వారఫలాలు : 15 నవంబర్ నుంచి 21 నవంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు కుటుంబ సభ్యుల సలహాలతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. గులాబీ, మెరూన్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ఓ సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశం. వాహన యోగం. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులకు విశేష ఆదరణ. తెలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మీ ఊహలు, అంచనాలు నిజం కాగల సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. ఎరుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు సాయం అందించి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. అంచనాలు నిజమవుతాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నలుపు, మెరూన్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు ముందుకు సాగవు. బంధువులతో అకారణ వివాదాలు. ఆస్తులకు సంబంధించి ఒప్పందాలు వాయిదా. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు. కళారంగం వారికి ఒత్తిడులు. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని ఆరాధించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. చాక్లెట్, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు పదవులు వరించే అవకాశం. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు మొదట్లో నిరాశ పరిచినా క్రమేపీ అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. భూ, వాహన యోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. కళారంగం వారికి సన్మానాలు. గోధుమ, మెరూన్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు