mehindi
-
ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా
సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో సెలబ్రిటీ వధువుల ఫస్ట్ ఆప్షన్ ఆమె. బాలీవుడ్ క్వీన్స్ అందాల హీరోయిన్ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్ ఫ్యావరేట్. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.వీణా నగ్దా మెహందీ ఆర్ట్‌పై తన తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్ అంబానీ కోకిలాబెన్ ఫోన్ నెంబరు, కార్డు ఉండాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు. అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.ఇషాకు ఆరేళ్లప్పటినుంచి గోరింటాకు పెడుతున్నాఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీణా నగ్దాను మెహందీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్‌లో ఉండేవారికి ఇంటికి వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.పారిస్ ఒలింపిక్స్ 2024, మెహిందీ ఆర్ట్పారిస్ ఒలింపిక్స్ 2024కి ఆహ్వానించినపుడు తానెంతో పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియన్ హౌస్‌లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం, ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్ రింగ్‌ను మెహందీ డిజైన్ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని కూడా వీణా గుర్తు చేసుకున్నారు. -
సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే..
పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారుఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్‌ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్. ముఖేష్, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్‌కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్-రణవీర్ సింగ్, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు. వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్ అలాంటిది మరి. -
Mehndi: గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇందులోని లాసోన్ అనే రసాయనం వల్ల..
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆనవాయితీ ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. లాసోన్ అనే సహజమైన రసాయనం వల్లే! ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. చదవండి: Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే.. -
ఫెమీనా మెహెందీ పోటీలు
-
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు మెహిందీ అడ్డంకి
ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థినులు చేతికి పెట్టుకున్న మెహిందీ అడ్డుతగిలింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం విద్యార్థినులు చేతికి మెహిందీ పెట్టుకున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 9 నుంచి ప్రారంభమైన బీఈడీ సోషల్ స్టడీస్‌లో ప్రవేశానికి సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్‌కు నగరంలోని ఏవీ కాలేజీలో కౌన్సెలింగ్‌కు హాజరైన కొందరు విద్యార్థినుల చేతికి ఉన్న మెహిందీ వలన బయోమెట్రిక్ యంత్రం వారి చేతి గుర్తులను స్వీకరించడం లేదు. దీంతో వారికి మరోక రోజు అవకాశం ఇచ్చారు. ఆదివారం (10న) చేతులు బాగ కడుకొని వచ్చినా చేయ్యంతా మెహిందీ వలన ఎర్రబడడంతో బయోమెట్రిక్ యంత్రం చేతి గుర్తులను స్వీకరించలేదు. బీఈడీ సోషల్ స్టడీస్ సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్ సోమవారంతో (11న) ముగియనున్నందున విద్యార్థినుల ఫోటోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎడ్‌సెట్-2016 ప్రవేశ పరీక్ష నాటికి వారి చేతులు మాములుగా ఉండడం వలన బయోమెట్రిక్ యంత్రంతో అప్పుడు సమస్య తలెత్తలేదు. కేవలం మెహింది చేతులకు పెట్టుకోవడం వలనే సమస్య వచ్చిందని ఎడ్‌సెట్ అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఈ సమస్యపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.