కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
‘‘ఏ సినిమా అయినా అనుకున్న బడ్జెట్‌లోనే చేయడానికి చూస్తాం. స్క్రీన్ మీద బాగా కనబడుతుందంటే ఖర్చుపెట్టడానికి మాత్రం వెనకాడం. సంపాదించుకుందాం అని కాకుండా మంచి సినిమాలు, హానెస్ట్ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. రెస్పాన్సిబుల్‌గా ఉండాలి, నిర్మాణ విలువలు తగ్గకూడదనుకుంటాం’’ అన్నారు ‘ఎం.ఎల్.ఎ’ చిత్ర నిర్మాతలు భరత్ చౌదరి,కిరణ్ రెడ్డి. కల్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మించారు.
ఇటీవల రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడారు. భరత్ చౌదరి మాట్లాడుతూ – ‘‘కిరణ్, నేను ఫ్రెండ్స్. ఇదివరకు డిస్ట్రిబ్యూషన్‌లో ఉండేవాణ్ణి. సినిమాల్లో ట్రైల్స్ వేద్దాం అని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా నిర్మించాం. అనుకున్న ఫలితం దక్కింది. కంగారు పడకుండా సంవత్సరానికి ఒకట్రెండు సినిమాలు చేసినా క్వాలిటీతో చేయాలనుకుంటున్నాం. ఉపేంద్ర మాధవ్ మొదటి నుంచి టచ్‌లోనే ఉన్నాడు.
కల్యాణ్ రామ్‌తో ఎప్పటినుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇలా కుదిరింది. కల్యాణ్ రామ్‌గారు గోల్డ్. ఈ సినిమాలో ఆయన చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు, మేకోవర్ చాలా బావుందని ఫీడ్‌బ్యాక్ వస్తోంది. సినిమా కథలో కచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. కేవలం డబ్బు పెడితే సరిపోతుంది అనుకోకుండా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్‘అల్లరి’ నరేష్ – భీమనేని శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నాం. ఇందులో సునీల్ పుల్ లెంగ్త్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నారు’’ అన్నారు.
కిరణ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను మైనింగ్ బిజినెస్ చేసేవాణ్ణి. ‘ఎం.ఎల్.ఎ’ సినిమా కొన్న బయర్స్ అందరూ సేఫ్. సోమవారం నుంచి ఓవర్ ఫ్లోస్‌లో ఉన్నాం. రెవెన్యూపరంగా శాటిలైట్ 7 కోట్లు వచ్చింది. తెలుగు రైట్స్ 4.5, హిందీ డబ్బింగ్ రైట్స్ 2.5 కోట్ల బిజినెస్ జరిగింది. రివ్యూలు బాలేకపోయినా ఆడియెన్స్ ఇచ్చిన తీర్పు వేరేలా ఉంది. సినిమాల ద్వారా ఏ నిర్మాతలకైనా కావల్సింది పేరు, డబ్బు. అవి ఈ సినిమాతో వచ్చింది చాలా హ్యాపీ. త్వరలోనే ఉపేంద్ర మాధవ్‌తో మా బ్యానర్‌లో మరో సినిమా ఉంటుంది’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment