
రాశి ఫలాలు (అక్టోబర్ 12నుండి 18 వరకు)
చంద్రబింబం: అక్టోబర్ 12నుండి 18 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఉద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధనలాభం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. పైస్థాయి వారిని వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. వారం మధ్యలో ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగవర్గాలకు నిరాశాజనకం. కళారంగం కొంత గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో వాహనయోగం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రశంసలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శ్రమకు ఫలితం దక్కుతుంది. మిత్రుల చేయూతతో సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సహాయం పొందినవారే సమస్యలు సృష్టిస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి ఒత్తిడులు. వారం చివరిలో శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆలోచనలు కలిసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఉద్యోగయత్నాలు నత్తన డకన సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు మార్పులు తప్పదు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో కీలక నిర్ణయాలు. ఆస్తిలాభం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం చివరిలో ఆకస్మిక ధన, వస్తులాభాలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మిత్రులతో వివాదాలు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు నిరాశ. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం. కార్యజయం.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష పండితులు