ఎన్టీఆర్ (ఫైల్)
జైలవకుశ తరువాత చిన్న గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ పరంగా చాలా వర్కౌట్స్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ యంగ్ టైగర్ జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎన్టీఆర్ ఇంకా స్లిమ్‌గా మారాడనీ తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచుదామని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. కానీ, ఆ లుక్కు బయటకు వచ్చే టైం వచ్చేసింది అనుకుంటున్నారు సినీ అభిమానులు.
నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘ఎంఎల్‌ఏ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ (మంగళవారం) సాయంత్రం జరగునుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్‌కు తన లుక్ బయటపెట్టే ఉద్దేశ్యం లేదట. మరి అన్న కోరిక మేరకు ఈవెంట్‌కు వస్తాడా? తన లుక్‌ను రివీల్ చేస్తాడా? అదే సమయంలో ఎన్టీఆర్ మాస్క్ తో ఈవెంట్‌కు వస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తల్లో ఏది నిజమో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment