సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్‌కి ఎంత ఛార్జ్‌ చేస్తారంటే.. | Celebrity Mehendi Artist Veena Nagda Who Charges Much For One Design | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్‌కి ఎంత ఛార్జ్‌ చేస్తారంటే..

Published Tue, Jun 25 2024 4:40 PM | Last Updated on Tue, Jun 25 2024 7:08 PM

Celebrity Mehendi Artist Veena Nagda Who Charges Much For One Design

పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్‌ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్‌లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు

ఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్‌లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్‌ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌-రాధికల  ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్‌. 

ముఖేష్‌, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్‌ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్‌ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్‌కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది.  సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్‌-రణవీర్‌ సింగ్‌, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు.  వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్‌ అలాంటిది మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement