looks
-
Valentine's Day : ప్రెటీ లుక్స్.. ఇవిగో టిప్స్!
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందులోనూ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు మరికొన్ని గంటల దూరంలో ఉంది. తన పార్ట్నర్తో రొమాంటిక్‌గా గడిపే క్షణాల్లో అందంగా మెరిసి పోవాలని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలైతే ముందు నుంచే అలర్ట్‌గా ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం జిడ్డు ముఖంతో ఎలా రా బాబూ అని తెగ హైరానా పడిపోతుంటారు. అవునా..? అందుకే ఇంటి చిట్కాలతో ఇన్స్టంట్ గ్లో వచ్చేలా చేసుకోవచ్చు. లవ్బర్డ్స్కోసం ఉపయోగపడే అలాంటి బ్యూటీ టిప్స్ ఒకసారి చెక్ చేద్దాం.అందం అనే దానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఉండాలంటే, మానిసిక ఆరోగ్యంతోపాటు, శారీరంగా కూడా కావాలి. అలా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నపుడు వచ్చే ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం వేరే లెవల్లో ఉంటుంది. దీనికి ప్రేయసి లేదా, ప్రియుడి చేయూత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. కొండంత బలాన్నిస్తుంది. దీనికి మించిన అందం ఏముంటుంది?అందకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనీలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్శనగ పిండిలో కాస్తంత పెరుగు, కొద్దిగా నిమ్మకాల కలిపి మంచి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించి, బాగా ఆరిన తరువాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి.నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి. ముఖం మెరిసిపోతుంది.బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి స్కిన్ గ్లోయింగ్‌గా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలుకు ఇది ఉపయోగపడుతుంది.ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి మెడకు,మోచేతులకు చక్కగా అప్లయ్ చేసి ఆరిన తరువాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది.చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది. అలాగే నచ్చినట్టుగా మీసాలు, గడ్డాన్ని చక్కగా నీట్‌గా కట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్‌ను మెయింటైన్ చేయాలి. దీంతోపాటు చక్కటి పెర్ఫ్యూమ్ వాడితే మరీ మంచిది. ఇక అమ్మాయిలైతే ఆలు గడ్డ రసంలో రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్, శనగపిండి కలిపి మాస్క్‌లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాఫీ ఫౌడర్‌లో కాస్తం టొమాటో రసం వేసి, ముఖానికి, మెడకు,మోచేతుల దాకా అప్లయ్ చేసి కాసేపు మసాజ్ చేసి శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసం, ఓట్స్ పొడి పాలు. ఈ స్క్రబ్‌లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక చేసిన రెండు ఐస్‌ముక్కలతో ముఖంపై మృదువగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుని రసాయను లేని మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరిన్ని టిప్స్చర్మం ఆరోగ్యంగా . యవ్వనంగా కనిపించాలనుకుంటే ప్రతి రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.తగినన్ని నీళ్లు తాగాలి. చర్మానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో, నీళ్లు కూడా అంతే అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం నుండి అదనపు మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది. తాజాపండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ, క్రమంతప్పకుండా రోజుకు కనీసంఅరగంటసేపు ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి. వీటన్నింటి కంటే ముందు మీ మనసులోని ఆనందం, మీ శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్లే మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. కనుక అందం గురించి పట్టించుకోకుండా, ఆనందంగా గడపండి. మీ బంధాన్ని దృఢం చేసుకోండి. మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకోండి. హ్యాపీ వాలైంటైన్స్ డే! -
ఫ్యాషన్ రంగంలో పాపులర్‌గా : సెల‘ప్రెట్టీ’ లుక్
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సోనమ్ కపూర్ ర్యాంప్‌వాక్ చేశారు. వావ్.. డ్రెస్.. హూ ఈజ్ ద డిజైనర్? ఇలా ప్రశ్నలకు ఓహ్.. షీ ఈజ్ జయంతిరెడ్డి ఫ్రమ్ హైదరాబాద్.. ఇలాంటి సమాధానాలలో నగరం పేరు వినిపించడం ముంబయి, ఢిల్లీ, చెన్నై, గోవా, బెంగళూరు.. తదితర చోట్ల సర్వసాధారణంగా మారుతోంది. ఒకప్పుడు సెలిబ్రిటీలు తమ ఫ్యాషన్ డిజైనర్ అనగానే ముంబయి డిజైనర్ పేరు చెప్పేవారు. ఇప్పుడు నగరంలో టాప్ డిజైనర్లు సెలిబ్రిటీ డిజైనర్లుగా పేరొందారు. – సాక్షి, సిటీబ్యూరోనగర డిజైనర్ల విజయాలు ఔత్సాహిక డిజైనర్లకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు గెలుపు పాఠాలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీలు నగరానికి చెందిన పలువురు టాప్ సెలిబ్రిటీ డిజైనర్ల గురించిన విశేషాలను అందిస్తున్నారు. ‘సోమ్’.. ఫేమ్.. నగరానికి చెందిన డిజైనర్ శ్రియా సోమ్ ఆధునిక మహిళ డ్రీమ్ డ్రెస్సింగ్‌ను అందిస్తారు. సున్నితమైన హస్తకళ, క్లిష్టమైన అలంకారాలు, సొగసైన ఛాయాచిత్రాలకు ఆమె లేబుల్ శ్రియా సోమ్ ప్రసిద్ధి చెందింది. పీవీ సింధు, జాన్వీ కపూర్, లీసా హేడన్ తదితరులు ఆమె జాబితాలో ఉన్న కొందరు సెలిబ్రిటీలు.. అంతేకాక ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అందానికి వన్నెలు.. అనుశ్రీ.. క్లిష్టమైన పనితనం, ఆకర్షణీయమైన సిల్హౌట్‌లు ఉన్న ఎథెరియల్ లెహంగాలకు అనుశ్రీ రెడ్డి లేబుల్ పర్యాయపదంగా మారింది. లెహంగా సిల్హౌట్‌లు వాటి డీప్ కట్‌వర్క్ నెక్‌లైన్‌లు, ఎంబ్రాయిడరీ కట్‌వర్క్ అంచులతో ఉన్న దుపట్టాలకు ఆమె హాఫ్ శారీస్ ప్రసిద్ధి చెందాయి. అందమైన గులాబీలు, పాస్టెల్ల నుంచి రాయల్ వైలెట్లు, బంగారు పసుపు వరకూ రంగుల మిశ్రమాన్ని ఆమె చాకచక్యంగా ఉపయోగిస్తారు. ఇటీవలి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమె కలెక్షన్స్.. అందమైన ఆర్గాన్జా, పూల ఎంబ్రాయిడరీ కట్‌వర్క్, తక్కువ చతురస్రాకార నెక్‌లైన్‌లు అన్ని షేడ్స్ న్యూడ్‌లు పింక్లతో మెరిపించాయి. ఆమె వర్క్ చేసిన సెలిబ్రిటీలలో అలియాభట్, కత్రినాకైఫ్, తాప్సీ పన్ను.. తదితరులు ఉన్నారు. ఆకా‘సమంత’.. అర్చన.. ఇటీవల నగరం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన డిజైనర్లలో అర్చనరావు ముందు వరుసలో ఉన్నారు. 2012లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన లేబుల్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే ‘వోగ్ ఇండియన్ ఫ్యాషన్ ఫండ్’ను గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన ప్రభాస్ కల్కి సినిమాకు ఆమె చేసిన వర్క్ ప్రశంసలకు నోచుకుంది. బాలీవుడ్ బాద్‘షా’.. నగరం నుంచి బాలీవుడ్ తారలకు డిజైన్లు అందించిన ఘనతను గౌరంగ్ షా సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికుల పనితనానికి పట్టం కడుతూ చేతితో నేసిన చీరలకు ప్రసిద్ధి చెందాడు. విద్యాబాలన్, సోనమ్ కపూర్, అదితీరావ్ హైదరీ సహా మరెందరో ఆయన డిజైన్లకు జై కొట్టారు. మహానటి సినిమా ద్వారా జాతీయ పురస్కారం అందుకున్నారు. మనదే ‘జయం’.. జయంతి రెడ్డి డిజైన్లు రాయల్ అద్భుత కథల వైబ్‌లను అందించడం ఖాయం. ఆమె డిజైన్Œలు సంప్రదాయ స్కర్ట్లు/లెహెంగాలతో జత చేసిన ఆధునిక క్రాప్–టాప్ సిల్హౌట్‌లు ఆసక్తికరమైన మిక్స్. గోల్డెన్, సిల్వర్జరీతో కూడిన ఆమె ఎంబ్రోయిడరీ వర్క్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్. అర్చనరావు డిజైన్ చేసిన న్యూడ్ కలర్ లేత గోధుమరంగు చీరకు బేబీ పింక్ కట్ వర్క్ బోట్ నెక్ బ్లౌజ్ మెటాలిక్ సిల్వర్ బెల్ట్‌తో జత చేసి, నటి సమంతా మెరిశారు. ఫెమినా వెడ్డింగ్ టైమ్స్‌లో ప్రదర్శించబడిన టూ–టోన్డ్ కార్సెట్ రఫిల్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ మెరిశారు. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, డిజైనర్ శ్రియా సోమ్ మొదటి సోలో షో కోసం ర్యాంప్ వాక్ చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో షో స్టాపర్‌గా లీసా హేడన్ డిజైనర్ శ్రియా సోమ్ మెరిసే, పొడవాటి చేతుల చోళీ అద్భుతమైన లెహంగా ధరించి.. అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోనమ్ కపూర్ గౌరంగ్ షా డిజైన్ చేసిన పసుపు రంగు కుర్తా లెహంగా స్కర్ట్‌తో మ్యాచింగ్ దుపట్టా ధరించి ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉత్సవాల్లో, బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ డిజైనర్ గౌరంగ్‌షా తీర్చిదిద్దిన ఆల్ ఇన్ ఆల్ అనార్కలీ సూట్ ధరించారు. ఓ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ఈవెంట్‌కి రకుల్ ప్రీత్ సింగ్ అర్చనారావు డిజైన్లు ధరించి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదీ చదవండి: మూడే మూడు చిట్కాలతో మిరాకిల్ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది! -
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
పుష్ప 2 కిస్సిక్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అదిరిపోయే లేటెస్ట్ లుక్స్ (ఫొటోలు)
-
గ్లామర్‌లో వేరే లెవల్.. సైనా నెహ్వాల్‌ను ఇలా ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
నెట్ చీరలో అందాల వల వేస్తున్న జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
గ్రీన్ డ్రెస్‌లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
ఎవరీ రాయంచ... పాలనురుగు అందంతో మెరిసిపోతోంది! (ఫోటోలు)
-
అనసూయ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్స్ (ఫొటోలు)
-
Aditi Rao Hydari: హీరామండి బ్యూటీ ఆదితిరావు హైదరీ స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్ 2024.. నీతా అంబానీ అద్భుత లుక్స్ ఫోటోలు
-
చీరలో కుందనపు బొమ్మలా బిగ్ బాస్ ప్రియాంక సింగ్ (ఫొటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్‌లో హన్సిక
-
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : సింగర్ శ్రేయా మునుపెన్నడూ చూడని లుక్స్
-
లెహెంగాలో వధువు రాధిక మనోహరంగా, మహరాణిలా (ఫోటోలు)
-
ఈ హీరోయిన్‌కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
షరారా సూట్లో అదితిరావు హైదరి అదిరే లుక్స్ (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో హన్సిక స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్‌లో ‘చందమామ’ మెరుపులు (ఫొటోలు)
-
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
-
ఇంటర్ పిల్లలా అనసూయ.. ఇంత క్యూట్ ఉందేంటి? (ఫొటోలు)
-
కళ్లు చెదిరే చీర అందాలు... ప్రేమమ్ బ్యూటీ (ఫొటోలు)
-
అల్ట్రా స్టైలిష్ లుక్స్‌లో దసరా బ్యూటీ (ఫొటోలు)
-
డిఫరెంట్ లుక్స్‌లో రాశి ఖన్నా.. అందిరిందన్నా.. (ఫోటోలు)
-
ఆహా.. అనిపించేలా నేహా లుక్స్ (ఫొటోలు)
-
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
-
ఔట్ ఆఫ్ ది బాక్స్ సుమ అదరగొట్టేసింది (ఫొటోలు)
-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
‘సిండ్రిల్లా’లా మెరిసిన రాధికా మర్చంట్, మురిసిన అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తెతో రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో క్రూయిజ్ షిప్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. గుజరాత్‌లోని జాం నగర్లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పోలిస్తే, రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను మరింత ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అలాగే ఈ వేడుకలో రాధికా మర్చంట్ తన ప్రిన్స్, అనంత్ అంబానీతో రియల్ లైఫ్ సిండ్రిల్లాలా మెరిసిపోయింది. రాధిక, నీలిరంగులోని కార్సెట్ గౌనులో అందంగా కనిపించింది. దీనికి బ్లూ డైమండ్, బ్లూ సఫైర్ నెక్లెస్, చెవిపోగులు ధరించింది. అటు అనంత్ అద్భుతమైన లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. అనంత్ బూజీ బ్లాక్ సెల్ఫ్ డిజైన్ చేసిన బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. అందంతో మెరిసిపోతున్న ప్రేయసిని చూసి అనంత్ అంబానీ, అటు పెళ్లి కళ ఉట్టిపడుతున్ నకాబోయే కోడల్ని చూసి ముఖేష అంబానీ కూడా మురిసిపోయారు. ఇదే ఈవెంట్లో పింక్ డియోర్ దుస్తులు ధరించింది రాధిక. ఈ గౌను ధర సుమారు మూడు లక్షలట. అలాగే ఈ సందర్భంగా ఆమె ధరించిన బ్యాగ్ ధర రూ. 26 లక్షలట. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 800 మందికి పైగా అతిథులుతో రూ.7500 కోట్లతో ఘనంగా జరిగిందీ వేడుక. జూలై 12న లవ్‌బర్డ్స్ అనంత్- రాధిక పెళ్లి పీటలెక్కనున్నారు. -
Cannes 2024: పింకీ గౌన్‌లో అదితిరావు ప్రెటీ లుక్స్ (ఫోటోలు)
-
ఫిట్నెస్ విత్ బ్యూటీ : సమంతా లేటెస్ట్ ఫోటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఒడి దుడుకులు, భర్తతో విడాకులు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడటం లాంటి కారణాలరీత్యా తన ఫిట్‌నెస్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ మరింత పెరిగింది. దీనికి సంబంధించి అనేక వీడియోలను, ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)తాజాగా కండలు తిరిగి భుజాలతో కూడిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేకాదు మరిన్ని ట్రైసెప్స్ డిప్స్ రాబోతున్నాయనే హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సుమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా సమంతా ఫిట్ బాడీని ఫిదా అయిపోయింది. ‘నీ ఫిట్‌నెస్‌లో సగమైనా సాధించాలని ఆశపడుతున్నాను’ అంటూ కమెంట్ చేయడం గమనార్హం. -
Aditi Rao Hydari HD Photos: పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
-
మల్లెపూలతో సన్నజాజిలా గుబాలిస్తున్న సిమ్రన్ చౌదరి (ఫొటోలు)
-
Samantha: ఫ్యాషన్ : కిల్లింగ్స్ లుక్స్‌లో సమంతా.. ఏమిటిదంతా..?( ఫోటోలు)
-
Hariteja: హరితేజ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! (ఫోటోలు)
-
‘టిల్లు’భామ : చీరలో స్టన్నింగ్ అండ్ గ్లామర్ లుక్స్ (ఫోటోలు)
-
Lavanya Tripathi Konidela Photos: మెగా కోడలి లేటెస్ట్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
Aishwarya Lekshmi: చీరలో ఐశ్వర్య లక్ష్మి.. సోయగాలు (ఫొటోలు)
-
టిల్లుతో మ్యాజిక్ సక్సెస్ : లిల్లీ అదిరిపోయే లుక్స్ (ఫొటోలు)
-
Aditi Rao Hydari: స్టైల్ అండ్ లుక్స్‌తో చంపేస్తున్న హైదరాబాదీ బ్యూటీ ఫోటోలు
-
Radhika Merchant: కాబోయే పెళ్లి కూతురు రాధికా ట్రెండీ లుక్స్
-
Rashmi Gautam Latest Car Wash Photoshoot: బాయ్స్ హాస్టల్లో అందంతో కట్టిపడేస్తోన్న రష్మి గౌతమ్..! (ఫొటోలు)
-
కాలం కార్ఖానా
కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్ మ్యాన్ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు. చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం. ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి. అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే. కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. -
పొలిటికల్ కారిడార్ : తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ చిన్న చూపు
-
నెట్టింట హాట్ టాపిక్‌గా అఖిల్ లుక్.. అక్కడి నుంచి కాపీ కొట్టారా ?
Akhil Agent Looks Have Copy Allegations: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అఖిల్. మంచు పర్వతాల్లో మొహం నిండా గాయాలతో ఉన్న ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ లుక్ కాపీ కొట్టారని చర్చ నడుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పర్వతాలు, గిరజాల జుట్టు, పోనీటైల్‌తో స్టైలిష్‌గా ఉన్న అఖిల్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లోని హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్)ను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సిరీస్‌లో తరహాలోనే 'ఏజెంట్' మూవీలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఊల్ కోట్ ధరించి కనిపిస్తున్నాడు. చిన్నపాటి మార్పు తప్ప ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే 'ఏజెంట్' చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. ఈ క్రమంలో మరో హాలీవుడ్ సిరీస్‌లోని హీరోను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ఇది కోఇన్స్డెంట్గా జరిగిందా, లేక కావాలని చేసిందా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కండలు పెంచిన అఖిల్‌కు కొంచెం కిట్ హరింగ్టన్ పోలికలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో టాక్ నడిచింది. చదవండి: ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
రాజన్న ఫేమ్ మల్లమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
-
సైరా గురువు
ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహారెడ్డి అనుచరులకు జార్జియాలో యుద్ధం జరుగుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తావన 18వ శతాబ్దంలో కదా? ఇప్పుడు ఎందుకు? అంటే ‘సైరా’ చిత్రం కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. సైరా బృందానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుదీప్, విజయ్ సేతుపతిలు కూడా పాల్గొన్నారు. ఈ షూట్లో దాదాపు రెండువేల మూడువందల మంది పాల్గొంటున్నారని టాక్. స్పైడర్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... గురువారం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. 76వ వసంతంలోకి అడుగుపెట్టారాయన. ఈ సందర్భంగా ‘సైరా’ చిత్రంలోని అమితాబ్ లుక్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపిస్తారట. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఎన్టీఆర్ వస్తాడా..? రివీల్ చేస్తాడా..?
జైలవకుశ తరువాత చిన్న గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ పరంగా చాలా వర్కౌట్స్ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ యంగ్ టైగర్ జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎన్టీఆర్ ఇంకా స్లిమ్‌గా మారాడనీ తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచుదామని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. కానీ, ఆ లుక్కు బయటకు వచ్చే టైం వచ్చేసింది అనుకుంటున్నారు సినీ అభిమానులు. నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘ఎంఎల్ఏ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ (మంగళవారం) సాయంత్రం జరగునుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్‌కు తన లుక్ బయటపెట్టే ఉద్దేశ్యం లేదట. మరి అన్న కోరిక మేరకు ఈవెంట్‌కు వస్తాడా? తన లుక్‌ను రివీల్ చేస్తాడా? అదే సమయంలో ఎన్టీఆర్ మాస్క్ తో ఈవెంట్‌కు వస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తల్లో ఏది నిజమో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. -
ఐడియా కు రిలయన్స్ జియో భారీ ఎఫెక్ట్
-
ఐడియాకు జియో దెబ్బ
ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా కు రిలయన్స్ జియో ఎఫెక్ట్ భారీగా తాకనుంది. రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సంస్థ పెర్ ఫామెన్స్ వీక్ గా ఉండనుందనే అంచనాల నేపథ్యంలో మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటా తన వాటాను అమ్మేందుకు యోచిస్తోంది. జియో ఉచిత సేవల కారణంగా మరో మూడేళ్లపాటు ఐడియా పనితీరు మందగించే అవకాశమున్నట్లు మలేసియన్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐడియాలో తన 20శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ) విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు గతంలో టెలీకాం మలేషియా, ఆక్సియాటా వాటాను తిరిగి కొనుగోలుకోసం ఐడియా సెల్యులర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ను సంప్రదించింది. (ఆదిత్యా బిర్లా గ్రూపు ఐడియాలో 40 శాతం వాటా ఉంది) అయితే దానికి తిరస్కరించడంతో ఇతర కొనుగోలుదారులకోసం చూస్తోంది. ఈ మేరకు బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఐడియా, ఆక్సియాటా సంస్థలు నిరాకరించాయి. కాగా పెద్ద నోట్ల రద్దుతో రూ.100- 200 మధ్య ఐడియా రిచార్జ్ లు గణనీయంగా తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే 2 శాతం క్షీణించిన ఐడియా ఆదాయం ఈ క్వార్టర్ లో 4-5 శాతం వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఆక్సియాటా వాటా విక్రయిస్తే..ఐడియాకు మరిన్ని కష్టాలు తప్పవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలతో మార్కెట్ లో ఐడియా కౌంటర్ బలహీనపడింది. సుమారు 3.28 శాతం నష్టాలతో కొనసాగుతోంది. మొబైల్ బిల్లులను రద్దయిన నోట్లతో చెల్లించడానికి డిశెంబర్ 15 వరకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ విజయంపై సత్య నాదెళ్ల
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 45 వ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి బుధవారం అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారందరితోనో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మెక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ఇన్ పోస్ట్ లో చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించారని ప్రశంసించిన ఆయన ఈ ఎన్నికలు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించాయని పేర్కొన్నారు. అధ్యక్షుడు సహా నిన్న ఎంపికయిన వారందరినీ అభినందించిన నాదెళ్ల వారందరితో పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నా మన్నారు. తమ ధృడమైన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉంటామని, ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతులను చిత్తశుద్ధితో కలుపుకుపోతామని తెలిపారు. దీంతో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా చేసిన సంచలన వ్యాఖ్యలను ఫాలో కావొద్దని సంకేతాలను అమెరికా నూతన అధ్యక్షుడికి సూచన ప్రాయంగా అందించారు భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల. అలాగే కంపెనీ ఆలోచనలు, సిఫార్సులను అమెరికా కొత్త అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్‌కు వివరిస్తూ మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా కంపెనీ బ్లాగులో ఒక పోస్ట్ పెట్టారు. -
ఫైవ్‌స్టార్ హోటల్స్‌లా యూనివర్సిటీలు
-
సెక్సీయస్ట్..!
గ్లామరెంతన్నది కాదిక్కడ... ఎంతమందికి కిక్కెంచిందనేదే పాయింట్..! వయసు పెరుగుతున్నా... కత్తిలాంటి లుక్స్‌తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది స్పానిష్ ముద్దుగుమ్మ పెనలోప్ క్రజ్. నలభై ఏళ్ల వయసులో జీవించి ఉన్న సెక్సీయస్ట్ విమన్గా ఖ్యాతి దక్కించుకుంది. యూరోపియన్ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్’ తాజాగా ఈ జాబితా ప్రకటించింది. ఏంజెలీనా జోలీ, చార్లైజ్ థెరాన్, హాలే బెర్రీ, స్కార్లెట్ జాన్సన్ తదితర తారలు గతంలో ఈ ఘనత దక్కించుకున్నారు. అయితే పెనలోప్ మాత్రం... ఇవేవీ పట్టించుకోకుండా తన కుటుంబంతో బిజీ అయిపోయింది. -
చక్రపాణికి కన్నీటి వీడ్కోలు
ఎస్పీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు గౌతంనగర్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య సరయూ నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన చక్రపాణి అంత్యక్రియలు శుక్రవారం మల్కాజిగిరి ఎస్పీనగర్ శ్మశాన వాటికలో బంధు, మిత్రుల కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి. గత నెల 30న అయోధ్యలో నిర్వహించిన సుందరకాండ పారాయణ యాగానికి వెళ్లిన చక్రపాణి నదిలో స్నానం చేస్తూ మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరిన చక్రపాణి మృతదేహాన్ని మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌లో మల్కాజిగిరి వాణినగర్‌లోని చక్రపాణి నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే అతని తల్లిదండ్రులు కృ ష్ణ కిశోర్‌శర్మ, రాజేశ్వరి గుండెలు పగిలేలా రోదిం చారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, బంధువులు చ క్రపాణి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. అలాగే, స్థానిక కార్పొరేటర్ ఆర్. సుమలతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్. రాంచందర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. మృతిని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.