
మనం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే కేవలం ముఖం సౌందర్యం మాత్రమే కాదు. కాళ్లు చేతులు కోమలంగా ఉండేలా చూసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఒత్తిడి లేని జీవితాన్ని సాగించడం కూడా అంతే ముఖ్యం. అలాగే సరిపడా నిద్రా, రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం చాలా ముఖ్యం. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటో చూద్దామా..!
ముఖం చూస్తే ఎంత ముచ్చటగా ఉన్నా, కాళ్లూ చేతులను పట్టించుకోకపోతే ఆ అందానికి అర్థం ఉండదు. పాదాలూ, చేతులూ కూడా బాగుంటేనే అందానికి సార్థకత.
కాళ్లు, చేతులపై మృతకణాలు పేరుకున్నప్పుడు చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. మీ పరిస్థితి కూడా ఇదే అయితే.. ఎప్పటికప్పుడు ఈ మృతకణాలు తొలగించేందుకు ప్రయత్నించడం మంచిది. దానికి సంబంధించిన కొన్ని పూతలు తయారుచేసి ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.
రాత్రి పడుకునే ముందు కాస్తంత స్వచ్ఛమైన కొబ్బరినూనెను పాదాలకు రాసుకుని మర్దన చేయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేయడం వల్ల పొడిబారిన చర్మం కాస్తా చాలా తక్కువ వ్యవధిలోనే మృదువుగా మారుతుంది.
చదవండి: ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా, ఏదైనా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ను వేయాలి. లేదంటే ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ అయినా ఫరవాలేదు. కుదిరితే అందులో కొన్ని గులాబీ రేకలూ వేసుకోవచ్చు. ఇందులో చేతులు లేదా కాళ్లను ఓ పదినిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల చర్మం మృదువుగా మారుతుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకుని అందులో కాళ్లు లేదా చేతుల్ని ఉంచాలి. పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుని పొడిబట్టతో మృదువుగా అద్దుతూ తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ భాగాలకు రక్తప్రసరణ సజావుగా జరిగి, రఫ్‌నెస్ తగ్గి మృదువుగా మారతాయి.
ఒక నిమ్మచెక్కకు పంచదార అద్దుకోవాలి. దీనితో కాళ్లు, చేతులకు మర్దన చేస్తున్నట్లు మృదువుగా రుద్దుకోవాలి. అలాగే రాత్రి నిద్రించే ముందు ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్‌తో మర్దన చేసుకున్నా సరి΄ోతుంది. ఇది చర్మాన్ని ఎంతో కోమలంగా ఉంచుతుంది.కోమలమైన కాళ్లూ చేతులకు..
Comments
Please login to add a commentAdd a comment