![Valentine's Day 2025 Amazing Beauty Tips To Look Prettier](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/valentinesday_beauty.jpg.webp?itok=MarPxEFr)
అందంగా, ఆనందంగా మెరిసిపోవాలంటే చిట్కాలు
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందులోనూ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు మరికొన్ని గంటల దూరంలో ఉంది. తన పార్ట్‌నర్‌తో రొమాంటిక్‌గా గడిపే క్షణాల్లో అందంగా మెరిసి పోవాలని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలైతే ముందు నుంచే అలర్ట్‌గా ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం జిడ్డు ముఖంతో ఎలా రా బాబూ అని తెగ హైరానా పడిపోతుంటారు. అవునా..? అందుకే ఇంటి చిట్కాలతో ఇన్‌స్టంట్ గ్లో వచ్చేలా చేసుకోవచ్చు. లవ్‌బర్డ్స్‌కోసం ఉపయోగపడే అలాంటి బ్యూటీ టిప్స్ ఒకసారి చెక్ చేద్దాం.
అందం అనే దానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఉండాలంటే, మానిసిక ఆరోగ్యంతోపాటు, శారీరంగా కూడా కావాలి. అలా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నపుడు వచ్చే ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం వేరే లెవల్‌లో ఉంటుంది. దీనికి ప్రేయసి లేదా, ప్రియుడి చేయూత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. కొండంత బలాన్నిస్తుంది. దీనికి మించిన అందం ఏముంటుంది?
అందకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనీలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు.
ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
శనగ పిండిలో కాస్తంత పెరుగు, కొద్దిగా నిమ్మకాల కలిపి మంచి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించి, బాగా ఆరిన తరువాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి.
నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి. ముఖం మెరిసిపోతుంది.
బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి స్కిన్ గ్లోయింగ్‌గా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలుకు ఇది ఉపయోగపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి మెడకు,మోచేతులకు చక్కగా అప్లయ్ చేసి ఆరిన తరువాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది.
చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది.
అలాగే నచ్చినట్టుగా మీసాలు, గడ్డాన్ని చక్కగా నీట్‌గా కట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్‌ను మెయింటైన్ చేయాలి. దీంతోపాటు చక్కటి పెర్‌ఫ్యూమ్ వాడితే మరీ మంచిది.
ఇక అమ్మాయిలైతే ఆలు గడ్డ రసంలో రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్, శనగపిండి కలిపి మాస్క్‌లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాఫీ ఫౌడర్‌లో కాస్తం టొమాటో రసం వేసి, ముఖానికి, మెడకు,మోచేతుల దాకా అప్లయ్ చేసి కాసేపు మసాజ్ చేసి శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసం, ఓట్స్ పొడి పాలు. ఈ స్క్రబ్‌లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక చేసిన రెండు ఐస్‌ముక్కలతో ముఖంపై మృదువగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుని రసాయను లేని మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని టిప్స్
చర్మం ఆరోగ్యంగా . యవ్వనంగా కనిపించాలనుకుంటే ప్రతి రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.
తగినన్ని నీళ్లు తాగాలి. చర్మానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో, నీళ్లు కూడా అంతే అవసరం.
హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం నుండి అదనపు మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
తాజాపండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ, క్రమంతప్పకుండా రోజుకు కనీసంఅరగంటసేపు ఏదో ఒక వ్యాయామం చేయాలి.
ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి.
వీటన్నింటి కంటే ముందు మీ మనసులోని ఆనందం, మీ శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్లే మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. కనుక అందం గురించి పట్టించుకోకుండా, ఆనందంగా గడపండి. మీ బంధాన్ని దృఢం చేసుకోండి. మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకోండి. హ్యాపీ వాలైంటైన్స్ డే!
Comments
Please login to add a commentAdd a comment