horoscope
-
ఈ రాశి వారికి వ్యాపారాలలో నూతనోత్సాహం
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.పంచమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: పుబ్బ ప.3.39 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.11.06 నుండి 12.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.41 నుండి 8.10 వరకు, అమృతఘడియలు: ఉ.8.16 నుండి 10.01 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 5.43.మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.వృషభం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.మిథునం: రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.కర్కాటకం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.సింహం: భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.కన్య: పనులు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.తుల: ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆస్తి లాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.మకరం: రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు. పనులు వాయిదా. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు రాగలవు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. -
పెళ్లికి జాతకం మాత్రమే ముఖ్యం కాదు..!
ఆత్మీయం వివాహానికి తల్లిదండ్రులు తమ పిల్లల జాతకాలను చూపించుకుని, వాటికి సరిపోయే జాతకం ఉండే వధువును లేదా వరుడిని వెతుక్కోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఆచారం ఒకప్పుడు కొన్ని వర్ణాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడది అన్ని వర్ణాలవారిలోనూ విస్తరిస్తూ వస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా, అవతలి వారి జాతకం బాగాలేదని వంకలు పెడుతూ వచ్చిన సంబంధాలన్నింటినీ తిరగ గొట్టడం, తీరా పెళ్లి వయసు దాటిపోతుండగా అప్పుడు ఏదో ఒక సంబంధాన్ని ఖాయం చేసుకోవడం... ఆ తర్వాత ఇద్దరికీ మనసులు కలవక ఇబ్బందులు పడటం... సర్వసాధారణమై పోతోంది. పెళ్లికి జాతకాలు చూపించడంలో తప్పులేదు కాని ఇతర అంశాలు అంటే వధువు లేదా వరుని ప్రవర్తన, ఉద్యోగం, కుటుంబ సంప్రదాయం, శీలం, నడత, రంగు, రూపు, విద్యార్హతలు అన్నింటికీ మించి ఆ సంబంధం తమ పిల్లలకు ఇష్టమా, కాదా అనేది విచారించకపోవడం... వీటితోపాటు ఇతర అంశాలు ఏవి నప్పకపోయినా సరే, జాతకాలు బాగున్నాయి కాబట్టి అన్నీ అవే సర్దుకుంటాయిలే అనే గుడ్డినమ్మకంతో వారిద్దరికీ ముడిపెట్టెయ్యడం సబబు కాదు. అదేవిధంగా పైన చెప్పిన అన్ని అంశాలు బాగుండి, వధూవరురిద్దరికీ ఒకరి పట్ల మరొకరికి సదభిప్రాయం, ఇష్టం ఉన్నప్పటికి కూడా కేవలం జాతకాలు కుదరలేదని వంకపెట్టి పెళ్లి ఆపేయటం కూడా సమంజసం కాదు. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులందరూ తెలుసుకున్నప్పుడే పెళ్లిళ్లు సకాలంలో అవుతాయి. కాపురాలు చల్లగా సాగుతాయి. -
పెళ్లి ప్రయత్నాలు ఫలించడం లేదా..?
పెళ్లిళ్ల కోసం కొందరు ఎన్ని ప్రయత్నాలు సాగించినా ఫలించవు. జాతకాల్లో కుజ దోషం, కళత్ర, ద్వితీయ స్థానాల్లో దుష్టగ్రహాల ప్రభావం వంటి లోపాలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. జాతకం చూపించుకుని నిర్దిష్టమైన పరిహారాలు పాటించడం వల్ల ఫలితాలు ఉంటాయి. అయితే, కొందరికి జాతకచక్రాలు ఉండవు. అలాంటి వారు కొన్ని సాధారణ పరిహారాలను పాటించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. పెళ్లి యత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి... ⇔ నిద్రపోయే ముందు తల వద్ద ఒక రాగిచెంబుతో నీళ్లు పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయండి. వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. శక్తి చాలకుంటే కనీసం చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారికి తోచిన సాయం చేయండి. ⇔ ప్రతి గురువారం పశువులకు తీపిరొట్టెలు తినిపించండి. అలాగే ఆలయాల వద్ద యాచకులకు కూడా తీపిరొట్టెలను పంచిపెట్టండి. ⇔ శ్రీకృష్ణ యుగళ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు పఠించండి. ఇంట్లో రోజువారీ చేసే పూజలో భాగంగా శ్రీకృష్ణుడికి ధూపదీపాలు సమర్పించండి. ⇔ కుంకుమ పువ్వును, కస్తూరిని పాలలో రంగరించి తిలకంగా ధరించండి. ఎరుపు రంగు రుమాలును దగ్గర ఉంచుకోండి. పర్సులో రాగినాణెం ఉండేలా చూసుకోండి. ⇔ గర్వాన్ని, దర్పాన్ని ప్రదర్శించే అలవాటు మానుకోండి. పెద్దలను గౌరవించండి. పిన్నలను ఆదరించండి. ఏ పరిస్థితుల్లోనూ దుర్భాషలాడకండి. ⇔ శుష్క వాగ్దానాలు చేయడం మానుకోండి. ఎవరికైనా మాటిస్తే దాన్ని కచ్చితంగా నిలబెట్టుకోండి. – పన్యాల జగన్నాథ దాసు -
నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు
సంబోధిని పొందకముందు బుద్ధుని పూర్వజన్మల గురించి తెలిపే 547 కథలే జాతక కథలు. బుద్ధుని ప్రామాణిక బోధలైన పాలీ భాషలోనున్న త్రిపిటకాల్లోని సుత్తపిటకంలోని ఖుద్ధక నికాయంలో జాతక కథల గ్రంథం ఒకటి. మానవుల ప్రవర్తనలోని వైఫల్యాలను సరిదిద్దడానికి, ఆ తప్పుల్ని సరిచేసుకోడానికి మరోకథను చెప్పి, తద్వారా ఆ తప్పుని చూపించటమే జాతక కథల ముఖ్యోద్దేశం. ప్రతి జాతక కథ, దానిని చెప్పవలసి వచ్చిన సందర్భాన్ని సూచిస్తూ మొదలై, మధ్యలో బోధిసత్వుని పూర్వజన్మ కథను కలిగి వుంటుంది. పరంపరగా సంప్రాప్తమైన లక్షణాలతో, సంకీర్ణమైన కారణ–కార్యసూత్రం జీవరాశిలో ఏ విధంగా పనిచేస్తుందో చెప్పటమే కథావస్తువుగా సాగుతుంది జాతక కథ. మానవులు, ప్రాణుల మధ్య ఎలాంటి భేదభావాన్ని చూపక, ప్రాణిక ఏకతను చాటుతూ, బుద్ధుడు బోధించిన అనిచ్చ(అనిత్య), దుక్క(దుఃఖ), అనత్త(అనాత్మ) అనే మూడు అక్షణాలు, పది శీల లక్షణాలు, నాలుగు ఆర్యసత్యాలతో కలిపి, నైతిక బోధ ప్రధానాంశంగా సాగుతాయి జాతక కథలు. బుద్ధుడు చెప్పిన దశపారమితలు సాధిస్తే ఆ వ్యక్తి ఉత్తముడవుతాడు. దానం, శీలం, ప్రజ్ఞ, ఓర్పు, సత్యం ఇలాంటి పది గుణాలే దశపారమితలు. ఈ గుణాల్ని ఎలా రూపొందించు కోవాలి, ఎలా కాపాడు కోవాలి, ఎలా పెంపొందించు కోవాలో ఈ కథలు తెలుపుతాయి. నైతికతని కథల ద్వారా ముఖ్యంగా జంతువుల్ని, పక్షుల్ని, పాముల్ని పాత్రలుగా చేసి కథలుగా మలచడం ప్రపంచ సాహిత్యంలోనే తొలి ప్రయోగం. పంచతంత్ర కథలు, ఈసప్ కథలు, కథాసరిత్సాగరం, జొసాఫెట్ కథలు... పర్షియా, అరేబియా, గ్రీకు, రోమన్ల కథా రచనలూ, కొన్ని షేక్స్పియర్ రచనలూ ఈ జాతక కథల ప్రభావానికి లోనైనవే. ప్రపంచ బాలసాహిత్యానికి పునాదిరాళ్ళు ఈ జాతక కథలు. భిక్ఖు ధమ్మరక్ఖిత సంపాదకత్వంలో ప్రముఖ బౌద్ధ రచయితలు బొర్రా గోవర్ధన్, బిక్ఖు ధమ్మరక్ఖిత ఈ గ్రం«థాన్ని పాలీ మూలం నుంచి సులభ వ్యావహారికంలో ఆసక్తికరంగా తెలుగులోకి అనువదించారు. జాతక కథలకు ఆచార్య బుద్ధఘోషుడు రాసిన ముందుమాటను భిక్ఖు ధమ్మరక్ఖిత తెనిగించారు. సద్ధర్మం చిరస్థాయిగా వుండటానికి బుద్ధుడు చెప్పినట్లు, పదాలు, వాక్యాలు సరైన క్రమంలో వుంటే వాటి అర్థాన్ని కూడా చక్కగా గ్రహించవచ్చు అన్న రెండు సూచనలను అనుసరించి అనువదించిన రచయితలు బౌద్ధ ధమ్మాన్ని, సాహిత్యాన్ని ఔపోసన పట్టిన దీక్షాపరులు. ఒక సాధకుడు ఎరుకలో సంకల్పించి, నైతిక ధార్మిక పురోగతిని సాధించి, సంసారంలోని ఇబ్బందులను అధిగమించి ప్రశాంతమైన, ఎల్లలు లేనటువంటి బుద్ధత్వాన్ని పొందే పరిణామాన్ని ఈ గ్రంథం చక్కటి కథన శైలిలో వివరించింది. ఈ గ్రంథంలో జాతక వ్యాఖ్యానంలో మొదటిదైన దూరే నిదాన కథతో ప్రారంభమై, అపణ్ణకవ, శీల, కురుఙ్జ, కులావక, అత్థకామ, ఆసీస, ఇత్థి, వరుణ, పపాయుహ్హ, లిత్త, పరోసత, హంచి, కుసనాళి, అసమ్పదాన, కకణ్ణక అనే 15 వర్గాలలో, వర్గానికి 10 చొప్పున మొత్తం 150 కథలున్నాయి. భగవాన్ బుద్ధుడు జేతవనంలో వున్నప్పుడు అనాధపిండక శ్రేష్టికి మిత్రులైన 500 మంది తైర్థిక శ్రావకులకు చెప్పిన అపణ్ణక జాతకం ఈ గ్రంథంలో మొదటి జాతక కథ కాగా, బుద్ధుడు నాలందాలోని వేళువనంలో వున్నప్పుడు దుర్మతి అయిన దేవదత్తుని ఆదరించిన రాజు అజాతశత్రు గురించి చెప్పిన సజ్జీవ జాతక కథ, చివరి జాతక కథ. 2004లోనే బౌద్ధధర్మ పరిరక్షణ, ప్రచారాలకు పూనుకున్న (మునుపటి ఆనంద బుద్ధవిహార) మహాబోధి బుద్ధవిహార, బౌద్ధధమ్మ ఉపాసకులు చెన్నూరు ఆంజనేయరెడ్డి, సంబటూరి వీరనారాయణరెడ్డి అనుసంధానకర్తలుగా చేపట్టిన తెలుగు త్రిపిటక జాతక కథలు మొదటి భాగాన్ని వెలువరించింది. బౌద్ధ అభిమానులే కాక, నౌతిక వర్తనాన్ని అభిలషించే ప్రతి పాఠకుడూ సేకరించి, దాచుకోవలసిన గ్రంథం ఇది. - డా||ఈమని శివనాగిరెడ్డి 9848598446 -
అంతా విజయమే!
2017 సంవత్సర ఫలితాలు మేషం (మార్చి 21– ఏప్రిల్ 20) రాశులలో వీరు మొదటి రాశికి చెందిన వారు కనుక జీవితంలో కూడా ఏదైనా ట్రెండ్ సృష్టించడంలో మొదటి వరుసలో ఉంటారు. 2017 సంవత్సరం వీరికి కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంవత్సరపు మొదటి భాగం చాలా బాగుంటుంది. మీకు సహకరించని అంశాలను ప్రకృతి తన సహజపద్ధతిలో తొలగిస్తుంది. కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు తమ లోపలి విషయాలు ఒకరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాము అనుకున్నది చేస్తారు. వృత్తి పరంగా ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక అందమైన ప్రదేశంలో సొంత ఇల్లు కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పుట్టినరోజు, ఇతర వేడుకలకు వృత్తి నుంచి విరామం తీసుకొని వినోదం పొందండి. ఈ విరామంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన శక్తియుక్తులను కూడగట్టుకోండి. మిమ్మల్ని నొప్పించే ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ప్రేమలో సరైన భాగస్వామిని ఎంచుకోండి. ఈ సంవత్సరం మీరు కోరుకునే అనుబంధాలు దక్కుతాయి. కలిసొచ్చేవి : రంగు: ఆరంజ్; వారం: ఆదివారం; అంకె: 1 వృషభం (ఏప్రిల్ 21–మే 20) వృషభరాశికి వాడి అయిన కొమ్ములతో ఉండే వృషభం చిహ్నం. ఇది స్థిరత్వానికీ, దృష్టికోణానికి సంకేతం. అయితే వీరికి ఈ సంవత్సరం కొంచెం మందకొడిగా నడిచే అవకాశం ఉంది. ఆశలు, ఆశయాలు భారీగా ఉన్నా ఆ సంగతి బయటకు చెప్పక మనసులోనే పెట్టుకుని ఉంటారు. అసలు గత సంవత్సరం కోసం ఏం నిర్ణయాలు తీసుకున్నామా అని ఒకసారి పరికించుకోండి. కొంచెం ఓపిక అవసరం. టీమ్‌తో పాటు కలిసి పని చేయడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామిక ధోరణి ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు, వివాహానికి ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. మిమ్మల్ని మీరు వెతుక్కోవడంలో మరింత లోతులకు వెళతారు.మీ పనే మీకు దైవం. మీ పనిలో మిమ్మల్ని కొట్టే చెయ్యి ఉండదు. ఆర్థిక పరంగా మంచి లబ్ధి కనిపిస్తోంది. పెట్టుబడులకు ఇది కలిసివచ్చే కాలం. ఏవైనా కోర్సులు చదవాలనుకునేవారికి కూడా ఈ కాలం కలిసి వస్తుంది. కలిసొచ్చేవి : రంగు: పసుపు; వారం: మంగళవారం; అంకె: 2 మిథునం (మే 21–జూన్ 21) ఈ 2017వ సంవత్సరం మీకు కలిసొస్తుంది. గతంలో చేసిన కృషికి తగ్గ ఫలితం ఈ కొత్త ఏడాదిలో లభిస్తుంది. అందుకే ఈ 2017లో వచ్చే కొత్త అవకాశాలను అందుకోవడం కోసం మీ మనసును తెరచి ఉంచుకోండి. భావోద్వేగపరమైన పరిణతి వస్తుంది. అయితే, ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద మీ మానసిక భావోద్వేగాలు పెచ్చుమీరి, పరిస్థితులపై వాటిదే పైచేయి కాకుండా చూసుకోండి. కొత్త ఇమేజ్ తెచ్చుకోవడానికి ఈ కొత్త ఏడాది భలే మంచి టైమ్. ఎప్పటిలానే, ఆరోగ్యం మీదే మీ చూపు అంతా! చాలా మంది ఆరోగ్యబాటలో పయనించడానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ 2017లో మీకు లాటరీలు తగిలే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విజయాలు అందుకుంటారు. మీ అదృష్టం మరింత పెరగాలంటే, దక్షిణపు దిక్కున ఫినిక్స్ బొమ్మను ఉంచండి. దీని వల్ల బోలెడన్ని అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటన్నిటినీ మీరు బంగారంలా వాడుకోవచ్చు. కలిసొచ్చేవి: రంగు: బంగారం; వారం: ఆదివారం; అంకె: 9 కర్కాటకం (జూన్22–జూలై 23) ఎంత కష్టపడి పని చేస్తే అంత ఫలితం. విజ్ఞానం పెంచుకోవడానికీ, నైపుణ్యాలను అలవరచుకోవడానికీ ఇదే తగిన సమయం. రానున్న సంవత్సరాల్లో బలంగా నిలదొక్కు కొని నిలబడడానికి ముందుగానే లక్ష్యం నిర్దేశించుకొని, ముందడుగు వేయడం అవసరం. కొత్త ఏడాదిలో మీకు వేసవి కన్నా, శీతకాలం చాలా బాగా కలిసొస్తుంది. ఈసారి మీరు మరీ కొట్టొచ్చినట్లుండే ముదురు రంగు దుస్తులు వాడకండి. మీకు ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా జీవితమే లేదని భావిస్తారు. అందుకే, ఆ ప్రేమాన్వేషణలో ఉంటూ, ఎవరితోనైనా ఇట్టే ప్రేమలో పడిపోతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో అన్ని ప్రేమలూ ఫలించవు కాబట్టి, కాస్తంత గుండె దిటవు చేసుకొని ముందుకు అడుగేయండి. మీ మనసుకు నచ్చేవాళ్ళను వెతుక్కోవడానికి ఇది సరైన సమయం కాకపోతేనేం, ఈ ఏడాది కాకపోతేనేం వచ్చే ఏడాదైనా దొరుకుతారని గుర్తించండి. ఈ ఏడాది మీ పుట్టినరోజు తరువాత మీ ప్రేమ జీవితం మరింత మెరుగవుతుందని గ్రహించండి. కలిసొచ్చేవి : అదృష్ట సంఖ్య: 6; రంగు: సీ గ్రీన్; వారం: గురువారం సింహం (జూలై 24–ఆగస్టు 23) సగర్వంగా, కొండొకచో అహంకారంగా అనిపిస్తున్నా, నమ్మకంగా, ధైర్యంగా ముందుకు సాగడం సింహ రాశి వారి లక్షణం. సౌహార్దంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో, మంచి ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, ప్రయాణాలు, లాటరీలు – అన్నీ మీకు ఈసారి కలిసొస్తాయి. మీ ఆశయాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఇతరులను ఎవరినీ మీ మార్గంలోకి అడ్డుగా రానివ్వకండి. ఉద్యోగం, పని విషయంలో ఈ ఏడాది మీకు ఎక్కడ లేని శక్తి, ఉత్సాహం ఉంటాయి. కొత్త ఏడాది ఆరంభంలో మీరు పట్టిందల్లా బంగారమే. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రేమ విషయంలో మీ మనసులోని మాటను నిజాయతీగా చెప్పేయడం మంచిది. సింహరాశి వారికి తగిన వ్యక్తులు దొరుకుతారు. ఇంట్లో దక్షిణ మూలలో రెండు ఎర్ర కొవ్వత్తులు వెలిగించండి. దాంతో, మీకు మరింత ప్రేమ, ప్రణయం లభిస్తాయి. కలిసొచ్చేవి: అదృష్ట సంఖ్య: 4; రంగు: అగ్ని జ్వాల లాంటి కమలాపండు రంగు; వారం: ఆదివారం కన్య (ఆగస్టు24–సెప్టెంబర్ 23) ఈ రాశి వారికి ఈ ప్రపంచం ఒక్కటే నాకు చాలదు అనే ధోరణి ఉంటుంది కనుక వీరి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. వీళ్లు జీవితం నుంచి ముక్తసరిగా కాకుండా ఎక్కువ ఆశించడం దానికి కారణం. ఇది మీరు మీ జీవిత గమనాన్ని విశ్వసించాల్సిన సమయం. మీకు ఆ సంగతి తెలుసు. అందుకు సిద్ధపడండి. కొంచెం అనిశ్చితి మొదట చోటు చేసుకున్నా మమ్మిల్ని మీరు స్థిరపరుచుకొని ముందుకు సాగండి. అంతేతప్ప మిమ్మల్ని మీరు వెనక్కు లాక్కోండి. సమయం వచ్చేసింది. ధైర్యంగా అడుగువేస్తే మీరు ఏమేమి కోరుకున్నారో అవన్నీ పొందుతారు. న్యాయపరమైన లావాదేవీలు పరిష్కృతమవుతాయి. జూన్ తర్వాత అంతా బాగుంటుంది. కొన్ని ఊహించని పరిణామాలు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా మారుతాయి. మీ పాత స్నేహితులు, పాత అనుబంధాలు మళ్లీ తారసపడి మీ గతంలోని హుషారును, కొంత కోలాహాలాన్ని తీసుకొని వస్తాయి. భౌతిక విషయాలు ఆధ్యాత్మిక విషయాల మధ్య సమన్వయం పాటించండి. కలిసొచ్చేవి: రంగు: లేలేత గులాబీ (టెర్రకోట పింక్); సంఖ్య: 3; వారం: బుధవారం తుల (సెప్టెంబర్ 24– అక్టోబర్ 23) మీ స్నేహం, మీ సమ్మోహన శక్తి, మీ ఆతిథ్యం... కొత్త సంవత్సరంలో అందర్నీ మీ చుట్టూ తిప్పుకుంటాయి. 2017 మీ జీవితానికి మంచి మలుపు. రోజులు సాఫీగా, సమతులంగా గడుస్తాయి. అనుకున్నదాన్ని సాధించడానికి మీకున్న పరిమితులను దాటుకుని మరీ ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే దుస్తులపై దృష్టి పెడతారు. మనసులను వశం చేసుకుంటారు. అభిమాన్ని చూరగొంటారు. కొత్త వ్యక్తులకు మీరు ఆత్మీయులైపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా జీర్ణకోశంపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇతర విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దూకుడు తగ్గించాలి. ఆలోచనల వేగాన్ని నియంత్రించుకోవాలి. ప్రారంభ మాసాలు కొంచెం అయోమయంగా ఉంటాయి. అలాగని ఆందోళన చెందనవసరం లేదు. 5వ అంకెకు దూరంగా ఉండండి. మే నెలలో డబ్బుకు కాస్త ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో ప్రయాణాలు. కలిసొచ్చేవి : రంగు : లేత నీలం (పాస్టల్ బ్లూ); వారం : బుధవారం; అంకె : 3 వృశ్చికం (అక్టోబర్ 24–నవంబర్ 22) సమర్థత మీ రహస్య ఆయుధం. దెబ్బ తగిలినా కోలుకోగల సామర్థ్యం మీ సొంతం. కొత్త అవకాశాల కోసం మీరు ఎంతోకాలంగా వేచిచూస్తున్నారు. కానీ ఎన్నో అవకాశాలు ఈ ఏడాది మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఒత్తిళ్లు ఎదుర్కోవడం అన్నది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మీ వెన్నంటే ఉన్నా... ఆ తర్వాతి విజయాలు ఆ ఒత్తిడుల తాకిడికి ఉపశమనంలా పనిచేస్తాయి. కొన్ని విజయాలు మిమ్మల్ని వరించడానికి ఈ ఏడాది సంసిద్ధంగా ఉన్నాయి. ఒక మార్మికమైన, దివ్యమైన శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీరు సంసిద్ధం చేసుకునే కొత్త కొత్త వ్యూహాల కారణంగా భవిష్యత్తులో మీకు భద్రత సమకూరుతుంది. పోరాటపటిమను ప్రదర్శిస్తుంటారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మరింతగా ఇష్టపడటానికి మీకు ఉన్న ఈ గుణమే దోహదపడుతుంది. ఫిబ్రవరి, ఆగస్టు, అక్టోబర్ నెలలు మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురిచేస్తాయి. జనవరి, డిసెంబరు నెలల్లో దూరప్రయాణాలకు అవకాశం కలగవచ్చు. కలిసొచ్చేవి : రంగు : ఇటుక ఎరుపు (బ్రిక్ రెడ్); వారం : మంగళవారం; నంబరు : 2 ధనుస్సు (నవంబర్23–డిసెంబర్ 21) ఉన్న చోటే కుదురుగా ఉండిపోడానికి ఇష్ట పడరు. స్వేచ్ఛగా విహరించేందుకు నిత్యం మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తారు. తత్వవేత్తలు, చింతనాపరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. చర్చల్లో పాల్గొంటారు. వాదోపవాదాల కారణంగా మీ విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. దేన్నయినా తేలిగ్గా తీసుకుంటారు. కానీ సూక్ష్మంగా విశ్లేషిస్తారు. మీరు కోరుకున్నది మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అక్టోబరులో మనసైన వారు చేరువవుతారు. జూన్ తర్వాత మాత్రమే చేతిలో కాస్త డబ్బుల ఆడతాయి. వ్యక్తిగత ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్యోగ రీత్యా కూడా మీరు విదేశీయానం చేస్తారు. మీది వ్యాపారం అయితే కొత్త వ్యాపారం, మీరు ఉద్యోగి అయితే కొత్త ఉద్యోగం జత కలుస్తుంది. అవసరంలో ఉన్నవారికి అడక్కుండానే సహాయం చేస్తారు. జూలై నుంచి మీ జీవితం అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. కొండాకోనల్లో, పచ్చని ప్రకృతి నీడలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. కలిసొచ్చేవి : రంగు : లేలేత ఊదా (రాయల్ పర్పుల్); వారం : గురువారం; అంకె : 9 మకరం (డిసెంబర్ 22–జనవరి 20) ఆధిక్య భావన, తీవ్ర ఆకాంక్ష, పట్టువిడుపులేని స్వభావం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. అంచెలన్నీ దాటి చకచకా అందలం చేరుకుంటారు. పై అధికారులకు మీ ముక్కుసూటితనం కొంత అసహనం కలిగించినప్పటికీ మీరు వారికి ప్రియమైన వ్యక్తి అవుతారు. ఇది మీకు ‘సక్సెస్ ఇయర్’. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. వచ్చిన అనేక మెరుగైన అవకాశాల్లో నుంచి మరింత మెరుగైన దాన్ని ఎంచుకోవడం మీకు కష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మార్పును అంగీకరించని మీ తత్వాన్ని 2017 కొద్దిగానైనా సడలిస్తుంది. అదీ మంచికే. ప్రేమకు మీరు తల ఒగ్గుతారు. ప్రేమ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అంటే రాజీ పడతారు. ప్రేమలో అవతలి వ్యక్తి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇస్తారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు మీకు అనుకూలమైనవి. జూలై నుంచి ఆరోగ్యం పూర్తిగా మెరుగవుతుంది. కలిసొచ్చేవి : రంగు : ముదురాకు పచ్చ (ఫారెస్ట్ గ్రీన్); వారం : శనివారం; సంఖ్య : 12 కుంభం (జనవరి 21–ఫిబ్రవరి 19) ఈ ఏడాది ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. ప్రేమలో విజయాలు, మీ సంతోషం కొనసాగుతాయి. గతంలోని చేదు అనుభవాలు తుడిచిపెట్టుకుపోతాయి. మీ దిగులు, బెంగ వంటి వాటిని ఎలా అధిగమించాలా అని తర్కబద్ధంగా ఆలోచిస్తారు. మీ జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించి, మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఆమె కీలకమైన భూమిక పోషిస్తుంది. ఒకవేళ మీరు మహిళ అయి ఉంటే మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారు. ఈ ఏడాది మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబం నుంచి అమితమైన ఆనందం లభ్యమవుతుంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. సంతోషాలు, ఆనందాలు అందరితో పంచుకుంటారు. ఆరోగ్యపరంగా ఏడాది మీకు అత్యుత్తమమైంది. అనంత విశ్వం నుంచి మీకు సమకూరే సంతోషాలతో ఈ ఏడాది మీకు ఎంతగా కలిసి వస్తుందంటే... ఆనందాల సింహాసనంపై కూర్చున్న రారాజులాగా మీరు ఫీలవుతారు. గుడిగంటల వంటి సంతోషాల ప్రకంపనలు మిమ్మల్ని ఎప్పుడూ సందడిగా ఉండేలా చేస్తాయి.కలిసొచ్చేవి : రంగు : నీలిమందు రంగు; వారం : శని; అంకె : 9 మీనం (ఫిబ్రవరి 20–మార్చి 20) మీరు ఒకింత సున్నిత మనస్కులు. మీ మనసుకు తగ్గట్లుగానే ఒక అద్భుతమైన కలల ప్రపంచం మీ ముందు ఆవిష్కృతమైనట్లుగా ఈ ఏడాది అంతా అనిపిస్తుంటుంది. ఈ ఏడాది ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని సమస్యలు ముందు ఉన్నా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని తేలిగ్గానే అధిగమిస్తారు. కొన్ని పొరబాట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ గత అనుభవాల కారణంగా మీరు వాటిని దొర్లనివ్వకుండా జాగ్రత్తపడతారు. మీ బాంధవ్యాల విషయంలో అపార్థాలకు తావివ్వకుండా మీ ఆలోచనలను పంచుకోడానికి సిద్ధంగా ఉండండి. దాంతో మీ ఆలోచనలను వారూ సానుకూలంగా తీసుకుంటారు. దాంతో ఎన్నో ఇక్కట్లు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మీ ఆదాయానికీ, ఖర్చులకూ సమన్వయం ఉంది. అయితే కొత్త ఆస్తులు సమకూర్చుకోడానికి తగిన అవకాశాలను సైతం ఈ కొత్త ఏడాది మీ ముందుకు తీసుకువస్తుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు మరింత సానుకూలంగా ఉంటుంది. కలిసొచ్చేవి : రంగు : నీలిపచ్చ (సీ గ్రీన్); వారం : గురువారం; నంబరు : 4 టారో అనలిస్ట్, టారో ఇన్సియా -
కాలసర్ప దోషమా?
జాతకంలో దోషాలు ఉండడం సహజమే. అదేవిధంగా ప్రతి దోషానికి మన ఋషులు నివారణ ఉపాయాలు కూడా అదే రీతిలో చెప్పారు. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? కాలసర్పదోషం జాతకంలో రాహు కేతువుల వలన ఏర్పడుతుంది. జాతకంలో 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ దోషం వలన వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ...! జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా వాటిని కాల సర్పదోషం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి / ఉద్యోగంలో ఉన్నతి మొదలైన వాటికి ప్రధాన అవరోధంగా మారుతుంది. కాలసర్పదోషం ఎందుకు వస్తుంది? ఈదోషం వంశపారంపర్యంగా లేదా ఒక్కరికైనా గానీ రావొచ్చు. చాలామంది అనుకునేది ఏంటి అంటే సర్పాలను చంపడం వలననే ఈ దోషం వస్తుందేమో అని. కొంత నిజమే అయినా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సర్పాలను తెలిసిగానీ తెలియకగానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా సంహరించడం చేసినా దోషం వదలదు అని నిర్ణయకౌముది చెబుతుంది. పీడించినా హింసించినా బంధించినా సంహరించినా ఆ పాపం సర్పదోషం రూపంలో మనల్ని పీడిస్తుంది. వంశ క్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం. అంతేకాదు.. గురువులు, ముసలివాళ్ళు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశు పక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది. అంటే ధర్మహీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే సమస్తకర్మలు సర్పశాప స్థితి ద్వారా అమలవుతాయన్నమాట. కర్త అనగా చేసినవాడు, కారయితా అనగా కారణం అయినవాడు, ప్రేరకః అనగా ప్రేరేపించినవాడు అనుమోదకః అనగా ఆమోదించినవాడు ఈ నలుగురు పాపం అయినా పుణ్యం అయినా సమానంగా అనుభవిస్తారట. నాగదోష ఫలితాలు ..! ...సంతానహీనతకు, గర్భశోకానికి, గుణ - రూప హీనులైన సంతానానికి, భర్తహీనతకి, సంసార దుఖానికి, ఈ నాగదోషమే కారణం. రోగాలకి అశాంతికి అభద్రతకి చంచలమైన - స్థిరత్వం లేని జీవితానికి కూడా ఈ దోషమే కారణం. వివాహం కాకపోవడం, దంపతులు త్వరగా విడిపోవడం బాల వైధవ్యం దాంపత్యంలో కలహాలు అన్యోన్యత లేకపోవడం కూడా నాగదోషమే. ఒక్కమాటలో చెప్పాలి అంటే జాతకంలో ఉండే అన్ని దోషాలకన్నా ప్రధానమైనదీ ప్రమాదమైనదీ కూడా ఈ ‘కాలసర్పదోషమే’ ఈ దోషం ఉన్న జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. వీరి మిత్రులు, సహచరులు వీరికన్నా తక్కువ స్థాయి వారూ వీరిని దాటి ముందుకు వెళ్తారు కానీ వీరు మాత్రం ప్రతిభా పాటవాలు ఉన్నా అక్కడే ఉండిపోతారు. ‘కాళహస్తిలో ’ పూజ చేయిస్తే సరిపోతుందా..? అందరూ ఇలాగే అనుకోని తప్పుచేస్తుంటారు. ఉదాహరణకు: గుండె జబ్బుతో బాధపడే వ్యక్తికి చికిత్స నిమిత్తం ఒక మాత్ర ఇస్తే సరిపోదు. బైపాస్ చేయించడమే తగు చికిత్స. అలాగే ఈ దోషానికి కూడా ’కాలసర్ప శాంతి’ అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం. అలా శాంతి చేయించిన తరువాత కాళహస్తి వెళ్లి అక్కడ రాహు - కేతు పూజ చేయించడంతో సమాప్తం అవుతుంది. దోషం పోవావాలంటే సశాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది 3 రోజులు లేదా 1 రోజు గానీ చేసుకోవచ్చు. గణపతి పూజ - పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం రాహువు 18 వేలు జపం, కేతువు 7 వేలు జపం, నక్షత్ర జపం, సర్ప మూల మంత్రం, లక్ష్మి గణపతి మూల మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గో క్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం చేయాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మాసాదేవి ఇష్టదేవతా కులదేవతా రుద్ర ప్రధాన కలశాల స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, మినుములతో; కేతువుకి దర్భ, ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేసాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో ఉలవలు కిలో, సర్ప ప్రతిమలు 2 కలిపి దక్షిణతో దానం చేసి, ఆయా కలశాల జలంతో కర్తకి (ఎవరికోసం చేసుకుంటున్నారో వారు ) మంత్రయుక్తంగా స్నానం చేయించాలి. కుదిరితే పూజలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తి అయినట్లే!మరి తమ పుట్టిన తేదీ తదితర జాతక వివరాలు తెలియనివారు తమకు కాలసర్పదోషం ఉన్నదో లేదో అనేది ఎలా తెలుసుకోగలరు అనే సందేహం రాకమానదు. అయితే అలాంటివారు తమ జీవితంలో జరిగిన, జరుగుతున్న ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అది కాలసర్ప దోషమో కాదో నిర్ధారణ చేయవచ్చు. - మద్దికుంట శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం నిర్వాహకులు -
నా జాతకంలో ఓటమి లేదు
- ఎర్రవల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ - దేవుడి దయతో ఏదనుకుంటే అది జరిగింది - ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయితది.. ఈ రెండు గ్రామాలు దేశానికే మార్గదర్శకం కాబోతున్నాయ్ - త్వరలో డబుల్ బెడ్ ఇళ్లలోకి పోదాం - పెద్ద దావత్ చేసుకుందాం.. నేను మీతోనే తింటా.. - ఇంటింటికీ పాడి గేదెలు.. ఇంటర్నెట్ సౌకర్యం - ఊరిలో అంతా కలసి ఉండాలె.. కొట్లాటలు, పంచాయితీలు బంద్ చేయాలె - గ్రామంలో 42 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ గజ్వేల్: ‘‘ఇప్పటివరకు దేవుడి దయ వల్ల నేనేది జరగాలనుకున్ననో అదే జరిగింది.. నేను కూడా ఎర్రవల్లి గ్రామస్తుణ్నే.. జాతకం ప్రకారం నాకు ఫెయిల్యూర్ లేదు.. ఎర్రవల్లి, నర్సన్నపేట ఆదర్శ గ్రామాల ప్రాజెక్టు కూడా సక్సెస్ అయితది.. ఈ రెండు గ్రామాలు రేపు దేశానికే మార్గదర్శకం కాబోతున్నయ్... ఇందులో అనుమానం లేదు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో వందశాతం రాయితీపై 42 మంది లబ్ధిదారులకు సీఎం ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘మరో రెండు నెలల్లో ఈ రెండు గ్రామాల్లో చిన్న యాగం చేద్దాం.. దేవుణ్ని కొలుచుకుందాం. తర్వాత డబుల్ బెడ్రూం ఇళ్ల గృహప్రవేశ పండుగ చేసుకుందాం. అలాగే రిలయన్స్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందించబోతున్నాం..’’ అని చెప్పారు. ‘‘సంఘటితంగా ఉంటే కొండలను కూడా బద్దలు కొట్టగలం. ఐకమత్యంలో చాలా బలముంది. ఈ విషయాన్ని మనకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలే. ఇప్పుడు మనం ఆచరించి చూపిద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతం కూడÐð ల్లి వాగును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘ ‘ఈసారి వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని చెబుతుండ్రు. సెప్టెంబర్‌లో బాగా పడతాయట. కూడవెల్లి వాగునీటితో కుంటలను నింపుకుని వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుందాం. తాగునీటికి ఇప్పటికే గోదావరి జలాలు అందుతున్నాయి. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు స్వయం ఆధార గ్రామాలుగా అవతరించాలన్నదే లక్ష్యం. రెండు గ్రామాల్లో ఒక్కరు కూడా పని లేకుండా ఉండొద్దు. 60 కుటుంబాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో ఇప్పటికే కొందరికి ట్రాక్టర్లు అందజేశాం. మరో 16–20 మందిని ఉమ్మడి వ్యవసాయంలో ఆపరేటర్లుగా నియమించబోతున్నం. ఇద్దరిని ఎరువుల గోదాం ఇన్చార్జులుగా నియమిస్తాం. ఒకరికి చెప్పుల దుకాణం, మరో ఇద్దరికి హెయిర్ కటింగ్ సెలూన్స్, మరికొందరికి కూరగాయల మార్కెట్, రెడీమేడ్ షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసి ఉపాధి చూపుతాం’’ అని చెప్పారు. ఇంటింటికీ ఆవులు లేదా గేదెలు డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశ సమయానికి ఇంటింటికి రెండు పాడి గేదెలు లేదా ఆవులను అందజేస్తామని సీఎం చెప్పారు. ‘‘ఎవరు నచ్చినై వారు కొనుక్కోవచ్చు. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునే పశువులను కొనుక్కుని పాడి ద్వారా మంచి ఆదాయం పొందాలె. సర్కారే అందరికీ గేదెలు, ఆవులను కొనిస్తది. దీంతో పాటు ప్రతి ఇంటికి పది దేశవాళీ కోళ్లను కూడా అందిస్తం. ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించుకుని ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలె. రెండు నెలల్లో గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తవుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి పనిచేసినా అందరికీ తెల్వాలె. ఇందుకు కమ్యూనిటీ హాల్ వేదిక కాబోతుంది’’ అని అన్నారు. ‘‘ఈ రెండు గ్రామాల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని నేను అడిగిన వెంటనే రిలయన్స్ సంస్థ ఒప్పుకుంది. సర్వే కూడా ప్రారంభించింది. రెండు నెలల్లో ఈ సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తది. ఈడ కూసోని అమెరికాలో ఉన్న వాళ్లతో వీడియో కాల్ మాట్లాడొచ్చు. హైదరాబాద్‌లో ఉండేటోళ్లు ఎర్రవల్లి కాడ ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుండు.. అనే వాతావరణం ఏర్పడతది. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామస్తులు ఈడికి వచ్చిండ్రు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసిండ్రు. రాబోయే రోజుల్లో ఈ ఊరి నుంచి వేరే గ్రామాలకు పోయి మీరే తోవ చూపాలే. ఈ రెండు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి.. రేపటి భావితరాల తెలంగాణ కోసమే. ప్రతి గ్రామం ఈ రెండు గ్రామాల్లా తయారు చేయడమే నా లక్ష్యం. కాకపోతే ముందు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు ఆ అదృష్టం పొందాయి’’ అని సీఎం వ్యాఖ్యానించారు. గన్ ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగ్ గొప్పది ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. నా భద్రత కోసం ఈడికి ఇంతమంది పోలీసులు వచ్చిండ్రు. ఇది గొప్ప కాదు. సోషల్ ఫెన్సింగ్ అనేది గొప్పది. గ్రామంలో ఒకరికొకరు ఎదురుపడగానే నవ్వుతూ మాట్లాడుకోవాలె. సమష్టిగా ఉండాలే. ఇక నుంచి కొట్లాటలు, పంచాయితీలు బంద్ జేయాలే. నా కోసం నా ఊరున్నది అనే భావన కలగాలె. అది చాలా గొప్పది’’ అని సీఎం చెప్పారు. సమష్టిగా ఉండడం వల్ల ఎన్నో విజయాలు వస్తాయన్నారు. ఇష్టమొచ్చినట్లు పంటలు వేయొద్దు.. ‘‘నిన్న మొన్నటిలాగా ఇకపై ఇష్టమొచ్చినట్లు పంటలు వేయొద్దు. ఈ ఊర్లో ఏ పంటలైతే బాగుంటయో.. ఏ నేలలో ఏ విత్తనమేయాలో.. అగ్రానమిస్టు చెబుతారు. ఆయన చెప్పినట్లే ఇక్కడ పంటలు వేద్దాం. ఈ సారి వెయ్యి ఎకరాల్లో సోయాబీన్, మరో 1,800 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేద్దాం’’ అని సీఎం ఎర్రవల్లి గ్రామస్తులతో అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావుతో సోయాబీన్ పంట వివరాలను రైతులకు చెప్పించారు. సోయాబీన్ ఎకరాకు 8–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని, ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ. 5,200 ధర పలుకుతుందని ఈ లెక్కన ఎకరాకు రూ.45 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని ప్రవీణ్‌రావు వివరించారు. అలాగే మొక్కజొన్నకు ఎకరాకు రూ.40 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుందన్నారు. గ్రామం పువ్వులా కనబడాలె.. ‘‘ఎర్రవల్లి ఒక పువ్వులా కనబడాలె. ఇప్పుడు నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లకు ఒక్కొక్క వీధిలో ఒక్కో రంగు వేయాలె. సింగపూర్‌లో ఇలాంటి విధానం ఉంటది. అదే తరహాలో ఇక్కడ కనబడాలె..’’ అని సీఎ కేసీఆర్ జేసీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ‘‘వెంకట్రామిరెడ్డి ఈ రెండు గ్రామాల గురించి చాలా కష్టపడుతుండు. తిన్న సద్ది రేవు తల్వాలే. వెంకట్రామిరెడ్డి మీ పెద్ద కొడుకు. మనం శ్రావణమాసంలో ఇళ్లకు పోంగనే పెద్ద దావత్ చేసుకుందం. నేనూ మీతోపాటే భోజనం చేస్తా. వెంకట్రామిరెడ్డిని గొప్పగా సన్మానించుకుందాం..’’ అని అన్నారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు పనితీరును కూడా సీఎం ప్రశంసించారు. హైదరాబాద్ వెళ్లే లోపు మూడ్రోజుల్లో మళ్లీ ఎర్రవల్లి వచ్చి అభివృద్ధిని చూస్తానని తెలిపారు. -
27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు
వారఫలాలు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు ప్రారంభంలో నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూ లిస్తాయి. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. రాజకీయ వర్గాలకు ఆశలు చిగురిస్తాయి. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ ప్రతిపాదనల్ని కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభం. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. కళాకారులకు సన్మాన, సత్కారాలు. లేత నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సమస్యలు కొంతవరకూ తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఇంక్రి మెంట్లు రాగలవు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నేరేడు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే అవకాశం. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పనులు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటా బయటా అనుకూలం. నిరుద్యోగులకు కొత్త ఆశలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు సన్మానయోగం. నేరేడు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఇంటా బయటా అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరం. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. భూ, గృహ యోగాలు కలిగే సూచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. భూవివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అవార్డులు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుంచి విముక్తి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు సన్మాన, పురస్కారాలు. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆప్తులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. కళాకారులకు ప్రయత్నాలు కలిసివస్తాయి. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. టారో 27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని టెన్షన్లయితే తప్పవు. డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్త. జీవిత భాగస్వామితో స్పర్థలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కారణంగా కూడా కొన్ని ఇబ్బం దులు తలెత్తవచ్చు. కాబట్టి వారి విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. ఇంట్లో ఒక క్రిస్టల్ బాల్ని ఉంచుకుంటే ఈ పరిస్థితిని జాగ్రత్తగా దాటగలరు. కలసివచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 - మే 20) స్నేహితుల నుంచి సాయం పొందడానికి ఇదే తగిన సమయం. మీరు ఎవరిని సాయం అడిగినా తప్పకుండా చేస్తారు. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఓ కొత్త భాగస్వామి కూడా మీతో చేరే చాన్స్ ఉంది. పెట్టుబడులు పెట్టడానికిది తగిన సమయం. అలాగే సేవింగ్స్ చేయడానికి కూడా. ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) ఊహించని లాభాలు పొందుతారు. అయితే తెలియక మీరు చేసే కొన్ని పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడకుండా జాగ్రత్తపడండి. లేదంటే అదే మిమ్మల్ని చాలా కష్టాలపాలు చేయవచ్చు. కలసివచ్చే రంగు: పసుపు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వ్యాపారంలోను, వ్యక్తిగతం జీవితంలోను కూడా మీకు ఓ మంచి భాగస్వామి లభిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేయవచ్చు. అలవాటైన పనిని వదిలి ఓ కొత్త పనిని చేయాల్సి రావొచ్చు. అది మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుంది అనేది మీ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి ఆడుగేయండి. కలసివచ్చే రంగు: వంకాయరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈవారం మీ జీవితంలో ప్రేమ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగక కొన్ని విసుగులు కూడా తలెత్తుతాయి. అయితే ఏమాత్రం ఎమోషనల్ అవ్వకండి. జాగ్రత్తగా ఆలోచించి మరీ అడుగేయండి. ఒకరి కోసం ఎదురుచూడటంలో తప్పు లేదు. నిజాయతీగా, నమ్మకంతో ఎదురుచూస్తే మీరు కోరుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఖాయం. కలసివచ్చే రంగు: వెండి రంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ ప్రవర్తన, పనితీరు ఇతరులను ఆకట్టు కుంటాయి. నవ్వు చాలా మంచి మందు. దీన్ని వచ్చే పదిహేను రోజుల్లో అస్సలు వదలకండి. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే పెళ్లి సంబంధాలు, లవ్ ప్రపోజల్స్ కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీరు జీవితంలో స్థిరపడటానికి ఇది మంచి అవకాశం. కలసివచ్చే రంగు: లేత పచ్చ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అన్నది తెలుసుకుంటే మీకిక తిరుగుం డదు. మంచి ఐడియాస్తో మీ దగ్గరికి వచ్చే వారిని తోసి పుచ్చకండి. వారి సాయంతో ఎదగ డానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక పవనాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఓ మంచి ఆధ్యాత్మిక కేంద్రానికి సందర్శనకు వెళ్తారు. కలసివచ్చే రంగు: ముదురు నీలం వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీరు ఇతరులకు సాయ పడటంలో ముందుంటారు. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అనాలోచితంగా ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేయకండి. పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడంలోనే మీ విజయం ఉంటుంది. కాబట్టి తొందర అస్సలు పనికిరాదు. ఏదైనా మీకు నచ్చదు అనుకుంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. మీకు తగిన వ్యక్తులెవరో ఎంచుకోండి. కలసివచ్చే రంగు: బంగారు వర్ణం ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీ పనుల్లో ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ మీరు వాటన్నిటినీ అధిగమిస్తారు. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతారు. సంపాదన కూడా బాగుటుంది. అయితే మీకు ఎంతో దగ్గరైన ఓ వ్యక్తి ఆర్థికపరమైన అంశాల్లో మీ తీరు పట్ల అసంతృప్తిని, విసుగును ప్రదర్శిస్తారు. వారు మీకు దూరమైపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తపడండి. కలసివచ్చే రంగు: వంకాయరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఈవారం విజయాలు చవిచూస్తారు. సంతోషంతో మీ మనసు నిండిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర్లో ఉన్న మీ బంధువులను చూడటానికి వెళ్లే అవకాశం ఉంది. మీ కష్టం మీకు ఎంతో పేరు తీసుకొస్తుంది. ఎన్నో కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కలసివచ్చే రంగు: పసుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీ కలలు త్వరలో నెరవేరబోతున్నాయి. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రాంత సందర్శన చేయాలన్న మీ చిరకాల కోరిక ఇప్పటికి నెరవేరుతుంది. కొత్తగా మీలో రేకెత్తిన ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో ఊహించని మార్పును తీసుకొస్తాయి. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదు. కలసివచ్చే రంగు: లేత వంకాయరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయి. పని విధానంలో మాత్రం కొన్ని మార్పులు చేసుకోండి. ముఖ్యమైన విషయాలను మీ జీవిత భాగస్వామితోటి, సన్నిహితులతోటి తప్పక చర్చించండి. లేదంటే ఆ విషయంలో వాళ్లు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వారి సాయం మిమ్మల్ని అన్నింట్లోనూ ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న దోషాలు పోవడానికి ఇంట్లో ఫెంగ్షు ఆబ్జెక్ట్స్‌ని ఉంచుకుంటే మంచి జరుగుతుంది. కలసివచ్చే రంగు: గులాబి ఇన్సియా నజీర్ టారో అనలిస్ట్ -
కలిసిరాని ‘జాతకం’
నారాయణఖేడ్: తమ పాండిత్యంతో నలుగురికీ జాతకాలు చెబుతూ.. వారు మాత్రం అంధకారంలో మగ్గిపోతున్నారు. ఏళ్లుగా నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక.. మరో పని చేయలేక అవస్థలు పడుతున్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఎర్నలి ప్రాంతం నుంచి 1991లో పలు కుటుంబాలు చిలక జోస్యం, పంచాంగం చెప్పేందుకు వలసవచ్చాయి. ఇలా వచ్చిన దాదాపు 50 కుటుంబాలు నారాయణఖేడ్‌లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం 200 పైగా జనాభాతో పట్టణంలోని అనుశమ్మ కాలనీలో అద్దె ఇళ్లు, గుడారాల్లో జీవిస్తున్నారు. ఆశల ఉదయం తెల్లవారగానే వీరి ప్రయాణం మొదలవుతుంది. పొద్దున్నే తలస్నానం ఆచరించి నుదుటున తిలకం దిద్దుకొని ఒక్కొక్కరు ఒక్కో గ్రామానికి పయనమవుతారు. ఇలా నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడ, జుక్కల్ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో వీధిలు తిరుగుతూ జాతకాలు చెబుతుంటారు. అయితే, గతంలో తాము గ్రామాలకు వెళ్తే ఎంతో మర్యాదగా ఇంటికి పిలిచి మరీ జాతకాలు చెప్పించుకునే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. టెక్నాలజీ విప్లవం.. దినదిన గండం 10 ఏళ్ల క్రితం వరకు కులవృత్తి మంచిగానే సాగిందని వీరు చెబుతున్నారు. టీవీలు, పత్రికలు ఎక్కువవడం.. అందులోనూ జాతకాలు చెబుతుండటంతో తమకు ఆదరణ తగ్గిందని ఆవేదన చెందుతున్నారు. టెక్నాలజీ అభివృద్ధితో తాము తిరోగమన దిశలో ఉన్నామని పేర్కొన్నారు. నిత్యం జాతకం చెప్పించుకునే వారికోసం గాలించినా చిక్కడ కష్టమైందంటున్నారు. మార్పు కోసం ఎదురుచూపులు బీదర్ జిల్లా ఎర్నలి నుంచి నారాయణఖేడ్ ప్రాంతానికి 20 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయామని గోందాల ప్రకాశ్, పాండురంగ తెలిపారు. తమలో చాలామందికి ఓటరు కార్డు, రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి రాకూడదనే ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామన్నారు. తమ వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందడం లేదని, సర్కార్ మాకు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కొందరు జాతకాలు చెప్పడం మాని కూలీ చేస్తున్నారని ఆవేదన చెందారు. గలగల.. వెలవెల! వీరికి ఓ రోజు పండగ వాతావరణం కన్పిస్తే.. మరో రోజు అధ్వాన పరిస్థితి ఎదురవుతుంది. జాతకాలు చెప్పించుకొనేవారు ఎదురైతేనే నాలుగు కాసులు చేతిలో పడతాయి. ఒకరోజు రూ.50 లభిస్తే మరోరోజు రూ.200 వరకు వస్తాయని జాతకం చెప్పేవారు తెలిపారు. దేవుడి దయతో తమ బతుకులు ఆధారపడి ఉంటాయన్నారు. పిల్లలపైనే ఆశ 12 ఏళ్ల వయస్సు నుంచి చిలక పంచాంగం చెబుతున్నా. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి గిట్టుబాటు కాలేదు. పిల్లల్ని అయినా మంచిగా చదివించుకోవాలని ఉంది. వారు మంచి వృత్తిలో స్థిరపడితే అంతకన్నా ఏం కావాలి. - గోందాల్ ప్రకాశ్, చిలకజోస్యం ప్రభుత్వంఆదుకోవాలి ఉపాధి పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. నాకు చదువు కూడా రాదు. నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివిస్తున్నాం. మాజీవితం ఎటూ కాకుండా పోయింది. వాళ్లయినా బాగుపడితే చాలు. - పాండురంగం, పంచాంగ పఠకుడు -
వారఫలాలు : 15 నవంబర్ నుంచి 21 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు కుటుంబ సభ్యుల సలహాలతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. గులాబీ, మెరూన్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ఓ సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశం. వాహన యోగం. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులకు విశేష ఆదరణ. తెలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మీ ఊహలు, అంచనాలు నిజం కాగల సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. ఎరుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు సాయం అందించి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. అంచనాలు నిజమవుతాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నలుపు, మెరూన్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు ముందుకు సాగవు. బంధువులతో అకారణ వివాదాలు. ఆస్తులకు సంబంధించి ఒప్పందాలు వాయిదా. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు. కళారంగం వారికి ఒత్తిడులు. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని ఆరాధించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. చాక్లెట్, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు పదవులు వరించే అవకాశం. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు మొదట్లో నిరాశ పరిచినా క్రమేపీ అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. భూ, వాహన యోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. కళారంగం వారికి సన్మానాలు. గోధుమ, మెరూన్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
వారఫలాలు 8 నవంబర్ నుంచి 14 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) సరికొత్త వ్యూహాలతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వస్తు, వస్త్రలాభాలు. బంధు వర్గంతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రజ్ఞా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆర్థికాభివృద్ధి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులు సమస్యల నుంచి బయట పడతారు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, గోధుమ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. గులాబీ, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆశించిన విద్య, ఉద్యోగావకాశాలు దక్కకుండా దూరమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొనవచ్చు. ఆర్థిక విషయాలలో హామీలు ఇవ్వవద్దు. ఆలయాలు సందర్శిస్తారు. మీ శ్రమ వృథా కాగలదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళారంగం వారికి నిరుత్సాహం. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసి రావు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. గృహ నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పైస్థాయి అజమాయిషీ పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం. మాటలతో ఆకట్టుకుంటారు. ప్రతిభను చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభ కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆర్థిక లాభాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వివాహ, ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు సామాన్యం. లేత ఆకుపచ్చ, ఆకాశనీలం రంగులు, దక్షి ణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు తీరి ఊరట చెందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. లేత పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణయత్నాలు సాగిస్తారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ముఖ్య నిర్ణయాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయ వర్గాలకు నిరాశ. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించని స్థితి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఇంటా బయటా సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. చాక్లెట్, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. -
వారఫలాలు : 27 సెప్టెంబర్ నుంచి 3 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో విజయం. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ చాటుకుంటారు. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. నీలం, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రుల సహకారం అందుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. లేత ఎరుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పారిశ్రామికవర్గాలకు అనుకూల సమాచారం. తెలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. వాహనయోగం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. తేనె, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభం. సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవమర్యాదలు. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అవార్డులు. చాక్లెట్, లేత ఆకుపచ్చ రంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్య రూపంలో పెడతారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఒక కోర్టు కేసు నుంచి విముక్తి లభించవచ్చు. రుణాలు తీరతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. చాక్లెట్, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. బంధువులు, మిత్రులతో మాట పట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) నూతనోత్సాహంతో పనులు చక్కబెడతారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇళ్లు, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు సన్మానాలు, అవార్డులు. తెలుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. ఆకుపచ్చ, ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు సామాన్యం. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి మాట పడతారు. ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఈ వారం పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఆశాజకనం. ధనలాభాలు ఉండవచ్చు. పనులు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు. ఎరుపు, గోధుమ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. తెలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన లేదా సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో జాప్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయట పడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీ ఖడ్గమాల పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు నిదానంగా పూర్తి కాగలవు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారికి కలసివచ్చే కాలం. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ పూజలు చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులు, మిత్రులతో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో పురోగతి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామిక వేత్తలకు సంతోషకరమైన సమాచారం. తెలుపు, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వ్యవహారాలలో విజయం. ఆప్తులు , సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్యాలు సాధించే దిశగా ముందుకు సాగుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఆశలు చిగురి స్తాయి. వివాహయత్నాలు సానుకూలం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 6 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువర్గంతో అకారణ తగాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. విలువైన సామగ్రి జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తెలుపు, లేత గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కారం. విద్యార్థులకు ప్రోత్సాహకరం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గు తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీయానం. నీలం, నేరేడు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. రుణబాధలు తొలగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు సమయానుసారం పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. విద్యార్థుల ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక వేత్తలకు నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొన్ని రుణాలు తీరతాయి. కోర్టు వ్యవహారంలో విజయం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. రాజకీయ వర్గాలకు సన్మానాలు, పురస్కారాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ఇతరులకు సహాయపడతారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి అవకాశాలు. లేత నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులు, మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు చికాకులు తొలగి ఊరట. పారి శ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం. విద్యార్థుల యత్నాలు సఫలం. భూ, గృహ యోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. లేతగులాబీ, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంగీత,సాహిత్యాలపై ఆసక్తిచూపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. నలుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారాల విస్తరణలో అనుకూలత. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకాశనీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగానే ఉంటాయి. సన్నిహితులతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. లేత ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. -
వారఫలాలు : 30 ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూ రుతుంది. సమయానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. కోర్టు కేసు ఒకటి పరిష్కార దశకు చేరుకుంటుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. గులాబీ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు. నీలం, చాక్లెట్‌రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పేరుప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. తెలుపు, లేత గులాబీరంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు వ్యవహారాలలో సహాయపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్న నాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు మొదట్లో నెమ్మదించినా క్రమేపీ వేగం పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం, కుటుంబ విషయాలలో కొద్దిపాటి చికాకులు. వాహనయోగం. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నేరేడు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. లేత ఆకుపచ్చ, పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గాయత్రీధ్యానం చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. సత్తా చాటుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. నీలం, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ప్రారంభంలో చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యవహారాలలో ప్రగతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, చాక్లెట్‌రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. భూవివాదాలు పరిష్కార మవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. గులాబీ, తెలుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యవహారాలు మీకు సవాలుగా నిలుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు కొంత నిరాశ తప్పదు. నీలం, నలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కుటుంబ సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. సంఘంలో మీదే పైచేయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు అభివృద్ధిలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నేరేడు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి, సోదరుల ద్వారా ధన, ఆస్తి లాభ సూచనలు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. -
వారఫలాలు : 16 ఆగస్టు నుంచి 22 ఆగస్టు, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహణి, మృగశిర 1,2 పా.) మీ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళారంగం వారికి సన్మానాలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆటంకాలు తొలగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. గులాబీ, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌చాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓర్పు,నేర్పుగా వ్యవహరించడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. తెలుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు కోర్టు వ్యవహారాలలో అనుకూలత. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామికి అర్చన చేయించుకుంటే మంచిది. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. లేత ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గాయత్రీధ్యానం చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థికంగా అనుకూలత. ఉద్యోగయత్నాలు సానుకూలమవు తాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు పదవీయోగం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఊహించని విధంగా సొమ్ము చేతికంది అవసరాలు తీరతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వాహన సౌఖ్యం. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కళారంగం వారికి ఆహ్వానాలు రాగలవు. తెలుపు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణదిశగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామివర్గాలకు అనుకోని ఆహ్వానాలు. నీలం, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు సొమ్ము అందే సూచనలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనయోగం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. గులాబీ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలలో కొద్దిపాటి అవరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బాకీలు కొన్ని అందుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు చికాకులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు. లేత నీలం, చాక్లెట్‌రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కుటుంబంలో శుభకార్యాలు. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. కళారంగం వారికి సన్మానాలు. తెలుపు, గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యవ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఒక సమాచారం విద్యార్థులకు ఊరటనిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. శ్రమ ఫలిస్తుంది. సత్తా చాటుకుంటారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి అవార్డులు, సన్మానాలు. చాక్లెట్, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలకు లోటు ఉండదు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వాహన యోగం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులలో విజయం. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి ఉత్సాహవంతం. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. కాంట్రాక్టులు చేపడతారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. గులాబీ, పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఇంటా బయటా ప్రోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. లేత ఆకుపచ్చ, నేరేడురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గాయత్రీ ధ్యానం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నీలం, నలుపు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్తపనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. నేరేడు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని పనులు నెమ్మదిస్తాయి. ఆత్మీయులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు 2 ఆగస్టు నుంచి 8 ఆగస్టు, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. ఆసక్తికర సమాచారం అందు తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటా బయటా అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సజావుగా సాగుతాయి. అభియోగాల నుంచి బయట పడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పోటీ పరీక్షల్లో విజయం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. నీలం, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహ స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఉన్న వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి కలుగుతుంది. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. గులాబీ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఆకుపచ్చరంగు,లేత గులాబీరంగులు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. తెలుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు (19 జూలై నుంచి 25 జూలై, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులలో పురోగతి కనిపిస్తుంది. యుక్తిగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నేరేడు, ఎరుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బాధ్యతలు పెరుగు తాయి. ఆలోచనలు కలసిరావు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపడాల్సిన సమయం. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు చికాకులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా సమస్యలు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కళారంగం వారికి అవకాశాలు దూరమయ్యే సూచనలు. పసుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొత్త రుణాల వేటలో పడతారు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అసంతృప్తి. ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు వరిస్తాయి. ఎరుపు, బంగారురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగులకు ఒక ప్రకటన కాస్త ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి చికాకులు. ఆకుపచ్చ, ఆకాశనీలం రంగులు ధరించండి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి. లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు హోదాలు. నేరేడు, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వాహన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించవచ్చు. లేత గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఎరుపు, కాఫీరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. రుణాలు చేయాల్సివస్తుంది. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో బంధువులతో వివాదాలు నెలకొనవచ్చు. పాతమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. కళారంగం వారికి చికాకులు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11సార్లు ప్రదక్షిణలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు అదనపు విధులు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. నలుపు, చాక్లెట్‌రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి అవార్డులు అందుతాయి. గోధుమ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (12 జూలై నుంచి 18 జూలై, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి ఆరాధన మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలించే సమయం. ఉద్యోగయత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు సన్మానయోగం. చాక్లెట్, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణ విభేదాలు. కుటుంబ బాధ్యతలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వివాహ, ఉద్యోగయత్నాల్లో నత్తనడక. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, తెలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. చిరకాల మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గులాబీ, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం. విద్యార్థులకు కొత్త ఆశలు. స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. లేత ఆకుపచ్చ, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగు. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వాహనాలు, భూముల కొనుగోలు. ఆలోచనలు కార్యరూపం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు నెమ్మదిస్తాయి. కుటుంబ సమస్యలు. బంధువులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. విదేశీ పర్యటనలు రద్దు. ఆకాశనీలం, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. నిర్ణయాల పునఃసమీక్ష. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవర్గాలకు అశాంతి. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలోచనలు కార్యరూపం. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు. చాక్లెట్, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు సకాలంలో పూర్తి. ఆర్థిక పురోగతి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆలోచనలు కార్యరూపం. స్వల్ప అనారోగ్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. చాక్లెట్, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. బాధ్యతలు మీద వేసుకుని సతమతమవుతారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలతో చికాకు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి. నీలం, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి నిరాశ. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. నిర్ణయాలలో తొందరవద్దు. మిత్రులే శత్రువులుగా మారతారు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. గోధుమ, ఎరుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. -
వారఫలాలు (5 జూలై నుంచి 11 జూలై, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. నీలం, లేత ఆకుపచ్చరంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ప్రారంభంలో కొన్ని వ్యవహారాలు మందగించినా క్రమేపీ పుంజుకుంటాయి. బంధువులు, మిత్రులతో సర్దుబాటు కాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులు, విద్యార్థులు మంచి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులకు, కళారంగం వారికి యోగవంతంగా ఉంటుంది. తెలుపు, లేత పసుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనుల్లో పురోగతి సాధిస్తారు. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. చాక్లెట్, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహ స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. కళారంగం వారికి సన్మానాలు. గులాబీ, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. అనుకున్నది సాధిస్తారు. భూ వివాదాలు తీరుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు విస్తరిస్తారు. లేత ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు పూర్తి కాగలవు. సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మీ దారికి వస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఎరుపు, సిమెంట్రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి అర్చన చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్యం కొంత చికాకు కలిగించవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల విస్తరణలో నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. గులాబీ, తెలుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నీలం, ఆకుపచ్చరంగు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు. నలుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఈవారం పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. బంధువులను కలుసుకుంటారు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. పసుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (28 జూన్ నుంచి 4 జూలై, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగుతాయి. పనులు ఆలస్యంగా పూర్తి. సంఘంలో గౌరవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నేరేడు, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. గుర్తింపు పొందుతారు. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ధార్మిక చింతన. భూములు, వాహనాల కొనుగోలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. చాక్లెట్, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సత్కారాలు. గులాబీ, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గోధుమ, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి. పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సన్నిహితులు, మిత్రులతో చర్చలు జరుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే ఛాన్స్. ఆకుపచ్చ, తెలుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు తప్పవు. రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్య సమస్యలు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. కళారంగం వారికి పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానం. సంఘంలో గౌరవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు హోదాలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ప్రతిభకు తగిన గుర్తింపు. వ్యవహార విజయం. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, తెలుపు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. నిరుద్యోగులకు కొత్త ఆశలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష ఆదరణ . భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఈవారం పట్టింది బంగారమే. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగు. రావలసిన సొమ్ము అందుతుంది. మిత్రులు, బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. నైపుణ్యానికి గుర్తింపు రాగలదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, విదే శీ పర్యటనలు. నలుపు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. గుర్తింపు రాగలదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గ డుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి పురస్కారాలు. బంగారు, గులాబీరంగులు, వేంకటేశ్వరస్తుతి మంచిది. -
వారఫలాలు (21 జూన్ నుంచి 27 జూన్, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనుల్లో కొద్దిపాటి జాప్యం ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సహకారం అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. తెలుపు, బిస్కెట్ రంగులు, ద క్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు అంచనాలు తప్పుతాయి. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఈవారం పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, సన్మానాలు. చాక్లెట్, ఆకాశనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పై స్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు దక్కించుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. ఆకుపచ్చ, తేనెరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. నీలం, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగులకు కలిసివ చ్చే కాలం. కళారంగం వారికి అవార్డులు దక్కవచ్చు. గులాబీ, ఆరెంజ్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు, సత్కారాలు. లేత ఎరుపు, తెలుపు రంగులు, గణేశ్ స్తోత్రాలు పఠించండి. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నేరేడు, నీలం రంగులు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. గోధుమ, చాక్లెట్‌రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు ( 7 జూన్ నుంచి 13 జూన్, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష పేరుప్రతిష్ఠలు. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఆరెంజ్. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాల కొనుగోలు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకుపచ్చ, లేత నీలం, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యవహార విజయం. బంధువులు, మిత్రుల చేయూత. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. మాట చెల్లుబాటు. శత్రువులు మిత్రులుగా మారతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థికాభివృద్ధి. వ్యాపారలాభం. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు. క్రీమ్, పసుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి అవార్డులు లభిస్తాయి. తెలుపు, లేత ఎరుపు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యలు కుటుంబసభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి కలసివచ్చే కాలం. ఆరెంజ్, లేత ఆకుపచ్చ. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రారంభంలో చికాకులు. ఆత్మవిశ్వాసంతో విజయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఉద్యోగలాభం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహ నిర్మాణ యత్నాలు. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు. తెలుపు, లేత నీలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవ గ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆలోచనలు కార్యరూపం. శుభకార్యాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు, భూముల కొనుగోలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి సన్మానయోగం. ఎరుపు, ఆకుపచ్చ, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11 ప్రదక్షణలు చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. రుణదాతల ఒత్తిడులు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు చేజారతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. గులాబీ, సిమెంట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. లేత పసుపు, నీలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతికి అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలతో పాటు గౌరవం పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఈ వారం నలుపు, చాక్లెట్ రంగులు ధరించడం మంచిది. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రోజూ అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సన్నిహితులు, మిత్రుల సహకారం. పోటీపరీక్షల్లో విజయం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. లేత ఎరుపు, తెలుపు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (31 మే నుంచి 6 జూన్, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూసంబంధిత వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నారింజ, తెలుపు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టక స్తోత్రం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహణి, మృగశిర 1,2 పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కీలక నిర్ణయాలు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగలాభం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాలు పుంజుకుంటాయి. రాజకీయవర్గాలకు పదవులు. పసుపు, లేత ఎరుపు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) శ్రేయోభిలాషులు తోడుగా నిలుస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం. వాహనాలు, భూములు కొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పనులు పూర్తి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి ఆదరణ. నీలం, ఆకుపచ్చ. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సేవలు గుర్తింపు పొందుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు కాస్త తొలగుతాయి. వ్యాపారాలలో కొంతవరకూ లాభాలు అందుతాయి. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, తెలుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలను పదవులు వరించే సమయం. గులాబీ, లేత పసుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ సీతారామస్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక లావాదేవీల్లో నిరాశ. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి వ్యతిరేకత. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యత్నాల్లో మందకొడి. పనులు శ్రమానంతరం పూర్తి. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. కళారంగం వారికి కొంత గందరగోళం. ఆకుపచ్చ, నీలం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్తోత్రం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) నూతన పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. చిన్ననాటి మిత్రుల కలయిక. సమస్యల నుంచి ఊరట. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ దుర్గాస్తుతి మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో విజయం. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగు. వాహనయోగం. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు పూర్తి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. సమస్యల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. శ్రమకు తగ్గ ఫలితం. వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు. సిమెంట్, లేత ఆకుపచ్చ. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం,ఆకుపచ్చ. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు నెమ్మదిగా సాగినా చివరికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, క్రీమ్. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగండి, విజయాలు వరిస్తాయి. నిరుద్యోగుల కృషి వృథా కాదు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని రుణాలు తీరుస్తారు. పరపతి పెరుగుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. పసుపు, లేత ఎరుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు