రాశి ఫలాలు | horoscope of the week august 3rd to 9th | Sakshi
Sakshi News home page

రాశి ఫలాలు

Published Sun, Aug 3 2014 12:58 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

రాశి ఫలాలు - Sakshi

రాశి ఫలాలు

ఆగస్టు 3 నుండి  9 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. సోదరులు, మిత్రుల సహకారంతో కొన్ని పనులు చక్కదిద్దుతారు.  ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
 
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయరంగం వారికి పదవీయోగం. వారం చివరిలో ఆరోగ్యభంగం.
 
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు.  ఇంటి నిర్మాణాలు, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగయత్నాలు ఫలించే సూచనలు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ప్రారంభంలో నెలకొన్న చికాకులు క్రమేపీ తొలగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.
 
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం.
 
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే సూచనలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
 
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
రుణాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనయోగం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్నంతగా లాభాలు రాగలవు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవర్గాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం చివరిలో అనారోగ్యం, బంధువులతో విభేదాలు.
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి ఊహించని సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
 
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు సహాయం అందిస్తారు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు.
 
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)

ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. బంధువులు, మిత్రులతో కొన్ని వివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు, పెరిగే బాధ్యతలు.
 
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
బంధువులు, మిత్రుల నుంచి మాటసహాయం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement