Hands
-
మృదువైన చేతులు... ముచ్చటేసే ముఖం కోసం...!
చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతగాలుల వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది. వీటితో పాటు సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు! బ్యూటీ టిప్స్స్పూన్ గ్లిజరిన్, స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ముఖ చర్మం మృదువుగా అవుతుంది.కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.ఓట్మీల్ పౌడర్ టీ స్పూన్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది. -
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే..
పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారుఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్‌ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్. ముఖేష్, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్‌కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్-రణవీర్ సింగ్, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు. వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్ అలాంటిది మరి. -
చేతులు రఫ్‌గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా
కొంతమందికి చేతులు, మోచేతులు నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని రకాల డ్రెస్సులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో మీచేతులు అందంగా, మృదువుగా, మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.పులిసిన పెరుగుపైన ఉండే మీగడ తీసుకుని చేతులకి మసాజ్ చే స్తూ ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి. పెట్రోలియమ్ జెల్లీతో కూడా మసాజ్ చేసుకోవచ్చు.ఆలివ్ ఆయిల్ ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, గ్లిజరిన్ ఒక చెంచా, గోధుమరవ్వ రెండు చెంచాలు, ΄ాలు ఒక చెంచా కలిపి చేతులకి రాసుకుని గంట తర్వాత వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.స్పూను దానిమ్మరసం, స్పూను టొమోటో గుజ్జు కలిపి దానిలో కొన్ని గ్లిజరిన్ చుక్కలు కలిపి చేతులకి పట్టించి ఒక గంట అయిన తర్వాత కడుక్కుంటే చేతులు చక్కగా మెరుస్తాయి. రెండు స్పూన్ల దానిమ్మరసంలో స్పూను పంచదార కలిపి చక్కెర కరిగిన తర్వాత చేతులకి పట్టించి నెమ్మదిగా మసాజ్ చేస్తే చేతులు నున్నగా ఉంటాయి.చెంచా బాదం పొడిలో తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేసుకొని చేతులకి రాసుకొని ΄ావుగంట తర్వాత కడుక్కోవాలి.నారింజ రసం రెండు చెంచాలు, తేనె రెండు చెంచాలు కలిపి చేతులకి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో కడుక్కోవాలి.రెండు చెంచాలు గ్లిజరిన్, రెండున్నర చెంచాలు రోజ్ వాటర్ కలిపి చేతులకి మసాజ్ చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు చేతులకి బేబీ ఆయిల్ పూసి మృదువుగా మసాజ్ చేస్తే చేతులు కోమలంగా ఉంటాయి. -
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్‌కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్‌లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్‌ఫోన్స్‌తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!
ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది. ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. -
చేతులు లేకున్నా చెక్కుచెదరలేదు
కాగజ్‌నగర్‌టౌన్: పుట్టుకతోనే చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. కాళ్ల వేళ్లే కుంచగా మారి అందమైన బొమ్మలెన్నో వేశాయి..కంప్యూటర్ కీ బోర్డుపై టక్టక్ శబ్దం వినిపిస్తూ ఎన్నో ఎంట్రీలు చేశాయి. ఆర్థిక ఇబ్బందులెన్ని ఎదురైనా నిరుత్సాహపడకుండా పీజీ వరకూ చదివి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు జాకీర్‌పాషా. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఆటో డ్రైవర్ షేక్ బాబా–మెహరా దంపతుల మొదటి సంతానమైన జాకీర్ పాషా డిగ్రీ వరకు కాగజ్‌నగర్‌లోనే చదివాడు. ఆపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నాడు. పీజీ చదువుతుండగానే కంప్యూటర్ కోర్సులు కూడా పూర్తి చేశాడు. ♦ జాకీర్‌పాషా కాళ్లతో పెయింటింగ్స్ వేయడమే కాకుండా.. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాడు. ♦ హరితహారం కార్యక్రమంలో వందలాది మొక్కలను కాళ్ల సాయంతో నాటి ఆదర్శంగా నిలిచాడు. ♦ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కేంద్రానికి వెళ్లి కాలి సాయంతో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ♦ తాజాగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి పలువురు ఆపరేటర్లను ఎంపిక చేశారు. అందులో జాకీర్పాషాకు అవకాశం దక్కింది. కాళ్లతోనే వివరాలను అప్లోడ్ చేస్తున్నాడు. రుణంరాలేదు.. కొలువూదొరకలేదు గత నవంబర్‌లో తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వెలువడిన రుణాల కోసం జాకీర్‌పాషా దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన కొలువు ఇప్పించాలని పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సైతం కొలువు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు సమరి్పంచాడు. ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూపు మాది నిరుపేద కుటుంబం. నాతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. నాన్న ఆటో నడిపితే వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నా. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది. – జాకీర్ పాషా, దివ్యాంగుడు -
ప్రేమతో... జామ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు గరిటె పట్టారు. తల్లి సోనియాగాంధీతో కలిసి బత్తాయి జామ్ తయారు చేశారు. పెరట్లో పండిన బుల్లి బత్తాయిలతో తయారు చేసిన ఆ జామ్ తనకెంతో ఇష్టమని సోనియా చెప్పారు. ఈ ఆసక్తికర వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి తోటలోని బత్తాయిలను తెంపుకొచ్చి జామ్ తయారు చేస్తూ తమ ఆహార ఇష్టాయిష్టాలను సరదాగా పంచుకున్నారు. కావాలంటే బీజేపీ వాళ్లకు కూడా జామ్ ఇద్దామని రాహుల్ అంటే, ‘మనకే తిరిగిచ్చేస్తా’రని సోనియా బదులిచ్చారు. జామ్ రెసిపీ తన చెల్లెలు ప్రియాంకదని రాహుల్ వెల్లడించారు. తల్లికి ఒకప్పుడు పచ్చళ్లు నచ్చేవి కావని, ఇప్పుడవి ఎంతో ఇష్టమని రాహుల్ అన్నారు. బ్రిటన్‌లో ఉండగా వంట నేర్చుకున్నానన్నారు. తానెప్పుడు విదేశాల నుంచి తిరిగొచ్చినా ముందుగా పప్పన్నం తినాల్సిందేనని సోనియా చెప్పారు. మాటల మధ్యే తయారైన జామ్‌ను ఇద్దరూ కలిసి చిన్న గాజు సీసాల్లో నింపారు. ‘ప్రేమతో.. సోనియా, రాహుల్’ అని రాసి స్నేహితులు, బంధువులకు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. -
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజల ఆత్మగౌరవం..అవసరం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా.. మీ అండ, బలగం ఉన్నంత కాలం దేనికీ తలవంచను.. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది.’అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ టికెట్ల జాబితా ప్రకటించగా, తుమ్మలకు స్థానం దక్కలేదు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆయన శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల అనుచరులు వెయ్యికి పైగా కార్లు, ఇతర వాహనాల్లో వచ్చినాయకన్గూడెం వద్ద తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఖమ్మంలోని గొల్లగూడెంలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు పదవి అలంకారం, అహంకారం, ఆధిపత్యం కోసం కాదని ప్రజల కళ్లలో చిరునవ్వు చూడటం కోసమేనని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా గోదావరి జలాలతో జిల్లా ప్రజల కాళ్లు కడిగి రాజకీయాల నుంచి విరమిస్తానని సీఎం కేసీఆర్‌కు చెప్పానని, అది నెరవేరాకే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. ప్రస్తు తం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా.. ప్రజల ఆరాటం, అభిమానం చూశాక తనకు అవసరం లేకపోయినా.. జిల్లా కోసం, ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పాలేరు, వైరా, లంకాసాగర్, ఉభయ జిల్లాల్లోని రిజర్వాయర్లను నింపి రాజకీ యాల నుంచి విరమిస్తానని తుమ్మల వెల్లడించారు. తుమ్మల ఫొటోతో ప్రత్యేక జెండాలు ర్యాలీలో ప్రతీ వాహనానికి ప్రత్యేకంగా తుమ్మల ఫొటో ఉన్న తెల్లరంగు జెండాలు కట్టారు. ఎక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కానీ బీఆర్ఎస్ జెండాలు కానీ కనిపించలేదు. కొందరు తుమ్మల ఫొటో ఉన్న జెండాలతో పాటు కాంగ్రెస్ జెండాలు కూడా పట్టుకోవడం కనిపించింది. -
బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..
ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆస్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్‌ని కూడా ఇచ్చింది. అయినా క్రిస్టినా ఇంకా అలా డల్‌గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్‌కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. (చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!) -
వియత్నాంలో వండర్ బ్రిడ్జ్
-
భర్తను ఆరు నెలలుగా ఇంట్లో నిర్బంధించి..
-
భర్త కాళ్లు, చేతులు విరగొట్టి.. ఇంట్లో బంధించి!
సాక్షి, రాజమండ్రి: భర్త అనే మర్యాద, ప్రేమ లేదు.. కనీసం సాటి మనిషి అనే కరుణ లేదు. కట్టుకున్నవాడిని ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా చిత్రవదకు గురిచేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరగిరిపట్నానికి చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమయింది. మొదట్లో బాగానే నడిచిన వీరి కాపురం, తర్వాత గొడవలకు దారి తీసింది. ఒక రోజు గొడవ పెరిగి కోపోద్రిక్తురాలైన భార్య సత్యనారాయణ కాళ్లు, చేతుల విరగొట్టింది. బయటకు పొక్కకుండా ఆరు నెలలుగా అతడిని ఇంట్లోనే బంధించి, ప్రతిరోజు అతడిని చిత్రవదలకు గురిచేసింది. భార్య చెర నుంచి తప్పించుకున్న సత్యనారాయణ బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించి సత్యనారాయణను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
భార్య చేతిలో చెయ్యేస్తే నొప్పి మాయం
న్యూయార్క్: ఆలు మగలు చేతిలో చేయేసి పట్టుకు తిరగాలోయ్! అని ఓ భావ కవి ఊరికే అనలేదేమో! అలా తిరిగినట్లయితే భార్యకున్న చేతి నొప్పులు ఇట్టే మాయమై పోతాయని అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలా చేయడం వల్ల భర్త గుండె లయ, శ్వాసప్రక్రియ భార్య గుండె లయ, శ్వాసప్రక్రియ సమమవడం ద్వారా భార్య చేతుల్లోని నొప్పి, మంట మాయం అవుతుందని వారు అంటున్నారు. భార్య చేతిని సానుభూతితో పటిష్టంగా పట్టుకొని కూర్చున్నా, నిలబడినా, నడిచినా ఫలితం సమంగా ఉంటుందట. చేతులు పట్టుకోకుండా పక్కపక్కనే కూర్చున్నా ఫలితం ఉండదట. 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సున్న 22 జంటలపై ఈ పరిశోధన సాగించారు. వారిని చేతులు పట్టుకోకుండా పక్క పక్కన కూర్చోబెట్టి, వారిని పక్కపక్క గదుల్లో విడివిడిగా ఉంచి, చేతులు పట్టుకొని కూర్చుని, నిలబెట్టి ఈ ప్రయోగాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆడవాళ్లకు ముంజేతుత్లో కొంచెం నొప్పి, మంట తరచుగా వస్తాయని, అందుకనే వారిపైనా ఈ పరిశోధన చేసినట్లు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఒక్క ఆలుమగలు చేతులు పట్టుకుంటేనే ఫలితం ఉంటుందా? ప్రేమికులు పట్టుకుంటే కూడా ఈ ఫలితం ఉంటుందా? అసలు స్త్రీ, పురుషులు పట్టుకుంటే కూడా ఫలితం ఉంటుందా ? అన్న విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు తేల్చలేదు. -
ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!!
టోరంటో: తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి? శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు తొలగిపోవడానికి కడుక్కోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్త ఆలోచనలు రావాలంటే చేతులు కడుక్కోవాలనే విషయం మీకు తెలుసా? శాస్త్రవేత్తలు మాత్రం ఇదే చెబుతున్నారు. చేతులు కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోవడమే కాకుండా పాత ఆలోచనలు దూరమై, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు. కెనడాకు చెందిన యూనివర్సిటి ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. చేతులు కడుక్కున్న వెంటనే పాత నిర్ణయాలను పక్కకునెట్టి కొత్త లక్ష్యాలకోసం మన మెదడు ఫ్రెష్‌గా ఆలోచిస్తుందంటున్నారు. పరిశోధనలో భాగం గా కొంతమందిని ఎంపికచేసి, వారికి ప్రేరేపణ కలిగించే నాలుగురకాల పరీక్షలను నిర్వహించారు. అంతకుముందు ఎంపికచేసిన వారిలో కొందరిని చేతులు కడుక్కోమని చెప్పా రు. అలా చేతులు కడుక్కున్నవారు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారట. అందుకు కారణం.. వారిలో సానుకూల భావనలు పెరగడమేనని, అంతకు ముందున్న పాత ఆలోచనలు సమసిపోవడమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. -
విమానంలో హెడ్‌ఫోన్ పేలితే..
గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో బెంబేలెత్తిన వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా ఆస్ట్రేలియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళ...ఇయర్ ఫోన్స్ లో సంగీతం వింటుండంగా సడన్ గా పేలిపోవడం ఆందోళకు దారి తీసింది. విమానాల్లో బ్యాటరీతో పనిచేసే పరికరాల ప్రమాదాల గురించి తరచూ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ ఈ సంఘటన చోటు చేసుకుందని బుధవారం అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 19న బీజింగ్ నుంచి మెల్బోర్న్ వస్తుండగా ఓ మహిళ ఆ హెడ్ ఫోన్స్ అకస్మాత్తుగా పెద్ద శద్దంతో పేలిపోయాయి. మ్యూజిక్ వింటుండగా సడెన్ పేలిపోయాయయనీ, చిన్న చిన్న నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని దీంతో నా ముఖమంతా కాలిపోతున్న అనుభూతి కలిగిందని తెలిపింది. తన మెడచుట్టూ ఉన్న హెడ్ ఫోన్ ఒక్క ఉదుటున విసిరికొట్టానంటూ తన భయంకర అనుభవాలను ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో కి నివేదించింది. దీంతో పాటు నల్లబడిన ముఖం , చేతులు, మెడపైన బొబ్బల్ని అధికారులకు చూపించిందా మహిళ. విమాన సహాయకులు వచ్చి బకెట్ నీళ్లు గుమ్మరించినా, అప్పటికే బ్యాటరీ, దాని కవరు మొత్తం కరిగిపోయి ఫ్లోర్‌కు అతుక్కుపోయిందని చెప్పింది. అలాగేకరిగిన ప్లాస్టిక్, కాలిన ఎలక్ట్రానిక్స్, కాలిన జుట్టు లాంటి వాసనను తోటి ప్రయాణికులు భరించలేకపోయారని తెలిపింది. మొత్తం అక్కడున్నవారంతా దగ్గుతూ ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారని చెప్పింది. కాగా విమానాల్లో ఇటీవల ఇలాంటి పేలుళ్ల ఘటనలు బాగా పెరిగాయి. విమాన ప్రయాణాల్లో బ్యాటరీలతో పనిచేసే డివైస్ లను సంబంధిత లగేజ్ ఏరియాలలో దాచి పెట్టడం లేదా వాడకుండా ఉండడం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. విచారణలో లిథియం బ్యాటరీ మూలంగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తేల్చారు. -
కొత్తగూడెం జిల్లాలో ఆదర్శ యువకుడు
-
ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని రాష్ట్ర సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ అన్నారు. మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు గురువారం సంస్థాన్ నారాయణపురంలో సన్మానం చేశారు. అంతకుముందు జయశంకర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వళన చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. విద్యార్థులను సరైన దారిలో నడిపించి, వారకి ఒక లక్ష్యం ఏర్పాటు చేసి, ఆ దిశగా అడుగులు వేయించే బాధ్యత కూడా ఉపాధ్యాయులదేనన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంఈఓ జి.వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీలో పేదల గుడిసెలు ఉన్నపళంగా కూల్చి వేసేందుకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు గహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 సంవత్సరంలో సుమారు 312 మందికి పైగా నిరుపేదలకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారని, గత కొంతకాలంగా తమను ఖాళీచేయించాలనే ప్రయత్నాలు స్థానిక నాయకులు చేస్తుండటంతో పేదలు గమనించి కోర్టును ఆశ్రయించారన్నారు. గహాలు నిర్మించుకోక పోవడం వల్ల ఖాళీ చేయిస్తున్నామని ప్రభుత్వం తరఫున కోర్టులో వాదన వినిపించారని, నిజంగా ఇళ్ళు వేసుకోకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇంతవరకు డ్యూ ప్రాసెస్ చేపట్టకుండానే రెవెన్యూ అధికారులు రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. హఠాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రొక్లెయిన్లతో, పోలీసు బలగాలతో వెళ్లారని, ఇది మంచిది కాదన్నారు. నిజంగా గహాలు నిర్మించుకోకపోతే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వారిని ఖాళీ చేయించాలన్నారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే, వారి తాబేదారుల ఒత్తిడి మేరకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని అంబటి ఆరోపించారు. కోర్టులు, చట్టాలను అధికారులు మోసం చేయడం భావ్యం కాదన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న పాలకులు కాపాడవచ్చని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉన్న పోలీసులను గుడిసెలు కూల్చడానికి వినియోగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రాజకీయాలకతీతంగా నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాకలెక్టర్‌తో మాట్లాడామన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల దష్టికి కూడా ఈవిషయాన్ని పేదలు తీసుకువెళ్లారన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారి కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యూత్ సెల్ పట్టణ, మండల అధ్యక్షులు అచ్యుత్ శివప్రసాద్, కళ్ళం విజయభాస్కరరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, గుడిపూడి వాసులు తదితరులు పాల్గొన్నారు. -
బాలల చేతుల్లో కర్పూరం వెలిగించింది...
లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్): దొంగతనం నేరం మోపి.. నిజ నిర్ధారణ కోసమంటూ చిన్నారుల చేతుల్లో కర్పూరం వెలిగించి గాయపరిచిన ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో వెలుగుచూసింది. గ్రామంలోని ప్రజాచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పది మంది బాలురతో ఆర్బీసీ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్లో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడి డబ్బును ఎవరో దొంగిలించారు. ఈ విషయమై స్కూల్ అటెండర్ అన్నపూర్ణమ్మ ముగ్గురు బాలురను అనుమానించింది. శుక్రవారం సాయంత్రం వారి అరచేతుల్లో కర్పూరం ఉంచి వెలిగించింది. అది కాలితే దొంగతనం చేసినట్లు...లేకుంటే నిజాయితీపరులేనని వారికిపరీక్షపెట్టింది. అయితే,కర్పూరం మంటతోముగ్గురి చేతులకూ కాలినగాయాలయ్యాయి. ఈ విషయంలో బాధితుల తరఫు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చెన్నారెడ్డికి అధికార టీడీపీ నేతల అండదండలున్నాయని సమాచారం. -
వైకల్యాన్ని జయించి..
రెండు చేతులూ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించి అనేక అవార్డులు రివార్డులు పొందాడు. అనుకోకుండా తనకు సంభవించిన వైకల్యాన్ని ఎదిరించి జీవితంలో ప్రత్యేకతను సాధించాడు. పధ్నాలుగేళ్ళ వయసులో చేతులు రెండు కోల్పోయినా విద్యతోపాటు, తనకిష్టమైన చిత్రలేఖనంపై దృష్టిని నిలిపి అపురూప దృశ్యకావ్యాలను రూపొందిస్తూ అందర్నీ అబ్బుర పరుస్తున్నాడు. ధవల్ కత్రి తన 14 ఏళ్ళ వయసులో జరిగిన ప్రమాదంలో రెండు చేతులనూ పోగొట్టుకున్నాడు. పాఠశాల సిబ్బంది కూడ అతడిని ప్రోత్సహించడం మానేసి, సెలవు తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ అటువంటి అడ్డంకులను ఏమాత్రం పట్టించుకోని ధవల్.. పట్టుదలతో తన విద్యభ్యాసాన్ని కొనసాగించడంతోపాటు, పరీక్షలన్నీ స్వతహాగా రాయడమే కాక, గిటారు వాయించడంలోనూ, పెయింటింగ్స్ వేయడంలోనూ ఆరితేరాడు. అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారు కూడ సాధించలేని విజయాలను సాధిస్తూ ఇప్పటివరకూ 300 వరకూ పెయింటింగ్స్ వేసిన ధవల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
చేత్తోనే ఎందుకు తినాలి?
పూర్వకాలంనుంచీ అవలంబిస్తున్న సంస్కృతీ, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత ఉన్నట్లు అనేకసార్లు రుజువైంది. పాతకాలంవారు పాటించిన ప్రతి పద్ధతి వెనుకా సైన్స్ దాగున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భోజనం చేయడం విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులకు కేరళ వాసులు మాత్రం నేటికీ దూరంగానే ఉన్నారు. భోజనం చేసేందుకు స్పూన్లు, ఫోర్కులు వాడకుండా నియమంగా చేత్తో కలుపుకొని తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ అలవాటు వెనుక అంతరార్థం ఆరోగ్యమేనంటున్నారు. ఆహార పదార్థాలను చేతులతో కలిపి తినడంవల్ల శరీరానికే కాక, మనస్సుకు, ఆత్మకు కూడ బలాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనానికి వాడే అరటి ఆకు అనుభవం వెనుక వేద జ్ఞానం కూడ ఇమిడి ఉందంటున్నారు. భారతీయ సంప్రదాయ భోజన విధానంలో చేత్తో కలుపుకొని తినడం వెనుక అనేక రకాల ఆరోగ్య రహస్యాలున్నట్లు కేరళలో కొలువైన రిసార్ట్ లోని ఛెఫ్ లు చెప్తున్నారు. కేరళ ఉత్తర కాసర్గోడ్ జిల్లాలోని 26 ఎకరాల్లో సుందరమైన, సద్గుణాలు కలిగిన పాకశాస్త్ర పరిజ్ఞానంతో కూడిన రిసార్ట్ ను తాజ్ బెకాల్ కు చెందిన వివంతా ఛెప్స్ అభివృద్ధి పరిచారు. ముఖ్యంగా కేరళ సంప్రదాయ వంటకాలతో కూడిన భోజనాన్ని, చేత్తో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను, లాభాలను పాశ్చాత్యులకు సైతం వివరిస్తూ, తినే విధానాన్ని పద్ధతిగా నేర్పిస్తున్నారు. చేతులతో తినడం వెనుక వేదజ్ఞానం ఉందని నిరూపిస్తూ... వారు స్వాధీనం చేసుకొన్న ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లోని వివరాలను, కాగితంపై ముద్రించి అక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఆయుర్వేద గ్రంథాల్లోని వివరాల ప్రకారం మన చేతి, కాళ్ళ వేళ్ళు వాహక నాళానికి మూలాలుగా పని చేస్తాయని, ముఖ్యంగా బొటన వేలు వల్ల కలిగే అగ్న.. జీర్ణక్రియకు సహకరించే స్వభావం కలిగి ఉంటుందని చెప్తున్నారు. మిగిలిన నాలుగు వేళ్ళలో చూపుడు వేలు వాయువును, మధ్యవేలు ఆకాశాన్ని, ఉంగరంవేలు భూమిని, చిటికెన వేలు నీటికి మూలకాలుగా వ్యవహరిస్తాయని అందుకే చేతి వేళ్ళతో ఆహార పదార్థాలు కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని అక్కడి కాగితాల్లోని వివరాల ఆధారంగా వివరిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యంగా శాకాహార సంప్రదాయ భోజనానికి వాడే అరటి ఆకులో కూడ ఎన్నో సద్గుణాలు ఉన్నాయని అక్కడి ఛెఫ్ లు చెప్తున్నారు. అంతేకాక భోజనాపికి వాడే ముడి బియ్యంలో కూడ కీళ్ళనొప్పులు, అల్సర్లతో పాటు అనేక రకాల నరాలకు సంబంధించిన రోగాలను నివారించే శక్తి ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి ప్రాశస్త్ర్యం కలిగిన సంప్రదాయ భోజనానాన్ని చేత్తో తినేందుకు ఇప్పుడు విదేశీయులు సైతం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. -
సెల్ఫీ వ్యామోహం ఉన్నవారికి 'టీ రెక్స్ హ్యాండ్'
సెల్ఫీల వ్యామోహం ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. అనేక వినూత్న భంగిమల్లో ఫొటోలు తీసుకోవాలని మనసు పడేవారికి, ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని ఇష్టపడేవారికి లేటెస్ట్ ట్రెండ్‌గా టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) హ్యాండ్స్ పోజును లండన్ కు చెందిన ఓ బ్యూటీ బ్లాగర్ పరిచయం చేసింది. చేతి వేళ్లను ముఖానికి దగ్గరగా అనేక భంగిమల్లో ఉంచుతూ ఫొటోలు తీసుకొని ఆ అందాలను మీరే స్వయంగా చూసుకోవాలని సలహా ఇస్తోంది. సెల్ఫీల ధోరణి ఎక్కువైన నేటికాలం జనానికి కొత్త రకం సెల్ఫీ స్టైల్ ను పరచయం చేసింది.. లండన్ కు చెందిన బ్యూటీ బ్లాగర్, ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ హుడా కట్టమ్. థైబ్రోస్, డక్ ఫేస్ లాంటి విభిన్న చిత్రాలను తీసుకోవడం సైతం పాత పద్ధతిగా మారిన నేపథ్యంలో... వినూత్నంగా టీ రెక్స్ ప్రయోగాన్ని ఆమె తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. మీరు సెల్ఫీ తీసుకునే సమయంలో రెండు చేతులను ఉపయోగించి, ముఖానికి దగ్గరగా ఉంచుకొని ఫొటో తీసుకుంటే టీ రెక్స్ ప్రభావం మీకే తెలుస్తుందంటూ ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించిన సదరు మహిళ వివరించింది. తాను స్వయంగా ఆ అనుభవాన్ని ఆస్వాదించినట్లు కట్టమ్ ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది. ఓ కొత్త పోజులో మీరు కనిపించాలనుకున్నపుడు కెమెరా పట్టుకున్న మీ చేతులను కళాత్మకంగా ముడుస్తూ.. ముఖం దగ్గర, గడ్డం మీద, జుట్టు మీద ఉంచి చూడమంటోంది. మీరు చేతిని, చేతి వేళ్లను కదులుస్తూ, ముఖంలోని ఒక్కో భాగంపై పెడుతూ టి రెక్స్ ను ఉపయోగించి చూస్తే సెల్ఫీ మజా ఏమిటో తెలుస్తుందంటోంది. ముఖ్యంగా వేళ్లను నుదుటిపై ఉంచినపుడు టి రెక్స్ అద్భుతంగా కనిపిస్తుందని, అలాగే ముఖంలోని ప్రతి భాగం విభన్నంగా కనిపిస్తుందని కట్టమ్ చెప్తోంది. టి రెక్స్ థెరోపాడ్ డైనోసార్ హ్యాండ్ పద్ధతిలో తీసుకున్న సెల్ఫీలు సెలబ్రిటీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో హల్ చల్ చేస్తున్నాయి. -
లక్షలమందిని ఆకట్టుకుంటున్న కవలలు!
కవల పిల్లలు పుట్టడమే ఓ వింతగా కనిపిస్తుంది. నవజాత శిశువుల్ని చూసేందుకు కూడ అందరూ ఎంతో ఇష్టపడతారు. అటువంటిది ఆ పిల్లలు ఒకరికొకరు చేతులు పట్టుకొని మరీ పుట్టారంటే నిజంగా అది వింతే కదా! అందుకేనేమో ఇప్పుడు ఆ పసివాళ్ళ వీడియో ఫేస్ బుక్ యూజర్లను కట్టి పడేస్తోంది. ఆంథియా జాక్సన్, రూస్ ఫోర్డ్ ల కు పుట్టిన నవజాత శిశువులు క్రిస్టినా, క్రిస్టియన్ లు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుట్టిన ఆ పిల్లలు తల్లిదండ్రులకే ఎంతో ఆశ్చర్యం కలిగించారు. అందుకేనేమో ఆ పిల్లల మురిపాన్ని అందరితో పంచుకోవాలనుకున్న తల్లిదండ్రులు వారిద్దరినీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియోను కోటీ డెభ్భై లక్షలమంది చూశారు. అంతే కాదు లక్షా అరవై వేల మంది షేర్ కూడ చేశారు. అసలు తల్లి గర్భంలో ఉండాల్సిన కన్నా 11 వారాల ముందే... అంటే 28 వారాలకే పుట్టిన ఆ నవజాత శిశువులు ఒక్కొక్కరూ ఓ కేజీ మాత్రమే బరువున్నారు. అయితేనేం చేయీ చేయీ పట్టుకొని ముందుకు నడుద్దాం అన్నట్లుగా ఎంతో ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందర్నీఅకట్టుకుంటోంది. వీడియోను అనేకమంది ఇష్టంగా చూస్తుండటంతో తల్లి ఆంథియా.. ఆ కవల పిల్లల మరిన్ని ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పోస్ట్ చేసింది. అయితే దానికి వెనుక ఆతల్లి మనసు ఆరాటం ఉంది. తన పిల్లలు ప్రీమెట్యూర్డ్ గా పుట్టడంతో వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ఇతర తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను ఆమె ఆశిస్తోంది. అటువంటి పిల్లల పెంపకంపై అనుభవజ్ఞులైనవారి నుంచి సలహాలను కూడ ఆ తల్లి కోరుకుంటోంది. '' ప్రిమెట్యూర్ కవలలు పుట్టడంతో నేను చాలా ఖంగారు పడ్డాను. అయితే వారు కాస్త స్థిరపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. నేను వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడానికి చిన్న కారణం ఉంది. తల్లిదండ్రులంతా ఇచ్చే కామెంట్లతో నాలో ధైర్యం కలుగుతుందని ఆశించాను.'' అంటూ ఆంథియా ఫేస్ బుక్ లో తన కామెంట్ ను కూడ పోస్ట్ చేసింది. '' మా పిల్లలకు ఇంతటి ఆదరణ దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా పిల్లలకు కూడ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని కూడ తన భావాలను వ్యక్తం చేసింది. -
బాలుడి చేతిలో పేలిన బాంబు
మైదుకూరు (వైఎస్సార్ జిల్లా) : నేలపై గుండ్రంగా కనిపించిన వస్తువును బంతి అనుకుని చేతిలోకి తీసుకోగా.. అది పేలిపోవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి గ్రామం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ప్రసాద్ (14) అనే బాలుడు పశువులను మేపేందుకు గ్రామశివార్లకు వెళ్లాడు. అక్కడ నేలపై గుండ్రంగా కనిపించిన దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానికి వైర్లు బిగించి ఉండడంతో... చేతిలోకి తీసుకున్న వెంటనే పేలిపోయింది. ఈ ఘటనలో బాలుడి కుడిచేయి మణికట్టు వరకు తెగిపడిపోగా, ఎడమచేతి ఐదు వేళ్లూ తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని అక్కడే ఉన్న మరో రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. వీటిని అక్కడ ఎవరు పెట్టి ఉంటారనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆమె చేతుల్లో అద్భుతాలు..
ఆమె... ప్రకృతి కళా రూపాలకు జీవాన్ని పోస్తోంది. అరచేతిలో అద్భుతాలు సృష్టిస్తోంది. శారీరక వైకల్యాన్ని అధిగమించి.. ఆశావహ ధృక్పధంతో ముందుకు సాగుతోంది. పెయింట్లు, డిజైన్లతో తన మనసులోని భావాలు ప్రతిబింబింపజేస్తూ.. ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఎందరో కళాభిమానుల మనసు దోచుకుంటోంది. చేతివేళ్ళపై చిత్రలేఖనంతో ఆకట్టుకుంటున్నఆమె పేరు... లంతా నాయకర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇరవై ఆరేళ్ళ ఆ కళాకారిణి.. తన ఎడమ చేతిలో జీవకళ ఉట్టిపడే త్రీడీ కళారూపాలను చిత్రిస్తూ ప్రత్యేతను చాటుతోంది. పుట్టుకతో చెవుడు సంక్రమించినా.. అధైర్య పడని.. ఆ డర్బన్ ఆర్టిస్ట్.. యాక్రిలిక్ రంగులు, జెల్ పెన్ లను ఉపయోగించి పలు చిత్రాలు, ప్రకృతి దృశ్యాలను అరచేతిలో సాక్షాత్కరింపజేస్తోంది. సీతాకోక చిలుకలు, బాతులు, గొరిల్లాలు వంటి విభిన్న చిత్రాలను గీసేందుకు ప్రత్యేక టెక్నిక్ ఉపయోగించి, నిజంగానే ఆమె చేతులో ఆ జంతువులు నిలబడ్డాయా అన్న సహజత్వాన్ని కల్పిస్తోంది. నీటిలో తేలే చేపలు.. సముద్ర జీవులు నాయకర్ చేతి ఉపతితలంపైనే తేలియాడుతున్న భావన కలుగుతుంది. కొత్త కోణంలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ.. ఆమె గీసే చిత్రాలు ఎందరో కళాకారులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. -
ఆ చిన్నారికి 25 వేళ్లు
సాధారణంగా ఎవరికైనా రెండు చేతులు, కాళ్లకు కలిపి 20 వేళ్లుంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆరేసి వేళ్లవంతున 24 వేళ్లుంటాయి. అయితే శ్రీకాకుళం జిల్లా రాజాం మల్లికార్జునకాలనీకి చెందిన ఆకుల ఉమామహేశ్వరి, అనంతరావు దంపతులకు ఈ నెల 12న రాజాం సెయింటాన్స్ ఆస్పత్రిలో పుట్టిన చిన్నారికి రెండు కాళ్లకు 12, రెండు చేతులకు 12 వేళ్లే కాకుండా ఎడమ చేతికి అదనంగా మరో వేలు ఉంది. దీంతో 25 వేళ్లు కలిగినట్టయింది. ఈ విషయమై ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జయలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జన్యుపరమైన కారణాలవల్ల ఇలాంటి జననాలు అరుదుగా జరుగుతాయని తెలిపారు. - రాజాం -
గోరింట రిమూవర్‌గా ఉప్పు
బ్యూటిప్స్ చేతులకు పెట్టుకున్న గోరింటాకు రంగు మారడంతో ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే ఆ రంగును తొలగించి మళ్లీ కొత్తగా పెట్టుకొని చేతులకు అందాన్ని తెచ్చుకోండి. ఆ మారిన రంగు పోవాలంటే గోరు వెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి చేతులను ఓ 20 నిమిషాల పాటు అందులో నానపెడితే చాలు. మీ సమస్య తీరుతుంది. చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎరుపు రంగులోకి రావాలంటే ఓ కొత్త చిట్కా ఉంది. ఆరిన గోరింటాకును తీసేశాక వెంటనే కడిగేసుకోకుండా చేతులకు విక్స్ బామ్ కానీ జండూ బామ్ కానీ రాసుకోవాలి. అది ఎరుపును ముదురు రంగులోకి మార్చేందుకు తోడ్పడుతుంది. అలా ఓ అయిదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో చేతులను కడుక్కుంటే సరి. మందారం లాంటి ఎరుపురంగు గోరింటాకు మీ చేతుల సొంతం. -
చర్మం మీద నల్లమచ్చలు, తెల్లమచ్చలు
మన శరీరంలోని మెలానిన్ పిగ్మెంట్ కారణంగా చర్మం యొక్క వర్ణం ఉంటుంది. ఈ మెలానిన్ పిగ్మెంట్ ఉత్పత్తిలో ఉన్న హెచ్చుతగ్గుల వల్ల మన చర్మంలో తెల్లమచ్చలు లేదా నల్లమచ్చలు రావచ్చు. మెలానిన్ పిగ్మెంట్ వల్ల చర్మానికి, కంటికి, జుట్టుకి వర్ణం వస్తుంది. నల్లమచ్చల రుగ్మతలు: పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్: గాయం లేక వాపు వచ్చి మానడం వల్ల చర్మంలో నల్లమచ్చలు రావడాన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఈ అవస్థకి తరువాతనే మొటిమలు, సోరియాసిస్, ఎటోపిక్ మరియు కాంటాక్ట్ డెర్మటైటీస్, లెకైన్ ప్సానస్ వచ్చే అవకాశం వుంది. దీనివల్ల తెల్లమచ్చలు అప్పుడప్పుడు వచ్చే అవకాశం వుంది. మెలాస్మా: శరీరంలో ఏ భాగమైతే ఎక్కువగా ఎండకి బహిర్గతం అవుతుందో అక్కడ ఈ విధంగా గోధుమ వర్ణంలో వున్న మచ్చలు వస్తాయి. ముఖ్యంగా ముఖం, చేతులు, పాదాలు. ఈ రకమైన మచ్చలు గర్భిణిల్లో కూడా చూడవచ్చు, కాని ప్రసవం తరువాత వాటంతట అవే పోతాయి. సోలార్ లెంటిజినెన్స్: ఎక్కువ అల్ట్రావెలైట్ లైట్‌కి (కిరణాలకి) బహిర్గతమైనప్పుడు చర్మం మీద నల్లగా చిన్నిచిన్న మచ్చలు వస్తాయి. ఇవి ప్రాథమికంగా, ముఖం, చేతులు, ఛాతి, వీపు, కాళ్ళమీద వస్తాయి. ఎఫిలైడ్స్: ఇవి సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనబడతాయి. పిల్లలు ఎక్కువ ఎండకి బహిర్గతం అవడం వల్ల వస్తాయి. ఇవి ఎరుపు రంగు నుండి గోధుమ రంగులో ముఖము, మెడ, ఛాతి, చేతుల మీద వస్తాయి. ఇవి స్వయంగా వాటంతట అవే చలికాలం వచ్చేసరికి మానిపోతాయి. తెల్లమచ్చలు: విటిలిగో: మెలానిన్ శాతం తక్కువ అవ్వడం వల్ల చర్మం మీద తెల్లమచ్చలు ఏర్పడతాయి. ఇవి మృదువుగా, తెల్లమచ్చలుగా ఏర్పడతాయి. ఇవి శరీరం మీద అక్కడక్కడ లేదా మొత్తం కూడా రావచ్చు. ఆల్చినిజమ్: శరీరంలో పూర్తిగా మెలానిన్ పిగ్మెంట్ లేకపోవడం వల్ల ఈ రకమైన తెల్లమచ్చలు వస్తాయి. జుట్టు రంగు మరియు చర్మం రంగు తెల్లగా మారిపోతుంది. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం వుంది. టీనియా మెర్సికలర్: ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దీనిలో చర్మంపై అనేక తెల్లమచ్చలు పొరలలో కూడా వస్తాయి. ఈ మచ్చలు అప్పుడప్పుడు పెరుగుతాయి కూడా. చర్మం జిడ్డుగా ఉన్నవాళ్ళు, చెమటలు ఎక్కువగా వస్తున్నవాళ్ళు, వ్యాధినిరోధకశక్తి తగ్గినవాకి ఇవి ఎక్కువ రావడానికి అవకాశం వుంది. నిర్ధారణ: రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య చరిత్ర ఆధారంగా రోగనిర్థారణ చేయవచ్చును. చికిత్స విధానం: ఆయుర్వేద వైద్యానుసారం దూషించబడిన వాత, పిత్త, కఫ దోషాలను సమస్థితిలోకి తీసుకుని వచ్చే ఔషధాలు, అద్భుతమైన లేపనాలు, పంచకర్మ విధానాలు ఉన్నాయి. వ్యాధి ఆరంభంలోనే రోగి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి వ్యాధిని పూర్తిగా నివారించుకోవచ్చును. డాక్టర్ లక్ష్మీ. ఎం.డి ఆయుర్వేద స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, నేరేడ్మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ, మరియు కర్ణాటక అంతటా... ఫోన్.7416102102, www.starayurveda.com advertorial -
ఆరేళ్ల చిన్నారికి వాతలు
-
అరచేతిలో... ఎర్ర మందారాలు!
డిజైన్ ఆషాఢం అతివలకు చాలా ఇష్టమైన మాసం. గోరింటాకుతో ఎర్రగా పండిన అరచేతులను చూసుకుని మురిసిపోతుంటారు. రకరకాల డిజైన్ల కోసం మెహెందీ కోన్స్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో కోన్స్ నాణ్యతనూ పరీక్షించి ఎంచుకోవాలి. మెహెందీ కోన్స్‌తో చేతులు, పాదాలపై అందంగా వేసుకున్న డిజైన్లు ఎరుపుదనం నింపుకోవాలంటే... మెహెందీ డిజైన్‌ను తీర్చిదిద్దిన 5 నిమిషాలకు చిక్కని నిమ్మరసం, పంచదార సిరప్‌లో దూది ఉండను ముంచి, ఆరిన మెహెందీ డిజైన్‌పై అద్దాలి. దీంతో డిజైన్ రంగు తేలుతుంది. చాలామంది గోరింటాకు, పొడితో వేసుకున్న డిజైన్లు రాత్రిమొత్తం ఉంచేస్తుంటారు. డిజైన్ ఎరుపురంగులోకి మారడానికి 4 నుంచి 6 గంటలు సమయం సరిపోతుంది. మెహెందీ డిజైన్ పొడిబారాక నీళ్లతో కడగకుండా, కేవలం పై పొరను బ్రష్‌తో తొలగించి, నూనె రాసుకోవాలి. పండిన చేతులను శుభ్రపరుచుకోవడానికి కనీసం 24 గంటల వరకు సబ్బును ఉపయోగించకూడదు. అలా చేస్తే డిజైన్ త్వరగా పోదు. -
రెండు చేతులకు రెండు ఫ్రీఫ్రీఫ్రీ
నేనొక్కదాన్నే.. ఇంత పని చేయాలంటే ఎలా.. నాకేమీ నాలుగు చేతుల్లేవు అని విసుక్కునే వాళ్లెందరో.. ఇక విసుక్కోవద్దు. మీకు మరో రెండు చేతులు తగిలించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) రోబోటిక్ నిపుణులు సిద్ధమవుతున్నారు. చిత్రంలోని రోబోటిక్ ఆర్మ్ డిజైన్ అదే. దీన్ని మనం భుజానికి బ్యాక్‌ప్యాక్‌లా ఈజీగా తగిలించుకోవచ్చు. 9 కిలోల బరువుండే ఈ ఎక్స్ట్రా చేతులు భారీ బరువులను ఎత్తేస్తాయి. అంతేకాదు.. మీ చేతికి అందని వస్తువులను తీసిపెడతాయి. అంటే.. ఆ సమయంలో మన ం మన చేతులతో మరొక పనిని చేసుకోవచ్చు. చూడ్డానికి ఇది స్పైడర్ మ్యాన్ సినిమాలోని విలన్ డాక్టర్ ఆక్టోపస్ తరహాలో కనిపిస్తున్నా.. ఇది సినిమాలోలాగా మెదడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయదు. మన శరీర కదలికలకు అనుగుణంగా ఈ రోబో చేతులు క దులుతాయి. అంటే.. మనం ఓ పుస్తకాన్ని చేతితో పట్టుకుంటే.. మన చేతులు ఏ దిశలో కదిలాయో.. ఇవి కూడా అలాగే కదులుతాయన్నమాట. అయితే.. భవిష్యత్తులో మన అవసరాలను ముందే గ్రహించి.. దానికి తగ్గట్లు వ్యవహరించేలా ఈ రోబోటిక్ ఆర్మ్స్ను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతానికి వారు ప్రాథమిక నమూనాను రూపొందించారు. అవి తలుపులు తీయడం, చిన్నచిన్న సామాన్లను ఎత్తడం వంటి పనులు చేస్తున్నాయి. -
రోజంతా చేతులు కడుగుతున్నారా?
స్వప్నలిపి ఒక కల తరచుగా వస్తుంటుంది... ఆ కలలో చేతులు కడుగుతూ కనిపిస్తాం. కొన్నిసార్లు అయితే మరీ విచిత్రమైన కల కూడా వస్తూ ఉంటుంది. మరే పని లేనట్లు రోజంతా చేతులను కడుగుతూనే ఉంటాం. ‘ఆరోగ్య స్పృహ నాలో ఎక్కువైందా?’ ‘శుభ్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా?’ ఇలాంటి సందేహాలు మదిని చుట్టుముడతాయి. నిజానికి ఆరోగ్యానికి సంబంధించిన స్పృహకూ, ఈ కలకూ ఎలాంటి సంబంధం లేదు! మరి ఈ కల ఉద్దేశం ఏమిటి? మనకు కొన్ని పశ్చాత్తాపాలు ఉంటాయి. వాటిని చెప్పుకోవాల్సిన వారి దగ్గర చెప్పుకుంటే మనసు శాంతిస్తుంది. అక్కడితో ఆ పశ్చాత్తాపానికి చెల్లుచీటీ దొరుకుతుంది. కానీ అన్నీ సందర్భాల్లోనూ అది కుదరకపోవచ్చు. అది ఒక బాధగా మనసులో మిగిలిపోవచ్చు. ‘చేతులు కడుక్కోవడం’ అనేది పశ్చాత్తాపానికి సంబంధించిన భావనకు ప్రతీక. కొన్నిసార్లు... మనం అత్యంత వినయంగా చేతులు కట్టుకున్నట్లుగా కల వస్తుంది, ఎదురుగా మాత్రం ఎవరూ కనిపించరు! మనకు బాగా నచ్చిన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి... కలవడానికి అందుబాటులో ఉండనంత దూరంలో ఉన్నప్పుడు, లేదా ఏవో కారణాల వల్ల కలవడానికి కుదరనప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయి.