వారఫలాలు ( 7 జూన్ నుంచి 13 జూన్, 2015 వరకు) | astrology-of-the-week-on-june7-to-june 13 | Sakshi
Sakshi News home page

వారఫలాలు ( 7 జూన్ నుంచి 13 జూన్, 2015 వరకు)

Published Sun, Jun 7 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

వారఫలాలు ( 7 జూన్ నుంచి 13 జూన్, 2015 వరకు)

వారఫలాలు ( 7 జూన్ నుంచి 13 జూన్, 2015 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష పేరుప్రతిష్ఠలు. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఆరెంజ్. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాల కొనుగోలు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకుపచ్చ, లేత నీలం, తూర్పుదిశ  ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యవహార విజయం. బంధువులు, మిత్రుల చేయూత. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. మాట చెల్లుబాటు. శత్రువులు మిత్రులుగా మారతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థికాభివృద్ధి. వ్యాపారలాభం. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు. క్రీమ్, పసుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి అవార్డులు లభిస్తాయి. తెలుపు, లేత ఎరుపు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యలు కుటుంబసభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి కలసివచ్చే కాలం. ఆరెంజ్, లేత ఆకుపచ్చ. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ప్రారంభంలో చికాకులు. ఆత్మవిశ్వాసంతో విజయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఉద్యోగలాభం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహ నిర్మాణ యత్నాలు. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు. తెలుపు, లేత నీలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవ గ్రహస్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆలోచనలు కార్యరూపం. శుభకార్యాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి  గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు, భూముల కొనుగోలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి సన్మానయోగం. ఎరుపు, ఆకుపచ్చ, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11 ప్రదక్షణలు చేయండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. రుణదాతల ఒత్తిడులు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు చేజారతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. గులాబీ, సిమెంట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. లేత పసుపు, నీలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతికి అర్చన చేయండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలతో పాటు గౌరవం పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఈ వారం నలుపు, చాక్లెట్ రంగులు ధరించడం మంచిది. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రోజూ అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సన్నిహితులు, మిత్రుల సహకారం. పోటీపరీక్షల్లో విజయం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు  విశేష ఆదరణ లభిస్తుంది. లేత ఎరుపు, తెలుపు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
-  సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement