వారఫలాలు : 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలలో కొద్దిపాటి అవరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బాకీలు కొన్ని అందుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు చికాకులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు. లేత నీలం, చాక్లెట్‌రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కుటుంబంలో శుభకార్యాలు. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. కళారంగం వారికి సన్మానాలు. తెలుపు, గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యవ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఒక సమాచారం విద్యార్థులకు ఊరటనిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. శ్రమ ఫలిస్తుంది. సత్తా చాటుకుంటారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి అవార్డులు, సన్మానాలు. చాక్లెట్, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలకు లోటు ఉండదు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వాహన యోగం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులలో విజయం. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి ఉత్సాహవంతం. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. కాంట్రాక్టులు చేపడతారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. గులాబీ, పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఇంటా బయటా ప్రోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. లేత ఆకుపచ్చ, నేరేడురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గాయత్రీ ధ్యానం చేయండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నీలం, నలుపు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్తపనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. నేరేడు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు నెమ్మదిస్తాయి. ఆత్మీయులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు