భర్త కాళ్లు, చేతులు విరగొట్టి.. ఇంట్లో బంధించి! | Husband Legs And Hands Broken By His Wife In East Godavari | Sakshi
Sakshi News home page

భర్త కాళ్లు, చేతులు విరగొట్టి.. ఇంట్లో బంధించి!

Published Sat, Jun 23 2018 1:22 PM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM

Husband Legs And Hands Broken By His Wife In East Godavari - Sakshi

విరిగిపోయిన భర్త సత్యనారాయణ కాళ్లు

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం

సాక్షి, రాజమండ్రి: భర్త అనే మర్యాద, ప్రేమ లేదు.. కనీసం సాటి మనిషి అనే కరుణ లేదు. కట్టుకున్నవాడిని ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా చిత్రవదకు గురిచేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరగిరిపట్నానికి చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమయింది. మొదట్లో బాగానే నడిచిన వీరి కాపురం, తర్వాత గొడవలకు దారి తీసింది.

ఒక రోజు గొడవ పెరిగి కోపోద్రిక్తురాలైన భార్య సత్యనారాయణ కాళ్లు, చేతుల విరగొట్టింది. బయటకు పొక్కకుండా ఆరు నెలలుగా అతడిని ఇంట్లోనే బంధించి, ప్రతిరోజు అతడిని చిత్రవదలకు గురిచేసింది. భార్య చెర నుంచి తప్పించుకున్న సత్యనారాయణ బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించి సత్యనారాయణను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement