
పెళ్లిళ్లల్లో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. మూడుముళ్లూ పడి, అమ్మాయి అత్తారింటికి వెళ్లేదాకా వధువు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మర్యాదలకోసం అత్తింటివారు చేసే ఆగడాలు, పెళ్లి కొడుకు అలకలు, అబ్బో..ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉంటాయి. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. కానీ ఒక షాదీలోకి అనుకోని అతిధి వచ్చి గందరగోళం సృష్టించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చివరిదాకా చదవాల్సిందే.!
పెళ్లి వారంతా హల్దీ వేడుకలో సందడిగా ఉంటే, ఎక్కడినుంచి వచ్చిందో ఒక మర్కటం నానా హంగామా చేసింది. సందు చూసుకొని తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. దీనికి తోడు ఇంకో పిల్లకోతి కూడా చేరింది. అతిథుల చేతిలోని పళ్లను చేతపట్టుకుని గెంతులేస్తూ అక్కడున్న వారినందరినీ హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో షేర్ అయింది. వధూవరుల హల్దీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అతిథులంతా వధూవరులకు పసుపు పూస్తూ, నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా పూర్తిగా వేడుకల్లో మునిగిపోయారు. మరికొందరు ఫోటోలు క్లిక్ చేస్తూ బిజీ...బిజీగా ఉన్నారు.
ఇంతలో, ఒక కొంటె కోతి, దాని పిల్ల ఎంట్రీ ఇచ్చాయి. పళ్లు,పళ్లాలతో కొతి గెంతులు వేసింది. ఇంతటితో ఆగలేదు.. ఏకంగా పండ్లతో నిండిన పళ్లాన్ని పట్టుకుని కనిపించింది. ఓరి దేవుడా.. అని స్పందించేలోగానే అతిథుల చేతిలోని పండ్లను చేతబట్టుకొని ఇంకోచోటికి తుర్రుమంది. దీంతో పెళ్లి కొడుకు సహా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడ్నించి జారుకుంది. కాసేపటికి తేరుకున్న అందదూ నవ్వుల్లో మునిగి పోయారు. మనమూ కోతి నుంచే వచ్చాంగా అనుకున్నారో ఏమోగానీ మరింత అల్లరి చేశారు. దీంతో అప్పటిదాకా ఆందోళనగా ఉన్న అక్కడి వాతావరణం మంకీ గలాటాతో నవ్వులతో నిండిపోయింది.
;
స్వయంగా హనమాన్‌జీ యే వచ్చాడు: నెటిజన్లు
ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమాన్ జీ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు" , స్వయంగా హనుమంతుడే దిగివచ్చాడు అని కొందరు, ఏది జరిగినా మన మంచికే అని మరికొందరు, అయ్యో.. ఇంకొన్ని పళ్లు తీసుకుని వెళ్లాల్సి ఉందని కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment