
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.అష్టమి రా.12.35 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మూల రా.11.06 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.6.11 నుండి 7.55 వరకు, తిరిగి రా.9.25 నుండి 11.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.08 నుండి 7.44 వరకు, అమృతఘడియలు: సా.4.20 నుండి 6.03 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.07, సూర్యాస్తమయం: 6.07.
మేషం: బంధుమిత్రుల నుంచి విమర్శలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. దైవదర్శనాలు.
వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చికాకులు. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
మిథునం: కార్యజయం. ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.అనుకున్న రాబడి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
కర్కాటకం: దూరప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
సింహం: అనుకోని ప్రయాణాలు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు.ఆరోగ్యభంగం. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమపెరుగుతుంది.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. బంధువులతో విభేదాలు. అంచనాలు తారుమారు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు.
తుల: నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఉద్యోగులకు అనుకూలస్థితి..వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో ఆటంకాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారులకు అంతగా లాభాలు అందవు. ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు. .
ధనుస్సు: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశించిన డబ్బు సమకూరుతుంది.భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. .
మకరం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధుగణం నుంచి విమర్శలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో శ్రమ. వ్యాపారులకు సామాన్యంగాఉంటుంది. .
కుంభం: ఉద్యోగప్రయత్నాలు కలిసివస్తాయి. బంధువులతో తగాదాలు తీరతాయి. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉత్సాహం.
మీనం: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాల రీత్యా ఖర్చులు.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు చిక్కులు తొలగే సమయం..
Comments
Please login to add a commentAdd a comment