వారఫలాలు : 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్, 2015 వరకు | astrology of the week on September13 to 19 September | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్, 2015 వరకు

Published Sun, Sep 13 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

వారఫలాలు : 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్, 2015 వరకు

వారఫలాలు : 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు  హోదాలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. ఆకుపచ్చ, ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు సామాన్యం. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి మాట పడతారు. ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఈ వారం పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఆశాజకనం. ధనలాభాలు ఉండవచ్చు. పనులు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు. ఎరుపు, గోధుమ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. తెలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన లేదా సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో జాప్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయట పడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీ ఖడ్గమాల పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

 పనులు నిదానంగా పూర్తి కాగలవు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారికి కలసివచ్చే కాలం. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ పూజలు చేయండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులు, మిత్రులతో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో పురోగతి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామిక వేత్తలకు సంతోషకరమైన సమాచారం. తెలుపు, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యవహారాలలో విజయం. ఆప్తులు , సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్యాలు సాధించే దిశగా ముందుకు సాగుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఆశలు చిగురి స్తాయి. వివాహయత్నాలు సానుకూలం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement