
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.షష్ఠి రా.2.06 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: హస్త రా.10.31 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: సా.4.02 నుండి 5.46 వరకు
సూర్యోదయం : 5.41
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం: ఇంటాబయటా సమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మిథునం: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
సింహం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందిస్తుంది. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: రుణవిముక్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. పాత బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
తుల: పనులలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో అకారణ వైరం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృశ్చికం: ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పనులలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
మకరం: బంధువులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: ముఖ్య నిర్ణయాలు వాయిదా. పనుల్లో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులలో అనుకూలత. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.