వారఫలాలు : 27 సెప్టెంబర్ నుంచి 3 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో విజయం. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ చాటుకుంటారు. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. నీలం, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రుల సహకారం అందుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. లేత ఎరుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పారిశ్రామికవర్గాలకు అనుకూల సమాచారం. తెలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. వాహనయోగం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. తేనె, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభం. సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవమర్యాదలు. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అవార్డులు. చాక్లెట్, లేత ఆకుపచ్చ రంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్య రూపంలో పెడతారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఒక కోర్టు కేసు నుంచి విముక్తి లభించవచ్చు. రుణాలు తీరతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. చాక్లెట్, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. బంధువులు, మిత్రులతో మాట పట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
నూతనోత్సాహంతో పనులు చక్కబెడతారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇళ్లు, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు సన్మానాలు, అవార్డులు. తెలుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు