ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం | Rasi Phalalu: Daily Horoscope On 14-06-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం

Jun 14 2025 5:31 AM | Updated on Jun 14 2025 9:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 14-06-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ ప.2.32 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.41 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.7.09 నుండి 8.48 వరకు, తదుపరి రా.3.43 నుండి 5.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: సా.4.54 నుండి 5.46 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. 

మేషం: శ్రమ ఫలిస్తుంది.  సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

మిథునం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తి లాభం. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య: కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.

తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

మకరం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.

మీనం: కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement