ్యతలు సంతృప్తిగా తీర్చుకోవడానికి తిరుమల వెంకటేశ్వరస్వామి దయే కారణమని, ఈక్రమంలో మొక్కు తీర్చుకునేందుకు 16వ తేదీ భార్య జయబాయితో కలిసి వెళ్లానని, తీరా ఉదయం ఫోన్ వస్తే తిరుమల నుంచి ఇటే అనంతకు చేరుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు. అక్కకు బంగారం ఇద్దామని.. శనివారం ఉదయం శశికళ తమ్ముడు వైద్య విద్యార్థి విశ్వనాథ్‌నాయక్ అనంతపురం రావాల్సి ఉంది. ఈ విషయంపై నిన్న అక్కతో మాట్లాడాను. రేపు మా ఇంటికి వస్తావా? అని అక్క పిలిచింది. ఉదయాన్నే అక్కబావల వద్దకు వెళ్లాలని ఎంతో సంతోష పడ్డాను. ఇంతలో ఇలా జరిగిపోయిందంటూ సోదరుడు గుండెలవిసేలా రోదించాడు. కేసు నమోదు: నవ వధువు ఆత్మహత్య సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బిడ్డ చావుకు అల్లుడే కారణమని బాధితు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. -
డిజిటల్ తరగతులకు దన్ను
అనంతపురం: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డిజిటల్ ఇన్షియేటివ్స్‌లో భాగంగా ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు నిర్వహించనున్నారు. ఐసీటీ, స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటుకు సమగ్రశిక్ష దన్నుగా నిలుస్తోంది. విద్యారంగంలో ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ విద్యనందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్ విద్యను వారికి చేరువ చేస్తోంది. ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషన్ స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డిజిటల్ కంటెంట్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలో 100లోపు విద్యార్థులు ఉంటే రూ.2.5 లక్షలు, 100 నుంచి 250 మందిలోపు ఉంటే రూ.4.50 లక్షలు, 250 నుంచి 700 మంది ఉంటే రూ.6.4 లక్షల గ్రాంట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ గ్రాంట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతులు రాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 957 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లు పూర్తిగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ, వీజే కనెక్టివిటీ, రికార్డెర్డ్ బోర్డు వర్క్, డిజిటల్ బోర్డును బ్లాక్ లేదా గ్రీన్ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం, ఆడియో, వీడియోలు ప్రదర్శనకు వీలు, ప్యానల్లోనే స్పీకర్ల ఏర్పాటు, స్పెసిఫికేషన్ల ఇంటెల్‌కోర్ ఐ–5, ఏఎండీ రీజెఎన్5 ప్రాసెసర్, కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. నాడు–నేడు బడుల్లో చకచకా ఏర్పాట్లు మనబడి ‘నాడు – నేడు’ కింద తొలి దశ పనులు పూర్తయిన స్కూళ్లలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్ బోధన చేస్తారు. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 65 ఇంచులతో ఉండే 1,463 స్మార్ట్ టీవీలను ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. డిజిటల్ కంటెంట్ సిద్ధం డిజిటల్ విద్యాబోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ సిలబస్‌కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఈ –కంటెంట్‌ను సీబీఎస్ఈ విధానంలో రూపొందిస్తోంది. వీటిలో ఆడియో, వీడియో తరహాలో కంటెంట్ ఉండనుంది. స్మార్ట్ తరగతులకు చర్యలు మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ తరగతులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తక్కిన వాటిలో కొత్తగా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి సమగ్రశిక్ష విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇపుడు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 957 స్మార్ట్ తరగతులు రానున్నాయి. – బి.ప్రతాప్‌రెడ్డి, ఆర్జేడీ, విద్యాశాఖ -
చాట్‌బాట్ దూకుడు..సెల్ఫోన్ల రికవరీలో ‘అనంత’ పోలీసుల సత్తా
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ఫోన్ పోయిందా.. గోవిందా అనుకునే రోజులు పోయాయి. పోగొట్టుకున్న ఫోన్‌ను పోలీసులు వెతికి మరీ ఉచితంగా ఇంటికి చేరుస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘చాట్‌బాట్’ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. పోయిందనుకున్న సెల్‌ఫోన్ తిరిగి చేతికి అందడంతో బాధితులు ‘అనంత’ పోలీసులను అభినందిస్తున్నారు. 5,077 ఫోన్ల రికవరీ.. చాట్‌బాట్ సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే రూ.8.25 కోట్లు విలువ చేసే 5,077 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం ఒక్కరోజే 700 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ ఫక్కీరప్ప అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అనంత పోలీసులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. భారీ స్థాయిలో ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ముట్టజెప్పడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీస్ టెక్నికల్ విభాగాన్ని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం అభినందించారు. ఎఫ్ఐఆర్ లేకుండానే... సెల్‌ఫోన్ పోతే బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లకుండానే, ఎఫ్ఐఆర్తో కూడా సంబంధం లేకుండానే రికవరీ చేసి వారికి అందజేయాలనే సంకల్పంతో చాట్‌బాట్ సేవలను 2022 మార్చి 17న ఎస్పీ ప్రారంభించారు. వాట్సాప్ నంబర్ 9440796812 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫోన్లు పోగొట్టుకున్న జిల్లా వాసులతో పాటు వివిధ ప్రాంతాల వారు ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా వేగంగా స్పందించి ఫోన్లు రికవరీ చేసి వారికి అందజేస్తున్నారు. సుదూర ప్రాంతాల వారు అనంతకు రాకుండానే ఫోన్లు పొందేలా ఉచిత డోర్ డెలివరీ సేవలను తాజాగా ప్రారంభించారు. ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో ఈ సేవలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటిదాకా 15 రాష్ట్రాల బాధితులకు సుమారు 400 సెల్ఫోన్లు రికవరీ చేసి అందించామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 18 జిల్లాల బాధితులు ఈ సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. -
మల్బరీ, పట్టులో ‘ఉమ్మడి అనంత’ పైచేయి
ఉద్యాన పంటలకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రాష్ట్రంలోనే పేరెన్నికగన్నవి. కానీ ఈ రెండు ఇప్పుడు మల్బరీ సాగులోనూ మొదటి వరుసలో నిలిచాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తయ్యే పట్టు అత్యంత నాణ్యమైనది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టుకు దేశీయంగా మంచి మార్కెట్ ఉంది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మల్బరీ పండించే జిల్లాల్లో శ్రీసత్యసాయి మొదటి స్థానంలో ఉండగా.. అనంతపురం జిల్లా నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగానూ ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ఎంత ఖ్యాతి ఉందో అందరికీ తెలిసిందే. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మనరాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాలతో పాటు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మల్బరీ సాగు భారీ విస్తీర్ణంలో ఉంది. ఒక్క శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల మంది రైతులు 44,487 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్టు పట్టుపరిశ్రమ శాఖ అంచనా. చిత్తూరులో 39,849 ఎకరాల్లోనూ, అన్నమయ్య జిల్లాలో 12,839 ఎకరాల్లోనూ పండిస్తుండగా, 6,740 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తూ అనంతపురం జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల పైచిలుకు మల్బరీ రైతులుండగా, అనంతపురం జిల్లాలో 8,500 మంది ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పట్టుగూళ్లు అత్యంత నాణ్యమైనవిగా పేరుంది. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరం పట్టుగూళ్లు కిలో రూ.607 పలుకుతున్నాయి. పట్టుగూళ్ల ధర ఆశాజనకం రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాం. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాం. బైవోల్టిన్ పట్టుగూళ్లు పెంచాం. దిగుబడి బాగా వచ్చింది. పట్టు గూళ్ల ధర కూడా ఆశాజనకంగా ఉంది. కిలో రూ.700పైగా పలికింది. రెండు ఎకరాలకు రూ.లక్షదాకా లాభం వచ్చింది. – రంగనాథ్, రైతు, రొళ్ల మల్బరీ సాగు లాభదాయకం కొన్నేళ్లుగా పట్టు పరుగులు పెంచుతున్నా. రెండెకరాల్లో మల్బరీ సాగు చేశా. ఏటా ఐదు నుంచి ఆరు పంటలు తీసుకుంటా. ఒక పంటకు ఖర్చు పోను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మల్బరీ నర్సరీని కూడా ఏర్పాటు చేశా. నర్సరీ ద్వారా కూడా ఆదాయం వస్తోంది. – నారాయణప్ప, వి.ఆగ్రహారం, అమరాపురం మల్బరీ విస్తీర్ణం పెంపునకు కృషి హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ రాష్ట్రంలోనే అతి పెద్దది. సగటున రోజుకు 6వేల కిలోల పట్టుగూళ్లు వస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరంలో కూడా పట్టుగూళ్ల మార్కెట్లు ఉన్నాయి. ఇప్పటికే మల్బరీ సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తాం. – పద్మమ్మ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ, శ్రీసత్యసాయి జిల్లా -
హెడ్ కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల జులుం!
కణేకల్లు: ‘వాళ్లు ఎవరనుకొంటున్నావ్.. టీడీపీ లీడర్లు.. మా వాళ్లు మమ్మల్ని పలుకరించేందుకు వస్తే అడ్డుకొంటావా..? గంట టైమ్ ఇస్తే మా ప్రతాపమేంటో చూపిస్తాం...’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతిచౌదరి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు కణేకల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుపై జులుం ప్రదర్శించారు. మంత్రి ఉషశ్రీచరణ్ భానుకోట వద్ద సుజలాన్ కంపెనీ భుములను ఆక్రమించారని ఇటీవల దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి శనివారం జిల్లా టీడీపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లాలని యత్నించారు. టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని నోటీసుల ద్వారా సూచించి పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నం, గోళ్ల వెంకటేశులు తమ వాహనాల్లో భానుకోటకు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కణేకల్లు టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా హెచ్‌సీ శ్రీరాములు వారిని అడ్డుకుని అందరూ కాకుండా ఒక్కొక్కరుగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారంతా ఒకే సారి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఉన్నం, వెంకటేశు బయటికొచ్చి పోలీసులపై నానా యాగీ చేశారు. ఏఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
భర్తను చంపేందుకు స్వామిజీతో కలిసి భార్య స్కెచ్
-
పనికి ముందే రేటు.. కావాలనే లేటు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదమూ లేని భూములను కూడా వివాదంలో ఉంచేందుకు అవతలి పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఆన్లైన్లో రెడ్‌మార్క్ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ భూమిని అమ్మడానికి, కొనడానికీ ఉండదు. చిన్న చిన్న ఫైళ్లకు కూడా డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫైలును నెలల తరబడి పెండింగులో పెట్టడం ఇక్కడ మామూలైంది. ముఖ్య అధికారి మామూళ్ల పర్వం తహసీల్దార్ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికీ రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలకూ లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు అధికారి అవినీతి వైఖరి నచ్చక ఒక దశలో ఇక్కడ పనిచేస్తున్న వీఆర్ఓలు సమ్మెలోకి వెళ్లాలని అసోసియేషన్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆఫీసులోని ఒక ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సహకరిస్తున్నారని, ఇవన్నీ ఆర్డీఓకు తెలిసినా మిన్నకుండిపోతున్నారని సమాచారం. దాదాపు 7 లక్షల మందికి ఈ తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ఈ నేపథ్యంలో భూముల సమస్యలపై ఇక్కడకు వచ్చే వేలాదిమంది పరిస్థితి వేదనాభరితంగా మారింది. రాప్తాడు నియోజకవర్గం మన్నీల పరిధిలోని భూమి(సర్వే నెం.25–4)కి సంబంధించి ఆర్ఓఆర్ (రైట్స్ ఆఫ్ రికార్డ్స్)కు యజమాని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి తిరిగినా అనంతపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు సరికదా.. ఆయన భూమిని వేరే వారి పేరున ఉన్నట్టు హక్కు పత్రాలు రాశారు. డైక్లాట్‌లో తనపేరే ఉన్నా తహసీల్దార్ అవతలి వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇలా చేసినట్టు యజమాని ఆరోపిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.93–2లోని 2.84 ఎకరాల భూమిని వివాదంలో (డిస్ప్యూట్ ల్యాండ్ కింద) పెట్టారు. ఎలాంటి ఆర్డరు గానీ, ఆర్డీఓ కోర్టు నుంచి ఆదేశాలు గానీ లేకుండానే భారీగా డబ్బు తీసుకుని ఈ విధంగా చేసినట్టు తేలింది. నిజమైన హక్కుదారుడు మాత్రం బాధితుడిగా మిగిలిపోయాడు. సోములదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే నెం.212–1ఎ లోని 5.50 ఎకరాల భూమిని ఇటీవలే వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ కిందకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి కిందిస్థాయిలో ఎలాంటి కన్వర్షన్ రిపోర్టు గానీ, అధికారుల సంతకాలు గానీ లేవు. నేరుగా తహసీల్దారే అన్నీ చేసేశారు. ఇందులో భారీగా డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. ఉపేక్షించేది లేదు.. ఆర్‌ఓఆర్‌లు, ల్యాండ్ కన్వర్షన్లకు డబ్బు అడిగితే ఉపేక్షించేది లేదు. హక్కుదారులకు న్యాయం చేయకుండా ఫిర్యాదులను బట్టి భూములను వివాదాల్లో పెట్టడం సరి కాదు. దీనిపై ప్రత్యేక విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ (చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి) -
అదిరిందయ్యా.. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణం
నిజాయితీగా బతకాలన్న ఆకాంక్ష ఉంటే చాలు.. కోటి ఉపాయాలు తన్నుకొస్తాయి. అందులో ఏదో ఒకదానిని ఆచరణలో పెడితే బతుకు సాఫీగా సాగిపోతుంది. ఇందుకు నిదర్శనమే ఖాదర్. అనంతపురంలోని నందమూరి నగర్‌కు చెందిన ఖాదర్ చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. అద్దె గది కోసం వెదికాడు. రూ. వేలల్లో అడ్వాన్స్, అదే స్థాయిలో నెలవారీ అద్దె చెల్లించడం భారంగా భావించిన అతను తనకొచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టాడు. తన వద్ద ఉన్న పాత మోపెడ్‌కు వెనుక తోపుడుబండిని అమర్చుకుని, అందులో గుండుసూది మొదలు.. వివిధ రకాల గృహోపకరణాలు, వంట సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, జ్యువెలరీ, గొడుగులు, లేడీస్ బ్యాగ్‌లు... ఇలా ప్రతి ఒక్క వస్తువునూ తీసుకెళ్లి వీధుల్లో విక్రయించడం మొదలు పెట్టాడు. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అదిరిందయ్యా ఖాదరూ అంటూ అభినందిస్తున్నారు. చూసేందుకు చిత్రంగా ఉన్న ఈ దుకాణంలో వస్తు, సామగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వైఎస్సార్సీపీ శ్రేణులో జోష్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన సమీక్షలు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి నాలుగు రోజుల పాటు 8 నియోజక వర్గాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలను అధిగమించేలా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సూచించారు. రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని కార్యకర్తలకు చెప్పారు. ఇంకా ఏమి సూచించారో ఆయన మాటల్లోనే... హామీలన్నీ అమలు చేశాం : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశాం. కులాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చాం. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబమూ లబ్ధిపొందని పరిస్థితి లేదు. గడప గడపకూ మన ఎమ్మెల్యేలు వెళ్లి వారికి జరిగిన లబ్ధి వివరిస్తున్నారు. ఎక్కడా వ్యతిరేకత అన్నది లేదు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగిన విషయాన్ని మరింతగా ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్తా సైనికుడే : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్తా సైనికుడే. చిన్న చిన్న విభేదాలున్నా పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కార్యకర్తలే పార్టీకి సైనికులు. క్షేత్రస్థాయిలో పోరాటం మీదే. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన ఈ పార్టీకి మీరే దిక్సూచి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో మన పార్టీ విజయం సాధించిందంటే అది మీ వల్లే. మీ పోరాటం వృథా కాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. ధైర్యంగా గడప గడపకూ వెళ్తున్నాం :అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కొంచెం భయం ఉంటుంది. కానీ మూడున్నరేళ్ల తర్వాత మనం ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నామంటే అది మన నాయకుడిపై ఉన్న విశ్వాసం, నమ్మకమే. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిది. అప్పట్లో ఉచిత విద్యుత్‌పై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకం చేస్తే, జగన్ తొలిరోజు నుంచే మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తున్నారు. టీడీపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు : ప్రజా బలం లేనందు వల్లే చంద్రబాబు పచ్చ మీడియాపై ఆధారపడి వెళ్తున్నారు. ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేస్తున్నా జనం నమ్మడం లేదనేది తెలుసు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లతో పొత్తులున్నా మనం భయపడాల్సిన పనిలేదు. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయి. వాటిని అధిగమించి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి.. జగన్‌ను మళ్లీ సీఎంను చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాలుగు రోజుల పర్యటనలో పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. -
హరిప్రసాద్.. అబ్బా అనిపిస్తున్నావబ్బా
సాక్షి,అనంతపురం: డాక్టర్ హరిప్రసాద్ సొంతూరు నార్పల. వైద్య విద్యలో ఎంఎస్ (జనరల్ సర్జరీ), ఎంసీహెచ్ (పీడియాట్రిక్ సర్జరీ) చేశారు. కొంతకాలం పాటు అనంతపురం సర్వజనాస్పత్రిలో పనిచేశారు. ప్రస్తుతం నగరంలోని సాయినగర్‌లో సొంతంగా ఆస్పత్రి నిర్వహి స్తున్నారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ (హృదయపూర్వక ధ్యానం) ట్రైనర్‌గానూ సేవలందిస్తున్నారు. సర్జన్‌గా, మెడిటేషన్ ట్రైనర్‌గా బిజీగా ఉంటున్నప్పటికీ తన ప్రవృత్తి అయిన యాక్టింగ్‌ను విస్మరించలేదు. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండాలని, అదే నిజమైన జీవితమని ఆయన బలంగా విశ్వసిస్తారు. మన ధోరణికి హృదయంలో ఉండే ఆనందం (హార్ట్ఫుల్నెస్ హ్యాíపీనెస్) ఆధారం కావాలని, అప్పుడే భౌతిక ప్రపంచం ఎన్ని ఎమోషన్స్ ఇచ్చినా తిరిగి ఆనందానికి చేరువవుతామని చెప్పే డాక్టర్ హరిప్రసాద్.. తన వద్దకు చికిత్సకు వచ్చే వారితోనూ సరదాగా మాట్లాడుతూ, చక్కని హాస్యాన్ని పంచుతుంటారు. తద్వారా వారిలోని ఒత్తిడిని పటాపంచలు చేసి, త్వరగా కోలుకునేందుకు తోడ్పడతారు. డాక్టర్ హరిప్రసాద్ ‘అబ్బా టీవీ’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయ్యారు. కామెడీ వీడియోలు చేస్తూ లక్షలాది మందికి చేరువయ్యారు. ఆయన కామెడీలో చక్కని టైమింగ్ ఉంటుంది. అంతర్లీనంగా సామాజిక సందేశమూ ఉంటుంది. డాక్టర్‌గా తనకు ఎదురయ్యే అనుభవాలు, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, పల్లె, పట్నం వాసుల జీవనవిధానం, సామాజిక సమస్యలు..ఇలా అనేక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని హాస్యభరితంగా వీడియోలు రూపొందిస్తున్నారు. కరోనా సమయంలో వ్యాధిపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ రూపొందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో హరిప్రసాద్ ఏ వీడియో పెట్టినా వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఫేస్బుక్ పేజీకి లక్షా 20 వేల మంది ఫాలోయర్స్, యూట్యూబ్ చానల్‌కు లక్షా 89 వేల సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆయన ఎంత ఫేమస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ హరిప్రసాద్ రూపొందించే కామెడీ వీడియోల్లో తనతో పాటు తన వద్ద పనిచేసే సిబ్బంది, జిల్లాకు చెందిన పలువురు కళాకారులు నటిస్తున్నారు. సర్జన్‌గా వచ్చే సంపాదన కూడా కొంత వరకు వదులుకుని కామెడీ వీడియోల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మంచి పొజిషన్లోæ ఉండి ఇలా ఎందుకు చేస్తున్నావని మొదట్లో బంధువులు, సన్నిహితులు వారించినా.. తన ప్రవృత్తిని మాత్రం వదల్లేదు. ఇంటిల్లిపాదీ ఆనందంగా చూడదగిన వీడియోల ద్వారా అనతికాలంలోనే జనానికి చేరువయ్యారు. లక్షలాదిమంది అభిమానులను కూడగట్టుకున్నారు. అలాగే తన వీడియోల ద్వారా పలువురు కళాకారులకు, ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. తన ఆధ్వర్యంలోనే అనంతపురం యాక్టర్ల సంఘం (అయాసం) ఏర్పాటు చేసి..వారిని ఒక గొడుగు కిందకు తెచ్చారు. డాక్టర్ హరిప్రసాద్‌కు సామాన్యులే కాకుండా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఒకసారి సినీనటుడు మోహన్‌బాబు స్వయంగా∙ఆయన నటనను మెచ్చి ఫోన్ చేసి అభినందించారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఐక్యూ, 2డీ సినిమాలు, ‘ఎవరికి వారే యమునా తీరే’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. అవి రిలీజ్ కావాల్సి ఉంది. -జిల్లా డెస్క్ ఆనందంతోనే అసలైన జీవితం పీజీ చదివేటప్పుడు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యా. ఆ స్థితి నుంచి బయట పడేందుకు ధ్యానం దోహదపడింది. దీంతో నా దృక్పథం మారిపోయింది. ఆనందంగా ఉండడమే నిజమైన జీవితమని గ్రహించాను. మొదట్లో వాట్సాప్ ద్వారా జోకులు, మెడిటేషన్‌కు సంబంధించిన అంశాలను పరిచయస్తులకు పంపేవాణ్ని. తర్వాత చిన్నచిన్న వీడియోలు రూపొందించి పంపించాను. అవి అందరికీ నచ్చి బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌లో ‘అబ్బా టీవీ’ ప్రారంభించి..రెగ్యులర్‌గా వీడియోలు చేస్తున్నా. డాక్టర్‌గా, యాక్టర్‌గా సక్సెస్ కావడం డబుల్ సంతోషాన్నిస్తోంది. – డాక్టర్ హరిప్రసాద్ -
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం..
సాక్షి, అనంతపురం: టిబెటియన్ మస్టిఫ్.. టిబెట్ దేశానికి చెందిన ప్రత్యేక శునకం. ఇది చలి ప్రాంతాల్లోనే జీవించే అరుదైన జాతి కుక్క. తెలివైన, బలమైన, రక్షణ కల్పించే జాగిలంగా ప్రసిద్ధి. సాధారణంగా 15 ఏళ్లు జీవిస్తుంది. గరిష్టంగా 65 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఈ జాతి శునకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దీని కోసం శునక ప్రియులు రూ.లక్షలు వెచ్చిస్తుంటారు. మస్టిఫ్ జాతి శునకం అనంతపురం సాయి నగర్ ఒకటో క్రాస్‌లో ఉండడం విశేషం. బుక్కచెర్ల నల్లపరెడ్డి నివాసంలో ఉండే ఈ జాగిలం పలువురిని ఆకర్షిస్తోంది. అతిశీతల ప్రాంతం నుంచి వచ్చిన కుక్క అయినప్పటికీ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడింది. రోజుకో కేజీ చికెన్ లాగించేస్తూ హాయిగా జీవిస్తోంది. పూర్తిగా ఏసీ గదుల్లోనే సేద తీరుతోంది. ఏకంగా పులినే చంపగల శక్తిశాలి అయిన మస్టిఫ్.. ఎవరి మీదా దాడి చేయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి పాస్‌పోర్టు కూడా ఉండడం విశేషం. వీసాపై దీన్ని ఇక్కడికి తెప్పించారు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. (చదవండి: అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు) -
సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు
వ్యవసాయరంగానికి జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో అంచనాకు మించి పంట రుణాలు మంజూరు చేసింది. రూ.11,957 కోట్ల వార్షిక రుణప్రణాళిక లక్ష్యంలో రెండో త్రైమాసికం ముగిసేలోపు అంటే సెప్టెంబర్ నెలాఖరుకే రూ.9,077 కోట్లతో 76 శాతం సాధించిన బ్యాంకర్లు గడువులోగా వంద శాతం సాధించే దిశగా అడుగులేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటోంది. పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో ఇప్పించి వ్యవసాయం సాఫీగా సాగేలా చూస్తోంది. ఖరీఫ్‌లో సాగుకు వీలుగా ఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,204.24 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 127 శాతంతో రూ.4,068.62 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,226.68 కోట్లు లక్ష్యంగా రబీ రైతులకు పంట రుణాల మంజూరు కొనసాగుతోంది. వ్యవసాయ టర్మ్ లోన్ల లక్ష్యం రూ.1,545.32 కోట్లు కాగా.. 121 శాతంతో రూ.1,869.81 కోట్లు మంజూరు చేశారు. ఇక అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.16.61 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రూ.92.18 కోట్లు ఇచ్చారు. ఇలా... మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రైతులు, ఇతర లబ్ధిదారులకు రూ.6,047.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఇతరత్రా రంగాలకూ విరివిగా రుణాలు వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ విరివిగా రుణాలు అందించారు. అందులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.795.15 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల కింద రూ.97.61 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ కింద రూ.1,780.72 కోట్లకు గానూ 116 శాతంతో ఏకంగా రూ.2,081.90 కోట్లు మంజూరు చేశారు. ఇలా రూ.11,957.94 కోట్ల వార్షిక రుణప్రణాళిక (లోన్ క్రెడిట్‌ప్లాన్–2022–23) అమలులో భాగంగా రెండో త్రైమాసికం ముగిసేనాటికే 76 శాతంతో రూ.9,077.42 కోట్లు పూర్తయింది. 2023 మార్చి 31 వరకు గడువు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిన బ్యాంకింగ్ నెట్వర్క్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్వర్క్ బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకులు దాదాపు 43 ప్రిన్సిపల్ బ్యాంకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల మంజూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రూ.1,567 కోట్లు, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,429 కోట్లతో పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూనియన్ బ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), బ్యాంకు ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్యాబ్యాంకు, ఐడీబీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే... ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ.4,453 కోట్లు, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,201 కోట్లు ఇవ్వగా తర్వాత గ్రామీణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులు, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాయి. రుణాల మంజూరుకు పోటీ రైతులతో పాటు అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల పురోభివృద్ధికి ఇటీవల కాలంలో బ్యాంకర్లు పోటీ పడి రుణాలు మంజూరు చేస్తుండటం మంచి పరిణామం. దీంతో వార్షిక లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించి గడువులోగా వంద శాతం చేరుకునే దిశగా రుణాల మంజూరు కొనసాగుతోంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, విద్యా, వాహన, గృహ, పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు... ఇలా అన్నింటికీ అవసరమైన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపుతున్నారు. – బి.నాగరాజారెడ్డి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) రూ.85 వేల పంట రుణం నాకు 2.75 ఎకరాల పొలం ఉంది. బొమ్మగానిపల్లి కెనరా బ్యాంకులో రూ.85 వేల పంట రుణం ఇచ్చారు. దీని వల్ల సకాలంలో పంట పెట్టుబడికి ఉపయోగపడింది. 2021లో తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్ పంట రుణాల సున్నావడ్డీ కింద ఇటీవల రూ.3 వేల వడ్డీ రాయితీ కూడా జమ కావడం సంతోషంగా ఉంది. – విరుపాక్షి, రైతు, ముప్పాలకుంట, బ్రహ్మసముద్రం మండలం -
డిపాజిట్లు రూ.50 కోట్లు.. మాయ చేశారిలా!
కళ్యాణదుర్గానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాలుగు నెలల క్రితం ‘సంకల్ప సిద్ధి మార్ట్’ గురించి తెలుసుకుని రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేశాడు. ఆకర్షణీయమైన కమీషన్‌తో ఆదాయం పొందవచ్చని.. తన తరఫున మరో పది మందిని సభ్యులుగా చేర్చి వారితోనే రూ.లక్షల్లో డిపాజిట్ చేయించారు. ఇటీవల మార్ట్ లావాదేవీలు స్తంభించిపోవడంతో కంగుతిన్నాడు. తనకు రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు. కళ్యాణదుర్గం పట్ణంలో ఆటు నడుపుకుంటూ జీవనం సాగించే యువకుడు చుట్టుపక్కల వారు, స్నేహితులతో సంకల్ప సిద్ది మార్ట్‌లో రూ.20 వేల దాకా డిపాజిట్ చేయించాడు. ఆదాయం వస్తుందని ఆశపడితే తీవ్ర నిరాశ ఎదురైంది. మార్ట్ లావాదేవీలు నిలిపేశారని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు. ఇలా వీరిద్దరే కాదు. విజయవాడ కేంద్రంగా నడిచిన ‘సంకల్ప సిద్ధి మార్ట్’ గొలుసుకట్టు వ్యాపారంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వందలాదిమంది డిపాజిట్లు పెట్టి నిలువునా మోసపోయారు. కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): గొలుసుకట్టు (చైన్‌లింక్) వ్యాపారంలో మరో సంస్థ బోర్డు తిప్పేసింది. మీ సొమ్ముకు రెట్టింపు మొత్తం పొందవచ్చని, ఆన్లైన్ షాపింగ్ ఉచితంగా చేసుకోవచ్చని దాదాపు ఐదు రకరకాల స్కీంలతో ‘సంకల్ప సిద్ధి మార్ట్’ సంస్థ మొబైల్ యాప్ రూపొందించింది. ఇంకేముంది ఎంతోమంది తమ ఆదాయం పెంచుకోవడం కోసం మార్ట్ వైపు ఆకర్షితులయ్యారు. డిపాజిట్‌గా వెయ్యి రూపాయలు కడితే.. రోజుకు పది రూపాయల కమీషన్, తన తరఫున మరొకరితో డిపాజిట్ చేయిస్తే మరో ఐదు రూపాయలు ఇస్తామని తెలిపింది. అందరికీ అందుబాటులోనే డిపాజిట్ మొత్తం ఉందని భావించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూలీనాలి చేసుకునే వారి నుంచి ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ఉద్యోగులు నమ్మి డిపాజిట్ చేశారు. ప్రారంభంలో ఆ సంస్థ చెప్పినట్టుగానే రోజువారీ కమీషన్ ఖాతాలకు జమ చేస్తుండటంతో డిపాజిట్‌దారులకు నమ్మకం కలిగింది. అలా సాగిపోతున్న క్రమంలో ఉన్నపలంగా యాప్ పనిచేయలేదు. ఈ రోజు పనిచేస్తుంది.. రేపు పని చేస్తుందని ఎదురుచూస్తుండగా విజయవాడలో ‘సంకల్ప సిద్ధి మార్ట్’ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు డిపాజిట్‌దారులు తాము మోసపోయామని బోధపడింది. కష్టపడి సంపాదించి మార్ట్‌లో పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్లు రూ.50 కోట్లు!.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 600 మంది ‘సంకల్ప సిద్ధి మార్ట్’లో డిపాజిట్ చేశారు. రూ.1000 మొదలుకొని లక్షలాది రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇందులో అత్యధికంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇలా మొత్తంగా ఈ ప్రాంతంలోనే రూ.50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మాయ చేశారిలా.. స్కీమ్ –1 : సంకల్పసిద్ధి మార్ట్‌లో రూ.1000 డిపాజిట్ చేస్తే రోజుకు రూ.10 కమీషన్ తో పాటు నెలలోపు రూ.300 విలువ చేసే కిరాణా సరుకులు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. స్కీమ్ –2 : రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.1000 చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తాం. దీంతో పాటు అదనంగా తన ఖాతా ద్వారా చేర్పించిన సభ్యుల తరపున కమీషన్ కూడా జమ అవుతుంది. స్కీమ్ –3 : రూ.లక్ష నగదు చెల్లిస్తే రూ.లక్ష విలువైన బంగారం ఇవ్వడంతో పాటు రోజుకు రూ.100 చొప్పున 300 రోజుల్లో రూ.30 వేలు ఇస్తామని మొబైల్‌కు మెసేజ్‌లు. స్కీమ్ –4 : రూ.2.5 లక్షలు ఇస్తే 25 ఎర్ర చందనం మొక్కలతో కూడిన స్థలం ఇవ్వడంతో పాటు 15 ఏళ్లకు రూ.1.75 కోట్లు వస్తాయంటూ నమ్మబలికింది. స్కీమ్ –5 : రూ.5 లక్షలు చెల్లిస్తే సెంటు భూమి ఇవ్వడంతో పాటు 300 రోజుల్లో తిరిగి రూ.2.5 లక్షలు చెల్లిస్తామని మరో రకంగా కస్టమర్లకు ఆశచూపింది. ఫిర్యాదు వస్తే పరిశీలిస్తాం సంకల్ప సిద్ధి మార్ట్‌పై బాధితుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసిన వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఫిర్యాదుపై విచారణ చేస్తాం. – బి.శ్రీనివాసులు, డీఎస్పీ, కళ్యాణదుర్గం -
పార్లమెంట్లో ప్రసంగించనున్న అనంత విద్యార్థి
అనంతపురం కల్చరల్: యువతలో దేశభక్తి, నైతికతను పెంపొందించే దిశగా పార్లమెంటు ఆఫ్ ఇండియా, నెహ్రూ యువకేంద్ర సంయుక్తంగా ఏటా నిర్వహించే వేడుకలకు దేశవ్యాప్తంగా 25 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈనెల 14న పార్లమెంటు ప్రాంగణంలో ప్రసంగించే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన మెగాజోష్కి దక్కింది. ఈ మేరకు నెహ్రూ యువకేంద్ర జిల్లా సమన్వయకర్త సందీప్‌కుమార్, డీడీవో శ్రీనివాసులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో చదువుకుంటున్న ఆమె గతంలో అనేక వక్తృత్వ పోటీల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. (చదవండి: జేసీ మనుషులమంటూ దౌర్జన్యం) -
పవన్ ప్రపంచంలోనే పెద్ద అరాచకవాది
సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ‘పవన్ కళ్యాణ్ ప్రపంచంలోనే పెద్ద అరాచకవాది. ఇలాంటి అరాచకవాది మరొకరుండరు. ఆయన దుర్మార్గ పనులను సమర్థించుకునేందుకు మిగతా మగవారిని కూడా అలాగే నడవమంటున్నాడు. స్త్రీలను స్టెపినీలు అంటూ అసభ్యంగా సంబోధించిన వ్యక్తి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హుడు. మరోసారి స్త్రీల పట్ల నీచంగా మాట్లాడితే రాక్షసులను సంహరించిన దుర్గాదేవిలా మహిళలే బుద్ధి చెబుతారు’ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ప్రజా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి విలువలు లేని నాయకుడిని సమర్థిస్తూ టీడీపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేశ్ వంతపాడటం దుర్మార్గ రాజకీయానికి అద్దం పడుతోందన్నారు. పవన్, లోకేశ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఓ మహిళగా డిమాండ్ చేస్తున్నానన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. మహిళల మానంతో ఆడుకోవాలా? ‘మీరూ మూడు పెళ్లిళ్లూ చేసుకోండి’ అంటూ పవన్ మాట్లాడుతున్నారు. యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా? మహిళల మానంతో ఆడుకోవాలని చెబుతున్నారా? మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? వారు చేసిందే గొప్ప అని పవన్, చంద్రబాబు ఒక లైన్ తీసుకున్నారు. పవన్‌తో టీడీపీ వారే బూతులు తిట్టించారు. అందుకే దత్త పుత్రుడికి చంద్రబాబు కొడుకు లోకేశ్ మద్దతు పలుకుతూ అవే పదాలు ఉపయోగించారు. ‘నా కొడుకులు’ అని పవన్, లోకేశ్, అయ్యన్న పాత్రుడు.. ఇలా వారంతా మాట్లాడుతున్నారు. వారందరికీ వారి బిడ్డల మీద కోపం ఉన్నట్టుంది. పవన్ వ్యాఖ్యలను గొప్పగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియాలో డిబేట్లు నడిపారు. టీడీపీ పత్రికల్లో జనసేన అధినేత అసభ్య పదజాలాన్ని పైకెత్తుతూ కథనాలు రాశారు. ఇదేమి పద్ధతి? ఏమిటా వెకిలినవ్వు బాబూ? చంద్రబాబు, ఆయన కొడుకు సమాజానికి ఏం చెప్పదలచుకున్నారు? ఆడపిల్ల నచ్చితే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలన్న బాలకృష్ణకు ఉన్న విలువలు ఏమిటి? మొత్తంగా టీడీపీ టాప్ లీడర్లు అందరూ మహిళలను గౌరవించడంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆడపిల్లలతో మందు, విందు చేసుకోవటంలో తప్పేమిటి అని నారా లోకేశ్ ‘ఆహా’ షోలో అంటాడు. ఆ ఫొటోలను నిస్సిగ్గుగా సమర్థిస్తూ మామకు (బాలకృష్ణకు) లేని అభ్యంతరం తనకు ఎందుకని చంద్రబాబు వెకిలినవ్వు నవ్వుతాడు. అమ్మాయిల వ్యవహారాలు ‘మీరు సినిమాల్లో చేసిన దానికంటే.. నేను నిజ జీవితంలో ఎక్కువ చేశాను’ అని వయసు కూడా మర్చిపోయి చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు. ఎక్కడైనా పోలిక ఉందా? కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా? ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు అహం ఎక్కడ? అదే మహిళలకు అన్నింటా 50 శాతం ప్రాతినిథ్యం కల్పించిన సీఎం జగన్ మనసు ఎక్కడ? సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అభినవ అంబేడ్కర్‌గా, పూలె అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం జగన్ వెంటే మహిళలంతా ఉన్నారు. జగన్‌కు ఉన్న ఇంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా సరే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీకే పట్టం కడతారు. ప్రభుత్వం చేసే మంచి పనుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే పవన్, చంద్రబాబు, దుష్టచతుష్టయం పని. మొన్న విశాఖ గర్జన సందర్భంగా పవన్ ఆడిన డ్రామానే ఇందుకు నిదర్శనం. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్నారు. అసలు వాళ్లు రాయలసీమకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలి. -
దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ
కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థి కర్నూలు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గతేడాది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఎలా జరిగిందని ఆరా తీయగా.. మొబైల్‌యాప్‌లో ఓ మహిళ ఫోన్ నంబర్ సేకరించి ఆ విద్యార్థిని పిలిపించుకుని శారీరకంగా కలిసిన విషయం వెలుగు చూసింది. తనకు పాజిటివ్ అని తేలగానే బెంగ పెట్టుకుని చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. రాయదుర్గానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఇటీవల జ్వరం, కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లినపుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు బయటపడింది. తండ్రి తప్పిదాల కారణంగా తల్లికి.. ఆ తర్వాత విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. రాయదుర్గం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆటోను వదిలి జీపు డ్రైవర్‌గా చేరాడు. బయటి ప్రాంతాలకు వెళ్లినపుడు మద్యం మత్తులో పెడదారి పట్టాడు. చివరకు హెచ్ఐవీ బారినపడి కుంగిపోతున్నాడు. డీ హీరేహాళ్ మండలానికి చెందిన 22 ఏళ్ల హిజ్రాకు హెచ్ఐవీ సోకింది. హిజ్రాతో లైంగిక సంపర్కం కలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా వీరే కాదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూస్తుండటం కలవరం రేపుతోంది. రాయదుర్గం (అనంతపురం జిల్లా): అరక్షిత శృంగారం ప్రాణాంతక హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు దారితీస్తోంది. భాగస్వామితో కాకుండా ఇతరులతో శారీరకంగా కలవడం, సురక్షిత పద్ధతులు పాటించకపోవడంతో చాలామంది దీనిబారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం వల్ల వారితో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కబళిస్తోంది. 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. డిన్నర్ల పేరుతో రాత్రిళ్లు రోడ్ల మీద తీరగడం, మొబైల్ యాప్‌ల ద్వారా ఆకర్షణతో పెడదారిన పట్టడం వెరసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ప్రతి నెలా 90 పాజిటివ్ కేసులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఏఆర్టీ, మొబైల్ నెట్వర్క్, నర్సింగ్ హోమ్ తదితర కేంద్రాల్లో నిర్వíహిస్తున్న హెచ్ఐవీ పరీక్షల్లో ప్రతి నెలా 80 నుంచి 90 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన డీ హీరేహాళ్, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండతో పాటు అనంతపురం తదితర ప్రాంతాల్లో 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన ట్రాన్స్జెండర్స్లోనూ హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో 14,718 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరందరికీ క్రమం తప్పకుండా చికిత్సలందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. హెచ్ఐవీ నిర్ధారణ జరిగినా కొందరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం, చికిత్సకు వెళ్లకుండా బయట మందులు వాడడం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉన్నత చదువుల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు కొందరు ఈ మహమ్మారి వలలో చిక్కుకోవడం దురదృష్టకరం. కండోమ్ వినియోగిస్తే హెచ్ఐవీ వైరస్ బారినపడరని తెలిసినా మత్తు, వ్యామోహంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. యువత ఇకనైనా మేల్కొని వివాహేతర సంబంధాలు, అరక్షిత లైంగిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితం నాశనం చేసుకోవద్దు యువత అనాలోచిత నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇటీవల కొంతమంది యువకుల్లో హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం కాస్త ఆందోళనకర విషయమే. అయినా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అరికట్టాల్సిన అవసరం అందరిపైనా ఉంది. పాజిటివ్ ఉన్నవారు దాచిపెట్టడం మాని చికిత్స తీసుకుంటే మంచిది. – కె.సత్యనారాయణ, ఏఆర్టీ వైద్యులు, అనంతపురం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి అని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిరక్షరాస్యులు ఒకరో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడితే ఏమో అనుకోవచ్చు.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ వ్యాధి బారినపడటం విచారకరం. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, బయట తిరుగుళ్లు తిరిగే యువతపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తుండాలి. హెచ్ఐవీ వైరస్ ఒకసారి ప్రవేశించాక జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప ఇంకెక్కడా మందులు లభించవు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స పొందుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. లైంగిక చర్యలకు దూరంగా ఉంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలి. – డాక్టర్ అనుపమ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, అనంతపురం -
ఊపిరిపీల్చుకున్న ‘అనంత’
అనంతపురం : వరద తగ్గుముఖం పట్టడంతో అనంతపురం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నగరంతో పాటు శివారులోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు నుంచి దాదాపు బయటపడ్డాయి. దీంతో ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. రోడ్లు, వీధులను శుభ్రంచేయడంలో మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ కార్మికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వే చేపట్టారు. వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోని 600 మందికి పైగా ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు తక్షణ సాయం అందజేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.2 వేల నగదు, 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కేజీ కందిపప్పు, కేజీ ఎర్రగడ్డలు, కేజీ బంగాళాదుంపలు ఇస్తున్నారు. మరోవైపు.. నగరంలోని జీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్‌తో కలిసి శుక్రవారం వరద బాధితులకు నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతపురంలో 34 వేల కుటుంబాలు, రాయదుర్గంలో 300 కుటుంబాలు వరద ప్రభావానికి గురైనట్లు గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. -
అనంతపురంలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
-
పరిటాల పాపం.. రైతులకు శాపం
టీడీపీ హయాంలో తమ కాంట్రాక్ట్ పనులకు అవసరమైన మట్టి కోసం పరిటాల కుటుంబం జంగాలపల్లి చెరువుపై కన్నేసింది. చెరువు స్వరూపం దెబ్బతీసేలా అధునాతన యంత్రాలతో మట్టిని తవ్వేశారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చెరువు ఆయకట్టులో ఊట పడటానికి కారకులయ్యారు. పంటలు దెబ్బతినడంతో పాటు జమ్ము గడ్డి ఏపుగా పెరిగి ఇకపై సాగు చేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. పరిటాల కుటుంబానికి కాసులు.. ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిలాయి. రాప్తాడు రూరల్: అనంతపురం మండలం జంగాలపల్లి చెరువు (కందుకూరు చౌడు చెరువు) 33 ఏళ్ల తర్వాత నిండింది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఆయా గ్రామస్తులు పట్టుబట్టి ధర్మవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువుకు తెప్పించుకున్నారు. చెరువుకు నీళ్లు రాగానే భూగర్భజలాలు పెరిగి బోరుబావులు రీచార్జ్ అవుతాయని ఆయకట్టు రైతులు ఆశపడ్డారు. అయితే వారి అశలు అడియాసలయ్యాయి. గత టీడీపీ పాలకులు చేసిన పాపం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అప్పట్లో చెరువులో జరిపిన తవ్వకాల వల్ల కింది భాగం మట్టి లూజు అయ్యింది. ఫలితంగా ఊటలు ఏర్పడి సాగు చేసిన పంటల్లో నీరు ప్రవహిస్తోంది. తుడిచిపెట్టుకుపోయిన పంటలు ఈ చెరువు ఆయకట్టు దాదాపు 275 ఎకరాల దాకా ఉంది. నీటి ఊట కారణంగా 150 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, పరుశురాం, వెంకటరాముడు, చరణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితర రైతులు సాగు చేసిన చీనీ, అరటి, బొప్పాయి, స్వీట్ ఆరెంజ్, కాయగూరల పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. రైల్వే పనులకు చెరువు మట్టి గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల కుటుంబం కాంట్రాక్ట్ చేసిన రైల్వే పనులకు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన మట్టిని జంగాలపల్లి చెరువు నుంచే తరలించింది. దాదాపు 30 అడుగుల లోతు ఇష్టారాజ్యంగా హిటాచీల సాయంతో తవ్వేశారు. జీడిబంక మట్టి అంతాపోయింది. ఇసుక, గరుసు వచ్చేవరకు తవ్వకాలు జరిపారు. టిప్పర్లు కింది నుంచి పైకి వచ్చేందుకు ప్రత్యేకంగా రన్‌వే ఏర్పాటు చేశారంటే ఏ స్థాయితో తవ్వకాలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఉబికి వస్తున్న నీళ్లు చెరువు ఆయకట్టులో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఉన్న పంటలు నష్టపోవడంతో పాటు కొత్తగా పంటలు సాగు చేసేందుకు కూడా వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్లలో నుంచి నీరు బయటకు వస్తోంది. నీటి ప్రవాహంతో పెద్ద ఎత్తున జమ్ము పెరిగింది. చేపల చెరువులకు లీజుకు ఇచ్చిన రైతులు నీటి ఊటతో పంటలు సాగు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో తొలిసారి చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆయకట్టు కింద వెంకటరామిరెడ్డి, చరణ్‌కుమార్‌రెడ్డి వరి సాగు చేసేవారు. మంచి దిగుబడి వచ్చేది. ఈసారి నీటి ప్రవాహం కారణంగా పంట సాగు చేసేందుకు వీలు కాకపోవడంతో తమ భూమిని నెల్లూరు జిల్లా వాసులకు చేపల చెరువుల కోసం లీజుకు ఇచ్చారు. మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి.. టీడీపీ పాలనలో చెరువులో జరిపిన మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దుగుమర్రి గోవిందరెడ్డి, సర్పంచ్ ప్రశాంత్‌కుమార్, ఎంపీటీసీ సభ్యులు రాగే రేవతి, పెద్దప్ప, ఉపసర్పంచ్ ఓబులేసు, పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, నరసింహారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు తెలిపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎంతో కష్టపడి కృష్ణాజలాలతో చెరువును నింపించారన్నారు. చెరువు అడుగు భాగం బాగా దెబ్బతినడంతో ఊటలు ఏర్పడి ఆయకట్టు అంతా నీరుపారుతోందన్నారు. ఇప్పటికే 60 శాతం దాకా నీళ్లు బయటికిపోయాయని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయకట్టులో జమ్ము గడ్డి పెరిగిందన్నారు. దీంతో ఇకపై పంటలు పెట్టేందుకు వీలుకాదని తెలిపారు. వ్యవసాయ పంటలకు దెబ్బ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చెరువుకు 75 శాతం నీళ్లు వచ్చినా ఏరోజూ ఊట పడలేదు. ఆనందంగా వరి సాగు చేసి.. 450 ప్యాకెట్ల ధాన్యం తీసేవాళ్లం. ఇప్పుడు ఆయకట్టులో భారీగా నీళ్లు ఊరుతున్నాయి. నా జీవితంలో ఎప్పుడూ ఆయకట్టులో జమ్ము గడ్డి పెరగడం చూడలేదు. ఇప్పుడా పరిస్థితి రావడంతో వ్యవసాయ పంటలకు పెద్ద దెబ్బ పడింది. – చరణ్‌కుమార్‌రెడ్డి, రైతు, జంగాలపల్లి మోటార్లతో నీళ్లు తోడుతున్నాం ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో చీనీ పంట, మూడెకరాల్లో అరటి సాగు చేశాను. ఊట దిగడంతో అరటి పంట మొత్తం దెబ్బతింది. అరటిపంటలో మొత్తం జమ్ము పెరిగింది. నాలుగున్నరేళ్ల వయసున్న చీనీచెట్లను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నా. రోజూ మోటార్లతో నీళ్లు తోడిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. చెరువు అంతా పెద్ద పెద్ద గుంతలు తవ్వడం వల్లే నీటి ఊటలు ఏర్పడ్డాయి. – కృష్ణారెడ్డి, చెరువు ఆయకట్టు దారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊటలోనే 12 ఎకరాలు.. చెరువు ఆయకట్టు కింద 19 ఎకరాలు ఉంది. అరటి, బొప్పాయి, చీనీచెట్లు సాగు చేశాం. ఊట ఏర్పడి రెండెకరాలు మినహా తక్కిన పంటలన్నీ పూర్తిగా ఎత్తిపోయాయి. ఏడెనిమిది నెలలవుతున్నా 12 ఎకరాల భూమి నీళ్లలోనే ఉంది. 15 ఏళ్ల వయసున్న చీనీచెట్లు, కోతకు వచ్చిన అరటి, బొప్పాయి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు రూ. 20 లక్షల పైనే నష్టం వాటిల్లింది. గతంలో చెరువులో నీళ్లు ఉన్నా...ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. – సోమశేఖర్‌రెడ్డి, రైతు, కందుకూరు -
థ్యాంక్యూ.. సీఎం సార్
అనంతపురం: గత 24 సంవత్సరాల కాలంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు. డీఎస్సీ–1998 అర్హత పొందిన అభ్యర్థుల జీవితాల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో డీఎస్సీ –1998లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశం కల్పించింది. ఏకంగా పదవీ విరమణ చేసే వరకు మినిమం టైం స్కేలు విధానంలో కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని జిల్లా సైన్స్ సెంటర్లో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి డీఎస్సీ –1998 అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులుగా అవకాశం దక్కుతుందనే ఆశ కూడా లేని పరిస్థితి నుంచి మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని కొనియాడారు. థ్యాంక్యూ ... సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో 1998 డీఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చల్లా రామాంజనేయులు, రమణ, నాగేశ్వరరావు, కిషోర్ పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం: డీఎస్సీ–1998లో అర్హత పొంది మినిమం టైం స్కేల్ కింద పనిచేయడానికి ఆన్లైన్లో అంగీకారం తెలిపిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైనట్లు డీఈఓ కే.శామ్యూల్ తెలిపారు. జిల్లా సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 570 మంది అభ్యర్థులకుగాను తొలి రోజు 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించామన్నారు. 8 నుంచి 12 వరకు రోజూ 100 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. అభ్యర్థుల జాబితా డీఈఓ బ్లాగ్స్పాట్లో అందుబాటులో ఉంచామన్నారు. -
Plastic: అంతం కావాలంటే పంతం కొనసాగాలి
ప్లాస్టిక్ వాడకం తగ్గించి భయంకర జబ్బులను నియంత్రించే దిశగా జూలై ఒకటో తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధికారులు అడుగులు వేశారు. కానీ రెండు మాసాలు కూడా గడవక ముందే అధికారులు శ్రద్ధ తగ్గించారు. దీంతో మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మళ్లీ యథాతథంగా పెరిగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలకు చిరునామాగా నిలిచిన అనంతపురం నగరపాలక సంస్థలో జూలై నెలకు ముందు ఎంత ఉత్పత్తి అయ్యేవో అంత కంటే ఎక్కువగా ఆగస్టులో పెరిగాయి. దీన్ని బట్టి ప్లాస్టిక్ అంతం కోసం అధికారులు దూకుడు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం జరిగేది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి ముందు నెలకు సగటున 28.5 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవి. జూలై ఒకటి తర్వాత అధికారులు ప్లాస్టిక్ నియంత్రణ కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ మాసంలో ఐదు టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. అనంతపురంలో టన్నులకొద్దీ... అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మరీ దారుణంగా ఉంది. నియంత్రణ చర్యలు తీసుకోకమునుపు నెలకు 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయ్యేవి. జూలైలో రెండు టన్నులు తగ్గి 10 టన్నులకు చేరింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో ఆగస్టులో గతం కంటే ఎక్కువగా 14 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరులోని హోల్‌సేల్ దుకాణాల నుంచి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు, కప్పులు ఇలా రకరకాల వస్తువులు ఇతర మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్నాయి. చిన్న చిన్న షాపులు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకూ మళ్లీ ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడుతున్నారు. మున్సిపల్ అధికారుల తనిఖీలు తగ్గడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు దాడులు చేస్తేనే నియంత్రణలోకి రాదని, ప్లాస్టిక్‌పై ప్రజలు కూడా ఆలోచించి వాడకాన్ని తగ్గిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రజల్లోనూ మార్పు రావాలి అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలపై ప్రజలూ ఆలోచించాలి. అత్యంత భయంకర జబ్బులకు మూలమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ సాధ్యం. – శంకర్రావు, పర్యావరణ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి స్పెషల్ డ్రైవ్ చేపడతాం ప్లాస్టిక్ నివారణ చర్యల్లో భాగంగా మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే శానిటేషన్ కార్యదర్శులు వారి పరిధిలోని వ్యాపార సముదాయాల్లో రోజూవారీ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తే..అపరాధ రుసుం వసూలు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు సైతం సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేయాలి. – కె.భాగ్యలక్ష్మి, కమిషనర్, అనంతపురం నగరపాలక సంస్థ -
వేదన తీర్చిన వేదావతి
రాయదుర్గం(అనంతపురం): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన బైరవానితిప్ప (బీటీపీ) ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వరదనీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో వేదావతి ఉగ్రరూపం దాల్చింది. గుమ్మఘట్ట మండలంలోని బైరవానితిప్ప గ్రామం వద్ద 1954లో వేదావతి నదిపై రూ.1.5 కోట్లతో 2.5 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి 1961లో పూర్తిచేశారు. 1981–82 మధ్య కాలంలో 8 గేట్లు తెరిచి 12 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన రికార్డు మాత్రమే ఇప్పటిదాకా ఉంది. రికార్డు బద్దలు.. క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటకలో ఉండడం, అక్కడ విస్తారంగా వానలు కురవడం వెరసి ఈ ఏడాది జూలై చివర్లోనే రిజర్వాయర్ వరద నీటితో తొణకిసలాడింది. క్రమేణ నీటి ప్రవాహం పెరగడంతో పాటు వేదావతి నదిపై నిర్మించిన వాణివిలాస్ ప్రాజెక్ట్ కూడా 88 ఏళ్ల తర్వాత మరువ పారింది. వీటి మధ్య చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు తెగి ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా దిగువకు నది పరవళ్లు తొక్కింది. ఈ కారణంగా ఆగస్టు 5న నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటు ఏకంగా 28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడం ఓ రికార్డయితే సెప్టెంబర్ 7న 10 గేట్లు తెరిచి 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం విశేషం. వర్షాలు తగ్గుముఖం పట్టినా 4,500 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా 2 క్రస్టు గేట్లు తెరిచి 4,500 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. స్తంభించిన జనజీవనం.. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ వేదావతి హగరి ప్రవహిస్తోంది. ఈ కారణంగా గత 45 రోజుల నుంచి హగరి పరివాహ గ్రామాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాలను కలిపే వేపులపర్తి కాజ్వే దెబ్బతినడంతో పాటు నీటి ఉధృతి తగ్గలేదు. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో కళ్లెదుటే కనిపించే గ్రామాలకు సైతం 20 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. -
కలెక్టర్ కార్యాలయం పేరు చెప్పి బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: గుర్తు తెలియని అగంతకుడి చేతిలో ఏఎన్ఎం, వలంటీరు ఇద్దరూ మోసపోయారు. ఉన్నతాధికారులు ఫోన్ చేశారని భావించి అగంతకుడికి వివరాలు అందజేసి, వారి బ్యాంక్ ఖాతాలోని నగదు అపహరణకు కారకులయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించాయి. ఇరువర్గాలను విచారించిన అనంతరం ఇది సైబర్ నేరస్తుడి పనిగా సీఐ జాకీర్ హుస్సేన్ నిర్ధారించారు. గురువారం వివరాలను విలేకరులకు ఆయన వెల్లడించారు. రుద్రంపేటలోని సచివాలయం–2 పనిచేస్తున్న ఏఎన్ఎం ఎర్రమ్మ, వలంటీర్ మమతకు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కోవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరిహారం విషయంలో ఫోన్ చేశానని, వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరాడు. ఇది నిజమని భావించిన ఏఎన్ఎం, వలంటీర్ వెంటనే అగంతకుడు అడిగిన సమాచారాన్ని అందజేశారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలిపి, కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే వారు అడిగిన వివరాలు అందజేయాలని సూచించారు. సచివాలయం సిబ్బంది చెప్పిన ప్రకారమే పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతి తనకు వచ్చిన ఫోన్ కాల్ అందుకుని అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించింది. కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.58 వేలు మాయమయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ ఖాతాలో నుంచి రూ.46 వేల కాజేశాడు. ఇరువురి ఖాతాలోనూ నగదు మాయం కావడంతో వారు ఏఎన్ఎం, వలంటీర్‌ను నిలదీశారు. తమ బ్యాంక్ ఖాతాలోని నగదు కాజేసింది మీరేనంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు, సచివాలయ సిబ్బంది ఉమ్మడిగా నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్ టాపిక్) -
అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఆదర్శం
డీ హీరేహాళ్ (రాయదుర్గం): ‘కళ్లెదుటే సచివాలయం.. పక్కనే రైతు భరోసా కేంద్రం.. చెంతనే నూతన హంగులతో రూపుదిద్దుకున్న సర్కార్ బడులు.. మరోవైపు హెల్త్ క్లినిక్.. నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ.. సమీపంలోనే పాల సేకరణ కేంద్రం.. ఇది సీఎం వైఎస్ జగన్ మూడేళ్ల క్రితం కన్న కల. దీన్ని సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి రాష్ట్ర వ్యాప్తంగా మహా వృక్షంలా ఎదిగింది. రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్తులను ప్రజలకే అంకితం చేసిన గొప్ప పాలనాదక్షుడు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం సోమలాపురంలో మోడల్‌గా ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ఆర్బీకే, హెల్త్‌క్లినిక్ ఇతర కార్యాలయాలను ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి ప్రభుత్వ విప్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుదర్శనరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విప్ కాపు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఒక్క సోమలాపురంలోనే వివిధ పథకాల కింద రూ.8.62 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. అర్హతే ప్రామాణికంగా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికీ రూ.1.50 లక్షలకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1.65 లక్షల కోట్లను జమచేసిన ఏకైక ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించిందన్నారు. మూడేళ్ల వ్యవధిలోనే 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.41 కోట్లతో 39 గ్రామాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తాగునీరందించబోతున్నామన్నారు. ఇందులో ఒక్క డీ హీరేహాళ్ మండలంలోనే 22 గ్రామాలు ఉన్నాయని ప్రకటించారు. దోపిడీపైనే కాలవ దృష్టి మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజా ధనం దోపిడీ చేయడం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. నాడు ‘నీరు– చెట్టు’ పనుల్లో రూ.కోట్లు దోచుకున్నారని, ఇసుక, మట్టిని కొల్లగొట్టారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడేదో ప్రజల కోసం ఉద్ధరిస్తున్నట్లు రాయదుర్గంలో నాటకాలకు తెరలేపారన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో కాలవ శ్రీనివాసులు అనంతపురానికి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి తలదాచుకున్నారని ధ్వజమెత్తారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలూ సమగ్రాభివృద్ధి చెందుతాయని ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని టీడీపీ అధినేతపై ధ్వజమెత్తారు. గతంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇది రుచించడం లేదని, అందుకే సంక్షేమ పథకాల తమాషా అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పథకం ఆపాలో ప్రజల్లోకొచ్చి చెప్పే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, ఎంపీపీ పవిత్ర, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాబాను, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్‌నాయక్, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వన్నూర్‌స్వామి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, పార్టీ నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు. -
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్‌తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
ఆర్జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి బంగారు గనులకు(ఆర్జీఎఫ్) మంచి రోజులొస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట మూసేసిన ఈ గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది. గనుల తవ్వకానికి సంబంధించిన సంస్థలను ఎంపిక చేసేందుకు టెండర్లనూ ఆహ్వానించారు. టెండర్ల స్వీకరణ గడువు సెప్టెంబర్ 2తో ముగుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే గనుల తవ్వకం ప్రారంభం కానుంది. రామగిరితో పాటు బొక్కసంపల్లి(రొద్దం మండలం), జౌకుల (కదిరి మండలం) ప్రాంతాల్లో 10 గోల్డ్ఫీల్డ్ బ్లాకులున్నాయి. వీటిలో మైనింగ్ జరిపేందుకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఇందుకోసం పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ బంగారు నిల్వలు బాగా ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే తేల్చింది. రామగిరిలో 1984లో భారత్ గోల్డ్‌మైన్ అనే కంపెనీ తవ్వకాలు చేసి, ఆ తర్వాత 2001లో ఆపేసింది. ఏడాదికి 124 కిలోల బంగారం వెలికితీయాలని, అలా 17 ఏళ్లు చేయాలన్నది అప్పటి కంపెనీ నిర్ణయం. తర్వాత రకరకాల కారణాలతో మైనింగ్ ఆపేశారు. ఈ గనుల్లోనే తవ్వకాలు రామగిరి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, బొక్కసంపల్లి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, జౌకుల ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ బ్లాక్‌లలో తవ్వకాలకు టెండర్లు పిలిచారు. ఈ పది బ్లాకుల్లో తవ్వకాల టెండరును దక్కించుకునేందుకు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా ఎంపిక చేసే సంస్థలకు తొలి రెండేళ్లు కాంపొజిట్ లైసెన్స్ ఇస్తారు. అంటే రెండేళ్ల పాటు తవ్వకాలు మాత్రమే చేస్తాయి. ఆ తర్వాత కమర్షియల్ లైసెన్స్(వాణిజ్య సంబంధిత) అనుమతులిస్తారు. రామగిరి, బొక్కసంపల్లి, జౌకుల ప్రాంతాల్లో ఉన్న గోల్డ్‌మైన్స్‌లో టన్ను మైనింగ్(తవ్వకం) జరిపితే 4 నుంచి 5 గ్రాముల వరకూ బంగారం వెలికి తీయొచ్చనేది అంచనా. ఒక్కో చోట 8 నుంచి 10 గ్రాముల వరకూ వెలికి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర బాగా ఉండటం, అత్యాధునిక మైనింగ్ మెషినరీ అందుబాటులో ఉండటం వల్ల గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఎక్కువ మంది బిడ్డర్లు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. భారీగా ఉపాధి అవకాశాలు ఇరవై ఏళ్ల కిందట మూతపడ్డ బంగారు గనులు తిరిగి తెరుచుకోనుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్టు అంచనా. రవాణా రంగం, హోటల్ పరిశ్రమలు వంటి అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతం ఇచ్చినట్టవుతుంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు బిడ్డింగ్‌కు రావడానికి రెండు కారణాలున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఎక్కువగా ఉంది కాబట్టి మైనింగ్ చేసే సంస్థలకు నష్టమొచ్చే అవకాశమే లేదు. రెండోది.. అండర్ గ్రౌండ్ మైనింగ్. అండర్‌గ్రౌండ్ మైనింగ్ ప్రక్రియలో అత్యాధునిక యంత్రాలొచ్చాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మైనింగ్ జరుగుతుంది. – బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్, గనుల శాఖ, అనంతపురం -
ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్: అనంతపురం ఎస్పీ ప్రకటన
సాక్షి, అనంతపురం: ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్సీపీని, ఆ పార్టీ నేత.. హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ -
శతాధిక స్ఫూర్తి... ‘శెట్టూరు గాంధీ’ అలుపెరుగని పోరు
స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయనంటే అందరికీ గౌరవం. అచంచల దేశభక్తి ఆయన సొంతం. స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. వందేళ్లు దాటినా అదే తరగని ఉత్సాహం. నేటికీ తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ ఉదయం గ్రంథాలయానికి వెళ్లి పత్రికలు, పుస్తకాలు చదువుతుంటారు. ఆయన అచ్చం గాంధీలానే కనిపిస్తారు. అందుకే చెట్ల రుద్రప్ప ‘శెట్టూరు గాంధీ’గా పేరుతెచ్చుకున్నారు. అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రం కోసం భారతీయులు చేసిన పోరాటాన్ని అణచివేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించారు. నాయకులను నిర్బంధించి.. జైలుకు పంపితే ఉద్యమం ఆపవచ్చని భావించారు. అయితే నాయకుల స్ఫూర్తితో పోరాటంలో భాగస్వాములైన వారు తదుపరి ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఊహించలేకపోయారు. అలాంటి బాధ్యతలు నిర్వర్తించిన వారిలో జిల్లాకు చెందిన చెట్లరుద్రప్ప ఒకరు. ‘శెట్టూరు గాంధీ’ అని ఆయన్ని ప్రజలు ముద్దుగా పిలుచుకుంటుంటారు. శతాధిక వృద్ధుడైన ఈయన ఆనాటి జ్ఞాపకాలను ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘మా పూర్వీకులందరూ కళ్యాణదుర్గం తాలూకాలోని శెట్టూరు గ్రామంలోనే నివసించారు. మా నాన్న చెట్ల తిమ్మప్ప, అమ్మ రంగమ్మ. నాన్న ఫారెస్ట్ హెడ్ వాచర్‌గా బ్రిటీష్ వారి దగ్గర పనిచేసేవాడు. తిరుమలరావు అని మా గురువు ఉండేవారు. దేశం కోసం పరితపించే ఆయన వద్ద ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. యాజమాని నారాయణరావు, ఉమాబాయి అనే వాళ్లు స్వాతంత్య్రం కోసం పనిచేశారు. కళ్యాణదుర్గానికి చెందిన ఐ.ఓబయ్య, బంగి ఎర్రిస్వామి నన్ను అమితంగా ప్రభావితం చేశారు. ప్రజా సమస్యలంటే ఏవిధంగా ఉంటాయో నేను దగ్గరగా చూశాను. కరువుకు కనికరం లేదు స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న తరుణంలోనే మా ప్రాంతాలను కరువు పట్టిపీడించేది. మేము ఇంటింటా ధాన్యం సేకరించి ప్రజలకు గంజినందించి ఆకలి తీర్చేవారం. అసలు పోరాటం చేయాలంటే బతికుండాలనే భావన అధికంగా ఉండేది. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం రాజశేఖరరెడ్డి, గుత్తి రామకృష్ణ వంటి వారితో నేను కలిసి పనిచేశాను. వారు అరెస్టై జైలుకెళ్లినా మా ఉద్యమం ఆగలేదు. తరిమెల నాగిరెడ్డి విడిపించారు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు పార్టీలకతీతంగా స్వాతంత్య్ర పోరులో పనిచేశారు. మేమెక్కువగా కమ్యూనిస్టుల వైపే నడిచాము. మా ఊరి కరణం భీమసేనరావు మా నాన్నను, పెద్దనాన్నపాలయ్యను అధికార బలంతో ఉద్యమాలకు పోనీకుండా అరెస్టు చేయించారు. అయితే తరిమెల నాగిరెడ్డి స్వయంగా వచ్చి విడిపించిన సంఘటన నాకింకా గుర్తుంది. స్వాతంత్య్ర పోరుకు మేము సైతం అనే వాళ్ల సంఖ్య అధికంగా ఉండేది. గాంధీజీకి రక్షణగా సదాశివన్ నిలబడ్డారు కల్లూరు సుబ్బారావు ప్రధాన శిష్యగణంలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ ఉండేవారు. వారి అనుయాయులుగా మేమూ వారి బాటలోనే నడిచాము. మాకు నేరుగా పెద్దవారితో పరిచయం ఉండేది కాదు. ఒకరిని తొక్కి ముందుకుపోవాలన్న యావ అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు. నిబద్ధత, నిజాయితీ అధికంగా ఉండేరోజులవి. సదాశివన్ ఓ చిన్నకొట్టులో పనిచేసేవారు. ఆయన గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరులో నడిచారు. ఆ క్రమంలో గాంధీజీ జిల్లా పర్యటనకొచ్చినపుడు రక్షణగా నిలబడిన సదాశివన్ పోలీసు దెబ్బలు తిన్న విషయం తెలిసి మేము బ్రిటీష్వారికి వ్యతిరేకంగా పనిచేశాము. మాకు పెద్ద పండుగ ఎంతో మంది ప్రజాక్షేత్రంలో ఉన్నవారే కాకుండా అజ్ఞాతంగా ఉండి దేశమాత దాస్య శృంఖలాలను తొలగించడానికి పోరు సల్పారు. వారందరి కృషితో స్వాతంత్య్రం సిద్ధించింది. స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీ మాకు పెద్ద పండుగ. ఆ రోజు జాతీయ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నాము. అవన్నీ జ్ఞాపకం వస్తే కళ్లు చెమరుస్తాయి. అదే స్ఫూర్తి కొనసాగుతోంది ప్రజల సమస్యలు, స్వాతంత్య్ర కోసం పోరాడేవాడిని. ఇంటిని పట్టించుకునేవాడిని కాదు. మేము పొందిన స్ఫూర్తి అలాంటిది మరి. మా ఊరు చైతన్యవంతం కావాలని గ్రంథాలయం తెప్పించుకున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చినపుడు మా ప్రాంతానికి నీళ్లు ఎందుకివ్వరని నిలదీసిన సంఘటన పెద్ద సంచలనమైంది. స్వాతంత్య్ర కాలం నాటి స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతోంది. నన్ను మా మండల ప్రజలు ఎంతో ప్రేమిస్తారు. జాతీయ పండుగలొస్తే త్రివర్ణపతాకం ఎగురవేయమని కోరుతారు. ఇవన్నీ భరతమాత నాకందించిన భాగ్యమే. గాంధీని తలపించే చెట్ల రుద్రప్ప సమాజ హితం.. ఆనందమయ జీవితం నాకు నలుగురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అందరూ నేను చెప్పింది ఈనాటికీ చక్కగా వింటారు. వారిలో చెట్ల ఈరన్న డిగ్రీ దాకా చదివాడు. టీచర్ ఉద్యోగం వస్తే వెళ్లిపోతానన్నాడు. కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో ఓ చిన్న ఉద్యోగమైనా సరే చేరమన్నాను. ఇటీవల బుక్‌హౌస్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. వందేళ్లు వచ్చినా ఎలా ఉత్సాహంగా ఉంటావని నన్ను చాలామంది అడిగారు. ఆహార నియమాలు పాటించడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లే ఆరోగ్యంగా, చలాకీగా ఉంటున్నాను. సమాజం కోసం బతికితే ఆనందంగా ఉంటుందన్నది నా జీవితం చెప్పే సత్యం.’ -
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను యువతి నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెళుతున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు భాస్కర్. కంబదూరు మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓ వైపు భర్త చావు బతుకుల మధ్య.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి -
అనంతపురంలో డెంగీ కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెంగీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒకటీ, రెండు నమోదయ్యే కేసులు పది రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో తక్కువగా ఉన్నా.. అనంతపురం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్స్ (ఎంఎండీసీ)లను రంగంలోకి దించారు. తొలకరి జల్లులు పడగానే డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటికే నాలుగు సెంటినల్ సర్వేలెన్స్ కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైతే వీటిని విస్తరించాలని యోచిస్తున్నారు. ప్లేట్లెట్స్ పేరిట భారీగా దోపిడీ వైరల్ జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయి. అయితే డెంగీ జ్వరమని చెబుతూ రోగిని, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆస్పత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. రకరకాల వైద్య పరీక్షలు చేయించి.. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా ఎవరైనా వసూళ్లు చేస్తే నేరుగా జిల్లా వైద్యాధికారికి గానీ, కలెక్టర్‌కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ డెంగీ నిర్ధారణ కాకున్నా ప్లేట్లెట్స్ పేరిట దోపిడీ చేయడం ఆస్పత్రుల యాజమాన్యాలకు రివాజుగా మారింది. ధర్మవరం పట్టణానికి చెందిన ఖాదర్‌బాషా వారం రోజుల క్రితం జ్వరంతో అనంతపురం కమలానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ప్లేట్లెట్స్ తగ్గాయని, డెంగీ లక్షణాలున్నాయని తెలిపి చికిత్స పేరుతో రూ.40వేలు వసూలు చేశారు. చివరకు అతనికి వైరల్ ఫీవర్ అని తేలింది. అనంతపురంలోని పాతూరుకు చెందిన నాగభూషణం వాంతులు, జ్వరంతో సాయినగర్‌లోని ఓ నర్సింగ్‌హోంలో చేరాడు. డెంగీ పేరుతో అతనినుంచి రూ.50వేలకు పైగా లాగారు. రోగి కోలుకున్నాడు కానీ, డెంగీ జ్వరం నిర్ధారణ కాలేదు. -
100 మంది పోలీసులు.. రెండు గంటలు.. కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నామంటే..??
-
అతనికి ఇద్దరు భార్యలు...మళ్లీ బాలికతో మూడో పెళ్లి...
అనంతపురం క్రైం: పోక్సో కేసులో ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలను గురువారం అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని హనుమాన్ కాలనీకి చెందిన రమణకు ఇద్దరు భార్యలు. జులాయిగా తిరిగే రమణ మద్యం, ఇతర వ్యసనాలకు బానిస. ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన మొదటి భార్య వేరుగా జీవనం సాగిస్తోంది. కొన్ని నెలలుగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి గత నెల 25న ధర్మవరానికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు అక్కడే ఓ ఆలయంలో బాలికను పెళ్లి చేసుకుని స్నేహితుడు మహేష్ సాయంతో ధర్మవరంలోనే ఓ ఇంటిలో బాలికను ఉంచాడు. బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత నెల 30న బాలికను గుర్తించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రమణపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సహకరించిన మహేష్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం స్థానిక రైల్వేస్టేషన్లో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఫోర్జరీ కేసు కీలక మలుపు) -
పల్లె జనం.. పట్టణ జపం
సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి : పల్లె తల్లి వంటిది.. అందుకే గతంలో స్వగ్రామాలను విడిచి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అంతా పట్నం బాటే పడుతున్నారు. ఫలితంగా పంటపొలాలకు లోగిళ్లుగా చెప్పుకునే పల్లెలు వివిధ కారణాలతో ఇప్పుడు పట్టణాలకు చేరువయ్యాయి. బతుకుతెరువు కోసం వచ్చి పట్టణాల్లో స్థిరపడిపోయిన కుటుంబాలు భారీగా పెరుగుతున్నాయి. ఎకరాల కొద్దీ మాగాణి భూములతో అలరారిన కుటుంబాలు సైతం ఇప్పుడు పట్టణాలను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నిటికీ ఒకటే సూత్రం..బతుకుదెరువు. లేదా పిల్లల చదువులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తాజాగా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. చదువుల కోసం నగరాలకు.. 2000 సంవత్సరానికి ముందు ఉపాధి కోసం ఎక్కువ మంది పట్టణాలకు చేరుకునే వారు. చిన్న చితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. దీంతో పట్టణ జనాభా కొద్దికొద్దిగా పెరుగుతూండేది. 2000 సంవత్సరం తర్వాత పిల్లలను చదివించుకోవాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువైంది. దీంతో భూములను కౌలుకు ఇవ్వడం, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పట్టణాల్లో స్థిరపడి పిల్లలను చదివించుకుంటున్నారు. ఈక్రమంలోనే గడిచిన 20 ఏళ్లలో పట్టణాలకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా విషయానికే వస్తే అనంతపురం నగరానికి పక్కనే ఉన్న నారాయణపురం పంచాయతీ జనాభా ఒకప్పుడు 8 వేల లోపే. ప్రస్తుత లెక్కల ప్రకారం జనాభా 24 వేలు ఉందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే, హిందూపురానికి దాదాపు 5 కిలోమీటర్ల పైనే దూరముండే కొట్నూరుకూడా పట్టణంలో కలిసిపోయింది. 1991 లెక్కల ప్రకారం సదరు పంచాయతీ జనాభా 1,350 కాగా ఇప్పుడు దాదాపు 4,500 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఒక్క పంచాయతీనే కాదు సడ్లపల్లి, పూలకుంట పంచాయతీలు కూడా హిందూపురం పట్టణంలో దాదాపు కలిసిపోయాయి. 2008 తర్వాత నుంచి భారీగా.. గతంలో ఇంజినీరింగ్ చదవాలంటే ఏ కొద్దిమందికో అవకాశం ఉండేది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య చదివే అవకాశం వచ్చింది. దీంతో పాటు మెరిట్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు పట్టణాలకు క్యూ కట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని లక్షలాదిమంది ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలా రకరకాల కారణాల వల్ల పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పట్టణాల్లో ఒకప్పుడు చదరపు కిలోమీటరకు 111 మంది ఉండగా..ఇప్పుడు 213కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 242కు చేరి ఉంటుందని అంచనా. అంటే పట్టణాలు ఎంత ఇరుకుగా మారుతున్నాయో అంచనా వేయచ్చు. పెరిగిన కాలనీలు.. ఒకప్పటి అనంతపురం నగరానికి ఇప్పటికీ భారీగా తేడా కనిపిస్తోంది. గతంలో పాతూరు, కొత్తూరు ప్రాంతాలు మాత్రమే ఉండేవి. శ్రీకంఠం సర్కిల్ వరకూ పాతూరు.. ఆ పైభాగం మొత్తం కొత్తూరుగా పిలుచుకునే వారు. ప్రస్తుతం బుక్కరాయసముద్రం పూర్తిగా నగరంలో కలిసిపోయిన పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే బళ్లారి రోడ్డుకు ఎస్టేట్‌కాలనీ, సిండికేట్‌నగర్, రాచానపల్లిపల్లి వరకూ నగరం విస్తరించింది. కళ్యాణదుర్గం రోడ్డుకు ఒకప్పడు బైపాస్ తర్వాత చివరన రాజా హోటల్ ఉండేది. అక్కడి వరకూ కూడా ఆటోలు రావాలంటే గగనంగా ఉండేది. ఇప్పుడు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల భారీ భవనాలు వెలిశాయి. కక్కకలపల్లి కాలనీ, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ, అక్కంపల్లి, ఎన్ఆర్కాలనీ, ధర్మభిక్షకాలనీ ఇలా కురుగుంట వరకూ నగరం విస్తరిచింది. ఆలమూరు రోడ్డుకు రుద్రంపేట, కట్టకిందపల్లి రూరల్ మండల పరిధిలో ఉండేవి. ప్రస్తుతం ఇవి కూడా నగరంలోకి కలిసిపోయాయి. కొత్తగా ప్రభాకర్‌చౌదరి కాలనీ, పంతులకాలనీ, చంద్రబాబు కొట్టాల, వికలాంగుల కాలనీ, అజయ్‌ఘోష్ నగర్, ఆదర్శనగర్ తదితర పేర్లతో కాలనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పట్టణం.. సౌకర్యవంతం మాది సోమందేపల్లి మండలం మండ్లి పంచాయతీ రూకలపల్లి. గ్రామం కావడంతో ఉపాధి కోసం హిందూపురం పట్టణానికి 2008లో వచ్చాము. ముద్దిరెడ్డిపల్లిలో పవర్ లూమ్స్‌లో చీరల నేస్తూ ఇక్కడే సిర్థపడ్డాను. ఉపాధి దొరకడంతో పాటు పట్టణం కావడంతో అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. – రవికుమార్ రెడ్డి, హిందూపురం పిల్లల ఉన్నత చదువుల కోసం వచ్చాం మా ఊరు పెద్దవడుగూరు మండలంలోని కిష్టిపాడు. నేను గుత్తి మండలం వన్నేదొడ్డి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం చేశా. కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వాడికి ఇబ్బంది ఉండవద్దని ‘అనంత’కు వచ్చి స్థిరపడ్డాం. – మస్తాన్‌వలి, టీచర్, అనంతపురం ఒకప్పుడు పల్లె... నేడు పట్టణం మాది నారాయణపురం. 30 సంవత్సరాల క్రితం మాదొక పల్లెటూరు. నగరంలో నివాసముంటున్న వారి దుస్తులు తీసుకొని గాడిదలపై వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నగరం బాగా పెరిగింది. ఈ ఊరు నగరంలో కలిసిపోయింది. రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు మీ ఊరేది అంటే అనంతపురం అని చెబుతున్నాం. – చాకలి సుబ్బరాయుడు, నారాయణపురం పంచాయతీ -
ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి : కలెక్టర్ నాగలక్ష్మి
అనంతపురం (రాయదుర్గం/టౌన్) : ‘ఏమ్మా.. అంతా బాగున్నారా? ఉదయమే వచ్చేశాను. మీరు తెచ్చుకున్న క్యారీ ఉందా? ఉంటే నాకూ కాస్త అన్నం పెట్టండి’ అంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కూలీలతో ఆప్యాయంగా మాట్లాడారు. బుధవారం ఆమె రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో పర్యటించారు. రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల, నాగిరెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మమేకమై..వారి సమస్యలను తెలుసుకున్నారు. వేపరాళ్ల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రాయదుర్గంలోని బీటీపీ, ముత్తరాసి లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను పరిశీలించి..పురోగతిపై ఆరా తీశారు. తర్వాత గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం, అడిగుప్ప గ్రామాల పరిధిలో ఉపాధి పనులను పరిశీలించారు. శిరిగెదొడ్డి గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో కూలీలతో మాట్లాడుతూ రూ.250 దినసరి కూలి అందేలా పనులు చేసుకోవాలని సూచించారు. ప్రతి పనీ నాణ్యతగా ఉండాలన్నారు. వేపరాళ్లలో రెండు వారాల వేతనం అందలేదని కూలీలు తెలపగా.. సత్వరమే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజూ రెండు లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మే 14 వరకు ఉన్న వేతనాలన్నీ జమ చేశామని, ఒకట్రెండు రోజుల్లో మిగిలినవీ చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కూలీలకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. సచివాలయాల్లో పౌర సేవలు మరింత మెరుగ్గా అందివ్వాలని సిబ్బందిని ఆదేశించారు. వి«ధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ, ఆర్బీకే భవన నిర్మాణాలను పరిశీలించి.. పురోగతిపై డీఈ రామమోహన్‌రెడ్డితో ఆరా తీశారు. నెలాఖరులోపు గ్రౌండింగ్ చేయాలి.. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను నెలాఖరులోపరు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడు నెలాఖరులోగా కచ్చితంగా నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత హౌసింగ్, మున్సిపల్, సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి, ఏపీడీ శంకర్, తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు
అనంతపురం (సప్తగిరి సర్కిల్): సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను అడ్డుకుంటామని టీడీపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్‌కుమార్ యాదవ్, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ధ్వజమెత్తారు. బుధవారం అనంతపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో హరీష్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా అండగా నిలిచి ఆదుకుంటుంటే టీడీపీ నాయకులు ఓర్వలేక బురద జల్లుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా చంద్రబాబు కోటలు బీటలు వారేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. 2024 ఎన్నికల్లోనూ టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీ లోకానికి ఊపిరి పోశారు రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న మాట్లాడుతూ.. బీసీ లోకానికి ఊపిరి పోసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అన్నారు. రాజ్యసభ సీట్లను తన కులం వారికి ఇచ్చుకోవడంతో పాటు వాటిని రూ.వందల కోట్లకు అమ్ముకున్న నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను గుర్తించి.. వాటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మహనీయుడు జగనన్న అని కొనియాడారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ అల్లీపీరా, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు. -
అమలాపురం ఘటనపై దళిత సంఘాల ఆందోళన
-
AP: రాష్ట్రంలో సామాజిక విప్లవం
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సామాజిక విప్లవంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా పదవులను కట్టబెట్టి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సామాజిక న్యాయాన్ని తెలియజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. యాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఉషశ్రీచరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులను హరించి అణగారిన వర్గాలుగా చూసిన చరిత్ర గత పాలకులదైతే, అన్నింటా పెద్దపీట వేసి వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు దోహదపడిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. విద్యతోనే అభ్యున్నతి సాధ్యమని నమ్మి ఫీజు రీయింబర్స్మెంట్ అందించి సమాజంలో ఉన్నతంగా జీవించేలా ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సామాజిక విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగే సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి నాగార్జున విమర్శించారు. బీసీలను అన్నింటా వంచించిన చంద్రబాబును కొన్ని మీడియా సంస్థలు, పెయిడ్ ఆర్టిస్టులు అట్టిపెట్టుకుని అభూతకల్పనలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ఎన్ని అరాచకాలు చేపట్టినా కళ్లులేని కబోధిలాగా ఉన్న చంద్రబాబు.. నేడు చిన్న ఘటనను కూడా పెద్దదిగా చూపించాలనుకోవడం ఆయన రెండునాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని హేళన చేసిన విషయాన్ని ఇంకా ఎవరూ మరువలేదన్నారు. కరోనా విజృంభించిన సమయంలో హైదరాబాద్ పారిపోయిన ఆయనను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఓ ఎస్సీ అమ్మాయి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తుంటే లోకేష్ వస్తున్నాడంటూ ఆపి శవాల మీద పేలాలు ఏరుకున్నారని, వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ భేరి యాత్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముస్లింల దోస్త్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అభివర్ణించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని, అయితే ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పప్పు నాయుడు, తుప్పునాయుడుల పార్టీకి 2024లో పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి సమాజంలో గుర్తింపునిచ్చిందని తెలిపారు. 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విప్లవాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు ఖాదర్‌బాషా మాట్లాడుతూ మైనార్టీలకు మేయర్లుగా, చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ మొహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహమ్మద్, రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, పార్టీ నాయకులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, రమేష్‌గౌడ్, కృష్ణవేణి, రాధాయాదవ్, కుళ్లాయిస్వామి, శ్రీనివాసులు, అనిల్‌కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బీసీలంటే బెస్ట్ క్లాస్ అని నిరూపించారు.. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్‌బోన్ ఆఫ్ ది సొసైటీ, బెస్ట్ క్లాస్ ఆఫ్ ది సొసైటీ అని సీఎం వైఎస్ జగన్ నిరూపించారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో బడుగు, బలహీన వర్గాల వారికి పదవులను కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. గత ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా పల్లె రఘునాథ రెడ్డిని నియమించారని, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రి పదవి కేటాయించలేదని దుయ్యబట్టారు. సమష్టిగా సాగి సామాజిక న్యాయ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. -
వైఎస్సార్ బీమా.. పేదలకు ధీమా
బీమా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. కంపెనీలు ప్రీమియమూ పెంచేశాయి. అయితే, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీమా అమలు విషయంలో వెనక్కి తగ్గలేదు. సొంతంగా వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకొచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. పెద్ద దిక్కు కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబీకులకు నేనున్నా అంటూ భరోసా కల్పిస్తోంది. అనంతపురం అర్బన్: పేదలకు సంక్షేమాన్ని అందించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వైఎస్సార్ బీమా అమలులో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో బీమా పథకం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 60 శాతం నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇచ్చేది. అయితే, 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం పథకం నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో బీమా కంపెనీలు కూడా ప్రీమియం (కంతు) మీద 35 శాతం పెంచాయి. కేంద్రం తప్పుకోవడంతో పథకం అమలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కంపెనీలు ప్రీమియం పెంచినా, కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. పేదలకు అండగా నిలవాలనే నిర్ణయించుకున్న వైఎస్ జగన్ సర్కారు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. వైఎస్సార్ బీమా పథకం తీసుకొచ్చి.. అమలు బాధ్యత మొత్తాన్నీ తన భుజాన వేసుకుంది. మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్లు.. వైఎస్సార్ బీమా ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం మధ్య మూడేళ్లలో 4,379 క్లెయిమ్‌లకు రూ.73.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెదు దుఃఖంలో కూరుకుపోయిన ఆయా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించింది. ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్ బీమా పాలసీదారులు 5,03,579 మంది ఉన్నారు. బీమా వర్తింపు ఇలా.. వైఎస్సార్బీమా కుటుంబంలో ఒకరికి... ప్రధానంగా కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే వ్యక్తికి వర్తింపజేస్తారు. బీమా తీసుకునే వ్యక్తి బియ్యం కార్డులో సభ్యుడై ఉండాలి. 18 – 70 ఏళ్ల వయసు వారు బీమా పాలసీకి అర్హులు. 18– 50 ఏళ్లలోపు సహజమరణం పొందినా, 18–70 ఏళ్ల లోపు ఏదైనా ప్రమాదంలో మరణం పొందినా బీమా వర్తిస్తుంది. సహజ మరణానికి రూ. లక్ష ఇస్తారు. ప్రమాద మరణానికి రూ.5 లక్షలు, పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం పొందితే రూ.2.50 లక్షలు అందజేస్తారు. మరణించిన పాలసీదారుని అంతిమ సంస్కారాలకు (మట్టిఖర్చులు) గతంలో ఉన్న రూ.5 వేల మొత్తాన్ని కూడా ప్రభుత్వం రూ.10 వేలకు పెంచి ఇస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎంఎస్బీవై (ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) కింద కూడా రూ.12 కడితేనే పాలసీకి అర్హులవుతుండడం గమనార్హం. ప్రభుత్వం ఆర్థిక అండనిచ్చింది నా భర్త బోయ ఈరన్న వ్యవసాయ కూలీగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రమాదవశాత్తు 2021, నవంబరు 11న చనిపోయాడు. వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వడంతో మా కుటుంబానికి ఆర్థిక అండ లభించింది. – భాగ్యమ్మ, గరుడాపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గం రూ. 3.90 లక్షలు అందింది లారీ డ్రైవర్‌గా పనిచేసే నా భర్త లక్ష్మణ్‌నాయక్ గతేడాది ప్రమాదానికి గురై చనిపోయాడు. నాకు ఇద్దరు సంతానం. బాబు వయసు 10, పాప వయసు 8 ఏళ్లు. వైఎస్సార్ బీమా ద్వారా ప్రభుత్వం రూ.3.90 లక్షలు ఇచ్చి ఆదుకుంది. మరో రూ.లక్ష వస్తుందని అధికారులు చెప్పారు. – రుక్మిణి, కువరగేరి, గుంతకల్లు మూడేళ్లలో రూ. 73.14 కోట్లు వైఎస్సార్ బీమా పాలసీదారుడు మరణిస్తే విషయాన్ని సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌కు తెలియజేయాలి. వారు తక్షణమే మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఇస్తారు. పథకం ద్వారా మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్లు అందించాం. – సత్యనారాయణ, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, వైఎస్సార్బీమా కుటుంబ పెద్ద పేరున పాలసీ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వ్యక్తి పేరున బీమా పాలసీ తీసుకోవాలి. ఆ వ్యక్తికి ఏదేని ప్రమాదం జరిగితే బీమా ద్వారా అందే సొమ్ము కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. వలంటీర్లు కూడా కుటుంబ పోషకుని పేరునే పాలసీ ఇవ్వాలి. – నరసింహారెడ్డి, పీడీ, డీఆర్డీఏ -
జేఎన్టీయూ ముంగిలి..ఆనంద లోగిలి
అనంతపురం విద్య: రాయలసీమకే తలమానికంగా మారి, వజ్రోత్సవాల కీర్తి సొంతం చేసుకుని, ఇంజినీరింగ్ నిపుణుల ఖిల్లాగా పేరొందిన జేఎన్టీయూ అనంతపురం శనివారం ఆనంద లోగిలైంది. దేశం గర్వించదగ్గ ఎందరో శాస్త్రవేత్తలను అందించిన విద్యాలయంలో 12వ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చాన్సలర్ హోదాలో హాజరుకావడం కొత్తకళను తెచ్చిపెట్టింది. గవర్నర్ హాజరైనప్పటి నుంచి ముగిసేవరకు విద్యార్థులు, అధికారులు క్రమశిక్షణతో మెలిగారు. గవర్నర్ ప్రసంగానికి యువత ముగ్దులయ్యారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశేష విజయ ప్రస్థానం కలిగిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కి చైర్మన్, వర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ జి. సతీష్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడంతో వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కీలకోపన్యాసం చేస్తూ.. నూతన ఆవిష్కరణలతో సమాజ ప్రగతికి పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. ఏడాదికి 10 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం భారత రక్షణ రంగంలో ఏడాదికి 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్డీఓలో అవకాశం కల్పిస్తామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో డిఫెన్స్ టెక్నాలజీ బ్రాంచ్‌లు ప్రవేశపెడతామన్నారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థిగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కర్తలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ఇస్రో తరఫున ప్రోత్సహిస్తామని సంస్థ చైర్మన్ సోమనాథ్ అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, మరణాన్ని జయించడం, జీవిత కాలాన్ని పెంపొందించడంపై ఇప్పటికే ప్రయోగాలు సాగుతున్నా యన్నారు. సైన్స్ మద్దతుతో ఆకలి, వ్యాధులను జయించేందుకు చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందన్నారు. ‘రాకెట్‌ను ఒక శిశువుగా పరిగణిస్తా, రూప కల్పన నుంచి ప్రయోగం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి విఫలమవుతుంటాం. జీవితంలో కూడా అనుభవం నుంచే పాఠాలు నేర్చుకోవాలి’ అని వివరించారు. అత్యుత్తమ సాంకేతికత గతల దేశాలే అభివృద్ధి చెందుతున్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతరిక్షంలోకి రోబోలను పంపి సమాచార సేక రణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో వర్సిటీకి రూ.1,296 కోట్లు జేఎన్టీయూ (ఏ)కు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ (మెరూ) గుర్తింపు దక్కిందని వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన అన్నారు. వర్సిటీ ప్రగతి నివేదికను ఆయన వివరించారు. మెరూతో వచ్చే ఐదేళ్లలో రూ.1,296 కోట్ల నిధులు రానున్నాయన్నారు. వర్సిటీలో రూ.98 కోట్లతో పాలనా భవనం, ఫార్మసీ బ్లాక్, జిమ్ హాల్, యోగా, మెడిటేషన్ భవనాల నిర్మాణం జరుగుతోందని, మరో రూ.23 కోట్లతో ధ్యాన్‌చంద్ ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల కళాశాలకు చెందిన ఎం. హర్షిత అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుందన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో వర్సిటీ కాలేజీల్లో 565 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించగా, అనుబంధ కళాశాలల్లో 5,904 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. జయంత్‌కుమార్ రెడ్డి, గీతాచరణ్ గేట్– 2022లో టాప్–10 ర్యాంకులు సాధించారన్నారు. హాజరైన ప్రముఖులు స్నాతకోత్సవానికి పలువురు ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ వై. వెంక ట్రామిరెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణా రెడ్డి, రెక్టార్ మల్లికార్జున రెడ్డి, రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావు, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జేసీ కేతన్‌గార్గ్, జేఎన్టీయూ రెక్టార్ విజయకుమార్, రిజిస్ట్రార్ శశిధర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ కేశవ రెడ్డి, తదితరులున్నారు. ‘బంగారు’ కొండలు జేఎన్టీయూ (ఏ) స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 22 మంది విద్యార్థులకు 35 బంగారు పతకాలను ప్రకటించారు. వీరిలో 19 మంది స్నాతకోత్సవ వేదికపై పతకాలు అందుకోగా..వివిధ కారణాలతో ముగ్గురు గైర్హాజరయ్యారు. మొత్తం పతకాలలో డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు అందుకోగా.. ఎం.సతీష్‌కుమార్ రెడ్డి (అనంతపురం), కె.మైథిలి (అనంతపురం) మూడేసి చొప్పున, టి.అనూష (అనంతపురం), బి.సరయూ (అనంతపురం), బి.వీరవంశీ కుమార్ (అనంతపురం), సి.భావన రెడ్డి ( జేఎన్టీయూ కాలేజీ, పులివెందుల) రెండేసి బంగారు పతకాలు, వి.మౌనిక (అనంతపురం), జి.శ్రేయారెడ్డి (అనంతపురం), ఏ.సుధీర్ (పులివెందుల), కె.దేవహర్ష (పులివెందుల), బి.షేక్ షబీహా (పులివెందుల), కే. గురుతేజస్విని (పులివెందుల), యు.విష్ణువర్ధన్ రెడ్డి (అనంతపురం) ఒక్కొక్క బంగారు పతకం అందుకున్నారు. అలాగే వర్సిటీ అనుబంధ ప్రైవేటు కాలేజీల విభాగంలో ఎ.కిశోర్ ( విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ, కావలి), కె.సుప్రియ (ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్, తిరుపతి), టి.శ్రీకాంత్ ( శ్రీవెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుత్తూరు), ఆర్.విష్ణుశ్రీ (శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొడవలూరు, నెల్లూరు జిల్లా), టి.హరిత (పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కావలి), నాగరోహిణి (నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు), కె.మనోజ (ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి), బి.పెంచల కుమారి (అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రాజంపేట) ఒక్కొక్క పతకం కైవసం చేసుకున్నారు. తండ్రి మరణించినా.. : నెల్లూరుకు చెందిన డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎలక్ట్రికల్ విభాగంలో విశేష ప్రతిభ చూపి ‘బంగారు కొండ’గా నిలిచారు. సుప్రజ తల్లిదండ్రులు శివప్రసాద్, సరోజ. రెండేళ్ల క్రితం శివప్రసాద్ గుండెపోటుతో మరణించారు. తల్లి సరోజ ప్రోత్సాహంతో బీటెక్‌ను విజయవంతగా పూర్తి చేశారు. కళాశాల టాపర్‌గా నిలవడంతో పాటు బెస్ట్ అకడమిక్ ఫెర్ఫార్మర్ అమాంగ్ గర్ల్స్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, టీఎస్ రాఘవన్ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, చందుపల్లె వెంకట్రాయులు, సరోజమ్మ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్‌ను సుప్రజ సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పబ్లిక్ రంగ కంపెనీలో ఉద్యోగం సాధిస్తానని, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా సుప్రజ చెప్పారు. -
కంత్రీ కాంతారావు
తెలుగుదేశం పార్టీ నాయకుల మైనింగ్ దందాకు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు అడ్డాగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ టీవీఎస్ కాంతారావు. అనుమతులు పొందింది గోరంత.. తవ్వి బొక్కసం చేసింది కొండంత. 2014–19 మధ్య కాలంలో టీవీఎస్ కాంతారావు చేసిన దందా అంతా ఇంతాకాదు. కోట్లాది రూపాయల ఖనిజం కొల్లగొట్టాడు. అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అతనికి ఇటు రాజకీయంగానూ, అటు అధికారుల పరంగానూ ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. దీంతో కోట్లాది రూపాయల ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ము చేసుకున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంతారావు మైనింగ్ దందాతో చెలరేగిపోయాడు. అనుమతులు తీసుకోవడం ఒక సర్వే నంబర్లో.. తవ్వింది మరో సర్వే నంబర్లో. ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు.. స్వయానా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో బయటపడ్డాయి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు తవ్వారో అధికారులకే అంతుచిక్కలేదు. దీంతో భారీగా పెనాల్టీలు విధించారు. నేమకల్లులో సర్వే నంబర్ 253లో అధికారికంగా అతనికిచ్చింది ఎకరా విస్తీర్ణంలో తవ్వుకోవాలని మాత్రమే. కానీ విచ్చలవిడిగా తవ్వడంతో అధికారులు రూ.కోట్లల్లో పెనాల్టీ విధించారు. అంతేకాదు అత్యంత కఠినమైన ఆర్ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్ట్ ద్వారా ఆస్తులు రికవరీ చేసుకోవాలని కూడా నోటీసులు ఇచ్చారు. కానీ తెలుగుదేశం హయాంలో ఏ అధికారీ అతని క్రషర్ల వైపు వెళ్లలేకపోయారు. కూతురు, అల్లుడు, తమ్ముడు, తమ్ముడి కొడుకు ఇలా అందరి పేరుమీదా కాంతారావు మైనింగ్ చేసి రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తీరు మైనింగ్ అధికారులనే నివ్వెరపోయేలా చేసింది. అనుమతులు లేకుండా తవ్వారు అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ మెటల్‌ను తవ్వి తరలించారు. అంతేకాకుండా పరిమితికి మించి ఎక్కువ భూమిలో తవ్వారు. దీంతో ఎక్కువ పెనాల్టీలు వేశాం. తహసీల్దార్లకు కూడా దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చాం. దీనిపై సదరు వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. దీనికి మేము రివిజన్ పిటిషన్లు కూడా వేశాం. –బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్, గనులశాఖ కఠిన చర్యలు తీసుకుంటాం మైనింగ్ శాఖ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి ఆస్తులను గుర్తించి ఆర్ఆర్ యాక్ట్కింద వసూలు చేస్తాం. జరిమానాలు కట్టించి తీరతాం. –ఎ.నిశాంత్‌రెడ్డి, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
టీడీపీ నేతల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్య
కనగానపల్లి(శ్రీ సత్యసాయి జిల్లా): టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త దండు దామోదర్‌రెడ్డి (48) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం రాంపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామంలోని గోసా రామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గత ఏడాది జనవరి 4న గ్రామపెద్దల సమక్షంలో లెక్కించారు. రూ.1,47,083 ఆదాయం రాగా.. ఆ మొత్తాన్ని గ్రామ కమిటీ సభ్యుడైన దామోదర్‌రెడ్డికి అప్పగించారు. చదవండి: ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన తర్వాత ఆ డబ్బు గురించి చిన్న గొడవ జరగ్గా పోలీసులు గ్రామ పెద్దలను స్టేషన్‌కు పిలిపించి డబ్బు తీసుకోవాలని చెప్పారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత ఎవరూ డబ్బు గురించి అడగకపోవటంతో దామోదర్‌రెడ్డి కొంత మొత్తాన్ని వాడుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న గ్రామ పెద్దలు సమావేశమై డబ్బు గురించి అడగ్గా కొంత గడువిస్తే డబ్బంతా ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే.. స్థానిక టీడీపీ నాయకులు అతనితో గొడవ పడటంతోపాటు ఆ డబ్బు పేరుతో వేధించసాగారు. దీంతో మానసిక వేదనకు గురైన దామోదర్‌రెడ్డి శనివారం సాయంత్రం తన పొలం దగ్గర సెల్ఫీ వీడియోలో టీడీపీ నాయకుల వేధింపులు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని వివరిస్తూ పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు, మృతుడి సెల్ఫీ వీడియో వాంగ్మూలం ఆధారంగా టీడీపీ నాయకులు ఎస్.వెంకట రాముడు, వడ్డే నాగభూషణ, రామాంజినేయులు, ముత్యాలప్ప, నారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కన్నకొడుకుని హతమార్చిన 90 ఏళ్ల వృద్ధుడు
గుంతకల్లు: ‘ఎంత వరకు ఓపిక పట్టాలి. ఎంతగా నచ్చచెప్పినా మారలేదు. ప్రతిరోజూ నాకు నరకమే చూపాడు. నాకున్న ఆరుగురు కుమారుల్లో ఎవరూ ఇంతగా సతాయించలేదు. ఏం చేయమంటారు? మనశ్శాంతి కోసం వాడు చచ్చేదాకా ఇనుప రాడ్‌తో తలపై పలుమార్లు బలంగా బాదాను’ అంటూ పోలీసుల ఎదుట 90 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి వేధింపులు తాళలేక చివరకు హతమార్చాల్సి వచ్చిందంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపిన మేరకు.. మద్యానికి బానిసగా మారి.. గుంతకల్లులోని ఎస్ఎల్వీ థియేటర్ వెనుక ఉన్న యల్లమ్మ తగ్గు ప్రాంతంలో నివాసముంటున్న షేక్ జాఫర్‌సాహెబ్‌కు ఆరుగురు కుమారులు సంతానం. వీరిలో ఐదో కుమారుడు షేక్ ఖలీల్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాగుడుకు బానిసైన ఖలీల్ వేధింపులు తాళలేక మూడేళ్ల క్రితం అతని భార్య విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి విడిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దనే ఖలీల్ ఉంటున్నాడు. ఎలాంటి పనీపాట లేకుండా మద్యం మత్తులోనే జోగుతుండేవాడు. వృద్ధాప్యంలో శరీరం సహకరించకపోయినా.. కూలి పనులతో కుటుంబ పోషణ భారాన్ని జాఫర్ సాహెబ్ మోస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ తండ్రిని ఖలీల్ వేధించేవాడు. డబ్బు లేదని చెబితే నడిరోడ్డుపై కేకలు వేస్తూ ఇరుగూపొరుగు వారితో గొడవకు దిగేవాడు. వేధింపులు తాళలేక.. మంగళవారం రంజాన్ పండుగను ఉన్నంతలో గొప్పగా చేయాలని తండ్రి భావించాడు. దాచుకున్న డబ్బు తీసి వంట సరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి చేతిలో డబ్బు చూసిన ఖలీల్ తనకు ఇవ్వాలని గొడవపడ్డాడు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. మాటలతో దూషించాడు. అసహాయుడైన వృద్ధుడిపై దాడి చేసేందుకూ వెనుకాడలేదు. దీంతో జాఫర్‌సాహెబ్‌లో ఓపిక నశించింది. ఇక కుమారుడు జీవించి ఉన్నంత కాలమూ తనకు మనశ్శాంతి ఉండదని భావించాడు. మధ్యాహ్నం నిద్రిస్తున్న కుమారుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని పలుమార్లు తలపై బలంగా మోదడంతో ఖలీల్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన వృత్తాంతాన్ని పోలీసులకు జాఫర్‌సాహెబ్ వివరించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నర్సింగప్ప, రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
ఆరుగురు విద్యార్థుల సస్పెన్షన్
నల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన పాఠశాలలోని తరగతి గదిలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ మీనాక్షి, ఏడీ రామకృష్ణ, ఎంఈఓ వేమనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ... ఘటనపై సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ? ఏప్రిల్ 30న ఎస్ఏ పరీక్షలు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు ఓ తరగతిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, డెస్క్, వైర్‌కుర్చీ(చైర్) ధ్వంసం చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్చార్జ్ హెచ్ఎం శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు హెచ్ఎం రమణప్ప మరుసటి రోజు ఘటనకు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకోవడంతో పాటు ధ్వంసమైన ఫర్నీచర్ మరమ్మతులకు అయ్చే ఖర్చు తామే భరిస్తామని చెప్పడంతో అప్పట్లో సమస్య సద్దుమణిగింది. తాజాగా ఈ నెల 2న ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అయితే అది నల్లమాడ ఉన్నత పాఠశాలలో జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. దీంతో ఏప్రిల్ 30న నల్లమాడ పాఠశాలలో జరిగిన ఘటన మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో డీఈఓ పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు. సామగ్రి ధ్వంసం చేసిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలోని సామగ్రి ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో డీఈఓ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేయాలని హెచ్ఎం రమణప్పకు ఆదేశాలిచ్చారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
పల్లెవించిన నాగరికత.. మారిన గ్రామీణ రోడ్లు
ఇది ఓబుళదేవరచెరువు మండలం ఇనగలూరు పంచాయతీలోని గొల్లపల్లె రహదారి. ఒకప్పుడు ఈ ఊరికి మట్టిరోడ్డే గతి. అడుగడుగునా కంకర తేలి, గుంతలమయంగా దర్శనమిచ్చేది. ప్రయాణానికి ఏమాత్రం అనువుగా ఉండేది కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా ఆస్పత్రులకు తరలించాలన్నా సాధ్యం కాని పరిస్థితి. చివరకు ఈ ఊరి యువకులకు పిల్లనిచ్చేందుకూ ఎవరూ ఆసక్తి చూపే వారు కాదు. అయితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. రూ.1.50 కోట్లతో 3.9 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇది నల్లమాడ మండలం చారుపల్లి నుంచి సి.రెడ్డివారిపల్లి వరకు వెళ్లే రహదారి. దశాబ్దాలుగా ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే రూ.1.10 కోట్లతో కిలోమీటర్ మేర సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు హాయిగా ప్రయాణం సాగిస్తున్నారు. చుట్టుపక్కల పల్లెలతో రవాణా అనుసంధానమూ పెరిగింది. సాక్షి, పుట్టపర్తి/ అనంతపురం సిటీ: నాగరికతకు రహదారులను చిహ్నాలుగా భావిస్తారు. రోడ్లు బాగుంటే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య అనుసంధానం పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగవడంతో అభివృద్ధి కూడా వేగంగా సాగుతుంది. ఈ విషయాలన్నింటికీ అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు రహదారులకు మహర్దశ తీసుకొచ్చింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులపై దృష్టి సారించి దశాబ్దాలుగా రాళ్లురప్పలతో అధ్వానంగా దర్శనిమిచ్చిన దారులను సుందరంగా మార్చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 170 గ్రామీణ రహదారులు నిర్మించారు. మొత్తం 591.41 కిలోమీటర్ల మేర రోడ్లు కొత్తగా వేసి సౌకర్యాలు మెరుగుపరిచారు. దీంతో పాటు మరో 52 ప్రధాన రహదారుల్లో మరమ్మతుల కోసం రూ. 70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేసి 39 చోట్ల పనులు పూర్తి చేశారు. మరో 11 రహదారులకు సంబంధించి పనులు టెండర్ దశలో ఉన్నట్లు అధికారులు వివరించారు. టీడీపీ హయాంలో జనం మొత్తుకున్నా వినలేదు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల్లో గుంతలు ఏర్పడి ప్రయాణం నరకంగా ఉండేది. రోడ్లను అభివృద్ధి చేయాలని గ్రామీణులు అనేక సార్లు విన్నవించినా అప్పట్లో నేతలు పట్టించుకోలేదు. కొన్ని చోట్లయితే తూతూమంత్రంగా శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత మర్చిపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం దొరకడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరింది దాదాపు 50 ఏళ్లు మోకాళ్లలోతు గుంతలు, రాళ్లు తేలిన మట్టిరోడ్డుతో చాలా ఇబ్బంది పడేవాళ్లం. టీడీపీ హయాంలో పలుసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప రోడ్డు నిర్మించలేదు. చారుపల్లి నుంచి సీ రెడ్డివారిపల్లికి సీసీ రోడ్డు నిర్మించడంతో మా దశాబ్దాల కల నెరవేరింది. చౌటతండా మీదుగా కొండమనాయునిపాలెం వరకు తారురోడ్డు నిర్మిస్తే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – మధుసూదన్‌రెడ్డి, సీ రెడ్డివారిపల్లి, నల్లమాడ మండలం చాలా సంతోషంగా ఉంది మా పల్లెకు సీసీ రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఎన్నోసార్లు అధికారులు, నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. సీసీ రోడ్డు నిర్మాణంతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ రోడ్డు వేయించినందుకు కృతజ్ఞతలు. – అశ్వర్థనారాయణ, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, సీ రెడ్డివారిపల్లి త్వరితగతిన పనులు రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. దశాబ్దాల నుంచి అధ్వానంగా ఉన్న గ్రామీణ దారులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ప్రణాళిక రూపొందించి పనులు చేపడుతున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం. – ఓబుళరెడ్డి, ఎస్ఈ, రోడ్లు, భవనాల శాఖ -
KGF ప్రశాంత్ నీల్.. మన బంగారమే
కేజీఎఫ్.. కేజీఎఫ్.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్‌వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్ నీల్ ఎవరంటే...అచ్చంగా మనోడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. తన మూడో సినిమాతోనే ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్‌నీల్ వెండితెర ప్రయాణం, జీవన గమన విశేషాలపై ప్రత్యేక కథనం. మడకశిర(అనంతపురం): ప్రశాంత్ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్–2 రిలీజ్ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. వెండితెర ప్రయాణమిలా.. ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ఉగ్రమ్‌తో విశ్వరూపం 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ‘ఉగ్రమ్’ సినీ చిత్రీకరణకు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్ నీల్.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్ రాసుకుని కోలార్ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది. నీల్ అంటే నీలకంఠాపురం.. రెండు రోజుల క్రితం వరకూ ప్రశాంత నీల్ మడకశిరవాసి అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ కుమారుడు ప్రశాంత్‌నీల్ అని తెలుసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్వగ్రామంపై ఉన్న గౌరవంతో నీలకంఠాపురం స్ఫురించేలా ప్రశాంత్ తన ఇంటిపేరును నీల్ అని పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ను ఆయన తెరకెక్కించనున్నారు. నీలకంఠాపురంలోని ప్రశాంత్‌నీల్ తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంది మా కుమారుడు సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతి గడించడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం దక్కింది. ప్రపంచస్థాయిలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తల్లిగా ఎంతో అనుభూతి పొందా. – భారతి, ప్రశాంత్‌నీల్ తల్లి నీలకంఠాపురానికి గుర్తింపు సినిమా డైరెక్టర్‌గా ప్రశాంత్‌నీల్ సాధించిన విజయం నీలకంఠాపురానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడాదికోసారి నీలకంఠాపురానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఈ గ్రామమంటే అతనికి ఎంతో ఇష్టం. ఈ నెల 14న వచ్చి తన తండ్రి సమాధికి నివాళులర్పించి వెళ్లాడు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలన్నదే నీలకంఠాపురం ప్రజల ఆకాంక్ష. – చిన్న రంగేగౌడ్, ప్రశాంత్‌నీల్ పినతండ్రి, నీలకంఠాపురం, మడకశిర మండలం చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? -
అన్నను దారుణంగా చంపిన తమ్మడు
సాక్షి, హిందూపురం: అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడు రఘును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హిందూపురం రూరల్ సీఐ హమీద్ ఖాన్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ఈ నెల 17న పరిగి మండలం పైడేటీ గ్రామంలో అన్న మారుతీపై తమ్ముడు కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చిన విషయం విదితమే. ఘటన అనంతరం తమ్ముడు రఘు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ధనాపురం క్రాస్ వద్ద నిందితుడు రఘును గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అన్నదమ్ములిద్దరికీ తాగుడు అలవాటు ఉంది. మద్యం మత్తులో తమ్ముడు రఘును మారుతి ఇష్టానుసారంగా తిట్టేవాడు. దీంతో అన్నపై కక్ష పెంచుకున్న రఘు అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 17న రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద రఘుతో మారుతి గొడవ పడ్డాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రఘు ఇంటి లోపలకు వెళ్లి కిరోసిన్ తీసుకువచ్చి అన్నపై పోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మారుతిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 18న అతను మృతి చెందాడు. మారుతి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు: శంకర్ నారాయణ
సాక్షి, అనంతపురం: పవన్ కళ్యాణ్‌కు రైతుల గురించి ఏం తెలుసు? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు పవన్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. పవన్ పరామర్శించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం చేసిందని తెలిపారు. రైతుల కోసమే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయనకు వ్యవసాయంపై అవగాహన లేదని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని సీఎం జగన్ సర్కార్ ఆదుకుందని తెలిపారు. ఒక్కొ రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందజేసిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. 469 మంది రైతులకు చంద్రబాబు చిల్లిగవ్వ సాయం కూడా సాయం చేయలేదని అన్నారు. చంద్రబాబు పాలనలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిహారం అందించారని తెలిపారు. చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడు పవన్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. అప్పుడు గాడిదలు కాస్తున్నావా? అని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వం కౌలుదారులకు అండగా నిలిచిందని, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేయలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని శంకర్ నారాయణ తెలిపారు. -
ముంగిళ్లలో వైద్యం
కణేకల్లుకు చెందిన సుబ్బయ్య దివ్యాంగుడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సాయంగా ఎవరూ లేకపోవడంతో చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. రెండు రోజుల తర్వాత 104 వాహనం గ్రామానికి రాగా వైద్యులే సుబ్బయ్య ఇంటివద్దకు వచ్చి మరీ పరీక్షలు చేశారు. అవసరమైన మందులూ అందించారు. బొమ్మనహాళ్‌కు చెందిన సుశీలమ్మ వృద్ధురాలు. వయసుమీద పడటంతో నడవలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురికాగా 104 వైద్యులే ఆమె ఇంటికి వచ్చి చికిత్స చేశారు. ఇలా గ్రామీణ ప్రాంతాల వారికి ఎందరికో 104 వాహనం ద్వారా మెరుగైన వైద్యం అందుతోంది. రాయదుర్గం: వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ముంగిళ్లలోనే వైద్యసేవలు అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, వైద్య పరికరాలతో కదిలే కార్పొరేట్ ఆస్పత్రి లాగా రూపొందించిన 104 మొబైల్ మెడికల్ క్లినిక్ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వరంలా మారింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, సాంక్రమిక∙వ్యాధుల రోగులకు సంజీవనిలా మారింది. రూ.201 కోట్లు ఖర్చు చేసి 1,088 వాహనాలను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.... వాటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి 104, 108 వాహనాలుగా తీర్చిదిద్దింది. 2020 జూలై 1వ తేదీన ఈ వాహనాలన్నీ సీఎం జగన్మోహన్రెడ్డి విడుదల చేసి చరిత్ర సృష్టించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 1న అధునాతనమైన సౌకర్యాలతో కూడిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సీఎం విడుదల చేశారు. ప్రతి గ్రామానికీ నెలలో రెండుసార్లు 104 వాహనం ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు వెళ్తుంది. సాధారణ జబ్బులతో పాటు చిన్నారుల్లో వచ్చే డయేరియా, కౌమారదశలో ఉన్నవారికి వచ్చే రక్తహీనత, సాంక్రమిక వ్యాధుల నిర్ధారణ, చర్మవ్యాధులు, మలేరియా, చికెన్ గున్యా, లెప్రసీ, క్షయ, మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధుల నిర్ధారణకు 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీజీ, ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు వాహనంలో 32 రకాల వైద్య పరికరాలు, 74 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనంలో వైద్యపరీక్షలు చేయడానికి డాక్టర్ సీటింగ్‌తో పాటు డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 12,03,429 మందికి వైద్య సేవలు 2020 జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 104 వాహనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా (అనంతపురం, శ్రీసత్యసాయి) వ్యాప్తంగా ఉన్న 62 వాహనాల ద్వారా 896 గ్రామ సచివాలయాల పరిధిలో 2022 మార్చి వరకు 21 నెలల్లో 12,03,429 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇంటివద్దకే వైద్యం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపీ చూసే 104 వైద్యులు 1.30 గంటల నుంచి నడవలేని లేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక భారం తగ్గింది నాకు షుగర్, బీపీ ఉన్నాయి. పట్టణానికి వెళ్లి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు చేయించుకుని, మందులు కొనుక్కురావడానికి నెలకు రూ.వెయ్యి ఖర్చు వచ్చేది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 104 వాహనాన్ని ప్రజల ముంగిటకే పంపి వైద్య సేవలు అందిస్తుండటంతో మాలాంటి వారికి ఆర్థిక భారం తగ్గింది. – సీతారామిరెడ్డి, కణేకల్లు క్రమం తప్పకుండా 104 వస్తుంది గతంలో నెలకోసారి, రెండు నెలలకు ఒకసారి వచ్చే 104 వాహనం ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా వస్తుంది. 104 వైద్యులు రోగులను పరీక్షించి మాత్రలు, ఇంజక్షన్లు వేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు, ఈసీజీ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. – తిప్పేస్వామి, బీఎన్‌హళ్లి గ్రామం, రాయదుర్గం మండలం 194 మంది సిబ్బందితో వైద్యసేవలు ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 62 ఉన్నాయి. 62 మంది డాక్టర్లు, 66 మంది డీఈఓ(డేటా ఎంట్రీ ఆపరేటర్)లు, 66 మంది డ్రైవర్లు మొత్తం 194 మంది సిబ్బంది ప్రతినెలా నిర్ణయించిన తేదీల్లో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనాల్లో 32 రకాల ఆధునిక పరికరాలతో పాటు పాము, తేలు, కుక్క కాటుకు మందులుంటాయి. –జి. కృష్ణమూర్తి, 104 ఉమ్మడి జిల్లా మేనేజర్ -
పెళ్లై ఐదు నెలలు.. కట్టుకున్నోడే కాలయముడు
గుంతకల్లుటౌన్: కట్టుకున్నవాడే కాలయముడిగా మారాడు. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన నవవధువు జీవితాన్ని ఐదునెలలకే చిదిమేశాడు. గుంతకల్లు పట్టణంలో ఈ నెల 2న సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒన్‌టౌన్ పీఎస్‌లో మంగళవారం విలేకర్ల సమావేశంలో సీఐ నాగశేఖర్ వివరాలు వెల్లడించారు. గుంతకల్లులో రైల్వేగార్డుగా పనిచేసే బాలాజీనాయక్ కుమారుడు సుబ్రమణ్యం నాయక్‌కు, కదిరి మండలం రాచవారిపల్లితాండాకు చెందిన ఎం.చంద్రానాయక్ కుమార్తె అఖిలబాయితో గత ఏడాది నవంబర్ 28న వివాహం జరిగిందన్నారు. చంద్రానాయక్‌కు స్వగ్రామంలో మూడెకరాల భూమి ఉండగా, అందులో ఒకటిన్నర ఎకరా రాయించుకురావాలంటూ అఖిలబాయిని పెళ్లైన కొన్ని రోజుల నుంచే ఆమె భర్త సుబ్రమణ్యం నాయక్, తల్లిదండ్రులు బాలాజీనాయక్, సుశీలబాయి, అక్కాబావ పుష్ప, హరిలాల్‌నాయక్ ఒత్తిడి చేసేవారన్నారు. అంతేకాకుండా అఖిలబాయి కాలేజీలో చేసిన టిక్‌టాక్ వీడియోను అడ్డుపెట్టుకుని ఎవరితోనో సంబంధాలు పెట్టుకున్నావంటూ భర్త చిత్రహింసలకు గురిచేసేవాడన్నారు. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారుజామున అఖిలబాయితో గొడవ పెట్టుకున్న సుబ్రమణ్యం నాయక్ ఆమె తలపై ఇనుపరాడ్‌తో కొట్టడంతో పాటు ఎడమ చేతి మణికట్టు వద్ద కత్తితో కోసేశాడన్నారు. అయినప్పటికీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో కత్తితో ఆమె గొంతుకోసి పరారైనట్లు సీఐ వివరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం పాత రైల్వేస్టేషన్ బుకింగ్ ఆఫీసు వద్ద సుబ్రమణ్యం నాయక్‌తో పాటు సుశీలబాయి, బాలాజీనాయక్‌లను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేసులో మరో ఇద్దరు నిందితులైన మృతురాలి ఆడపడుచు పుష్ప, ఆమె భర్త హీరాలాల్‌నాయక్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.ముగ్గురినీ స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సీఐ తెలియజేశారు. సమావేశంలో రూరల్ సీఐ లక్ష్మణ్, ఏఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయి?
కణేకల్లు(అనంతపురం): భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ)కు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు టీడీపీ హయాంలో మంజూరైన రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజలకు తెలపాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాయదుర్గం మార్కెట్‌యార్డు చైర్పర్సన్ ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యులు డి.పద్మావతి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ లీలావతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డితో కలిసి కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బీటీపీ కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు కాలవ తెచ్చిన జీఓ అంతా ఉత్తిదేనన్నారు. జగన్‌తోనే బీటీపీకి కృష్ణా జలాలు సాధ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయదుర్గానికి వచ్చిన సమయంలో బీటీపీకి కృష్ణా జలాలు తీసుకొస్తామని మాట ఇచ్చారని, త్వరలోనే పనులు ప్రారంభించి కృష్ణా జలాలు తెచ్చితీరుతామన్నారు. కాలవా.. ఇవి నిజం కాదా..? బీటీపీపై మట్టి రోడ్డు వేసి రూ.50 లక్షలు, పైలాన్ కట్టి రూ.80 లక్షలు మీరు దోచేయడం నిజం కాదా..? నాగేపల్లి గ్రామంలో మారుతి వనం పేరుతో అనుచరులతో కలిసి రూ.కోట్లు పందికొక్కుల్లా మెక్కడం వాస్తవం కాదా..? కులానికో కల్యాణ మంటపమంటూ స్థలం కేటాయింపులపై ఉత్తుత్తి కాగితాలిచ్చి కుల రాజకీయాలు చేసింది నువ్వు కాదా...? 2019లో ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో ఓబుళాపురం గ్రామంలో తాగునీటి పథకం పనికి భూమి పూజ చేసి ప్రజలను వంచించిన ఘనత నీది కాదా..? రూ.3,500 కోట్లతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్న కాలవ ఆ నిధులతో ఏయే పనులు చేశారో చెప్పాలని కాపు నిలదీశారు. మీ జాతకాలు బయటపెడతా అసెంబ్లీ సమావేశాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలో ‘నీరు–చెట్టు’ పథకం పేరుతో కాలవ, అతని అనుచరులు ఎవరెవరు ఎంత దోచేశారో.. వారి జాతకాలను బయట పెడతానని కాపు పేర్కొన్నారు. కణేకల్లు చెరువు పేరుతో రూ.2 కోట్లు, కళేకుర్తి చెరువు పూడికతీత పేరుతో భారీగా నిధులు దోచేశారన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు పైనేటి తిమ్మప్పచౌదరి, మాజీ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, కణేకల్లు పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ టీ.కేశవరెడ్డి, మాజీ సర్పంచు పాటిల్ చెన్నకేశవరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
AP: అమెరికా లాంటి అగ్ర దేశాలకు ‘అనంత’ ఉత్పత్తులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది కరువు. కానీ అది గతం. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు ఖండాంతరాలకు వెళ్లింది. అమెరికా లాంటి అగ్రదేశాలకు అనంత ఉత్పత్తులు చేరుతున్నాయి. ఉద్యాన పంటల్లోనే ఇప్పటివరకూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన జిల్లా తాజాగా కార్లు, మందులు, రెడీమేడ్ గార్మెంట్స్ వంటి వాటిలోనూ ముందంజ వేసింది. పారిశ్రామిక ప్రగతికి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎగుమతుల కారణంగా విదేశీ మారకంతో పాటు ఇక్కడ ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. వేలాదిమంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక్కడ తయారై ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల విలువ ఏటా రూ.5 వేల కోట్లకు పైనే ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. గత ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు ఎగుమతి అయిన కియా కార్లు అక్షరాలా 40,440. జిల్లాలో తయారై మన దేశంలో అమ్ముడైన కార్ల సంఖ్య 1,55,678గా ఉంది. అమెరికాలో మన కార్లే అమెరికా వంటి అగ్రదేశంలోనూ మన జిల్లాలో తయారైన ‘కియా’ కార్లు తిరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. కార్లే కాదు జిల్లాలోని రాచనాపల్లి వద్ద తయారవుతున్న సిఫ్లాన్ డ్రగ్స్ (పశువుల మందులు) పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, టర్కీ, ఐర్లాండ్, ఉరుగ్వే, నెదర్లాండ్స్, పాకిస్తాన్ వంటి దేశాలకు వెళుతున్నాయి. జిల్లాలోని పరిగి వద్ద ఇండియన్ డిజైన్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసే రెడీమేడ్ దుస్తులు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రమారమి రూ.52.88 కోట్ల విలువైన దుస్తులు ఎగుమతయ్యాయి. హిందూపురం పట్టణ పరిధిలోని తూముకుంట వద్ద ఉన్న విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ సంస్థ నుంచి పిస్టన్ రాడ్స్..యూరప్‌తో పాటు ఇజ్రాయిల్ తదితర దేశాలకు వెళుతున్నాయి. ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు జిల్లాలో ఎవరైనా ముందుకొచ్చి యూనిట్లు పెడితే వారికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. ఇన్సెంటివ్‌లు వచ్చేలా చూస్తున్నాం. ముఖ్యంగా లార్జ్‌స్కేల్ యూనిట్లపై దృష్టి సారిస్తున్నాం. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. – నాగలక్ష్మి సెల్వరాజన్, కలెక్టర్ -
కదిరిలో ‘పచ్చ’ రచ్చ.. తారస్థాయికి వర్గపోరు
కదిరి(అనంతపురం): టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రచ్చ రచ్చగా మారింది. సొంత పార్టీ నాయకుడిపైనే నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు రెచ్చిపోయారు. సోమవారం కదిరి పట్టణంలోని అమృత ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. గ్రూపులు, వర్గ పోరు కారణంగానే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేతిలో వరుసగా రెండు సార్లు ఓడిపోయామని టీడీపీ నాయకుడు మనోహర్ నాయుడు అనడంతో కందికుంట అనుచరులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లారు. ఆయన చేతిలోని మైకు లాక్కొని ‘ఇక్కడ కందికుంట వర్గం తప్ప మరో వర్గానికి తావు లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడితే బాగుండదు’ అని హెచ్చరించారు. అయితే మనోహర్ నాయు డు స్వరం పెంచుతూ.. ‘నేను చెప్పింది అక్షరాలా నిజం. పార్టీ మీద అభిమానం కన్నా కందికుంట భజనపరులే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వ్యక్తుల కన్నా పార్టీనే సుప్రీం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవడానికి కలిసి కట్టుగా పనిచేద్దాం’ అని చెప్పడంతో వారు మరోమారు దౌర్జన్యానికి దిగారు. చివరకు కందికుంట మైకు అందుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చాంద్‌బాషా దూరం : టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో పాటు ఆయన వర్గీయులు హాజరు కాలేదు. అది పార్టీ సమావేశం కాదని, కందికుంట భజనపరుల మీటింగ్ అని చాంద్‌బాషా అనుచరులు బాహాటంగానే విమర్శించారు. నకిలీ డీడీల కేసులో కందికుంట మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని, కావున వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ చాంద్‌బాషాకే వస్తుందని వారు అంటున్నారు. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో సైతం కందికుంటకు 35.9 శాతం రాగా.. చాంద్‌బాషాకు 64.1 శాతం మద్దతు లభించిందని చాంద్ అనుచరులు చెబుతున్నారు. ఈ సర్వేపై ఇప్పటికే కందికుంట, చాంద్‌బాషా వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాంద్‌కు అంతసీన్ లేదు : వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అధికారం కోసం అమ్ముడుపోయిన చాంద్‌బాషా ఇకమీదట వార్డు మెంబర్‌గానూ గెలవలేరని, అలాంటి వ్యక్తికి సర్వేలో 64 శాతం వచ్చిందంటే టీడీపీ కార్యకర్తలెవరూ నమ్మరని కందికుంట వర్గీయులు అంటున్నారు. కాగా...రానున్న రోజుల్లో ఇరువురు నాయకుల మధ్య వర్గ పోరు మరింత ముదరడం ఖాయమని, ఇక్కడ మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే ఉంటుందని స్వయానా టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. -
డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో.. కట్టుకున్న భార్యనే..
శెట్టూరు( అనంతపురం): వ్యసనం.. ఓ కుటుంబంలో కార్చిచ్చు రేపింది. మద్యానికి బానిసైన భర్తలో మార్పు తీసుకువచ్చేందుకు ఆ ఇల్లాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు మద్యం మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు... చింతలేని కుటుంబం.. శెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్ప... చిన్నకారు రైతు. కొన్నేళ్ల క్రితం కర్ణాటక ప్రాంతానికి చెందిన గొల్ల లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరికి వివాహమైంది. కుమారులు ముగ్గురూ బెంగళూరులోని గార్మెంట్స్ పరిశ్రమలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. వ్యవసాయంతో పాటు పాడి పోషణ చేపట్టి కుటుంబ బాధ్యతలను లక్ష్మీదేవి చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నరసింహప్ప మద్యానికి బానిసయ్యాడు. తరచూ గొడవ.. మద్యానికి బానిసైన నరసింహప్ప ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ వచ్చేవాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక తాను కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులో కొంత మేర ఇస్తూ వచ్చింది. దీంతో నరసింహప్ప మద్యం మహమ్మారికి పూర్తిగా లొంగిపోయాడు. ఒక్కపూట మద్యం తాగకపోతే విచిత్రంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో.. మద్యం వ్యసనం నుంచి భర్తను బయట పడేసేందుకు లక్ష్మీదేవి విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు అవసరమైన డబ్బు కోసం లక్ష్మీదేవిని నరసింహప్ప ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. అలవాటు మానుకోవాలని హితవు చెప్పింది. సాయంత్రం మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. బెదిరించాడు. భర్తలో మార్పు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. మొత్తం సంసారాన్ని తానే నెట్టుకొస్తున్నానని, రోజూ మద్యం తాగేందుకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అసహనం వ్యక్తం చేసింది. రాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు విచక్షణ కోల్పోయిన నరసింహప్ప శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య లక్ష్మీదేవి (45)పై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై బలమైన వేటు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తెల్లవారుజామున నరసింహప్ప సోదరుడు కుమారుడు ఈరన్న పాల కోసం వచ్చినప్పడు ఈ విషయం వెలుగు చూసింది. ‘పిన్నమ్మ ఎక్కడకు పోయింది కనిపించడం లేదు’ అంటూ ఇంటి బయట కూర్చొన్న చిన్నాన్నను ఈరన్న అడిగినప్పుడు అతని మౌనమే సమాధానమైంది. దీంతో వెనుదిరుగుతున్న సమయంలో రక్తపుమడుగులో పడి ఉన్న పిన్నమ్మ కనిపిచండంతో ఒక్కసారిగా అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమి జరిగిందంటూ చిన్నాన్నను నిలదీశాడు. అతను సమాధానమివ్వకపోవడంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేశాడు. ఘటనాస్థలాన్ని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ యువరాజ్ పరిశీలించారు. హతురాలి సోదరుడు ఈరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అక్కడే ఉన్న నిందితుడు చిన్న నరసింహప్పను అదుపులోకి తీసుకున్నారు. -
హమ్మయ్య.. కదిరికి వచ్చేశా.!
కదిరి(అనంతపురం): ఎట్టకేలకు కదిరికి వచ్చేశా.. నా దేశం చేరుకుంటానో లేదో..నా తల్లిదండ్రులను ఇక చూస్తానో లేదోనని భయంగా ఉండేది..భారత్‌లో అడుగు పెట్టగానే నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది..’ అని ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న కదిరి చెందిన షేక్ రాఖియా అన్నారు. కదిరి పట్టణానికి చెందిన బోరు బండ్ల నిర్వాహకుడు ఘని కుమార్తె అయిన ఆ విద్యార్థిని ఉక్రెయిన్‌లోని విన్నిషియా నగరంలో చదువుతోంది. ఆ దేశంపై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి ఆమెతో పాటు ఉన్న ఏపీకి చెందిన మరికొందరు మెడిసిన్ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాగడానికి మంచినీళ్లు దొరకడం కూడా కష్టంగా ఉండేదని ఆమె అంటున్నారు. బాంబుల శబ్ధం వినబడగానే భయం వేసేదని, ఒకానొక దశలో మన దేశం వదిలి ఇక్కడికి ఎందుకొచ్చామా..? అనిపించిందని ఆవేదన వ్యక్త పరిచారు. ఆ దేశం నుంచి విమానంలో బుధవారం ఢిల్లీ చేరుకుని, మరో విమానంలో గురువారం సాయంత్రం బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి తల్లిదండ్రులతో కలిసి కారులో గురువారం రాత్రి బాగా పొద్దు పోయాక కదిరిలోని తమ ఇంటికి క్షేమంగా చేరుకుంది. -
కంటి మీద కునుకు లేదు.. కడుపు నిండా తిండి లేదు
ఒక వైపు రాకెట్ల దాడులు, మరో వైపు ఫిరంగుల మోతలు, బాంబుల శబ్ధాలు. అంతా భయానక వాతావరణం. ఎప్పుడు చల్లారుతుందో తెలియదు. ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్తే.. అకస్మాత్తుగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు మన విద్యార్థులను కష్టాల్లోకి నెట్టాయి. బతుకు జీవుడా అంటూ బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకోవాల్సిన దీనావస్థ తెచ్చిపెట్టాయి. రష్యా భీకర దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న అనంతపురం జిల్లావాసులతో ‘సాక్షి’ గురువారం ఫోన్లో మాట్లాడింది. ‘కంటి మీద కునుకు లేదు.. కడుపు నిండా తిండి లేదు’ అని కొందరు భావోద్వేగంతో చెప్పగా, ‘ఎన్నో కష్టాలు పడి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నాం.. మరో రెండు రోజుల్లో మనం దేశం చేరుకుంటాం’ అని మరికొందరు వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఎంతో కష్టంగా హంగేరి చేరుకున్నా ఉక్రెయిన్‌లోని జెప్రోజీ స్టేట్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం చదువుతున్నా. వ్యయప్రయాసలతో ప్రస్తుతం హంగేరికి చేరుకున్నా. మరో రెండు రోజుల్లో స్వగ్రామానికి చేరుకుంటానని అనుకుంటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు. – సాయితేజ, బెళుగుప్ప బంకర్లో తలదాచుకున్నాం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపా. మేమున్న ప్రాంతంలో బాంబుల వర్షం కురవడంతో ఆ శబ్ధాలకు భయపడి బంకర్లోకి వెళ్లి దాక్కున్నా. నాతో పాటు ఏపీకి చెందిన మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ప్రాణభయంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక వాహనంలో రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాం. రైల్లో సుమారు 1,400 కి.మీ ప్రయాణించి ఉక్రెయిన్ బార్డర్ దాటాం. భారత ఎంబసీ అధికారులను కలిశాం. రెండు రోజుల్లో ఢిల్లీ చేరుకుంటాం. –షేక్ షకుస్థా భాను, కదిరి నరకయాతన అనుభవించా.. రెండు రోజుల క్రితం బుడాపెస్ట్ చేరుకున్నా. ఎంబసీ అధికారులు సౌకర్యాలు కల్పించారు. జాబితా ఆధారంగా ఇండియాకు పంపుతున్నారు. శుక్రవారం సాయంత్రంలోపు చేరే అవకాశం ఉంది. రెండు రోజుల నుంచి నరకయాతన అనుభవించా. హోటల్‌కు వచ్చిన తరువాత మనశ్శాంతి కలిగింది. – జి.శ్రావణి, గుమ్మఘట్ట బాంబుల మోతతో దద్దరిల్లుతోంది మేమున్న ప్రాంతం రోజూ పదుల సంఖ్యలో హెలికాప్టర్లు, విమానాల బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మేం మా కాలేజ్ కన్సల్టెంట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో హంగేరి బార్డర్‌కు వచ్చాం. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి, భోజనం లభిస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియార్టీ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్లలో పంపుతున్నారు. త్వరలోనే ఇంటికి వస్తాను. – అముక్తమాల్యద, కళ్యాణదుర్గం ఆహారానికి ఇబ్బంది పడుతున్నాం ఉక్రెయిన్ దేశంలోని చెర్నోవిట్సిలో బ్యూకో వెనియన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నా. అష్టకష్టాలు పడి 3 రోజుల క్రితమే రుమేనియా సరిహద్దుకు చేరుకున్నా. ఇక్కడ ఒక భవనంలో నాతో పాటు మరికొందరిని ఉంచారు. ఆహారం, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. రోజూ అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడుతున్నా. – పవన్‌కల్యాణ్, మడకశిర ఒక్కో రూంలో 12 మంది బస ఉక్రెయిన్ యూనివర్సిటీ నుంచి బుధవారం సాయంత్రం బుడాపెస్ట్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకున్నాం. షిప్టుల వారీగా టోకెన్లు అందజేస్తున్నారు. ఇంకా ఎప్పుడు పంపుతారో తెలియదు. ఒక్కో రూంలో 12 మంది బస చేస్తున్నాం. గురువారం మధ్యాహ్నం వరకూ ఆహారం ఇవ్వలేదు. ఆకలితో ఉన్నా.. క్షేమంగా ఉండడం సంతోషాన్నిస్తోంది. ఈ విషయాన్నే తల్లిదండ్రులకు తెలిపా. – అజిత్ రెడ్డి, ఉక్రెయిన్ వర్సిటీ విద్యార్థి, రాయదుర్గం ప్రస్తుతానికి సేఫ్ జోన్లోనే ఉక్రెయిన్ యూనివర్సిటీలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతం సేఫ్ జోన్ లోనే ఉన్నా. హంగేరి దేశంలోని బుడాపెస్ట్ ఎయిర్ పోర్టుకు 20 కి.మీ. దూరంలో ఉన్నా. బసతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. విడతల వారీగా ఇండియాకు పంపుతున్నారు. మరో రెండు రోజుల్లో మన దేశం చేరుకుంటామని భావిస్తున్నా. – సాయి గణేష్, రాయదుర్గం ఎప్పుడెళ్లేది క్లారిటీ లేదు ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక రైలులో హంగేరిలోని బుడాపెస్ట్‌కు చేరుకున్నా. ఇక్కడ ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన ఆఫీస్‌లో ఉన్నా. సమయానికి భోజనాలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియాకు ఎప్పుడు తీసుకెళ్లేది అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. – తిప్పేష్, మెడిసిన్ విద్యార్థి, కణేకల్లు రెండు రోజుల్లో గుంతకల్లుకు.. 2019లో ఉక్రెయిన్‌లోని జాంబ్రేజాయా యూనివర్సీటీలో మెడిసిన్ అడ్మిషన్ పొందా. గతేడాది ఆగస్టులో ఉక్రెయిన్ వెళ్లా. యుద్ధ వాతావరణంలో ఉండలేక జాంబ్రేజాయా నుంచి బస్సు, రైలు ప్రయాణం, నడక మార్గం ద్వారా మంగళవారం రాత్రికి హంగేరికి చేరా. రెండు రోజుల్లో గుంతకల్లుకు చేరుకుంటా. – వి. సాయినాథ్, గుంతకల్లు -
పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని వెళ్లగొట్టాడు..
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త.. ఆడపిల్లలు పుట్టారని వెలేశాడంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. స్పందించిన మానవతావాదులు ఆమెను కాపాడి జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి వద్దకు పిలుచుకెళ్లారు. బాధితురాలి వేదన ఆమె మాటల్లోనే.. ‘నా పేరు మమత. బుక్కపట్నం మండలం కొడపగానిపల్లి. బుక్కపట్నంలో వీఆర్వోగా పనిచేస్తున్న రామ్మోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మాది ప్రేమ వివాహం. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నా భర్త నా నుంచి దూరమయ్యాడు. బుక్కపట్నంలో తాను పనిచేస్తున్న సచివాలయంలోనే వివాహిత అయిన ఓ ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిలదీయడంతో నాపై పలుమార్లు దాడికి ప్రయత్నించాడు. అతని వేధింపులు తాళలేక 2021, డిసెంబరులో నిర్వహించిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశా. దిశా పోలీసు స్టేషన్‌కు నా భర్తను పిలిపించి మందలించి పంపారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా ఇంటి ముఖం కూడా చూడడం లేదు. నా తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి.. నన్ను, పిల్లలను పోషించలేక పోతున్నారు. సమస్యను కలెక్టర్‌కు విన్నవించి, నా సంసారాన్ని చక్కబెట్టాలని కోరేందుకు వచ్చా. అయితే నా కష్టం తీరుతుందని అనుకోలేదు. దీంతో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువులో పిల్లలను తోసి నేనూ దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. నా ప్రయత్నాన్ని అక్కడున్న వారు అడ్డుకుని జాయింట్ కలెక్టర్ సిరి మేడమ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి కదిరి ఆర్డీఓకు ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు’ అంటూ వివరించారు. బాధితురాలు మమత -
రాజీ పేరుతో కొట్టుకుంటూ లాక్కెళ్లి ప్రాణం తీశారు!
అనంతపురం క్రైం: ‘మాకు ఆరుగురు పిల్లలు. అందులో నలుగురూ ఆడపిల్లలే సార్. నా భర్త సంపాదనతోనే మా కుటుంబం నడుస్తోంది. రాజీ అయ్యామని చెప్పి.. రాత్రికి రాత్రి గుంపుగా ఇంటిపై పడ్డారు. ఇంట్లో ఉన్న నా భర్త ప్రసాద్, అతని తమ్ముడు లోకేష్, నా తమ్ముడు బాబును కొట్టుకుంటూ బయటకు లాక్కెళ్లారు. చివరకు నా భర్త ప్రాణాలు తీసేశారు సార్’ అంటూ హతుడు ప్రసాద్ భార్య లక్ష్మి బోరున విలపించింది. సోమవారం ఉదయం అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తమ కుటుంబసభ్యులందరూ నగరంలోని గౌరీ థియేటర్ వెనుక ఉన్న కొట్టాల్లో నివాసముంటున్నట్లు తెలిపారు. ఈ నెల 6న తన మరిది లోకేష్ కుమారుడి తలనీలాలు సమర్పించేందుకు గుత్తి సమీపంలోని బాట్లో సుంకులమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. నీరుగంటి వీధి వద్దకు చేరుకోగానే పాముల కొట్టాలకు చెందిన కొందరు రాంగ్ రూట్లో ద్విచక్రవాహనంపై వస్తూ తమ వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలిపారు. ఆ సమయంలో కాస్త నిదానంగా వెళ్లాలని తన భర్త, మరిది చెప్పారన్నారు. దీంతో వారు కేకలు వేస్తూ లోకేష్‌పై చెయ్యి చేసుకోవడంతో గొడవ మొదలైందన్నారు. ఆ తర్వాత పాముల కొట్టాలకు చెందిన తిరుపతయ్య, తదితరులు కల్పించుకుని రాజీ అవుతున్నట్లుగా చెప్పి.. రాత్రికి రాత్రి ఉన్నఫళంగా పెద్ద గుంపుగా వచ్చి ఇంట్లోకి చొరబడ్డారన్నారు. భర్త ప్రసాద్, మరిది లోకేష్, తమ్ముడు బాబును కొట్టుకుంటూ ఇంటి నుంచి బయటకు లాగారన్నారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసినా వదల్లేదని, వెంటబడి కొట్టుకుంటూ తరిమారన్నారు. వేణుగోపాల్ నగర్ వద్ద ప్రసాద్ కిందపడిపోగా ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి తిరుపతయ్య, చిన్న తిరుపతయ్య, నరేంద్ర, మహేష్ తదితరులను కలుపుకుని 17 మందిపై హత్య కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. -
హైబ్రీడ్ సైకిల్.. కేవలం ఆరు రూపాయలతో!
అనంతపురం: మేథో శక్తి ఒకరి సొత్తు కాదని నిరూపించాడు అనంతపురానికి చెందిన యువకుడు. సాధించాలనే తపన.. నూతన ఆవిష్కరణల పట్ల ఉన్న జిజ్ఞాస అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగని ఉత్పత్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతనే.. అనంతపురం నగర శివారులోని చంద్రబాబు కొట్టాలకు చెందిన బాబా ఫకృద్దీన్. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక 9వ తరగతితో చదువు మానేసి.. వాహనాల మరమ్మతుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన బాబా ఫకృద్దీన్.. తాను చేస్తున్న ప్రతి పనీ వినూత్నంగా ఉండాలని భావించేవారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు తొలిసారిగా రివర్స్ గేర్‌తో నడిచే త్రిచక్ర వాహనాన్ని రూపొందించి అందరి ప్రశంసలూ అందుకున్నారు. అంతటితో ఆగకుండా యువతను ఉర్రూతలూగించేలా హైబ్రీడ్ సైకిల్‌కు రూపకల్పన చేశారు. హల్క్ బైసైకిల్.. రూ.56 వేల ఖర్చుతో బాబా ఫకృద్దీన్ రూపొందించిన హైబ్రీడ్ సైకిల్ నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సైకిల్‌కు ఏర్పాటు చేసిన 72 ఓల్టుల బ్యాటరీని రెండు నుంచి మూడు గంటల పాటు చార్జింగ్ పెట్టడం ద్వారా 3 నుంచి 4 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. ఈ లెక్కన రూ.6తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రూ.18,600తో కొనుగోలు చేసిన సైకిల్‌కు రూ.29 వేలు విలువైన 72 ఓల్టుల బ్యాటరీని అమర్చారు. ఎల్ఈడీ సెన్సార్, సౌండ్ హారన్, చార్జింగ్ రీడింగ్, బ్యాటరీ బ్యాక్‌ఆప్ డిస్ప్లేతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 40 కిలోల బరువున్న ఈ సైకిల్‌పై 120 కిలోల బరువున్న వ్యక్తి సైతం 50 కిలోమీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లవచ్చు. సైకిల్‌కున్న భారీ టైర్ల (26X4) వల్ల కొండ గుట్టలను సునాయాసంగా ఎక్కి దిగవచ్చు. మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుంది నా ప్రతి ఆవిష్కరణ వెనుక ఒకరి వ్యధభరితమైన జీవితం ఉంది. వారి కోసం ఏదో చేయాలనే తపనే నూతన ఆవిష్కరణలకు కారణమవుతోంది. త్రిచక్ర వాహనాన్ని పార్కింగ్ ప్లేస్‌లో వెనక్కు తీసుకునేందుకు దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు గమనించి రివర్స్ గేర్ సదుపాయం ఉన్న వాహనాన్ని రూపొందించాను. ప్రస్తుతం నేను తయారు చేసిన సైకిల్‌ను చూసిన చాలా మంది ముచ్చటపడి హల్క్ బైక్ అని పేరు పెట్టారు. తగిన ప్రోత్సాహమిస్తే మరిన్ని ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఉంది. – బాబా ఫకృద్దీన్, అనంతపురం -
అనంతపురం జిల్లా వాసికి అంతర్జాతీయ అవార్డు
ధర్మవరం రూరల్(అనంతపురం జిల్లా): నిమ్మలకుంటకు చెందిన దళవాయి కుళ్లాయప్పకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. తోలుతో అతను చేసిన హనుమంతుడి చిత్రాన్ని పరిశీలించిన అనంతరం అవార్డుకు ఇంటర్నేషనల్ క్రాప్ట్ సంస్థ జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రాప్ట్ సంస్థ తెలియజేసింది. త్వరలో ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా క్రాప్ట్ వీక్ కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
సైకిల్ పైనే ఆఫీసుకు అనంతపురం డిప్యూటీ మేయర్
-
ఇద్దరు భార్యల్ని పోషించలేక ఒకరు.. ప్రేయసి మాట్లాడలేదని మరొకరు
అనంతపురం: రెండు కుటుంబాల పోషణ భారమై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయ కాలనీకి చెందిన సాకే నాగేంద్ర (42) క్రిటి డ్రిప్ కంపెనీలో జిల్లా కో–ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య జ్ఞానేశ్వరి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. మూడేళ్ల క్రితం బదిలీపై చిత్తూరుకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన దుర్గాభవానీతో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. తిరిగి అనంతపురానికి వచ్చినప్పుడు ఆమెను పిలుచుకువచ్చి హౌసింగ్ బోర్డులోని ఎంఐజీ బస్టాఫ్ వద్ద ఉన్న ఓ ఇంటిలో ఉంచాడు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల పోషణ భారమైంది. ఆదివారం ఉదయం దుర్గాభవానీ బెడ్రూంలోకి వెళ్లిన నాగేంద్ర ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో వెనుక వీధిలో నివాసముంటున్న అతని స్నేహితుడికి విషయం తెలిపింది. అతని ద్వారా సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్ఐ జయరాం నాయక్, సిబ్బంది అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని నాగేంద్ర మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలు మాట్లాడలేదని మరో యువకుడు... ప్రియురాలు మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఒడిశాలోని కసోటి గ్రామానికి చెందిన బికాస్ మాలిక్ (19)గా అనంతపురం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. నగరంలోని ఎంపోరియంలో వంట మనిషిగా పనిచేసే అతను కొన్ని రోజులుగా ప్రియురాలు మాట్లాడక పోవడంతో గత డిసెంబర్ 30న విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మిత్రులు గమనించి ఆస్పత్రిలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను మృతి చెందాడు. -
నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా...
పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. జై జగన్..జైజై జగన్ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: 82 శాతం లబ్ధిదారులకు పింఛన్ AP: టీనేజ్‌కు టీకా -
ఉన్నఫళంగా కోమాలోకి.. వైఎస్సార్సీపీ యువనాయకుడు మృతి
అగళి(అనంతపురం): మండలంలోని హుల్లేకెర గ్రామానికి చెందిన మాజీ సర్పంచు దేవన్న తనయుడు, వైఎస్సార్సీపీ యువనాయకుడు డీ శ్రీనివాస్ (38) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆదివారం ఉన్నఫళంగా కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే శిర ప్రభుత్వసుపత్రికి తీసుకెళ్లారు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పార్టీలో చురుకుగా పనిచేసేవాడని స్థానిక ప్రజాప్రతినిధులు అన్నారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ధర్మవరం(అనంతపురం): పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చాణుక్య (31) ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన పులిచెర్ల శ్రీనివాసులు, నాగలక్ష్మి దంపతుల కుమారుడు చాణుక్య(31) కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన వ్యక్తిగత పనిపై వెళ్లి ద్విచక్రవాహనంలో రోడ్డుపైకి వస్తుండగా కొత్తచెరువు వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఏడాది కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివేకా హత్యపై తప్పుడు వాంగ్మూలం ఇమ్మంటున్నారు
అనంతపురం క్రైం: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు వాంగ్మూలమివ్వాలని సీబీఐ అధికారులు, మరికొందరు ఒత్తిడి తెస్తున్నట్లు కల్లూరు గంగాధరరెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకాను హత్య చేయాలని ఆ కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను కోరారని, ఇందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారని, ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని వాంగ్మూలమివ్వాలంటూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్, అప్పటి సిట్ సీఐ శ్రీరామ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత తీవ్ర ఒత్తిడి తెచ్చారని తెలిపాడు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గంగాధరరెడ్డి సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. చదవండి: హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలది కీలకపాత్ర: జర్నలిస్ట్ భరత్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. నాది కడప జిల్లా పులివెందుల. 12 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నా. పులివెందులలో డబుల్ మర్డర్ కేసులో ముద్దాయిని. వివేకానందరెడ్డిని హత్య చేయాలని నన్ను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంప్రదించినట్లు చెప్పాలని అప్పట్లో సిట్ బృందంలో సీఐగా (ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర సీఐ) ఉన్న శ్రీరామ్ నాపై ఒత్తిడి తెచ్చారు. కడప డీటీసీలో చిత్ర హింసలు పెట్టారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈ ఏడాది అక్టోబర్ 2, 3 తేదీల్లో సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్టు చెప్పాలన్నారు. అక్టోబర్ 4న సీబీఐ అధికారులు యాడికిలోని మా ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లి హత్య చేసి, దొంగతనం చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి పారిపోవాలని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లు చెప్పాలన్నారు. ఎవరైనా పట్టుకుంటే దొంగతనానికి వెళ్లానని, బీరువా శబ్దం విని వివేకానందరెడ్డి వచ్చినట్లు, ఏమి చేయాలో పాలుపోక హత్య చేశానని చెప్పమన్నారు. ఇందుకు శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలమివ్వాలని రామ్‌సింగ్ ఒత్తిడి చేశారు. చదవండి: సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు! కడప రింగ్ రోడ్డులో వైఎస్ సునీతను కలిశా ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఆరోగ్యం సరిగా లేక, అబద్ధాలు చెప్పేందుకు మనస్కరించక వెళ్లలేదు. తర్వాత కడప జిల్లా పెద్దకుడాలకు చెందిన బాబురెడ్డి యాడికికి వచ్చి నన్ను కలిశాడు. వైఎస్ సునీత నన్ను విచారణకు హాజరై సీబీఐ వాళ్లు కోరినట్లుగా వివేకాను శివ శంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారని చెప్పమన్నారని చెప్పాడు. ఇలా చెబితే రూ.10 లక్షలు ఇచ్చి, నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామని చెప్పారు. బాబురెడ్డి ముందస్తుగా రూ.15 వేలు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమన్నాడు. నేను భయపడి ఈ నెల 25న కారు బాడుగకు తీసుకుని పులివెందులకు వెళ్లా. అక్కడ రింగ్ రోడ్డు వద్ద కారులో వేచి ఉన్న సునీతను కలిశా. సీబీఐ అధికారులు చెప్పమన్నట్లు సీబీఐ కోర్టు ముందు చెప్పమన్నారు. కడప సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ సీబీఐ వాళ్లు నన్ను కడప ఆర్ అండ్ బీ అతిథి గృహానికి తీసుకెళ్లారు. పైన చెప్పిన విధంగా వాంగ్మూలం తయారు చేసి నాకు చదివి విన్పించి, సంతకం చేయమన్నారు. చేయని తప్పుకు సంతకం చేయబోనని సీబీఐ వారితో గొడవపడ్డా. ఈ నెల 30న కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డు చేయాలని, అప్పుడు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు రెండు పేపర్లలో సమాధానాలు రాశిచ్చారు. దాన్ని తీసుకుని యాడికికి వచ్చేశా. అప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వారు చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ హింసిస్తున్నారు. నా ఇంటి చుట్టుపక్కల కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ప్రాణ రక్షణ కల్పించాలి’ అని గంగాధర్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీతో విచారణ చేయిస్తున్నాం : ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప గుర్తు తెలియని వ్యక్తులు, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కల్లూరు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో చేయని నేరానికి వాంగ్మూలం ఇవ్వాలని 2019లో అప్పటి సిట్ బృందంలోని సీఐ శ్రీరామ్, ఇటీవల సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. సీబీఐ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వాట్సాప్ కాల్స్ స్క్రీన్‌షాట్‌ను జత చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణకు తాడిపత్రి డీఎస్పీ చైతన్యను నియమించాం. గంగాధర్‌రెడ్డిని వాచ్ చేయాలని పామిడి సీఐ, ఇతరులను ఆదేశించాం. -
ఉమ్మబోతే.. ఊపిరి పోయింది!
ఎన్పీకుంట:(అనంతపురం) ఉమ్మబోయిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్పీకుంట మండలం ఎదురుదొన పంచాయతీ దాసరివాండ్లపల్లికి చెందిన డేరంగుల శివమ్మ (50) శనివారం ఉదయం రెక్కమానుకు బయలుదేరింది. పల్లెనాయినివారిపల్లి వద్ద ఆటో ఎక్కిన ఆమె గూటిబైలు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోకి చేరుకోగానే ఉమ్మడానికి తల బయటపెట్టింది. ఆదే సమయంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం సైడ్ మిర్రర్ తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఘటనపై ఎన్పీకుంట ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. -
పెళ్లి ఆగిపోయే పరిస్థితి.. ‘ఖాకీ’ సాయంతో
అనంతపురం : భారీ వర్షాలతో జిల్లాలో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఆదివారం హిందూపురంలో జరగాల్సిన ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా...వారు ఊరు దాటించి పెద్దసాయం చేశారు. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నంకు చెందిన గోపి కుమార్తె వైష్ణవికి హిందూపురంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 21వ తేదీన హిందూపురంలోనే వివాహం చేసేందుకు నిర్ణయించారు. బంధువులందరికీ పత్రికలు పంచారు. కల్యాణ వేదిక, అలంకరణ, విందుకోసం అడ్వాన్స్కూడా ఇచ్చేశారు. అయితే భారీ వర్షాలతో పుట్టపర్తి, కొత్తచెరువు మార్గాల్లో వరదనీరు ప్రవహిస్తుండగా...బుక్కపట్నం నుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గోపి స్థానిక ఎస్ఐ నరసింహుడిని సంప్రదించి తన సమస్య వివరించారు. దీంతో ఎస్ఐ గోపి స్పందించి మత్స్యకారుల తెప్పలను తెప్పించి పెళ్లివారిని అందులో ఎక్కించుకుని 3 కి.మీ. మేర బుక్కపట్నం చెరువు మార్గంలో కొత్తచెరువు ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. దీంతో వధువు తండ్రి గోపి ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బుక్కపట్నానికే చెందిన రూపా వివాహం సైతం ఆదివారమే మరో ప్రాంతంలో జరగాల్సి ఉండటంతో ఆమెను, కుటుంబీకులను కొత్తచెరువు వరకూ తెప్పలో తరలించారు. -
అనంతపురం: ఒక్క ఫోన్ కాల్.. నలుగురి ప్రాణాలు కాపాడింది
అనంతపురం: ఒక్క ఫోన్ కాల్ అధికారులను అప్రమత్తం చేసింది. నలుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం తెల్లవారుజామున కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలి..శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండిళ్లపై పడటంతో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైదున్నీసా(2), ఫారున్నీసా(8 నెలలు), యాషికా(3)తో పాటు మరో ముగ్గురు మహిళలు ఫైరోజా(65), భాను(30), ఫాతిమాబీ(65) ఉన్నారు. అయితే..ఇదే ఘటన నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఫోన్‌కాల్ వల్ల వారి ప్రాణాలు నిలిచాయి. 8 గంటలు శిథిలాల కిందే ఉన్నా.. కదిరి మండలం చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్ నాయక్ శుక్రవారం రాత్రి వరద ఉధృతి కారణంగా స్వగ్రామానికి వెళ్లలేకపోయాడు. కదిరిలో తనకు తెలిసిన చైర్మన్ వీధిలో నివాసముంటున్న క్యాటరింగ్ వంట మాస్టర్ రాజు ఇంట్లో ఉండిపోయాడు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. తాము ఉంటున్న ఇల్లు కూలిపోయిందని గ్రహించాడు. వెంటనే తనతో పాటు నిద్రిస్తున్న రాజు, మీటేనాయక్ తండాకు చెందిన ఐటీఐ విద్యార్థి గౌతమ్‌నాయక్, రామదాస్ తండాకు చెందిన ఉదయ్ నాయక్‌లను అప్రమత్తం చేసి.. గోడ వైపు సురక్షిత ప్రదేశానికి మెల్లిగా జరిగారు. వెంటనే తరుణ్ తన మొబైల్ నుంచి డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డీఎస్పీ భవ్య కిశోర్, ఆర్డీఓ వెంకటరెడ్డి, సీఐలు మధు, సత్యబాబు, ఫైర్, 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. తరుణ్‌తో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ... అందుకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించి ఎనిమిది గంటల తర్వాత నలుగురినీ బయటకు తీశారు. కాకపోతే వీరు ఉంటున్న ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో వీరందరికీ గాయాలయ్యాయి. కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంట మాస్టర్ రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ముగ్గురు మహిళలు... ముగ్గురు చిన్నారుల దుర్మరణం నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో నిద్రిస్తున్న ఫైరోజా(65) శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందారు. ఈ భవనం శిథిలాలు పడటంతో పక్కింటి పైఅంతస్తులో ఉంటున్న జర్నలిస్టు సోమశేఖర్ భార్య భాను(30), వీరి మూడేళ్ల కూతురు యాషికా, అత్త ఫాతిమాబీ(65) నిద్రలోనే కన్నుమూశారు. ఆ పక్కింటిలో ఉంటున్న హబీబుల్లా, కలీమున్నీసా, కరీముల్లా, హబీబున్నీసా, హిదయతుల్లా భవనం కూలిన శబ్దానికి నిద్రలేచి బయటకు పరుగులు తీశారు. అయితే కరీముల్లా దంపతుల ఎనిమిది నెలల చిన్నారి ఫారున్నీసాతో పాటు రెండేళ్ల చిన్నారి సైదున్నీసాలను మాత్రం కాపాడుకోలేకపోయారు. వారు శిథిలాల కిందే మృత్యు ఒడికి చేరారు. భార్యతో పాటు అత్త, కుమార్తెను కోల్పోయిన పాత్రికేయుడు సోము, తమ ఇద్దరు బిడ్డలను కాపాడుకోలేక పోయిన కరీముల్లా దంపతులు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యేతో సహా అందరికీ హ్యాట్సాఫ్ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాలుపంచుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, 108, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యే శనివారం ఉదయం 8 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం కదిరికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
నదిలో జేసీబీపై చిక్కుకున్న 10 మంది.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
సాక్షి, అనంతపురం: వర్ష బీభత్సంతో అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది. అందులోని నలుగురు వ్యక్తులను రక్షించేందుకు మరో ఆరుగురు వెళ్లారు. మొత్తం 10 మంది జేసీబీ లోనే ఉండిపోయారు. తాళ్ల సాయంతో.. విద్యుత్ తీగల సాయంతో రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కలిసి జిల్లాలోని పరిస్థితిని వివరించారు. తక్షణమే వరద బాధితుల కోసం విశాఖ, బెంగళూరు నుంచి రెండు హెలికాప్టర్లు పంపేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిందని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా బయటకు తెచ్చారని తెలిపారు. ఇదిలాఉండగా.. కర్ణాటక సరిహద్దులోని మేల్యా చెరువుకు గండి పడింది. హిందూపురంలోని కొటిపి, పూలమతి, శ్రీకంఠపురం చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. -
బంగారు నగల వ్యాపారి కేసు: మెతక వైఖరే కారణమా?
కదిరి: దోపిడీలు, దొంగతనాలు, గుట్కా, మట్కా, లాటరీ టికెట్ల అమ్మకాలకు తోడు వరుస హత్యలతో కదిరి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కదిరి ఎంజీ రోడ్డులో బంగారు నగల తయారీదారు కిరణ్‌ని హతమార్చారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా నిందితులెవరో అంతు చిక్కడం లేదు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఎన్జీఓ కాలనీలో టీచర్ శంకర్‌రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు చొరబడి, ఆయన భార్య టీచర్ ఉషారాణిని హతమార్చి విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు కాపురముంటున్న ఎన్జీఓ కాలనీలోనే ఈ ఘటన జరిగితే.. ఇక మిగిలిన వీధుల పరిస్థితేంటని జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆయా కేసుల్లో నిందితులను వెంటనే గుర్తించి, శిక్షించి ఉంటే ఈ తరహా ఘటనలకు తావుండేది కాదని అంటున్నారు. కేసుల దర్యాప్తులో పోలీసుల మెతక వైఖరే ఇందుకు కారణంగా విమర్శలు వెల్లువెత్తాయి. భవంతులు సరే.. సీసీ కెమెరాలేవీ? ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నట్లైతే కదిరి ఎన్జీఓ కాలనీలోని రెండిళ్లలో చోరీతో పాటు టీచర్ ఉషారాణి హత్య జరిగేది కాదని పోలీసులు చెబుతున్నారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుతో పెద్ద భవంతులు నిర్మించుకుని వాటి ముందు రూ.వేలు విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడాన్ని ఈ సందర్భంగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత బాధాపడేదానికన్నా.. ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రతి మహిళా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటింటికీ తిరిగి చెబుతున్నా కొందరు మాత్రమే స్పందిస్తున్నారని, మిగిలిన వారు పట్టించుకోవడం లేదని పోలీసులు అంటున్నారు. దర్యాప్తు ముమ్మరం దోపిడీ, మహిళా టీచర్ హత్య (మనీ ఫర్ గెయిన్) కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో నలుగురు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని లాడ్జీలు, రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, హోటళ్లు, పెట్రోలు బంకుల్లో ఆరా తీస్తున్నారు. కదిరి ప్రాంతాన్ని డీఎస్పీ భవ్యకిషోర్ నేతృత్వంలో పోలీసు బృందాలు జల్లెడ పట్టాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్న వారి వేలిముద్రలు సేకరించి, హత్య జరిగిన ప్రాంతంలోని వేలి ముద్రలతో పోల్చి చూస్తున్నారు. కదిరికి చేరుకునే అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు ప్రత్యేక బృందాలు అనంతపురం క్రైం: కదిరి ఘటనను జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో బుధవారం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. సీసీఎస్ డీఎస్పీ మహబూబ్‌బాషా, హిందూపురం సీఐ హమీద్‌ఖాన్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఈ బృందాల్లో ఉన్నారు. సాధ్యమైనంత తొందరగా కేసును ఛేదించాలనే ధృడనిశ్చయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ‘మనీ ఫర్ గెయిన్’ పాత కేసుల్లో నిందితులుగా ఉన్న 37 మంది కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే అనంతపురం, పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, పుట్టపర్తి, ధర్మవరం సబ్డివిజన్ల పరిధిలో ఆయా డీఎస్పీల పర్యవేక్షణలో దొంగతనాల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శివారు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులు కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. -
తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు.. మహిళ ప్రాణం తీసి!
పావగడ: దొంగతనానికి వెళ్లిన దుండగులు తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని పావగడ తాలూకా మురారాయనహళ్లికి చెందిన గంగమ్మ (55) సోమవారం రాత్రి తన ఇంటికి తాళం వేయకుండా చుట్టుపక్కల మహిళలతో కలిసి ఇంటి బయట అరుగు మీద బారాకట్ట ఆడుతూ ఉంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత తన ఇంటిలోకి వెళ్లిన ఆమె అప్పటికే లోపలకు చొరబడి దొంగతనానికి ప్రయత్నిస్తున్న దుండగులను చూసి భయంతో కేకలు వేసింది. ఆ సమయంలో ఛార్జింగ్ వైర్‌ని ఆమె గొంతుకు బిగించారు దుండగులు. వారితో పెనుగులాడి తప్పించుకున్న ఆమె కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగున వచ్చింది. అదే సమయంలో ఆమెను అనుసరిస్తూ వచ్చిన దుండగులు బండరాయితో ఆమె ముఖంపై కొట్టి హతమార్చారు. గంగమ్మ కేకలు విని పొరుగున ఉన్న యువకుడు బయటకు రావడం గమనించి నలుగురు దుండగులు అక్కడి నుంచి చీకట్లోకి పారిపోయారు. సమాచారం అందుకున్న పావగడ సీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దుండగుల ఆచూకీ కోసం స్నిప్పర్ డాగ్‌ను రంగంలోకి దించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త చనిపోయిన తర్వాత గంగమ్మ ఒంటరిగా జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహమై స్థానికంగానే మరో ప్రాంతంలో నివాసముంటున్నారు. -
కదిరి: గవర్నమెంట్ టీచర్ హత్య.. పార్థీ గ్యాంగ్ పనేనా?
అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్‌ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి. కదిరి సమీపంలోని టోల్గేట్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్‌కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. లాడ్జీల్లో తనిఖీలు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు. శోకసంద్రంలో చీకిరేవులపల్లి అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్‌రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ హైసూ్కల్లో బయోలాజికల్ సైన్స్ టీచర్ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్‌రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నారు. ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
చంపుతానని బెదిరింపులు..పరిటాల శ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు
చిలమత్తూరు: పరిటాల శ్రీరామ్ ఒక ఆకతాయి... ఫ్యాక్షన్ రాజకీయాలకు ఊతమిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) విమర్శించారు. ఆదివారం సాయంత్రం తన కాలర్ పట్టుకుని చంపుతానంటూ శ్రీరామ్ బెదిరించడంపై రామగిరి మండల వైఎస్సార్సీపీ నేత నసనకోట ముత్యాలు సోమవారం చిలమత్తూరు పోలీస్‌స్టేషన్‌లో చందుతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చందు మాట్లాడారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు బెదిరింపు ధోరణులకు పాల్పడుతుండడం సిగ్గుచేటన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలు.. వైఎస్సార్సీపీ తరఫున తిరుగుతుండడం జీర్ణించుకోలేక గతంలో దాడులు చేయించిన నీచ సంస్కృతి శ్రీరామ్‌దని గుర్తు చేశారు. తన ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని పాపాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు అడిగే ధైర్యం లేక ఇలాంటి రౌడీ మూకల్ని రంగంలో దించి, ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.100 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన అల్లరి మూక శ్రీరామ్‌ను ప్రశాంతంగా జీవిస్తున్న చిలమత్తూరు మండల ప్రజలపైకి తోలి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అరాచకాలు భరించలేక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 26వేల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీని గెలిపించుకున్నారన్నారు. అంతటితో ఆగకుండా స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేసేలా ఓటర్లు తీర్పునిచ్చారన్నారు. సొంత మండలం రామగిరిలో 9 పంచాయతీలకు గాను కేవలం రెండింటిని మాత్రమే పరిటాల కుటుంబీకులు నిలబెట్టుకున్నారంటే వారిపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిలమత్తూరు మండల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్, నాయకులు రామకృష్ణారెడ్డి, అమరనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, సోమశేఖర్, న్యాయవాది ఇందాద్ తదితరులు పాల్గొన్నారు. -
బంధుత్వం బరువైన వేళ..
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఓ మహిళ మృతదేహానికి ఇండియన్ ముస్లిం మైనార్టీ (ఐఎంఎం) ఆర్గనైజేషన్ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేసి, మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. మడకశిర ప్రాంతానికి చెందిన శాంతమ్మ (53) అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ విషయాన్ని 15 ఏళ్ల కుమారుడు, దివ్యాంగురాలైన కూతురు బంధువులకు తెలిపారు. అయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికుల సూచన మేరకు నగరంలోని ఐఎంఎం ఆర్గనైజేషన్ సభ్యులను కుమారుడు సంప్రదించాడు. ఐఎంఎం ఆర్గనైజేషన్ సభ్యులు మహాప్రస్థానం వాహనంలో మృతదేహాన్ని హిందూ శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు చేపట్టారు. మృతురాలి భర్త కూడా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా, సభ్యులు మహమ్మద్, ఇస్మాయిల్, దాదాబాషా, నూర్, బాషా పాల్గొన్నారు. -
లోకేష్‌ను తాకిన సొంత పార్టీ సెగ
TDP Student Leaders Protest Against Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సొంత పార్టీ సెగ తాకింది. బుధవారం అనంతపురంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం నేరుగా ఆయన ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడి వెనుదిరుగుతుండగా ఆయనను కలిసేందుకు ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ప్రయత్నించారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీని రద్దు చేయాలని కోరేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంత మాత్రం పట్టించుకోకుండా లోకేష్ కారు ఎక్కడంతో అసహనానికి గురైన దళితులు ఆ వాహనం ముందుకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తూ కారును ముందుకు పోనివ్వాలంటూ డ్రైవర్‌కు హుకుం జారీ చేశారు. అదే సమయంలో పార్టీ నేతలు కొందరు జోక్యం చేసుకుని కారుకు అడ్డుగా నిల్చొన్న దళితులను పక్కకు లాగేయడంతో లోకేష్ వాహనం శరవేగంగా అక్కడి నుంచి దూసుకెళ్లింది. దళితులను అవమానిస్తారా? సమస్య వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన లోకేష్ తీరుపై ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు సాకే హరి మీడియాతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో దళితులను అవమానపరుస్తూ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసి నియోజకవర్గంలో టీడీపీని మటుమాయం చేస్తామని హెచ్చరించారు. టీడీపీలోని అగ్రకులాలకు చెందిన కొందరు నేతలు రాజకీయంగా దళితులు, గిరిజనులు ఎదగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దళితులతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదంటే పార్టీలో ఎస్సీ, ఎస్టీల స్థానమేమిటో అర్థమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఏసీ నేతలు శింగంపల్లి కేశవ, ముకుందాపురం నరసింహులు, జైభీమ్‌సేన ఏపీ అధ్యక్షుడు ఆకులేడు ఓబులేసు ఉన్నారు. -
అత్యాచార వీడియో ఒకరి నుంచి ఒకరికి.. ఐదుగురికి యావజ్జీవం
అనంతపురం లీగల్/ పెద్దవడుగూరు: వివాహితపై అత్యాచారం కేసులో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ అనే యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై 2014 జూన్ రెండో తేదీన ముప్పాలగుత్తి వైపు వస్తున్నారు. అదే సమయంలో కదరగుట్టపల్లికి చెందిన మహిళ పశువులకు గడ్డి కోసం పొలంలోకి వెళ్తుండగా అటకాయించారు. ఆమెను సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. జరిగిన ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను బయట పెడతామని బెదిరించి.. అక్కడి నుంచి ఉడాయించారు. వీడియో వైరల్‌తో వెలుగులోకి.. అత్యాచార వీడియోను ఆ యువకులు నల్లబోతుల శివకృష్ణ మూర్తి, బోయ రామాంజనేయులుకు పంపారు. అలా ఒకరి నుంచి ఒకరికి వీడియో వెళ్లి.. విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 07–06–2014న ఐదుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు మేజిస్ట్రేట్ ఆదేశించారు. 14–07–2014న మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్తుండగా చూసిన సాక్షులు, బాధితురాలు ఏడుస్తూ తిరిగొస్తుండగా చూసిన వారి సాక్ష్యాలతో కేసు బలపడింది. నిందితుల మొబైల్ ఫోన్లలోని వీడియో క్లిప్పింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన చోట ఆధారాలను సేకరించారు. కేసు విచారణలో ఉండగానే నల్లబోతుల శివకృష్ణమూర్తి అలియాస్ రామకృష్ణ, బోయ రామాంజనేయులు అలియాస్ రాంబాబు అనారోగ్యంతో చనిపోయారు. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌లకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధిస్తూ అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.సునీత మంగళవారం తీర్పు చెప్పారు. ముద్దాయిలు చెల్లించే జరిమానా మొత్తం బాధితురాలికి చెందాలని తీర్పులో పేర్కొన్నారు. -
ఎంబీఏ చదివాడు.. పాత నేరస్తుడితో కలిసి చైన్ స్నాచింగ్
హిందూపురం: సులువుగా డబ్బు సంపాదించాలనుకుని చైన్‌స్నాచర్‌గా మారిన ఎంబీఏ పట్టభద్రుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలను సోమవారం హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమ్య వెల్లడించారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన అభిలాష్ ఎంబీఏ పూర్తి చేసి సులువుగా డబ్బు సంపాదించాలనుకుని గుప్త నిధుల కేసులో పాత నేరస్తుడిగా ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన జనత్‌కుమార్‌తో చేతులు కలిపాడు. గుప్తనిధులు వెలికి తీసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేందుకు చైన్‌స్నాచింగ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలోనే హిందూపురంలోని పాండురంగనగర్, టీచర్స్‌కాలనీ, శ్రీనివాసనగర్, పెనుకొండలోని ఆల్విన్ కాలనీ, అనంతపురంలోని రాంనగర్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాము అపహరించిన బంగారు చైన్లను సోమవారం హిందూపురంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా హిందూపురం రూరల్ సీఐ హహీద్‌ఖాన్, ఎస్ఐ శ్రీనివాసులు గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.90 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.15 లక్షలు విలువ చేసే 30.50 తులాల బరువున్న 8 బంగారు మాంగళ్యం చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
కోడలి హత్య కేసులో మామకు రిమాండ్
సాక్షి, గుంతకల్లు: కోడలిని హతమార్చిన కేసులో మామను రిమాండ్‌కు తరలించారు. వివరాలను గుంతకల్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చిన్న గోవిందు, ఎస్ఐ నరేంద్ర వెల్లడించారు. పాత గుంతకల్లులోని చెట్టప్పబావి వీధికి చెందిన జ్యోతి భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఆ సమయంలో అందిన బీమా పరిహారం, ఇతర డబ్బు మొత్తం దాదాపు రూ.10 లక్షల వరకు మామ మల్లికార్జున తన వద్దే ఉంచుకున్నారు. ఈ విషయంగా భర్త వాటా తనకివ్వాలని మల్లికార్జునను జ్యోతి అడుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె పుట్టింటికి చేరుకున్నారు. ఈ నెల 1న ఆమెను ఇంటికి రప్పించుకుని రోకలితో బాది హతమార్చాడు. పరారీలో ఉన్న మల్లికార్జునను సోమవారం ఉదయం దోసలుడికి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు దౌర్జన్యం.. మహిళను పబ్లిగ్గా బూతులు తిడుతూ
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికి.. పచ్చ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు. తాజాగా టీడీపీ నేత ఒకరు మహిళపై బెదిరింపులకు దిగారు. ఆ వివరాలు.. చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మహిళపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వీడియో ఒకటి శనివారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్) అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల సోమశేఖర్ నాయుడును కారుతో గుద్ది చంపేందుకు యత్నించారంటూ ప్రకాశ్ నాయుడి సోదరులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో ప్రకాశ్ నాయుడు బాధితుల ఇంటికెళ్లి బెదిరించాడు. తనపైనే కేసు పెడతారా అంటూ ప్రకాశ్ నాయుడు ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి పబ్లిగ్గా బూతులు తిట్టాడు ప్రకాశ్ నాయుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
Viral: దాహమేసిన కోతికి కొబ్బరి బోండాం దొరికితే!
కోతులు జనావాసాలకు వస్తే.. ఇళ్లలో ఉండే ఆహారపదార్థాలను ఎత్తుకెళ్లి మరీ తింటాయి. నగరంలో అయితే పండ్లు, కూరగాలయలు, కొబ్బరి బోండాం షాప్‌లపై పడుతుంటాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే.. ఆ ఆనందం వేరు! అయితే కొబ్బరి చిప్పకు బదులు కొబ్బరి బోండాలు దొరికాయి. అసలే దాహం, ఆకలిలో మర్కటం ఓ కొబ్బరి బోండాన్ని తానే స్వయం ఒలుచుకుంది. మనుషుల వలే కొబ్బరి పీచును నెమ్మదిగా తీసింది. పచ్చి కొబ్బరి బోండాం కావటంతో ఆకలికి ఆగలేని కోతి.. పీచును కూడా తిన్నది. అయితే ఆ కొబ్బరి బోండాలు తాగి పక్కకు పడేసిన వియషం దాని తెలిక కొబ్బరి కోసం కుస్తీ పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ఓ మార్ట్ వద్ద చోటుచేసుకుంది. దాహం వేసిన మర్కటం కొబ్బరి బోండాంను తానే స్వయంగా ఒలచుకుంది. చివరి నిముషంలో కొబ్బరిబోండాం వ్యాపారి ఆ మర్కటాన్ని తరిమివేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని కదిరి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అక్రమాలపై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రే రూ.21.50 లక్షల చలానా డబ్బును ముగ్గురు ఉద్యోగులు జమ చేశారు. దీంతో ఉన్నతాధికారులు నకిలీ చలానాలపై విచారణ చేపట్టారు. రూ.5 వేల చలానాకు రూ.50 వేలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు మార్చారు. సబ్ రిజిస్టర్ నాసీర్, సీనియర్ అసిస్టెంట్ షామిర్ బాషా, జూనియర్ అసిస్టెంట్ హరీష్ ఆరాధ్యలను అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడింది. -
మార్చురీలో కన్న తండ్రి.. ‘ నాన్న... లే నాన్నా!’ అంటూ..
చుట్టూ ఆందోళనతో తిరుగాడే జనం.. ఏం జరిగింది? అంతు చిక్కడం లేదు. అమ్మమ్మ కళ్లు చెమర్చి ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నారో ఏడేళ్ల బాలుడికి తెలియదు. ‘అమ్మమ్మ.. నిన్నటి నుంచి నాన్నను చూడలేదు. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది...’ ఆ బాలుడి మాటలకు గుండెలకు హత్తుకున్న అమ్మమ్మ మౌన రోదనే సమాధానమైంది. కన్నతండ్రిని చూడాలన్న ఆరాటంతో తమను చుట్టు ముట్టిన జనాన్ని తప్పించుకున్న ఆ బాలుడు మెల్లగా మార్చురీలో కాలు పెట్టాడు. డాక్టర్‌గా మెడలో స్టెత్ వేసుకుని హుందాగా తిరుగాడే నాన్న అక్కడ స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు. ‘నాన్న లే నాన్న’అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని కదిపాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు ‘నాన్న పడుకుని ఉన్నాడు.. లేచాక మాట్లాడుదువుగాని రా’ అంటూ నచ్చచెప్పి మార్చురీ బయట ఉన్న అమ్మమ్మ వద్దకు చేర్చారు. గురువారం అనంతపురం శివారులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ రాజేష్ కుమారుడు రోహన్ ఆవేదన ఇది. సాక్షి,అనంతపురం క్రైం: నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీ శిల్పారామం ప్రవేశ మార్గంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ దేశాయి గురు రాజేష్ (39) అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు...బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పనిపై జేఎన్టీయూఏ వద్దకు వెళుతున్నట్లు భార్య డాక్టర్ లక్ష్మి (బి.పప్పూరు పీహెచ్సీ వైద్యాధికారి)కు తెలిపి ఇంటి నుంచి డాక్టర్ రాజేష్ బయటకు వచ్చారు. అర్ధరాత్రి 1 గంటైనా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అంటూ సమాధానం వచ్చింది. వేకువజామున 44వ జాతీయ రహదారిపై శిల్పారామం వద్ద టీ కొట్టు తెరిచేందుకు వచ్చిన వెంకటేష్ నాయక్.. ప్రమాదానికి గురైన కారును గమనించి, ఆ చుట్టుపక్కల గాలించాడు. పక్కనున్న సీ స్క్వయర్ కాఫీ క్లబ్ ప్రహరీ వద్ద ఓ మృతదేహం పడి ఉండడంతో సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్, మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని డాక్టర్ రాజేష్‌గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిందిలా.. నగరంలోని రెండో రోడ్డులో నివాసముంటున్న డాక్టర్ రాజేష్.. అర్ధరాత్రి తన హుండాయ్ వెర్నా కారులో తపోవనం ఫ్లై ఓవర్ నుంచి హైదరాబాద్ వైపుగా వేగంగా వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. సీ స్క్వయర్ కాఫీ క్లబ్‌కు అమర్చిన సీసీ కెమెరాలో రాత్రి 11.37 గంటలకు నమోదైన ఫుటేజీలో డాక్టర్ రాజేష్ గాలిలో చక్కర్లు కొడుతూ ఎగిరి వచ్చి పడిన దృశ్యాలు కనిపించాయి. తొలుత శిల్పారామం నామఫలకాన్ని ఢీకొన్న కారు.. ఆ వేగానికి దాదాపు 15 అడుగుల ఎత్తు గాల్లోకి లేచింది. తెరుచుకున్న కారు డోరు నుంచి డాక్టర్ రాజేష్ బయట పడ్డారు. దాదాపు 181 అడుగుల దూరం గాలిలో చక్కర్లు కొడుతూ వెళ్లి సీ స్క్వయర్ కాఫీ క్లబ్ ప్రహరీ వద్ద పడ్డారు. పడిన వెంటనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురి దిగ్భ్రాంతి నగర పాలక సంస్థ ఎంహెచ్‌ఓగా ఆయన పనిచేస్తున్న సమయంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ రాజేష్ అహరి్నశం శ్రమించారు. ప్రమాదంలో ఆయన మృతి చెందారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనైన మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి, వైఎస్సార్ సీపీ నేత అనంత చంద్రారెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: వివాహితపై గ్యాంగ్ రేప్ -
రాజుల కాలంనాటి బంగారు పూసలని రూ.15 లక్షలు తీసుకున్నాడు.. తీరా చూస్తే
సాక్షి,పుట్టపర్తి: తక్కువ ధరకు మేలిమి బంగారం ఇస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షలతో ఉడాయించిన ఘటన బుక్కపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మంగలి కుమార్‌కు కొంత కాలం క్రితం ఫోన్ ద్వారా కర్ణాటకకు చెందిన గణేష్ పరిచయమయ్యాడు. తాను జేసీబీ డ్రైవర్‌నని ఇటీవల కర్ణాటకలో పైప్‌లైన్ పనులు చేస్తుంటే లభ్యమైన రాజుల కాలం నాటి 3 కిలోల బంగారు పూసలను రూ.15 లక్షలకు ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తక్కువ ధరకు మేలిమి బంగారం వస్తుందని కుమార్ ఆశపడ్డాడు. రూ.15 లక్షలు తీసుకుని పుట్టపర్తికి వస్తే తాను అక్కడకు వచ్చి బంగారు పూసలు ఇస్తానని చెప్పడంతో అలాగేనని సోమవారం సాయంత్రం కుమార్ పుట్టపర్తికి చేరుకున్నాడు. తర్వాత కొత్తచెరువులో తానున్నట్లు గణేష్ తెలపడంతో అక్కడకెళ్లాడు. అనంతరం బుక్కపట్నం ఆస్పత్రి వద్ద ఇద్దరూ కలిశారు. తన వద్ద ఉన్న కొన్ని బంగారు పూసలు చూపించడంతో వాటిని పరిశీలించి, మేలిమి బంగారంగా కుమార్ ధ్రువీకరించుకుని రూ.15 లక్షలు అప్పగించడంతో పూసల గుచ్ఛను చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత వాటిని మరోసారి పరిశీలించుకోగా నకిలివిగా తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు బుక్కపట్నం, కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు -
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకట నారాయణ సస్పెన్షన్
సాక్షి, అనంతపురం: కొత్తచెరువులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకటనారాయణను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై డీఐజీ సీరియస్ అయ్యారు. 1.92 లక్షల చలానా డబ్బులు ట్రెజరీకి చేరకుండానే వెంకట నారాయణ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ సురేష్ ఆచారి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి సమగ్ర విచారణ చేపట్టారు. సురేష్ ఆచారి.. 9 నెలల్లో 1000 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలింది. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ చదవండి: సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. -
వాగులో పడిపోయిన భారీ లారీ
-
వంకలో కొట్టుకుపోయిన కారు: ఇద్దరు గల్లంతు
-
ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే
రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు కాజేశారు. అప్పటి మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు ఈ ఆక్రమణల పర్వానికి ముఖ్య సూత్రధారిగా వ్యవహరించాడు. ఎకరా రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయించి భారీఎత్తున సొమ్ము చేసుకున్నాడు. నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్టేషన్ అధికారులు కళ్లు మూసుకుని రిజిష్టర్ చేసి అక్రమార్కులకు సహకరించారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడంతో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కొందరు టీడీపీ నేతల కన్ను సర్వే నంబరు 123లోని ప్రభుత్వ భూమిపై పడింది. ఈ సర్వే నంబరులో మొత్తం 34.41 ఎకరాలు ఉండగా.. ఇందులో నాలుగు ఎకరాలను మాజీ మిలటరీ ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 30.41 ఎకరాల్లో వంక, శ్మశానం, ప్రభుత్వ భూమి కలిపి 5.92 ఎకరాలు పోను మిగిలిన 24.49 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఇక్కడ ఎకరా రూ.4 కోట్లకు పైగా పలుకుతోంది. దీంతో టీడీపీ నేతలు అధికారులను నయానో.. భయానో లోబర్చుకుని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించారు. పరిటాల అనుచరుడి భార్య పేరిట ఐదెకరాలు 24.49 ఎకరాల్లో ఐదెకరాల భూమిని మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు భార్య పంజగల ప్రసన్న పేరుతో సర్వే నంబర్ 123–2 కింద 2015లో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం కూడా జారీ చేశారు. అనువంశికం కింద ఆమెకు హక్కులు కలి్పంచారు. ప్రస్తుతం అడంగల్, 1–బీ లాంటి రెవెన్యూ రికార్డుల్లో ఆమె పేరే కనిపిస్తోంది. ఈ అక్రమ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు సహకరించినట్లు స్పష్టమవుతోంది. 4.17 ఎకరాల విక్రయం ప్రసన్న పేరిట రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదైన ఐదు ఎకరాల భూమి నుంచి ఇటీవల 4.17 ఎకరాలను ఇతరుల పేరిట రిజిష్టర్ చేశారు. దీని విలువ రూ.16 కోట్ల పైమాటే. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఈ ఏడాది జూలై 15న అనంతపురం రూరల్ సబ్‌రిజిస్టార్ సురేష్ ఆచారి నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన జంపుగుంపుల వెంకటప్ప, అనంతపురం శారదానగర్‌కు చెందిన బోయపాటి కిరణ్‌బాబు పేరిట రిజిష్టర్ చేశారు. తొలుత పెండింగ్ నంబరు 1004 కింద రిజి్రస్టేషన్ చేసి.. తర్వాత ఐదు రోజులకే (జూలై 20) రెగ్యులర్ నంబరు 7835 కేటాయించారు. ఇందుకు గానూ సబ్ రిజి్రస్టార్‌కు రూ.20 లక్షల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా రిజిస్టేషన్లు సాధారణంగా ఏదైనా స్థలాన్ని గానీ, భూమిని ఈగానీ రిజి్రస్టేషన్ చేయాలంటే సర్వే నంబరును పరిశీలిస్తారు. ఆ సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుంది. అయితే అనంతపురం రూరల్, యాడికి సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో పనిచేసిన కొందరు సబ్ రిజి్రస్టార్లు నిషేధిత భూములను సైతం రిజిష్టర్ చేశారు. ప్రసన్నాయపల్లి పంచాయతీకి చెందిన సర్వే నంబరు 123లోని భూమిని నిషేధిత జాబితాలో ఉంచామని రెవెన్యూ అధికారులు అధికారికంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలిపినా ఉపయోగం లేకుండా పోయింది. ఇందులో చాలా వరకు భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేశారు. 90 శాతం వరకు ప్లాట్లను యాడికి సబ్‌రిజి్రస్టార్ కార్యాలయంలో ‘ఏనీవేర్ రిజిస్ట్రేషన్’ కింద రిజిష్టర్ చేయడం గమనార్హం. సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడం నేరం. సర్వే నంబరు 123–2లోని ఐదెకరాల భూమిని 2015లో టీడీపీ నేత పి.శ్రీనివాసులు భార్య పి.ప్రసన్న పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందన్న విషయాన్ని ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –బి.ఈరమ్మ, తహసీల్దార్, రాప్తాడు అలా చేయడం తప్పు ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిష్టర్ చేయరాదు. సర్వే నంబరు 123–2లో జరిగిన రిజి్రస్టేషన్లను పరిశీలిస్తా. సబ్‌రిజి్రస్టార్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తా. – హరివర్మ, జిల్లా రిజి్రస్టార్, అనంతపురం చదవండి: కృష్ణా బోర్డు పరిధిలోకి ‘వెలిగొండ’ను తేవాలి -
బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్ వస్తారు!
అనంతపురం విద్య: విద్యార్థి క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులను పర్యవేక్షించేందుకు ప్రధానోపాధ్యాయులతో పాటు కొత్తగా వలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో విద్యార్థి హాజరును రోజూ నమోదు చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి. వరుసగా మూడు రోజులు వెళ్లకుంటే... జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 5,129 ఉండగా.. 6,06,780 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులంతా క్రమం తప్పకుండా స్కూల్‌కు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు పాఠశాలకు హాజరై.. అభ్యసన ప్రక్రియలో పాల్గొంటున్నారా?... లేదా అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థి అయినా వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే... విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు సమాచారం వెళ్తుంది. దీంతో వలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి సమాచారం పంపుతారు. ఇతరత్రా కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరు నమోదుపై దృష్టి సారించేవారు. ఇక నుంచి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏడాదిలో 70 శాతం హాజరు లేకపోతే ‘అమ్మఒడి ’ పథకం కూడా వర్తించదని తేల్చిచెప్పింది. దీంతో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల హాజరును తప్పకుండా యాప్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవీ చదవండి: Tank Bund: ఆదివారం.. ఆనంద విహారం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ -
టెలిగ్రామ్ ద్వారా మోసాలు.. అమ్మకానికి జనన, మరణ ధ్రువపత్రాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల క్రితం మరణించగా సంబంధిత వ్యక్తి వారసులు ఆయన మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారులు రికార్డుల్లో లేదని తెలిపారు. దీంతో వారసులు ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి సహాయంతో రూ.1,000 చెల్లించి విజయనగరం జిల్లాలోని ఓ పీహెచ్సీ రికార్డుల్లో నమోదైనట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతపురం జిల్లాకే చెందిన ఓ వృద్ధుడు ఆధార్ కార్డులో వయసు మార్పు కోసం ఇదే తరహాలో రూ.900 చెల్లించి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు ఓ అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో యథేచ్ఛగా కొనసాగిస్తోంది. 1990 తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని మంజూరు చేసే అధికారం గ్రామ, మండల, పురపాలక స్థాయి అధికారులకు ఉంది. జనన, మరణాల వివరాలు రికార్డుల్లో లేకపోతే తగిన ధ్రువీకరణ పత్రాలను అందించి మీసేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్డీవో వాటిని రికార్డుల్లో నమోదు చేసి.. ఆయా పత్రాల మంజూరుకు అనుమతి ఇస్తారు. కానీ ఇవన్నీ లేకపోయినా కేవలం రూ.600తో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందిస్తోంది.. అంతర్రాష్ట్ర ముఠా. ఈ ముఠా ఆగడాలను పరిశీలిస్తే సాంకేతికంగా ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తుల నేతృత్వంలోనే ఈ దందా భారీ ఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ముఠా మోసాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మీసేవా, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకుల నంబర్లు సేకరించి.. ఆన్లైన్ ద్వారా సరికొత్త దందాకు తెరలేపిన అంతర్రాష్ట్ర ముఠా ముందుగా ప్రజలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం సంప్రదించే ఇంటర్నెట్, మీసేవా సెంటర్లపై కన్నేస్తోంది. వాటి నిర్వాహకుల నంబర్లను సేకరించి.. వారిని టెలిగ్రామ్ యాప్ ద్వారా తమ గ్రూపు సభ్యులుగా చేర్చుకుంటోంది. గ్రూప్ అడ్మిన్‌కు వివరాలు పంపి.. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లిస్తే చాలు.. జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని మంజూరు చేయడం తీవ్ర నేరం. విద్రోహశక్తులు, సైబర్ నేరగాళ్లకు ఇవి ఊతంగా మారే ప్రమాదం లేకపోలేదు. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడం, బీమా సంస్థల నుంచి సొమ్మును పొందటం, ఉద్యోగాల్లో పదోన్నతి పొందడం, తదితర చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే అవకాశమూ ఉంది. ఫోన్‌పేలో రూ.600 చెల్లిస్తే చాలు.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారు టెలిగ్రామ్‌లో ‘సర్టిఫికెట్ సర్వీస్ చార్జబుల్’ అనే గ్రూపు నిర్వాహకుడికి వివరాలను పంపి రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. రితేష్‌కుమార్ అనే వ్యక్తి ఫోన్‌పే నంబర్ 9939844009కు నగదు పంపి.. ఆ స్క్రీన్ షాట్‌ను పంపితే చాలు.. క్షణాల్లో సంబంధిత రాష్ట్రంలోని ఏదైనా ఓ పీహెచ్సీలో నమోదు చేసిన పత్రాలను ఆన్లైన్లోనే సదరు వ్యక్తులకు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కొద్దు టెలిగ్రామ్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న ముఠా ఉచ్చులో ప్రజలెవరూ చిక్కుకోవద్దు. ముఖ్యంగా ఇంటర్నెట్, మీసేవా నిర్వాహకులు ఈ ముఠా సభ్యుల మాటలు నమ్మి ప్రజలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను అందించవద్దు. ఇలాంటివాటిని ఉపయోగించి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందినా, బీమా సంస్థలను మోసం చేసినా, ఉద్యోగోన్నతి కోసం వీటిని ఉపయోగించినా నేరంగా పరిగణిస్తాం. –డాక్టర్ కె.ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం గతంలో ఆధార్ కార్డుల్లో వయసు మార్పు ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఈ ముఠా అందజేస్తున్నట్లు సమాచారం. తాము అందిస్తున్న ధ్రువీకరణ పత్రాల్లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా అన్ని వివరాలు పక్కాగా ఉంటాయని ఈ ముఠా టెలిగ్రామ్ గ్రూపులలో సందేశాలు పంపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి జనన ధ్రువీకరణ పత్రం కావాలని టెలిగ్రామ్ గ్రూపులో సదరు ముఠా సభ్యుడితో చాటింగ్ చేయగా.. వెంటనే అనంతపురం జిల్లా రాయదుర్గం పీహెచ్సీలో డేటా అందుబాటులో ఉందని సంక్షిప్త సందేశం పంపించాడు. హిందూపురంలోనూ ఇదేవిధంగా పత్రాలను అందజేస్తామన్నాడు. అలాగే విశాఖపట్నం చెందిన ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించగా.. విశాఖపట్నం ఆర్సీడీ హాస్పిటల్లో అందజేస్తామని సమాధానం ఇచ్చాడు. ఇలా అడిగిన వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బులు జమ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. గతంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఆధార్ కార్డుల్లో వయసును విచ్చలవిడిగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఘటనలు విదితమే. అప్పట్లో ఆధార్‌లో వయసు మార్పునకు పాన్‌కార్డులో వయసు మార్చారు. కాగా ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో లభించే జనన ధ్రువీకరణ పత్రాలను ఇందుకు వినియోగిస్తుండటం గమనార్హం. -
మైనర్ బాలిక కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
సాక్షి, అనంతపురం: కదిరిలో కలకలం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రకాష్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బాలికను ప్రకాష్ కిడ్నాప్ చేశాడాని పోలీసులు వెల్లడించారు. ఆరుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులతో పాటు స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .కాగా శుక్రవారం ఉదయం బాలిక తల్లితండ్రులను ఇంట్లో బంధించి ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. కిలోమీటర్ల పాటు ఛేజింగ్ చేసి తెల్లవారి మూడు గంటల సమయంలో ధర్మవరం సమీపంలో కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి:రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? -
ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స
సాక్షి, అనంతపురం: ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండాలని అన్నారు. పేదలకు 1.28 లక్షల ఇళ్లు అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు. -
టీడీపీ నేతలకు మతిభ్రమించింది: మంత్రి శంకర్‌నారాయణ
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఎల్లోమీడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేయలేదా? బాబు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కాలువ శ్రీనివాస్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్‌దే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
-
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
సాక్షి, అనంతపురం: కదిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బరి తెగింపు చర్యలకు పాల్పడ్డాడు. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకుని కొడతానంటూ బెదిరించడమే కాక అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ వివరాలు.. మున్సిపల్ అధికారులు సోమవారం కదిరిలో కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు గల ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కందికుంట వెంటకప్రసాద్ అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకున్నాడు. అంతటితో ఊరుకోక... ఆఫీస్‌కు వచ్చి కొడతానంటూ అధికారులను బెదిరించాడు. అధికారులపై అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయాడు. కందికుంట రౌడీయిజంపై స్థానికులు మండి పడుతున్నారు. -
అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం
-
భార్యలు పుట్టింటికి వెళ్లారని ఇద్దరు ఆత్మహత్య
సాక్షి,బుక్కరాయసముద్రం: రెండు కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసలై భార్యలను కొట్టడంతో వారు పుట్టింటికి వెళ్లగా .. ఇద్దరు భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు... మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కాలనీకి చెందిన నాగయ్య (45) తన భార్య అశ్వర్థమ్మతో కలిసి కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారు. అయితే నాగయ్య మద్యానికి బానిసై భార్యను రోజూ కొట్టేవాడు. దీంతో భార్య అశ్వర్థమ్మ ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన నాగయ్య శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పురుగు మందు తాగి... మండల పరిధిలోని కేకే అగ్రహారంలో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. కేకే అగ్రహారం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (26) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈశ్వరయ్య తాగుడుకు బానిసై భార్యను కొట్టేవాడు. దీంతో ఇటీవలే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఈశ్వరయ్య పురుగుల మందు సేవించాడు. బంధువులు గమనించి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. బంధువులు గుట్టుచప్పడు కాకుండా మృత దేహాన్ని గ్రామంలో ఖననం చేస్తుండగా విషయం పోలీసులకు తెలియడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్-2తో పాటు జిల్లాలోని పది మునిసిపాలిటీల్లో రెండో వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ బలపరిచిన) ఎన్నిక కాగా.. ఇక్కడ ఎన్నిక ప్రక్రియను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పట్టణంలో అక్రమ భవనాల కూల్చివేతను అడ్డుకోవడంతో పాటు భూ కబ్జాదారులకు మద్దతిస్తున్న మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం: శ్రీరంగనాథరాజు
సాక్షి, అనంతపురం: పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నామన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని వెల్లడించారు. లే ఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని, అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి హితవు పలికారు. -
బైక్ అంబులెన్సులు.. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బైక్ అంబులెన్సులను రూపొందించారు. అత్యవసర సమయాల్లో కరోనా రోగులకు ఉపయోగపడేలా వీటిని తయారు చేశారు. ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఇందులో ఉంటాయి. పూణేకు చెందిన డసల్ట్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధి సుహాస్ ప్రీతిపాల్ పర్యవేక్షణలో మెకానికల్ సెకండియర్ చదువుతున్న గుత్తికి చెందిన యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ 45 రోజులు శ్రమించి బైక్ అంబులెన్సులను రూపొందించారు. ఇప్పటిదాకా తయారైన పది బైక్ అంబులెన్సులను త్వరలోనే సచివాలయాలకు ఉచితంగా అందజేస్తామని గేట్స్ కాలేజీ ఎండీ గజ్జల రఘునాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కో అంబులెన్స్ తయారు చేయడానికి దాదాపు రూ.50 వేలు ఖర్చయ్యిందని, కరోనా రోగులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ చెప్పారు. -
మూగజీవాల మృత్యుఘోష ..
సాక్షి, అనంతపురం(గుత్తి): మండల పరిధిలోని ఊటకల్లు వద్ద కురుబ రాజు మామిడి తోటలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మామిడి తోటలోని ఓ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో 22 కేఫ్‌లు (పేలుడు పదార్థాలు) ఉంచారు. టమాట పండ్ల మాదిరి ఉండటంతో అటువైపు వెళ్లిన రైతు నారాయణరెడ్డికి చెందిన ఆవు తినడానికి ప్రయత్నించింది. దీంతో ఒక కేఫ్ పెద్ద శబ్దంతో పేలింది. ఆవు తల భాగం ఛిద్రమైంది. గ్రామస్తులు వెంటనే గుత్తి సీఐ రాముకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎస్ఐ సుధాకర్ యాదవ్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేలని 21 కేఫ్‌లను గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సాధారణంగా కేఫ్‌ను అడవి పందులను చంపడానికి వినియోగిస్తారని చెప్పారు. అయితే అడవ పందులను చంపడానికైతేఅక్కడక్కడా ఒకటి చొప్పున మాత్రమే ఉంచుతారు. ఒకేచోట 22 ఎందుకు ఉంచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రొళ్లపాడు, గుడిసెల గ్రామాలకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో ఊటకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా పేలుడు పదార్థాలు ఉంచారోనని భయపడుతున్నారు. గ్రామంలో ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కేఫ్ పేలితే సుమారు కిలో మీటరు దూరం వరకు శబ్ధం వినిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. మూగజీవాల మృత్యుఘోష అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామాంజులపల్లి బస్‌షెల్టర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు ఎద్దులు మృతి చెందాయి. మరో ఏడు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి గురైన మూగజీవాలు విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి చెన్నైకు ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ లారీ తెల్లవారుజామున రామాంజులపల్లి బస్‌షెల్టర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులో తూగాడు. దీంతో లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ను వేగంగా ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులోని 12 ఎద్దులలో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. మిగిలిన ఏడు కొమ్ములు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. అవి విలవిలలాడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. లారీలోనే మృతి చెందిన ఎద్దులను జేసీబీ సాయంతో తొలగించారు. లారీ వేగంగా ఢీ కొనడంతో బస్‌షెల్టర్ సైతం దెబ్బతింది. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి గుర్నాథరెడ్డి గోపాలమిత్రలను సంఘటనా స్థలానికి పంపి గాయపడిన పశువులకు చికిత్స చేయించారు. అనంతరం వాటిని చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు: సీఎం జగన్
రాయదుర్గం: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిపియని సీఎం తెలిపారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సీఎం జగన్ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు ఆనాడు ఏం చేశావ్? అయ్యా చంద్రబాబు ఇవాళ మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌లు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా ’ అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అని చంద్రబాబుని సీఎం జగన్ నిలదీశారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా రైతులేనని, రైతుల కోసం అందరూ కలిసి రావాలని సీఎం అన్నారు. నీటిని రాజకీయాలకు వాడుకోవద్దని సీఎం జగన్ సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాయదుర్గంలో రేపు సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్‌లో అగ్రి ల్యాబ్‌ను సీఎం ప్రారంభించనున్నారు. రూ.1506 కోట్ల అగ్రి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.413 కోట్లతో నిర్మించిన 1,898 ఆర్బీకేలు.. రూ.80 కోట్లతో నిర్మించిన 100 అగ్రికల్చర్, ఆక్వా ల్యాబ్‌లు.. రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 వెటర్నరీ ఆస్పత్రులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో నిర్మించనున్న 1262 వ్యవసాయ గోదాంలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.200 కోట్లతో పోస్ట్ హార్వెస్టింగ్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.212 కోట్లతో మార్కెట్ యార్డుల్లో నాడు-నేడు పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.96.64 కోట్లతో రైతుల కోసం ఏర్పాటు చేసిన 611 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఏపీలో 45 కొత్త రైతుబజార్లకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
Anantapur: ఈ మైనర్లు మహాముదుర్లు!
అనంతపురం క్రైం: వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించడానికి చోరీల బాట పట్టిన నలుగురు మైనర్లను ఇటుకలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని జువైనల్ జస్టిస్(జేజే) బోర్డు ముందు హాజరుపరిచారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి కేసు పూర్వాపరాలు వెల్లడించారు. 2019 నుంచి రాప్తాడు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పలు చోరీలు జరిగాయి. వీటిపై దృష్టి సారించాలని ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు శ్రీకాంత్, ఆంజనేయులు ప్రత్యేక నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో మంగళవారం రాప్తాడు సమీపంలోని డాల్ఫిన్ రెస్టారెంట్ వద్ద నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా... చోరీల గురించి పూర్తి వివరాలు తెలిశాయి. జల్సాల కోసమే ఇళ్లలో చోరీలు చేశామని, 2019 నుంచి ఇప్పటి వరకు 9 చోరీలు చేసినట్లు వారు అంగీకరించారు. దీంతో పోలీసులు వారి నుంచి 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని జేజే బోర్డు ముందు హాజరుపర్చి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్లు డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్‌భాస్కర్‌గౌడ్, ఎస్ఐలు ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి -
అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లో ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్ -
Photo story: ఆట కట్టు!
అనంతపురం: కరోనా సమయంలోనూ యథేచ్ఛగా తిరుగుతూ గుంపులుగా చేరుతూ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్న యువకుల ఆటకట్టించారు త్రీటౌన్ పోలీసులు. ఆదివారం ‘సాక్షి’లో కరోనాతో ఆటలా శీర్షికన వెలువడిన కథనంపై స్పందించారు. యువకులను చెదరగొడుతున్న త్రీటౌన్ సీఐ రెడ్డప్ప నేషనల్ పార్కు సమీపంలో ఆటలాడుతున్న యువకులను చెదరగొట్టారు. వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలోనూ క్రమశిక్షణ పాటించకుంటే ఎలా అంటూ హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇంట్లో పెద్దవాళ్లను ప్రమాదంలో పడేయొద్దని సీఐ రెడ్డప్ప సూచించారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్ పోలీసుల రాకతో పరుగు పెడుతున్న యువకులు -
తాడిపత్రిలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్ ఆస్పత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... ‘‘ కోవిడ్ టైంలో, ఆక్సిజన్ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్ స్టీల్‌కు ఎయిర్ సపరేషన్ ప్లాంట్ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పనిచేశారు. పేరుపేరునా అందరికీ అభినందనలు. అర్జాస్ స్టీల్స్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తికి ప్రత్యేక అభినందనలు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిది’’ అని అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్ శ్రీకారం సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ -
గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు
గుంతకల్లు(అనంతపురం): ‘నకిలీ అపాయింట్మెంట్’ల వ్యవహారం రైల్వే ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది. నకిలీ ఉత్తర్వుల వ్యవహారంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం 12 మంది నకిలీ ఉత్తర్వులతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించారు. వీరిలో చెన్నైకి చెందిన టి.రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్నాడు. మిగిలిన 11 మంది వివరాలు రైల్వే అధికారులు గోప్యంగా ఉంచారు. వాస్తవానికి ఇలాంటి నకిలీ ఉత్తర్వులతో దాదాపు 50 మందికి పైగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం అక్రమాల్లో తమిళనాడుకు చెందిన 12 మంది నుంచే కాకుండా గుత్తి, గుంతకల్లుకు చెందిన మరో 38 మంది అభ్యర్థుల నుంచి రూ. లక్షలు వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బు పర్సనల్ డిపార్టుమెంట్‌లోని కొందరు సిబ్బందితోపాటు ఒకరిద్దరు అధికారులు కూడా వాటాల రూపంలో దండుకున్నట్లు సమాచారం. ఫోర్జరీ సంతకాలతో.. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆఫీస్ ముద్రతోపాటు డీపీఓ పోర్జరీ సంతకంతో కూడిన ఉత్తర్వులు చూస్తుంటే దీని వెనుక పెద్ద గూడుపుఠానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా రైల్వే ఆస్పత్రి నుంచి ఫిట్నెస్, మెడికల్ సరి్టఫికెట్లు కూడా పొందారంటే..ఇందులో పర్సనల్ డిపార్టుమెంట్ కార్యాలయ సిబ్బంది ప్రమేయం తప్పకుండా ఉంటుందని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. కాగా ఈ నకిలీ బాగోతం బహిర్గతం కావడంతో అప్రమత్తమైన అవినీతిపరులు తప్పిదం తమ మీదకు రాకుండా దారి మళ్లించే పథకం రచించినట్లు సమాచారం. పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు ఆదివారం గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. గుత్తి డీజిల్òÙడ్లో ఎం.విజయస్టాన్లీ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడనీ, ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమను నమ్మించాడు. ఈ ఏడాది జనవరిలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశాడని తెలిపారు. అలాగే సర్టిఫికెట్, మెడికల్, ఫిట్నెస్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లుగా వివరించాడు. తీరా జాయిన్ అయ్యే సమయంలో అవి పోర్జరీ సంతకాలతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు అని తేలడంతో తాము మోసపోయినట్లు బాధితులు బోరుమన్నారు. చనిపోయిన వ్యక్తి పేరుతో దందా.. వాస్తవానికి నకిలీ ఆర్డర్ కాపీలతో తమను మోసపుచ్చాడని నిరుద్యోగులు చెబుతున్న విజయ్‌స్టాన్లీ అనే వ్యక్తి కొంతకాలం క్రితం కరోనాతో మృతి చెందాడు. అతని ఐడీ కార్డును ఉపయోగించుకుని ఓ వ్యక్తి తాను రైల్వే ఉద్యోగినంటూ మోసానికి తెర లేపినట్లు తెలిసింది. ఇలా 50 మంది తాము మోసపోయినట్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే ఈ కుంభకోణంలోని ప్రధాన పాత్రధారులంతా పక్కకు తప్పుకొని... చనిపోయిన స్టాన్లీబాబుపైకి నేరం నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. చదవండి: అంతేనా లోకేష్.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా! ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పోలీసులు మరో వివాదానికి తెరలేపారు. టీడీపీ నేతలతో కలిసి ఓ కానిస్టేబుల్ సాగిస్తున్న గ్యాంబ్లింగ్ దందాను దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘మీ ఇష్టం.. ఏమన్నా రాసుకోండి’ అంటూ విలేకరులపైనే ఖాకీ నైజాన్ని ప్రదర్శించారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్థం మార్చేసేలా సాక్షాత్తూ డీఎస్పీ ఎదుటే ఓ సీఐ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఏం జరిగింది? ఈ నెల 20న తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో రైస్ మిల్లు వద్ద గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పట్టుబడిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు శరత్‌కుమార్‌తో పాటు మరో పది మంది ఉన్నారు. వీరిలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడు కూడా ఉండటం విశేషం. అయితే తాడిపత్రి పోలీసులు ఈ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన రోజు పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.50 వేలు స్వా«దీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నా...పేర్లు మాత్రం వెల్లడించలేదు. కానీ విషయం తెలుసుకున్న ఎస్పీ సత్యయేసుబాబు కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడిపై చర్యలు తీసుకున్నారు. వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులిచ్చారు. మీ ఇష్టం ఏమన్నా అనుకోండి.. ఆదివారం తాడిపత్రి పోలీసులు తెలంగాణ మద్యం స్వాదీనం చేసుకోగా, డీఎస్పీ చైతన్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పేకాటలో దొరికిన కానిస్టేబుల్ అంశాన్ని విలేకరులు లేవనెత్తడంతో సీఐ ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. విషయాన్ని దాటవేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ ఉన్నందునే పేర్లు బహిర్గతం చేయలేదా? అని విలేకరులు ప్రశ్నించగా... సీఐ సహనం కోల్పోయారు. అది ఒక చిన్న పెట్టీ కేసు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి లోతుగా వెళ్లకండి. కాదంటే మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండని సమాధానమిచ్చారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్ ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
Natural Farming: వారెవ్వా వన్నూరమ్మా!.. ప్రధాని మోదీ ప్రశంసలు
మారుమూల కుగ్రామంలో ఉండే అతి సాధారణ దళిత మహిళా రైతు వన్నూరమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి దేశ ప్రజల దృష్టిలో పడింది. ఎడారి నేలలోనూ ఏడాది పొడవునా ఆమె విజయవంతంగా చేస్తున్న ప్రకృతి వ్యవసాయానిదే ఈ ఘనత! బంజరు భూమిని బాగు చేసుకొని.. వర్షాధారంగా ఏడాదిలో మూడు పంటలను రసాయనాల్లేకుండా పండించటం మాత్రమే కాదు.. ఎడారిని తలపించే చోట ఒక ఎకరంలో రూ. లక్షకు పైగా నికరాదాయం పొందటం వన్నూరమ్మ సాధించిన ఘన విజయం. ప్రకృతి వ్యవసాయం తమ కుటుంబాన్నే కాకుండా తండావాసుల జీవితాల్లోనూ వెలుగులు విరబూయిస్తున్న తీరును ఆమె నిస్సంకోచంగా చకచకా వివరించడంతో.. ఆమె కృషి దేశానికే ఆదర్శమని ప్రధాని ప్రశంసించారు. ఇంతకీ.. వన్నూరమ్మ తన బంజరు భూమిలో నీటి వసతి లేకుండానే బంగారు పంటలు ఎలా పండిస్తోంది..? చూసొద్దాం పదండి..! అసలే కరువు నేల.. వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతం. బోర్లు వేసినా భూగర్భ జలాలు లేక నీరు పడని దుస్థితి. ఇలాంటి నేలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది దళిత మహిళా రైతు వన్నూరమ్మ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వన్నూరమ్మ 11 ఏళ్ల క్రితమే భర్తను కోల్ఫోయింది. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. చదువుతోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న లక్ష్యంతో నలుగురు పిల్లలను చదివిస్తోంది. ప్రభుత్వం తమ కుటుంబానికి ఇచ్చిన 4.5 ఎకరాల భూమి భర్త మరణం తర్వాత బీడు పడిపోయింది. ఈ నేపథ్యంలో పంటలకు రసాయన ఎరువులు వాడకుండా ఏపీ ప్రభుత్వ సహకార ప్రకృతి సేద్య విభాగం డీపీఎం లక్ష్మీ నాయక్, సిబ్బంది సహకారంతో బీడు భూమిని తిరిగి సాగులోకి తెచ్చింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో వన్నూరమ్మ భూమి తల్లిని నమ్ముకుంది. ప్రకృతి సేద్యం నేర్చుకుంది. మూడేళ్ల క్రితం శిక్షణ పొందింది. ట్రాక్టర్‌తో దున్నించిన తర్వాత ఎత్తుమడులు చేసింది. కట్టెలు, వేరుశనగ కట్టె, పొట్టు పొలాన్ని ఆచ్ఛాదనగా వేస్తూ సాగుయోగ్యంగా మార్చుకుంది. మొదట అరెకరంలో చిరుధాన్యాలు సాగు చేసింది. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉందని భావించి, రెండు ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించింది. ఏడాదంతా 365 రోజులూ పొలంలో పంటలు ఉండేలా ప్రణాళికతో సాగు చేస్తోంది. దీన్నే ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పిఎండిఎస్) పద్ధతి అంటారు. తొలుత వర్షాలకు ముందే నవధాన్యాలను మిశ్రమ పంటగా విత్తింది. ఆ తర్వాత సజ్జ, టమాటా, వంగ, మిరప పంటలను సాగు చేసింది. ప్రస్తుతం టమాటో పంట ఉంది. స్వయంగా తయారు చేసుకున్న ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం లాంటి సహజ ఎరువులు, కషాయాలను తయారు చేసుకుని వాడుతూ పంటలను కాపాడుకుంటున్నది. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం ద్వారా వచ్చే పంట దిగుబడి కంటే తన పంట అధికం గానూ, నాణ్యం గానూ ఉంటుందని వన్నూరమ్మ స్పష్టం చేస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేసిన ఒక ఎకరంలో నవధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు సాగు చేసేందుకు రూ.27 వేలు పెట్టుబడి కాగా, నికర లాభం రూ.1.07 లక్ష వచ్చినట్లు తెలిపింది. మహిళలను ప్రకృతి సేద్యం వైపు మళ్లిస్తూ.. భాగ్యలక్ష్మి మహిళా స్వయం సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్న వన్నూరమ్మ ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధించడంతో ఆ బృందంలో నలుగురు మహిళా రైతులు మొత్తం 12.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న వన్నూరమ్మ.. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లివంక తండాకు చెందిన 170 మంది గిరిజన డ్వాక్రా గ్రూపు మహిళలకు తన అనుభవాన్ని, ఆశావహ దృక్పథాన్ని రంగరించి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 106 మంది రైతులు మొత్తం 138 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయనారంభించారు. తాను తయారు చేసిన జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను అందిస్తూ ఆమె రైతులను ప్రోత్సహిస్తుండటం విశేషం. ప్రధానితో మాట్లాడినందుకు గర్వంగా ఉంది! భర్త చనిపోయిన తర్వాత భూమి బీడుపడింది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం నేర్చుకున్నాను. నవధాన్యాల సాగు మొదలుకొని కూరగాయల సాగు కూడా చేశాను. వ్యవసాయంలో మహిళలు కూడా రాణించాలనేది నా కోరిక. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతానని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాతో పాటు మహిళలు అధిక సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. నా వంతుగా ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. – వన్నూరమ్మ (63042 78582), దళిత మహిళా రైతు, దురదకుంట , అనంతపురం జిల్లా పీఎండీఎస్ ప్రకృతి సేద్యం ఓ వరం మన్నూరమ్మ బంజరు భూమిలో 365 రోజులూ వర్షాధారంగానే వరుస పంటలు సాగు చేసి చూపింది. ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) అనే ప్రత్యేక పద్ధతిని శ్రద్ధగా పాటిస్తూ.. ఎకరానికి ఏడాదిలో రూ. లక్షకు పైగా నికరాదాయం పొందారు. వర్షపు నీటితోపాటు, అంతకన్నా ఎక్కువ మొత్తంలో నీటిని గాలిలో తేమ నుంచి గ్రహించే విశిష్ట విధానంలో పంటలను సాగు చేయటం వల్లనే ఇది సాధ్యమైంది. ఎఫ్.ఎ.ఓ. నిపుణుడు డా. వాల్టర్ యన సలహా మేరకు ఈ శాస్త్రీయ పద్ధతిని ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమలు చేçస్తున్నాం. అనంతపురం జిల్లాలో 110 మంది రైతులు, కోస్తాలో 3 లక్షల మంది రైతులు (43% నీరు/విద్యుత్తు ఆదా చేశారు) ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. నీటి సంక్షోభాన్ని, భూతాపాన్ని రూపుమాపే ఈ సాగు పద్ధతి ప్రపంచానికే ఓ వరం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ vjthallam@gmail.com – ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా -
కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత
ధర్మవరం: కరోనాతో మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇచ్చారు. మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్‌రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ కన్నుమూత కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట -
కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. తన సొంత పనిపై శనివారం రాత్రి అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి... జిల్లా కేంద్రానికి చేరువవుతుండగా రోడ్డు పక్కనే రక్తం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి పరిశీలించగా క్షతగాత్రుడు చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మురళీగా గుర్తించారు. బైక్‌పై వెళుతూ అదుపు తప్పి కిందపడినట్లుగా తెలుసుకున్న ఆయన వెంటనే క్షతగాత్రుడిని తన వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ -
మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
బత్తలపల్లి: ‘‘మాటేసి ఉన్నాం... మాస్క్ లేకుండా బయటకొచ్చారో జాగ్రత్త’’ అంటూ యముడు వేషధారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు ఆంజనేయులు, శ్రీరాములు, సుదర్శన్‌లు ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు. చదవండి: ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? -
‘అందుకే ఆత్మహత్యాయత్నం.. నన్ను ఎవరూ బెదిరించలేదు..’
రాప్తాడు: ‘‘ఉద్యోగం పోతుందనే భయంతోనే నేను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. నన్ను ఎవరూ బెదిరించలేదు. దీన్ని ఎవరూ రాజకీయం చేయవద్దండి. పరిటాల సునీత దీన్ని రాజకీయం చేయడం చాలా బాధగా ఉంది’’ అని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కపాడం అనిత అన్నారు. బుధవారం ఆమె రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు. తాను పది సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా పని చేస్తున్నానని, గ్రామంలో కొందరు టీడీపీ నాయకులు తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో భయాందోళనతో ఈ నెల 19న విష ద్రావకం తాగానన్నారు. వెంటనే తనను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. అయితే తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారని, ఆ తర్వాత దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. తనను రాజకీయ పావుగా వాడుకునేందుకు ప్రయత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. ఇంతకు మించి ఈ ఘటనపై రాజకీయ రాద్ధాంతం తగదన్నారు. చదవండి: అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్ నిధి ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు.. -
ఆశావర్కర్ అనిత కేసు ఓ డ్రామా
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత బురద రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఆశావర్కర్ అనితను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సీఐ విజయభాస్కర్ వెల్లడించారు. చెర్లోపల్లిలో లైంగిక వేధింపులపై ఆశావర్కర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే, నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించారు. అనిత కేసు ఓ డ్రామాగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తారని అనిత అపోహ పడిందని సీఐ విజయభాస్కర్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో అనిత కేసు పెట్టిందని సీఐ పేర్కొన్నారు. అనిత ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా, ఆమె పాయిజన్ తీసుకోలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని సీఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. పరిటాల సునీత మహానటి.. సాక్షి, అనంతపురం: రాప్తాడు మండలం చెర్లోపల్లి ఆశావర్కర్ ఘటనను టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పరిటాల సునీత చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ పరిటాల వర్గమే అని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్ అనిత టీడీపీ ట్రాప్‌లో పడిందని తెలిపారు. పరిటాల సునీత మహానటి అనే విషయం అందరికీ తెలిసిందేనని, తాజాగా ఆశా వర్కర్ ఘటనను రాజకీయం చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఓ చిరుద్యోగిని అడ్డుపెట్టుకుని రాజకీయానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆశా వర్కర్ అనిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆశా వర్కర్ కుటుంబం వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, తమలో తమకే చిచ్చు పెట్టేందుకు సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల శ్రీరాంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తానేనని శ్రీరాం ఒప్పుకున్నా... ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి -
పోలింగ్ కేంద్రంలో తల్లి.. పసిబిడ్డను ఆడించిన ఏపీ కానిస్టేబుల్
సాక్షి, అనంతపూరం: ఖాకీలు అనగానే.. కటువు మాటలు, కరడు గట్టిన హృదయం, కర్కోటకులు అనే భావన ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయింది. అయితే పోలీసుల్లో అందరు ఇలానే ఉండరు. వారిలో కూడా మంచి, మానవత్వం ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలను ఎన్నింటినో చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పసిబిడ్డను తీసుకుని ఓ తల్లి ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఎర్రటి ఎండ.. క్యూలైన్లో నిల్చోవడంతో చిన్నారికి ఉక్కపోత పోసి.. ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇది గమనించి.. బిడ్డను తనతో పాటు తీసుకుని టెంట్ కిందకు వచ్చాడు. ఏడవకూడదంటూ ఊరడించాడు. చిన్నారి తల్లి ఓటు వేసి వచ్చేవరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు. బిడ్డను ఎత్తుకున్న కానిస్టేబుల్ ఫోటోని ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతుంది. తమిళనాడులో చోటు చేసుకున్న సంఘటనను, అక్కడి పోలీసు కానిస్టేబుల్ని ఏపీ పోలీసులు ఎందుకు ప్రశంసిస్తున్నారంటే.. సదరు కానిస్టేబుల్‌ది అనంతపురం కాబట్టి. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ఈ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తునాడు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో ‘‘తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుకున్న ఏపీ పోలీసు కానిస్టేబుల్. ఈ అనంతపురం పోలీసు కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇక ఆ మహిళ ఓటు వేసి వచ్చేవరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనిని అక్కడున్న వారందరు ప్రశంసించారు’’ అంటూ ట్వీట్ చేసింది. #APPolice's humane face at #TamilNaduElections: @AnantapurPolice constable deployed to #TamilNadu for #TamilNaduElections2021 carried & lulled a 1-month-old crying baby until the mother's return from the voting booth, winning the hearts of many.#AndhraPradesh#Elections2021 pic.twitter.com/vk0DO2doJN — Andhra Pradesh Police (@APPOLICE100) April 6, 2021 ఏపీ పోలీసు శాఖ సదురు కానిస్టేబుల్ పేరును వెల్లడించలేదు. ఈ ఫోటోని చూసిన వారంతా తెగ ప్రశంసిస్తున్నారు. గుడ్ జాబ్.. హ్యాట్సాఫ్ అంటూ పొగుడుతున్నారు. ఇక తమిళనాడు 38 జిల్లాలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 62.86 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మే 2న వీరి భవితవ్యం తేలనుంది. చదవండి: తమిళ ఎన్నికల్లో ‘అనంత’ పోలీసుల సేవలు -
మడకశిర నుంచి తమిళనాడుకు వెళ్లి..
మడకశిర రూరల్: సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్ హరిప్రసాద్ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది. వివరాల్లోకి వెళితే.. మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ తమిళనాడు రాష్ర్టం మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో మూడు నెలలుగా చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో రెండు నెలలుగా పింఛన్ పొందని ఆమె...ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుంది. దీన్ని గుర్తించిన వలంటీర్ హరిప్రసాద్ 800 కి.మీ దూరంలోని ఉసిలంపల్లికి వెళ్లి పుంగమ్మకు మూడు నెలల పింఛన్ అందించాడు. దీంతో పుంగమ్మ వలంటీర్‌కు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి తమిళనాడు వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. చదవండి: సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్ చంద్రగిరిలో బాబుకు షాక్ -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ హరికుమార్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 384, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: కుప్పం టీడీపీలో ముసలం.. ‘పాచిపోయిన లడ్డూను తింటున్నారా..’ -
జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదయ్యింది. నిన్న మద్యం మత్తులో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ వద్ద హంగామా సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులు.. ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. జేసీ అనుచరులు 26 మందిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో విందు పార్టీ ఏర్పాటు చేసి గొడవకు కారణమైన ఇద్దరు ఉద్యోగులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిన్న అసలేం జరిగిందంటే.. తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్‌చైర్‌పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్‌కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్‌కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. చదవండి: పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. భార్యపై అనుమానం.. తెల్లవారు జామునే నిద్రలేచి.. -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: రాప్తాడు టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్‌తో సహా తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముష్టికోవెల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట్రాముడుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇచ్చావంటూ పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట -
సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు
తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సహకారం లేకుంటే..తాను ఈరోజు మునిసిపల్ చైర్మన్ అయ్యుండే వాడిని కాదన్నారు. ఆయన తల్చుకుంటే ఏమైనా చేసి ఉండొచ్చని.. కానీ ఆయనలోని నైతిక విలువలను ఈరోజు స్పష్టంగా గమనించానని తెలిపారు. హ్యాట్సాఫ్ టు సీఎం అని ప్రశంసించారు. తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పనిచేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి నిధులను కోరేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తానని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు భేష్ అని జేసీ కితాబిచ్చారు. చదవండి: బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు? నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ -
ఓటమి భయంతో జేసీ కంటతడి..!
సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురీతున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న జేసీ.. ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటమి భయంతో ఆయన కంటతడి పెట్టారు. తాడిపత్రిలో ఏదో జరిగిపోతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేని వాహనాల్లో వెళ్తూ పోలీసులతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పేందుకు యత్నించిన టీడీపీ నేత రఘుపై దాడికి పాల్పడ్డారు. బూతులతో మరోసారి రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జేసీ దౌర్జన్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. జేసీ పవన్‌పై కేసు తాడిపత్రి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌రెడ్డిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. గత ఆదివారం అర్ధరాతి టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున తాడిపత్రిలోని హరిజనవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ కాన్వాయ్‌తో హరిజనవాడకు చేరుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం పట్ల షాడో టీం ఫిర్యాదు మేరకు జేసీ పవన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: అయోమయంలో టీడీపీ.. చంద్రబాబు మాటలతో చేటే! మహిళను మెడవంచి కొట్టిన అశోక్‌గజపతిరాజు -
మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీతకు తన జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కనగానపల్లి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రామలింగయ్య టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ నుంచి పలువురు నాయాకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భవం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ సర్పంచ్‌గా ఎంపీపీగా, పదవులు అలంకరించిన కేఎస్ ఫైరోజ్ బేగం, ఆమె భర్త జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ ఉమర్‌తో పాటు మరో 50 కుటుంబాలకు చెందిన 200 మంది ఆదివారం వైఎస్సార్సీపీలో చెరిన విషయం తెలిసిందే. చదవండి: ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు