Viral: దాహమేసిన కోతికి కొబ్బరి బోండాం దొరికితే! | Monkey To Peel Fibrous Part Of Coconut In Viral Video Anantapur | Sakshi
Sakshi News home page

Viral: దాహమేసిన కోతికి కొబ్బరి బోండాం దొరికితే!

Published Wed, Oct 6 2021 1:49 PM | Last Updated on Wed, Oct 6 2021 2:51 PM

Monkey To Peel Fibrous Part Of Coconut In Viral Video Anantapur - Sakshi

కోతులు జనావాసాలకు వస్తే.. ఇళ్లలో ఉండే ఆహారపదార్థాలను ఎత్తుకెళ్లి మరీ తింటాయి. నగరంలో అయితే పండ్లు, కూరగాలయలు, కొబ్బరి బోండాం షాప్‌లపై పడుతుంటాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే.. ఆ ఆనందం వేరు! అయితే కొబ్బరి చిప్పకు బదులు కొబ్బరి బోండాలు దొరికాయి. అసలే దాహం, ఆకలిలో మర్కటం ఓ కొబ్బరి బోండాన్ని తానే స్వయం ఒలుచుకుంది.

మనుషుల వలే కొబ్బరి పీచును నెమ్మదిగా తీసింది. పచ్చి కొబ్బరి బోండాం కావటంతో ఆకలికి ఆగలేని కోతి.. పీచును కూడా తిన్నది. అయితే ఆ కొబ్బరి బోండాలు తాగి పక్కకు పడేసిన వియషం దాని తెలిక కొబ్బరి కోసం కుస్తీ పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ఓ మార్ట్ వద్ద  చోటుచేసుకుంది.

దాహం వేసిన మర్కటం కొబ్బరి బోండాంను తానే స్వయంగా ఒలచుకుంది. చివరి నిముషంలో కొబ్బరిబోండాం వ్యాపారి ఆ మర్కటాన్ని తరిమివేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement