వారఫలాలు : 6 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువర్గంతో అకారణ తగాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. విలువైన సామగ్రి జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తెలుపు, లేత గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కారం. విద్యార్థులకు ప్రోత్సాహకరం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గు తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీయానం. నీలం, నేరేడు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. రుణబాధలు తొలగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు సమయానుసారం పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. విద్యార్థుల ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక వేత్తలకు నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొన్ని రుణాలు తీరతాయి. కోర్టు వ్యవహారంలో విజయం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. రాజకీయ వర్గాలకు సన్మానాలు, పురస్కారాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ఇతరులకు సహాయపడతారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి అవకాశాలు. లేత నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులు, మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు చికాకులు తొలగి ఊరట. పారి శ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం. విద్యార్థుల యత్నాలు సఫలం. భూ, గృహ యోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. లేతగులాబీ, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంగీత,సాహిత్యాలపై ఆసక్తిచూపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. నలుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారాల విస్తరణలో అనుకూలత. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకాశనీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగానే ఉంటాయి. సన్నిహితులతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. లేత ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.