వారఫలాలు 8 నవంబర్ నుంచి 14 నవంబర్, 2015 వరకు | astrology | Sakshi
Sakshi News home page

వారఫలాలు 8 నవంబర్ నుంచి 14 నవంబర్, 2015 వరకు

Published Sat, Nov 7 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

వారఫలాలు  8 నవంబర్ నుంచి 14 నవంబర్, 2015 వరకు

వారఫలాలు 8 నవంబర్ నుంచి 14 నవంబర్, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 సరికొత్త వ్యూహాలతో  వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం.  ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వస్తు, వస్త్రలాభాలు. బంధు వర్గంతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
  పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రజ్ఞా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆర్థికాభివృద్ధి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులు సమస్యల నుంచి బయట పడతారు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, గోధుమ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. గులాబీ, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆశించిన విద్య, ఉద్యోగావకాశాలు దక్కకుండా దూరమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొనవచ్చు. ఆర్థిక విషయాలలో హామీలు ఇవ్వవద్దు. ఆలయాలు సందర్శిస్తారు. మీ శ్రమ వృథా కాగలదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళారంగం వారికి నిరుత్సాహం. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసి రావు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. గృహ నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి.  ఆరోగ్యం మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పైస్థాయి అజమాయిషీ పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 కొత్త పనులకు శ్రీకారం. మాటలతో ఆకట్టుకుంటారు. ప్రతిభను చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభ కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆర్థిక లాభాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
 తుల: (చిత్త 3,4,
 స్వాతి, విశాఖ1,2,3 పా.)
 వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కాగలవు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వివాహ, ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు సామాన్యం. లేత ఆకుపచ్చ, ఆకాశనీలం రంగులు, దక్షి ణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు తీరి ఊరట చెందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. లేత పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణయత్నాలు సాగిస్తారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ముఖ్య నిర్ణయాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయ వర్గాలకు నిరాశ. నలుపు, ఆకుపచ్చ రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ముఖ్యమైన పనులు మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించని స్థితి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఇంటా బయటా సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. చాక్లెట్, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement