ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం. | Rasi Phalalu: Daily Horoscope On 1 March 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Published Sat, Mar 1 2025 5:17 AM | Last Updated on Sat, Mar 1 2025 9:12 AM

Rasi Phalalu: Daily Horoscope On 1 March 2025 In Telugu

    గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.విదియ రా.3.16 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.10.50 నుండి 12.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.28 నుండి 7.57 వరకు, అమృతఘడియలు: ఉ.6.24 నుండి 7.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.01. 

మేషం: సన్నిహితులతో మాటపడాల్సిన పరిస్థితి. సమయానికి డబ్బు అందక ఇబ్బంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికలావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మిథునం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: మిత్రులు, బంధువులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహం: మిత్రుల నుంచి కొద్దిపాటి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిళ్లు.

కన్య: పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుకుంటారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు కొంత నిదానిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

ధనుస్సు: వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

మకరం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement