MLA Movie
-
మేం హ్యాపీ..అందరూ హ్యాపీ
‘‘ఏ సినిమా అయినా అనుకున్న బడ్జెట్లోనే చేయడానికి చూస్తాం. స్క్రీన్ మీద బాగా కనబడుతుందంటే ఖర్చుపెట్టడానికి మాత్రం వెనకాడం. సంపాదించుకుందాం అని కాకుండా మంచి సినిమాలు, హానెస్ట్ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. రెస్పాన్సిబుల్‌గా ఉండాలి, నిర్మాణ విలువలు తగ్గకూడదనుకుంటాం’’ అన్నారు ‘ఎం.ఎల్.ఎ’ చిత్ర నిర్మాతలు భరత్ చౌదరి,కిరణ్ రెడ్డి. కల్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడారు. భరత్ చౌదరి మాట్లాడుతూ – ‘‘కిరణ్, నేను ఫ్రెండ్స్. ఇదివరకు డిస్ట్రిబ్యూషన్లో ఉండేవాణ్ణి. సినిమాల్లో ట్రైల్స్ వేద్దాం అని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా నిర్మించాం. అనుకున్న ఫలితం దక్కింది. కంగారు పడకుండా సంవత్సరానికి ఒకట్రెండు సినిమాలు చేసినా క్వాలిటీతో చేయాలనుకుంటున్నాం. ఉపేంద్ర మాధవ్ మొదటి నుంచి టచ్‌లోనే ఉన్నాడు. కల్యాణ్ రామ్‌తో ఎప్పటినుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇలా కుదిరింది. కల్యాణ్ రామ్‌గారు గోల్డ్. ఈ సినిమాలో ఆయన చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు, మేకోవర్ చాలా బావుందని ఫీడ్‌బ్యాక్ వస్తోంది. సినిమా కథలో కచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. కేవలం డబ్బు పెడితే సరిపోతుంది అనుకోకుండా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్‘అల్లరి’ నరేష్ – భీమనేని శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నాం. ఇందులో సునీల్ పుల్ లెంగ్త్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నారు’’ అన్నారు. కిరణ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను మైనింగ్ బిజినెస్ చేసేవాణ్ణి. ‘ఎం.ఎల్.ఎ’ సినిమా కొన్న బయర్స్ అందరూ సేఫ్. సోమవారం నుంచి ఓవర్ ఫ్లోస్‌లో ఉన్నాం. రెవెన్యూపరంగా శాటిలైట్ 7 కోట్లు వచ్చింది. తెలుగు రైట్స్ 4.5, హిందీ డబ్బింగ్ రైట్స్ 2.5 కోట్ల బిజినెస్ జరిగింది. రివ్యూలు బాలేకపోయినా ఆడియెన్స్ ఇచ్చిన తీర్పు వేరేలా ఉంది. సినిమాల ద్వారా ఏ నిర్మాతలకైనా కావల్సింది పేరు, డబ్బు. అవి ఈ సినిమాతో వచ్చింది చాలా హ్యాపీ. త్వరలోనే ఉపేంద్ర మాధవ్‌తో మా బ్యానర్లో మరో సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. -
కాంబినేషన్ కాదు... కథే ముఖ్యం – కల్యాణ్ రామ్
‘‘కాంబినేషన్ కంటే కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే ఇష్టం. అలాంటి వారిలో ‘ఎంఎల్ఏ’ చిత్రనిర్మాతలు ముందుంటారు. తప్పకుండా వీరు పెద్ద నిర్మాతలు అవుతారు’’ అన్నారు కల్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘పటాస్’ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో ‘ఎంఎల్ఏ’ కథ విన్నప్పుడూ అంతే ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో ఉపేంద్ర నన్ను కొత్తగా చూపించాడు. ‘పటాస్, ఇజం’ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంత బాగా ఫీలయ్యానో.. ఈ సినిమాకూ అలాగే ఫీలయ్యాను. కొత్త దర్శకుడిని గైడ్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ది భార్య, భర్తల బంధం. నేను పనిచేసిన కెమెరామెన్స్‌లో బెస్ట్ కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్లగారు. కాజల్‌తో రెండో చిత్రమిది. ఇప్పటివరకూ నేను పధ్నాలుగు సినిమాలు చేస్తే.. తను 50 సినిమాలు చేసింది. అందుకు కారణం తన డెడికేషన్’’ అన్నారు. ‘‘రియల్ లైఫ్‌లో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే అవడం ఎంత కష్టమో నాకు తెలియదు. కానీ, ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో తెలుసు. ఉపేంద్ర నా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ‘‘తన బాధ్యతను ఎక్కువగా ప్రేమించే డైరెక్టర్స్‌లో ఉపేంద్ర ఒకరు. సాలూరి రాజేశ్వరరావు తర్వాత ఆ స్థాయిలో సంగీతం అందించగల మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి.సురేశ్ బాబు. ‘‘కల్యాణ్ రామ్‌గారికి ‘ఎంఎల్ఏ’ టైటిల్ చక్కగా యాప్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు ఎన్.శంకర్. ‘‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలోనే ఉపేంద్ర ఈ కథ చెప్పారు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో కల్యాణ్ రామ్. చేతికి గాయమైనా కమిట్మెంట్తో సినిమాను పూర్తి చేశారు’’ అని కిరణ్ రెడ్డి అన్నారు. ‘‘కథ వినగానే సినిమా చేస్తున్నాం అన్నారు కల్యాణ్ రామ్‌గారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ అయింది. మణిశర్మగారు పాటలు ఎంత బాగా చేశారో.. రీ–రికార్డింగ్ అంత కంటే బాగా చేశారు’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. పోసాని, రవికిషన్, కోన వెంకట్, వీఎన్ ఆదిత్య, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్ల తర్వాత..!
సాక్షి, సినిమా : సినీ ఇండస్ట్రీలో హిట్పెయిర్కు భలే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారని అంటారు. ఒక వేళ సినిమా ఆడకపోతే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని విమర్శిస్తారు. హీరో రామ్, హీరోయిన్ కాజల్ తీసిన గణేశ్ సినిమా విజయం సాధించకపోయేసరికి వీరిరువురు కలిసి మరో సినిమా తీయలేదు. ఫ్లాప్ కాంబినేషన్ కావటంతో దర్శక నిర్మాతలు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత రామ్, కాజల్‌లు కలిసి నటించనున్నారు. గరుడవేగతో విజయం సాధించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వీరు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర పూర్తి వివరాలను యూనిట్ సభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రవీణ్ సత్తార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా గ్యాప్ తర్వాత తొలి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యేలో నటించిన కాజల్.. ఇప్పటికే సినిమా లుక్స్ అందరినీ ఆకట్టుకోగా, ఇప్పుడు మరో సినిమాలో ఎనిమిదేళ్ల తర్వాత రామ్ సరసన నటించనుంది. మరి ఈ సినిమాతోనైనా హిట్ జోడిగా పేరు తెచ్చుకుంటుందో చూడాలి. -
ఎన్టీఆర్ వస్తాడా..? రివీల్ చేస్తాడా..?
జైలవకుశ తరువాత చిన్న గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ పరంగా చాలా వర్కౌట్స్ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ యంగ్ టైగర్ జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎన్టీఆర్ ఇంకా స్లిమ్‌గా మారాడనీ తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచుదామని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. కానీ, ఆ లుక్కు బయటకు వచ్చే టైం వచ్చేసింది అనుకుంటున్నారు సినీ అభిమానులు. నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘ఎంఎల్ఏ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ (మంగళవారం) సాయంత్రం జరగునుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్‌కు తన లుక్ బయటపెట్టే ఉద్దేశ్యం లేదట. మరి అన్న కోరిక మేరకు ఈవెంట్‌కు వస్తాడా? తన లుక్‌ను రివీల్ చేస్తాడా? అదే సమయంలో ఎన్టీఆర్ మాస్క్ తో ఈవెంట్‌కు వస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తల్లో ఏది నిజమో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. -
ఎమ్మెల్యే వినోదం
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా విడుదలైన పదకొండేళ్లకు కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం ‘ఎంఎల్ఎ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్’ అన్నది ఉపశీర్షిక. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. పీపుల్ మీడియా అసోసియేషన్‌లో చేసిన ‘ఎంఎల్ఎ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న సినిమా విడుదల చేస్తాం. మా బ్యానర్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ‘ఎంఎల్ఎ’ ఇంకా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘టైటిల్‌ని చూసి ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అనుకోవద్దు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. తొలిభాగం కార్పొరేట్ నేపథ్యంలో, రెండో భాగం రూరల్ నేపథ్యంలో సాగుతుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, కల్యాణ్‌రామ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. చిత్రసమర్పకులు విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. ∙కల్యాణ్ రామ్, కాజల్ -
‘ఎమ్మెల్యే’ మూవీ స్టిల్స్
-
టీజర్ టాక్ : ఎంటర్టైనింగ్ ఎమ్మెల్యే
సాక్షి, సినిమా : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’ కాగా.. మరొకటి ‘నా.. నువ్వే’ . ఇక సంక్రాంతి కానుకగా ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి... అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్, పృథ్వీ మధ్య డైలాగ్ ఫన్నీగా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా ‘ఎమ్మెల్యే’ రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మార్చిలో ఎమ్మెల్యే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
కాజల్ పనైపోయిందా.?
సాక్షి, తమిళ సినిమా: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ అగ్రనటీమణుల్లో ఒకరని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అయితే ఈ స్థాయికి రావడానికి కాజల్ పెద్ద పోరాటమే చేసింది. ఈ ఉత్తరాది బ్యూటీ నట జీవితం అపజయాలతోనే మొదలైంది. వాటిన్నిటిని అధిగమించి కృషి, ప్రతిభను నమ్ముకుని అగ్రనటిగా రాణిస్తోంది. కాయలున్న చెట్లకే దెబ్బలన్న చందాన కాజల్‌పై కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారట. కాజల్ తొలుత బాలీవుడ్ నటిగా 2004లో రంగప్రవేశం చేసింది. దక్షిణాదికి మాత్రం 2007లో పరిచయమైంది. లక్ష్మీకల్యాణం అంటూ టాలీవుడ్‌కు అడుగిడిన కాజల్‌కు ఆ చిత్రం సక్సెస్ అయినా అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా చిత్రం బొమ్మలాట్టం చిత్రంలో రంగప్రవేశం చేసినా అదీ అసలు కాజల్ కెరీర్‌కు హెల్ప్ కాలేదు. ఇలా ఆదిలో అవకాశాల కోసం పోరాడి గెలిచిన నటి కాజల్. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కాజల్ విజయ్ బాటలోనే పయనిస్తోంది. తెలుగులో మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కాజల్ మార్కెట్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందట. 32 రెండేళ్ల కాజల్అగర్వాలల్ పనైపోయిందని ఇక ఎక్కువ కాలం హీరోయిన్గా నిలదొక్కుకోవడం కష్టం అని ఆమె పోటీ నటీమణులు తమ అనుచరులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని సమాచారం. ఈ విషయం కాజల్ చెవిన పడడంతో తను ఎలా స్పందించిందో తెలుసా? ఎవరు ఎలాంటి ప్రచారం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఐ డోంట్ కేర్ అని చాలా లైట్‌గా తీసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో ప్యారిస్ ప్యారిస్ చిత్రం ఒకటి. ఇది హిందీలో నటి కంగనారావత్ నటించి పలు అవార్డులను గలుచుకున్న క్వీన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంతో తను పలు అవార్డులను అందుకుంటాననే నమ్మకాన్ని కాజల్ వ్యక్తం చేస్తోంది. ఇక నానీతో నటిస్తున్న ఎంఎల్ఏ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇక తమిళంలో అజిత్‌తో జత కట్టిన వివేగం, విజయ్‌తో రొమాన్స్ చేసిన మెర్శల్, అదే విధంగా తెలుగులో చిరంజీవితో నటించిన ఖైదీ నంబర్ 150, రానాకు జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయన్నది తెలిసిందే. -
‘ఎంఎల్ఏ’ ఫస్ట్ లుక్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎంఎల్ఏ(మంచి లక్షణాలున్న అబ్బాయ్) సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. మంగళవారం ఫస్ట్‌లుక్ ఫొటోను తన ట్విటర్లో పేజీలో కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు. రేపు(జూలై 5) ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌కు నచ్చేలా ఇందులో కనిపించారు. ఈ సినిమాతో ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. బ్లూ ప్లానెట్ పతాకంపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ ఎంటర్టైన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడిగా కాజల్ నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాలో ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించారు.