27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు | astrology of the week on March 27 to 2 April | Sakshi
Sakshi News home page

27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు

Published Sat, Mar 26 2016 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు

27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు

వారఫలాలు
 మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 ఆర్థిక లావాదేవీలు ప్రారంభంలో నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూ లిస్తాయి. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. రాజకీయ వర్గాలకు ఆశలు చిగురిస్తాయి. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
 పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ ప్రతిపాదనల్ని కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభం. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. కళాకారులకు సన్మాన, సత్కారాలు. లేత నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సమస్యలు కొంతవరకూ తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఇంక్రి మెంట్లు రాగలవు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నేరేడు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు  సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే అవకాశం. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పనులు నత్తనడకన సాగుతాయి.  విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటా బయటా అనుకూలం. నిరుద్యోగులకు కొత్త ఆశలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు సన్మానయోగం. నేరేడు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఇంటా బయటా అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరం. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. భూ, గృహ యోగాలు కలిగే సూచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

 పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం.  భూవివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అవార్డులు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుంచి విముక్తి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు సన్మాన, పురస్కారాలు. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆప్తులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. కళాకారులకు ప్రయత్నాలు కలిసివస్తాయి. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
 
   టారో
 27 మార్చి నుంచి 2ఏప్రిల్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
 పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని టెన్షన్లయితే తప్పవు. డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్త. జీవిత భాగస్వామితో స్పర్థలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కారణంగా కూడా కొన్ని ఇబ్బం దులు తలెత్తవచ్చు. కాబట్టి వారి విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. ఇంట్లో ఒక క్రిస్టల్ బాల్‌ని ఉంచుకుంటే ఈ పరిస్థితిని జాగ్రత్తగా దాటగలరు.
 కలసివచ్చే రంగు: నీలం
 
 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
 స్నేహితుల నుంచి సాయం పొందడానికి ఇదే తగిన సమయం. మీరు ఎవరిని సాయం అడిగినా తప్పకుండా చేస్తారు. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఓ కొత్త భాగస్వామి కూడా మీతో చేరే చాన్స్ ఉంది. పెట్టుబడులు పెట్టడానికిది తగిన సమయం. అలాగే సేవింగ్స్ చేయడానికి కూడా. ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
 కలసివచ్చే రంగు: ఆకుపచ్చ
 
 మిథునం (మే 21 - జూన్ 20)
 ఊహించని లాభాలు పొందుతారు. అయితే తెలియక మీరు చేసే కొన్ని పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడకుండా జాగ్రత్తపడండి. లేదంటే అదే మిమ్మల్ని చాలా కష్టాలపాలు చేయవచ్చు.
 కలసివచ్చే రంగు: పసుపు
 
 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
 వ్యాపారంలోను, వ్యక్తిగతం జీవితంలోను కూడా  మీకు ఓ మంచి భాగస్వామి లభిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో పడేయవచ్చు. అలవాటైన పనిని వదిలి ఓ కొత్త పనిని చేయాల్సి రావొచ్చు. అది మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుంది అనేది మీ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి ఆడుగేయండి.
 కలసివచ్చే రంగు: వంకాయరంగు

 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
 ఈవారం మీ జీవితంలో ప్రేమ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగక కొన్ని విసుగులు కూడా తలెత్తుతాయి. అయితే ఏమాత్రం ఎమోషనల్ అవ్వకండి. జాగ్రత్తగా ఆలోచించి మరీ అడుగేయండి. ఒకరి కోసం ఎదురుచూడటంలో తప్పు లేదు. నిజాయతీగా, నమ్మకంతో ఎదురుచూస్తే మీరు కోరుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఖాయం.
 కలసివచ్చే రంగు: వెండి రంగు
 
 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)

 మీ ప్రవర్తన, పనితీరు ఇతరులను ఆకట్టు కుంటాయి. నవ్వు చాలా మంచి మందు. దీన్ని వచ్చే పదిహేను రోజుల్లో అస్సలు వదలకండి. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే పెళ్లి సంబంధాలు, లవ్ ప్రపోజల్స్ కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీరు జీవితంలో స్థిరపడటానికి ఇది మంచి అవకాశం.
 కలసివచ్చే రంగు: లేత పచ్చ
 
 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
 ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అన్నది తెలుసుకుంటే మీకిక తిరుగుం డదు. మంచి ఐడియాస్‌తో మీ దగ్గరికి వచ్చే వారిని తోసి పుచ్చకండి. వారి సాయంతో ఎదగ డానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక పవనాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఓ మంచి ఆధ్యాత్మిక కేంద్రానికి సందర్శనకు వెళ్తారు.
 కలసివచ్చే రంగు: ముదురు నీలం
 
 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
 ఈవారం మీరు ఇతరులకు సాయ పడటంలో ముందుంటారు. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అనాలోచితంగా ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేయకండి. పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడంలోనే మీ విజయం ఉంటుంది. కాబట్టి తొందర అస్సలు పనికిరాదు. ఏదైనా మీకు నచ్చదు అనుకుంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. మీకు తగిన వ్యక్తులెవరో ఎంచుకోండి.
 కలసివచ్చే రంగు: బంగారు వర్ణం

 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
 మీ పనుల్లో ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ మీరు వాటన్నిటినీ అధిగమిస్తారు. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతారు. సంపాదన కూడా బాగుటుంది. అయితే మీకు ఎంతో దగ్గరైన ఓ వ్యక్తి ఆర్థికపరమైన అంశాల్లో మీ తీరు పట్ల అసంతృప్తిని, విసుగును ప్రదర్శిస్తారు. వారు మీకు దూరమైపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తపడండి.
 కలసివచ్చే రంగు: వంకాయరంగు
 
 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
 ఈవారం విజయాలు చవిచూస్తారు. సంతోషంతో మీ మనసు నిండిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర్లో ఉన్న మీ బంధువులను చూడటానికి వెళ్లే అవకాశం ఉంది. మీ కష్టం మీకు ఎంతో పేరు తీసుకొస్తుంది. ఎన్నో కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
 కలసివచ్చే రంగు: పసుపు
 
 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
 మీ కలలు త్వరలో నెరవేరబోతున్నాయి. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రాంత సందర్శన చేయాలన్న మీ చిరకాల కోరిక ఇప్పటికి నెరవేరుతుంది. కొత్తగా మీలో రేకెత్తిన ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో ఊహించని మార్పును తీసుకొస్తాయి.  కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదు.
 కలసివచ్చే రంగు: లేత వంకాయరంగు
 
 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
 మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయి. పని విధానంలో మాత్రం కొన్ని మార్పులు చేసుకోండి. ముఖ్యమైన విషయాలను మీ జీవిత భాగస్వామితోటి, సన్నిహితులతోటి తప్పక చర్చించండి. లేదంటే ఆ విషయంలో వాళ్లు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వారి సాయం మిమ్మల్ని అన్నింట్లోనూ ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న దోషాలు పోవడానికి ఇంట్లో ఫెంగ్‌షు ఆబ్జెక్ట్స్‌ని ఉంచుకుంటే మంచి జరుగుతుంది.
 కలసివచ్చే రంగు: గులాబి
  ఇన్సియా నజీర్
 టారో అనలిస్ట్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement