సాక్షి, సినిమా : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’ కాగా.. మరొకటి ‘నా.. నువ్వే’ . ఇక సంక్రాంతి కానుకగా ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి... అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్, పృథ్వీ మధ్య డైలాగ్ ఫన్నీగా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘ఎమ్మెల్యే’ రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తోంది.
ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మార్చిలో ఎమ్మెల్యే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment