Subbarao
-
నాకు ఈ పదవి ఇచ్చిన జగనన్నకు ధన్యవాదాలు
-
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) -
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్‌లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్‌గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్‌టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్‌గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్‌లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
Ramoji Rao: శవాలపై పేలాలు
రాజంపేట: అసలే అంతులేని అప్పుల భారం.. ఆపై పచ్చ మూకల ఆన్లైన్ భూ మాయాజాలం! ఇదీ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేతకారుడు పాల సుబ్బారావు కుటుంబం విషాదకర చావులకు అసలు కారణం! దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడుతూ, రాష్ట్రమంతా ఇలాగే జరిగిపోతోందంటూ శోకాలు పెడుతూ ఈనాడు రామోజీ మరోసారి శవాలపై పేలాలను ఏరుకున్నారు! దాదాపు రూ.అరకోటి దాకా తలకు మించిన అప్పులు, భూముల రికార్డులు తారుమారు కావడమే తమ చావులకు దారి తీసినట్లు మరణ వాంగ్మూలంలో సుబ్బారావే వెల్లడించాడు. అప్పులు చేసింది తానేనని బాధితుడే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి ఇక భూములు రికార్డులు తారుమారు ఎప్పుడయ్యాయి? ఎవరు చేశారు? అనేది కదా తేలాల్సిన కీలక అంశం. టీడీపీ హయాంలో 2015లో ఆన్లైన్లో భూముల మాయాజాలం కారణంగా బాధితుడు వంచనకు గురయ్యాడు. ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని నాడు పచ్చమూకలు రికార్డులు తారుమారు చేసి బాధితుడి తండ్రి చలపతి పేరుతో ఆన్లైన్లో చేర్చినట్లు నమ్మించాయి. ఆ వెంటనే మరొకరి పేరుతో మార్చి ఇదే వంచనను కొనసాగించాయి. పచ్చమూకలు ఒకరి తరువాత ఒకరిని మోసగించాయి. ఇవేవీ నిన్ననో మొన్ననో జరిగిన వ్యవహారాలు కాదు. నిజానికి ఆ భూమిని సుబ్బారావుకే కాదు.. ఎవరికీ అసైన్మెంట్ (డీకేటీ) కింద ప్రభుత్వం కేటాయించనేలేదు. గతంలో ఎవరూ అధికారికంగా, అనధికారికంగా సాగు చేసిన దాఖలాలూ లేవు. ఆ భూమిని తనకు కేటాయించాలని బాధితుడు ఎన్నడూ కూడా అర్జీ పెట్టుకోలేదు. మరి అలాంటప్పుడు వ్యక్తిగత సమస్యలతో ఓ వ్యక్తి తన కుటుంబాన్ని బలి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం ఏమిటనే ఇంగితం రాజ గురువుకు ఉండాలి కదా? రికార్డుల్లో లేకుండా ఆన్లైన్లో మాయ మృతుడు సుబ్బారావు తన తండ్రి వెంకట చలపతి పేరుతో 2187/2 సర్వే నెంబరులో 3.10 ఎకరాల భూమి (ఖాతా నెంబరు 1712) ఉన్నట్లు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఆన్లైన్లో ఎక్కించినట్లు తొలుత సుబ్బారావును 2015లో నమ్మించగా ఆ తరువాత 2017లో కట్టా శ్రావణి పేరుతో ఆన్లైన్లో చేర్చారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న కట్టా శ్రావణికి 2020 నుంచి రైతు భరోసా వస్తున్నట్లు వ్యవసాయాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల మేరకు సర్వే నెంబరు 2050 కొండ నుంచి సబ్ డివిజన్ చేశారు. ఇందులో 9.12 ఎకరాల భూమి ఉండగా మూడు సబ్ డివిజన్లు చేశారు. 2187/1 విస్తీర్ణంలో 3.76 ఎకరాలు, 2187/2 విస్తీర్ణం 5.00 ఎకరాలు, 2187/3 విస్తీర్ణంలో 0.36 ఎకరాలు సబ్ డివిజన్ చేశారు. ఈ సర్వే నెంబర్లలో మృతుడి తండ్రి వెంకట చలపతి పేరుతో డీకేటీ పట్టా ఇచ్చినట్లు రికార్డులో నమోదు కాలేదని రెవిన్యూశాఖ స్పష్టంగా చెబుతోంది. మృతుడి తండ్రి పేరుతో ఉన్నట్లు చెబుతున్న భూమి సాగులో కానీ, ఎవరి అనుభవంలోగానీ లేదు. ఆ భూమి, రాళ్లు, చెట్లతో కూడుకుని ఉంది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈ అవకతవకలపై ఉన్నతస్ధాయి విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది. నేతకు దూరంగా.. అప్పుల ఊబిలో విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల తారుమారు మొదలుకొని లెక్కలేనన్ని భూ మాయాజాలాలు జరిగాయి. చేనేతకారుడు సుబ్బారావు దీనికి బలి పశువుగా మారాడు. సుబ్బారావు చాలా రోజులుగా చేనేత పనులకు దూరంగా ఉంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడు. మద్యానికి బానిస కావడం, ఆపైన క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యసనాలున్నాయి. అందిన చోట అధిక మొత్తంలో అప్పులు చేశాడు. తిరిగి వాటిని తీర్చలేక భార్య, కుమార్తెకు మత్తు ఇచ్చి హతమార్చి ఆ తరువాత ఒంటిమిట్ట చెరువు సమీపంలో రైల్వే ట్రాక్‌పై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది ప్రభుత్వ భూమే ఒంటిమిట్ట: కుటుంబాన్ని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేతకారుడు పాలా సుబ్బారావు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులు చేసినట్లు తమ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. ఎవరెవరికి ఎంత అప్పు ఉన్నాడనే వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బాధితుడు తన కుటుంబం పేరుతో ఉన్నట్లు చెబుతున్న 3.10 ఎకరాల భూమిపై కడప ఆర్డీవో ప్రత్యేకంగా విచారణ చేపట్టి పూర్తి స్పష్టత ఇచ్చారని వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం అది పక్కాగా ప్రభుత్వ భూమి అని, అందులో ఎలాంటి డీకేటీ పట్టాలు గానీ, ఇతర పట్టాలు గానీ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. 2015లో సుబ్బారావు ఇతరుల సహకారంతో ఆన్లైన్లో తన పేరు నమోదు చేశారని, అనంతరం రెండేళ్లకు (2017లో) మరొకరి పేరుతో అదే భూమి ఆన్లైన్లో మార్చేశారని చెప్పారు. ఆన్లైన్లో తారుమారు చేశారే గానీ ప్రభుత్వం తరపున 3.10 ఎకరాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఇవ్వలేదన్నారు. నాడు ఆన్లైన్లో ఎవరు చేర్చారు? రెవెన్యూ శాఖలో ఎవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. 2015లో పీఎం కిసాన్ లేదని, తర్వాత కూడా సుబ్బారావు పేరుతో పీఎం కిసాన్ సాయం పడలేదని తెలిపారు. సుబ్బారావు వ్యసనాలకు బానిసగా మారి క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలై చనిపోవాలని నిర్ణయించుకున్నాడన్నారు. :::ఎండీ షరీఫ్ డీఎస్పీ ,కడప బాబు శవ రాజకీయాలు: ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలతో పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి విమర్శించారు. సుబ్బారావు, పద్మావతి, వినయ మృతదేహాలకు ఆయన నివాళులర్పించి పెద్ద కుమార్తెను ఓదార్చారు. తామున్నామని ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుబ్బారావు భూమికి సంబంధించి ఆన్లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగిందనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సుబ్బారావు కుటుంబానికి అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే ఉరి తీయాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై బురదచల్లడం చంద్రబాబు చిల్లర రాజకీయానికి నిదర్శనమన్నారు. బీసీల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంత కృషి చేశారో బడుగులందరికీ తెలుసన్నారు. ఈ ఘటనను సీఎం జగన్ దృష్టికి తెచ్చి న్యాయం చేస్తామన్నారు. డీకేటీ పట్టా ఇవ్వలేదు.. పాల సుబ్బారావు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకట చలపతి పేరుతో డీకేటీ పట్టా మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఎక్కడా నమోదు కాలేదు. ఆ సర్వే నంబరు ఉన్న భూమి సాగు, అనుభవంలో లేదు. రాళ్లు ,చెట్లతో నిండి ఉంది. అది కట్టా శ్రావణి పేరుతో ఎలా మార్పు జరిగిందనే అంశంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. :::వెంకటరమణ, తహసీల్దారు, ఒంటిమిట్ట గతంలో జరిగిన మోసమే.. టీడీపీ పాలనలోనే సుబ్బారావు, కట్టా శ్రావణి ఆన్లైన్ భూముల వ్యవహారాలు జరిగాయన్నది సత్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదచల్లడం విచారకరం. గతంలో జరిగిన మోసాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడం ఎన్నికల స్టంట్ అని చేనేత కార్మికులతోపాటు ప్రజలందరికీ తెలుసు. భూమి ఆన్లైన్లో మారిన కొత్తపల్లెకు చెందిన కట్టా శ్రావణి విదేశాల్లో ఉన్నారని చెబుతున్నారు. సుబ్బారావు కుటుంబం మృతి ఘటన మమ్మల్ని కలిచివేసింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. :::పి.శేషారెడ్డి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకం.. మా గ్రామంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. అప్పుల బాధలు సుబ్బారావును చుట్టుముట్టాయి. ఆయన భూమి ఆన్లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకం. సుబ్బారావు తండ్రి చలపతి మూడేళ్ల క్రితం చనిపోయారు. వృత్తికి దూరమైన సుబ్బారావు మద్యం వ్యసనాలతో అప్పుల్లో కూరుకుపోయి తనువు చాలించాలనుకున్నాడు. భార్య, కుమార్తెను హత్య చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. :::పన్నెల చంద్రశేఖర్, గ్రామపెద్ద, కొత్తమాధవరం, ఒంటిమిట్ట -
జన్మభూమి కమిటీపై అలుపెరగని పోరాటం
ద్వారకాతిరుమల: గత టీడీపీ జన్మభూమి కమిటీ నిర్వాకం కారణంగా వ్యవసాయ భూమిని కోల్పోయిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులూరివారిగూడెంకు చెందిన బంటుమిల్లి రామలక్ష్మి అలుపెరుగని న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. భూవివాద సమయంలో సంభవించిన తన భర్త మృతి ముమ్మాటికీ జన్మభూమి కమిటీ చేసిన హత్యేనని ఆమె జాతీయ ఎస్సీ కమిషన్ (న్యూఢిల్లీ)ను ఆశ్రయించారు. దాంతో సదరు కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ ఈనెల 18న ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. 1981లో పావులూరివారిగూడెంలో భూస్వామి దేవరపల్లి హనుమంతరావు వద్ద లాండ్ సీలింగ్‌లో అధికంగా ఉన్న 16.44 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఆ భూమిని నిరుపేదలైన 16 మందికి ఒక్కో ఎకరం చొప్పున, మరో వ్యక్తికి 44 సెంట్లు ఇచ్చారు. అందులో బంటుమిల్లి సుబ్బారావు ఎకరం భూమిని పొందారు. అయితే హనుమంతరావు తన వద్ద ప్రభుత్వం అధిక భూమిని సేకరించిందని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు 2012లో 7.80 ఎకరాల భూమిని తిరిగి హనుమంతరావుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా భూమిని కోల్పోయే లబ్ధిదారులకు మరోచోట భూమిని కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో హనుమంతరావుకు రెవెన్యూ అధికారులు భూమిని తిరిగి వెనక్కిచ్చారు గానీ, బాధితులకు ఏవిధమైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించలేదు. అడ్డగోలుగా జన్మభూమి కమిటీ నిర్ణయం ఇదిలా ఉంటే 2015 నవంబర్ 27న టీడీపీ జన్మభూమి కమిటీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పటికే సాగులో ఉన్న సుబ్బారావు ఎకరం భూమిలో అరెకరం నంబూరి సోమరాజు కుటుంబ సభ్యులకు కేటాయించారు. దాంతో అప్పటి నుంచి గ్రామంలో భూ వివాదాలు, కొట్లాటలు మొదలయ్యాయి. సుబ్బారావుకు హైకోర్టులో సైతం అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2021 ఫిబ్రవరి 17న వివాదాస్పద భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొందరు సుబ్బారావుపై దాడి చేశారు. అదేరోజు అతడు మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య రామలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు సుబ్బారావు మృతికి సంబంధించి పోలీసుల విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రామలక్ష్మి 2021 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. 2021 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో విచారణ చేపట్టింది. పోలీస్, రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022 డిసెంబర్ 22న భూమిని కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను కమిషన్ ఆదేశించింది. సుబ్బారావు మృతిపై పునఃవిచారణ చేపట్టాలని కూడా డీఎస్పీ పైడేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బాధితులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించారు. కాగా పోలీసులు సమర్పించిన నివేదికపై సంతృప్తి చెందని కమిషన్ సుబ్బారావు మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సంచలన తీర్పు ఈనెల 18న కమిషన్ చేపట్టిన విచారణకు డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏలూరు ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, ద్వారకాతిరుమల తహసీలా్దర్ పి.సతీష్, ఎస్సై టి.సుధీర్‌లు హాజరై, తమ నివేదికను సమర్పించారు. దీనిపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన కమిషన్ కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలను జారీ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుని, నివేదికను సమర్పించాలని కమిషన్ మెంబర్ సుభాష్ రాంనాథ్ పార్ధీ ఆదేశించారు. న్యాయం జరుగుతుంది: జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రామలక్ష్మి తెలిపారు. నా భర్త సుబ్బారావు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పటి గ్రామ రెవెన్యూ అధికారి వీర్రాజుకు తగిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తానన్నారు. -
కమనీయం.. గణనాథుని కల్యాణం
యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్ స్వామి, సుబ్బారావు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం భేష్
ఒంగోలు సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం చాలా బాగుందని, ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అస్ట్రేలియా గ్లోబల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సీఈవో రాక్వెల్ ఫ్రాఫ్ అన్నారు. ఆమె శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. డీఈవో వీఎస్ సుబ్బారావు, పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(పీఈవో) సోమా సుబ్బారావుతో కలిసి జిల్లాలోని పలు పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం, రామచంద్ర మిషన్‌ను రాక్వెల్ ఫ్రాఫ్ సందర్శించారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి, విద్యార్థులకు అందించిన యూనిఫాం, షూ, పుస్తకాలు, కేరీర్ గైడెన్స్, ఇంగ్లిష్ మీడియంలో బోధన, మార్గదర్శినిపై విద్యాశాఖ చేస్తున్న కసరత్తును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రూపు సంతరించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. ముందుగా ఆమెకు విద్యాశాఖ అధికారులు, రోటరీ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. -
2030 నాటికి ఇస్రో నుంచి స్పేస్ టూరిజం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది. మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్సైట్లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు. -
వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948
కేన్సర్ చికిత్సలో ఉపయోగించేందుకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేసినవారు ఎల్లాప్రగడ. మానవ శరీరంలోని కణాలకు శక్తినిచ్చేది ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ) అని కనుగొన్నదీ ఆయనే. ఫైలేరియాకు హెట్రాజన్ కనుగొన్నది కూడా ఆయనే. యల్లాప్రగడ పర్యవేక్షణలో వెలువడిన (ఆరోమైసిన్ ) రోగ నిరోధకాలు పెన్సిలిన్ కంటే ఎంతో శక్తిమంతమైనవి. ఆయన కనిపెట్టిన ఫోలిక్ యాసిడ్, స్ప్రూ మందులు నేటికీ మానవాళికి ప్రాణాధారాలు! అందుకే ఎల్లాప్రగడ వైద్యశాస్త్రానికీ, జీవ రసాయనిక శాస్త్రానికీ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) లో ఎల్లాప్రగడ జన్మించారు. జగన్నాథం, వెంకమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో నాలుగో సంతానం. యల్లాప్రగడ ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్ చదివాక, మద్రాస్ వైద్య కళాశాలలో చేరారు. రాజమండ్రిలో ఉండగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి సంస్కరణల ధోరణినీ, వందేమాతరం ఉద్యమం వేడినీ చూసిన ఎల్లాప్రగడ విదేశీ వస్త్ర బహిష్కరణ కోసం గాంధీ ఇచ్చిన పిలుపునకూ స్పందించారు. ఖద్దరుతో ఆపరేషన్ థియేటర్లో కనిపించారు. ఇదే జీవితం మీద తొలిదెబ్బ అవుతుందని ఆయన ఊహించలేదు. సర్జరీ ప్రొఫెసర్ ఎంసీ బ్రాడ్‌ఫీల్డ్‌కు అది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పరీక్ష బాగా రాసినా ఎల్లాప్రగడకు పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ పట్టా ఇవ్వనివ్వలేదు. ఎల్ఎంఎస్ సర్టిఫికెట్తో సరిపెట్టారు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో చేరడానికి ఇది ఆటంకమైంది. అందుకే డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి ఆయుర్వేద కళాశాలలో అనాటమీ అధ్యాపకునిగా చేరారు. ఆయుర్వేద ఔషధాలలోని రోగ నిరోధక లక్షణం ఆయనను ఎంతో ఆకర్షించింది. కొత్త పద్ధతులను మేళవించి పరిశోధన ప్రారంభించారు. ఇంతలోనే హార్వర్డ్ మెడికల్ కళాశాలలో ఉష్ణమండల రుగ్మతల విభాగం నుంచి పిలుపు వచ్చింది. మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ (కాకినాడ) వారి సాయం కూడా అందింది. హార్వర్డ్‌లో డిప్లొమా పొంది అక్కడే అధ్యాపకుడయ్యారు. వైద్య పరిశోధనలో ఎల్లాప్రగడ ప్రతిభ ఎంతటిదో మొదట రుజువైనది ఇక్కడే. మనిషి రుగ్మతలు ఎన్నింటికో ఎల్లాప్రగడ మందు కనిపెట్టారు. కానీ ప్రపంచానికి పట్టిన రుగ్మతలకు మందు కనిపెట్టే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. వర్ణ వివక్ష, ఈర్ష్యా ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలతో బాధపడుతున్న ప్రపంచాన్ని మరమ్మతు చేయగల ఒక ఔషధం కోసం లోకం అర్రులు చాస్తోంది. ఎల్లాప్రగడ వంటి ప్రతిభా సూర్యుడిని మేఘాల్లా కమ్మేసినవీ ఇవే! (చదవండి: శతమానం భారతి: పరిరక్షణ) -
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజున ఆవుల సుబ్బారావు ఉప్పల్ అకాడమీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. హకీంపేట సోల్జర్స్ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు పెట్టినట్లు గుర్తించారు. ఆందోళనకు కావాల్సిన లాజిస్టిక్స్ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. విధ్వంసం కేసులో కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసులో A2గా ఉన్న పృధ్విరాజ్ సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థిగా గుర్తించారు. నరసారావుపేటలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ ఇస్తున్నారు. విధ్వంసంలో పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది.. A7, A8, A9, A10, A11, A12, A62, A63 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. చదవండి: (కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి) -
హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు
సాక్షి, గుంటూరు: అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ అటాక్‌లో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసులో బుధవారం నుంచి సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు విచారించనున్నారు. చదవండి: (అగ్నిపథ్ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు) -
ఏపీ పోలీసుల అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్
-
ఏపీ పోలీసుల అదుపులో సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి వెనుక సహకారం ఉందని భావిస్తున్న సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయనను ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేట తరలించారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. చదవండి: (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు) -
ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రామదాసు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు.. వావిలికొలను సుబ్బారావు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం – రాజంపేట ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు. ఈయన జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు 1, 1936లో మద్రాసులో పరమపదించారు. ఆలయ అభివృద్ధికే.. రాజులు ఒంటిమిట్ట ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి కోదండరామాలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఈ రామాలయంను ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయంను పునరుద్ధరించారు. టెంకాయచిప్పలో ఎంతధనం పడినా ఏదీ తన కోసం ఉంచుకోకుండా రాయాలయ అభివృద్ధికే ఇచ్చేశారు. ►ఈయన రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయం, దండకత్రయం, టెంకాయచిప్ప శతకం, పోతన నికేతన చర్చ, శ్రీరామనుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నో రచనలు కూడా చేశారు. ►వాల్మీకి సంస్కృత రామాయణంను 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. ఆయన రాసిన రామాయణంను ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు. -
సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్
నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను తీసి నేలకొట్ట తీయని నారింజ తింటే హాయ్ హాయ్.. చిన్నప్పుడు చదువుకున్న పాట ఇది. నారింజ పేరు చెబితేనే కళ్లు మూసుకుంటాయి. అటువంటి నారింజ రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి, ఆత్రేయపురం వెళ్లే దారిలో లొల్ల లాకులకు ముందుగా, రోడ్డు పక్కన పచ్చని చెట్ల కింద చిన్న బండి కనిపిస్తుంది. అక్కడకు రాగానే వారి వారి వాహనాలను పక్కన పెట్టి, జుత్తుగ సుబ్బారావు తాత ఇచ్చే నారింజ రసం సేవించి, సేద తీరుతుంటారు. సుబ్బారావు వయస్సు 83 సంవత్సరాలు. ‘శ్రేష్ఠమైన వడ్లమూడి నారింజ పండ్లు తెప్పించి, రసం తీసి ఇస్తాను. వడ్లమూడిలో దొరక్కపోతే, రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాల నుంచి నారింజకాయలు తీసుకువస్తాయి’ అంటారు ఈ తాత. ఆశ్చర్యమేమిటంటే, నారింజ కాయలు కొనడానికి తాత ఎక్కడకూ వెళ్లరు, అక్కడి నుంచి కాయలు రాగానే, ఇక్కడ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ‘అంతా నమ్మకం మీదే నడిచిపోతోంది వ్యాపారం’ అంటారు ఈ తాత. ఒక్కో మనిషికి మూడు కాయల రసం పిండుతారు. కాయలు బాగా తగ్గినప్పుడు రెండు కాయలు పిండుతారు. ఒక్కో కాయ పది రూపాయలకు కొంటారు. కాని గ్లాసు రసం 20 రూపాయలకే అమ్ముతారు. ఎవరైనా వచ్చి ‘ధర పెంచవా తాతయ్యా’ అని అడిగితే, ‘నాకు ఆదాయానికి లోటు లేదు. నేను కూర్చుని తిన్నా నాకు సాగుతుంది. కాని ఏదో ఒక పనిచేయనిదే నాకు తోచదు. ఇది అలవాటైన పని. ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను’ అంటూ ఎంతో సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. వ్యాపార రహస్యం.. నారింజ రసంలో నాలుగు రకాల వస్తువులు కలుపుతారు. ‘లక్ష రూపాయలిచ్చినా ఆ రహస్యం మాత్రం చెప్పను’ అంటారు సుబ్బారావు తాత. మొట్టమొదట్లో ఈ వ్యాపారం ర్యాలి గ్రామంలోని జగన్మోహిని ఆలయం దగ్గర ప్రారంభించారు. అక్కడ ఈ బండి పాతిక సంవత్సరాలు నడిచింది. ఆ తరవాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చానని చెబుతారు సుబ్బారావు తాత. ఆ తల్లి చలవ.. సుబ్బారావు తాత తన చిన్నతనంలో ఒకరి ఇంట్లో చాలా కాలం పనిచేశారు. అందుకుగాను వారు సుబ్బారావు తాతకు ఆరు కుంచాల పొలం రాసి ఇచ్చారట. సుబ్బారావు తాతకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిది ఉమ్మడి కుటుంబం. ‘వంటంతా ఒక కుండలోనే జరుగుతుంది’ అంటూ సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. ‘ఇంటి దగ్గర కూర్చుంటే ఏం వస్తుంది. ఓపిక ఉంది, కష్టపడతాను. ఎక్కడెక్కడ నుంచో మీరంతా రసం తాగటానికి వస్తుంటారు. నేను తయారుచేసిన నారింజ రసం అమెరికా కూడా వెళ్లింది. నాకు అంతకుమించిన సంతోషం లేదు’ అంటారు ఈ తాత. ఆరు నెలలు నారింజలే.. ఆరు నెలల పాటు కేవలం నారింజ రసం అమ్ముతారు. మిగిలిన ఆరు నెలలు రకరకాల రసాలు అమ్ముతారు. సొంతంగా లిమ్కా రుచిని కూడా తయారుచేస్తారు. మొత్తం 20 రకాల జ్యూస్‌లు తయారుచేస్తారు సుబ్బా రావు తాత. అన్నీ 20 రూపాయలకే అందిస్తున్నారు. వచ్చిన ప్రతివారినీ ‘రండి బాబూ! రా తమ్ముడూ! రా మనవడా!’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పది పైసలతో మొదలు.. 50 సంవత్సరాల క్రితం 10 పైసలతో ప్రారంభమైన నారింజ రసం ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. ‘ఈ పాకం, ఈ ఫార్ములా ఎవ్వరికీ తెలియదు. ఈ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చి, ఆగి తాగి వెళ్తారు. ‘సుబ్బారావు గ్రేట్’ అంటారు అక్కడ రసం తాగినవారు. మంచి నీడనిచ్చే చెట్టు కింద నీడలో చల్లగా సేద తీరుతారు. ‘బండి చిన్నదే కానీ రుచి మాత్రం పెద్దది’ అంటారు ఆ రసం రుచి చూసినవారంతా. ఆ రసాన్ని మిషన్ మీద కాకుండా చేత్తో తీసే మిషన్‌తోనే తీస్తారు. ఉప్పు, కారం, ప్రత్యేకమైన మసాలా వేసి, కొద్దిగా ఐస్ జత చేసి జ్యూస్ ఇస్తూ, సుబ్బారావు తాత అందరి కడుపులను చల్లబరుస్తున్నారు. -
తెగిన గాలిపటం
భూమిలోకి దిగి పాతుకుపోయిన ఊడలమర్రి కింద తాడు ముడులు విప్పుతూ కూర్చున్నాడు యాదయ్య. కొమ్మల సందుల్లో నుండి పడుతున్న లేలేత కిరణాలు క్రమక్రమంగా పెరగసాగాయి. బతుకుముడులు విప్పుకునే అవకాశం లేని తను, తనకు ఆధారమైన తాళ్లకు ముడులిప్పడం ఆశ్చర్యంగా తోచి తనలో తనే నవ్వుకున్నాడు యాదయ్య. పుట్టినప్పటినుండీ తన బతుకు చిన్నచిన్న సాహసాల మధ్యే గడిచింది. గుండ్రంగా ఉన్న ఇనుపచువ్వల మధ్యలో నుండి అటూఇటూ దూకడం, ఇనుపరింగులలో తన దేహాన్ని దూర్చి బయటికి వచ్చాక అందరికీ ఆనందం కలిగించడం, ఒక్కోసారి అంటించిన మంటల్లో నుంచి దూకి అబ్బురపరచడం మొదట్లో భయంభయంగానే అనిపించినా రానురానూ అలవాటుగా మారిపోయింది. పెళ్లయ్యాక పిల్లలు పుట్టాకా కూడా అదే తన బతుకుకు ఆదరువుగా మారిపోయింది. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా పెరిగాడో తెలియదు. ఒక ఊరి నుండి మరో ఊరికి, ఆ ఊరు నుండి ఇంకో ఊరికీ ప్రయాణం సాగుతూనే ఉంది. చేసిన విన్యాసాలు చూసి చప్పట్లు ఈలలతో హడావిడి చేసేవారే గానీ ఒక్కరు కూడా చిల్లర రాల్చేవారు కాదు. ఒళ్ళు గగుర్పొడిచే సాహస విన్యాసాలు చేస్తున్న తన చిన్నపిల్లల్ని చూసి ‘అయ్యబాబోయ్’ అని ఆశ్చర్యపడేవారే గానీ వాళ్లని పిల్చి అభినందించి అర్థరూపాయి బహుమతి ఇచ్చేవారు లేరు. తను ఒకప్పుడు తన తండ్రికి కొడుకు..ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రి. విన్యాసాలు చేయకుండా విస్తర్లు లేవని తన జీవితాన్ని తల్చుకోగానే యాదయ్య మనసంతా విషాదం నిండిపోయింది. ‘నానా... అమ్మెప్పు డొస్తుంది..నాకు ఆకలవుతుంది’’ అన్న కూతురి మాటలతో ఆలోచనలను విదుల్చుకుంటూ ఈ లోకంలోకి వచ్చి ఆడుకుంటున్న కూతురివంక చూశాడు. మూడేళ్ల కూతురు లచ్చి... డ్రాయరు వేసుకుని అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లిమొగ్గలతో సంతోషపడుతోంది. డప్పులు లయబద్ధంగా మోగుతున్నాయి. చుట్టుపక్కల రైతులంతా పొలం చుట్టూ చేరారు. ప్రొద్దున పూట ఎండే అయినా చురుక్కుమంటోంది. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న తాడుమీద నడుస్తోంది సాయవ్వ. చేతిలో ఆసరాగా గెడకర్రను పట్టుకుని తాడుమీద అటూఇటూ నడవసాగింది. ఒళ్లంతా చిరాగ్గా ఉంది. చెమట కారిపోతూ పాదాలలోకి తడి చేరుతోంది. ఆ తడికి కాలెక్కడ జారిపోతుందోనని భయపడింది సాయవ్వ. తనవైపు పైకి చూస్తున్న కొడుకు రాజాని చూడాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. కానీ ఎక్కడ అదుపు తప్పి కిందపడుతుందోనని ఆ ప్రయత్నం మానుకుంది. పంజాబీడ్రస్సు నడుముకు కట్టిన చున్నీముడి జారిపోతున్నట్లుగా అనిపించింది. వేపాకు, పసుపు కలిపిన బియ్యాన్ని తాడు మీద అటూ ఇటూ నడుస్తూ విన్యాసాలు చేస్తూ పొలంలోకి చల్లాలి. జారిపోతున్న మూట క్షణక్షణానికీ బరువుగా అనిపిస్తోంది. రాత్రి సరిగా భోజనం లేకపోవడం, పొరుగూరి నుండి ఈ ఊరొచ్చేసరికి రాత్రికావడం, దానివల్ల నిద్రలేకపోవడం వల్ల నీరసంగా, ఆకలిగా ఉంది. కళ్లు మూతలు పడిపోతున్నాయి. పిల్లల్ని పస్తుపెట్టడం ఇష్టంలేక ఏవో కాసిని బియ్యం, డబ్బులు వస్తాయని ఆశపడి ఒప్పుకుంది. మామూలుగా తన నీడపడకుండా, తాకకుండా జాగ్రత్తపడే ఈ జనాలంతా తన చేతులతో పసుపుబియ్యాన్ని పొలాల్లో చల్లించాలని ఆశపడుతున్నారు. అలా చల్లితే పంటలు బాగా పండుతాయట! వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని బావుల దగ్గర కూడా బియ్యాన్ని చల్లించడంతో మనసులో నవ్వుకుంది సాయవ్వ. వాళ్ల నమ్మకాల మాటెలా ఉన్నా తనలాంటి వాళ్లకి అటూఇటుగా రోజు గడిచిపోతుంది. ఆలోచనలతోనే ఒకసారి ఆ చివరనుండి ఈ చివరివరకు నడిచి చేతిలోని గెడకర్రను కిందనున్న కొడుక్కి అందించింది. మళ్లీ తాడు మీద నడుస్తూ నడుముకు కట్టిన మూటవిప్పి బియ్యాన్ని గుప్పిట్లోకి తీసుకుని పొలాల్లోకి విసర సాగింది. విసిరేటప్పుడు ముందుకు తూలినట్లు అనిపించింది. డప్పు మోగుతూనే ఉంది. చివరి వరకూ నడిచి ఒడిలో ఉన్న బియ్యాన్ని పొలాల్లోకి సత్తువ కొలదీ విసిరింది. బియ్యం చల్లటం అయ్యాక నిలబెట్టిన గెడ నుండి జారుకుంటూ కిందికి వచ్చింది.చల్లనిగాలి ఒంటికి తగిలి ప్రాణం లేచివచ్చింది. అప్పటి వరకూ డప్పు కొడుతూ కిందనున్న రాజా ‘అమ్మా’ అంటూ చుట్టుకుపోయాడు. వాడినలా చూడగానే సాయవ్వ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బహుశా చిన్నపిల్లల సంపాదన మీద ఆధారపడే బతుకులు తమవే కాబోలు! ఊరూరూ తిరగడం వల్ల ఒక స్థిరమైన ఇల్లంటూ లేకపోయింది. తాళ్లూ కర్రలూ ఇనపరింగులు, బిందెలు, దువ్వెనలు...వీటితోనే బతుకాట సాగిపోతోంది. తెగిన గాలిపటాల్లా ఒకచోటి నుండి ఇంకో చోటికి ఎక్కడెక్కడికో ఎగరాల్సి వస్తోంది. ఆ చెట్టుకిందా ఈ చెట్టు కిందా కాలం గడపాల్సి వస్తోంది. తాత్కాలికంగా వేసుకునే గుడారాలు చలికి ఆగవు. ఏదో ఎండనుండి కొంచెం నీడనిస్తాయి. అలాగని గుడారం బలంగా ఉన్నా రెండు మూడు రోజులకే అక్కడి నుండి వెళ్లాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఏపుగా పెరిగిన చెట్లే ఎంతో నీడనిస్తుంటాయి. కొడుకుని ముద్దుపెట్టుకుని నడుముకున్న చున్నీ విప్పి పొలాల రైతుల ముందు నిల్చుంది. చూపుల్లో ఏదో చులకన భావం, మాటల్లో వెకిలితనం సాయవ్వని వెక్కిరించాయి. తన కష్టానికి ప్రతిఫలం గుడ్డలో వేస్తూ అదోలా చూస్తున్న వాళ్లను ఏమీ అనలేక తలకిందకి దించుకుంది. ఊరూరూ తిరుగుతూ పొట్టపోసుకుంటున్న తనలో కూడా ‘అందాన్ని’ ఆరాధిస్తున్న వారిపట్ల జాలి కలిగింది. అసలు తను ఆడదాన్ననే విషయమే ఎప్పుడో మర్చిపోయింది. గుంటలు పడిన కళ్లల్లోనూ, పీక్కుపోయిన బుగ్గల్లోనూ అందాన్ని వెదికి సొల్లుకారుస్తున్న వాళ్లను చూసినప్పుడల్లా తను ఆడదాన్ననే విషయం గుర్తొస్తుంటుంది. ఈ విన్యాసాలు చేయలేక ఒళ్లమ్ముకుని బతికిన వాళ్లు మనసులో కదలాడారు. చేదు తమ జీవితాల్లోనే ఉన్నప్పుడు చూసేవాళ్ల కళ్లల్లో ఎన్ని అర్థాలుంటే తనకెందుకు? దొరికే గుప్పెడు గింజలు తన కడుపు నింపుతున్నాయా లేదా అనేదే తనకు అవసరం. ఎండసూటిగా వీపుకి తగులుతుంటే తన దగ్గరున్న చున్నీ తీసుకుని కొడుకు చొక్కాలేని వీపుమీద కప్పి వాడిని దగ్గరగా పొదువుకుంది. నడుస్తుంటే దారిలో స్కూలుకెళ్లే పిల్లలు ఎదురుపడ్డారు. వాళ్లనలాగే చూస్తూ తల్లివైపు తిరిగి ‘‘అమ్మా..నేను కూడా వాళ్లతో కలిసి బడికెళ్లనా’’ అన్నాడు. ఆశ ఆకాశానికి ఈడ్చుకుపోతుంటే వాస్తవం కటిక పేదరికంలా మారి కాళ్లకి అడ్డుపడుతున్నట్లనిపించింది. వాడి వంక విషాదంగా చూస్తూ ‘‘నువ్వు చదవాలంటే ఒకటో తరగతే వంద ఊళ్లల్లో చదవాలి’’ అంది నవ్వుతూ. ‘‘అంటే’’ అమాయకంగా అడిగాడు. ‘‘మన బతుకులు తెగిన గాలిపటాలు నాన్నా. ఎంతసేపు ఎగురుతామో, ఎక్కడ కూలబడిపోతామో తెలియదు. ఆడితేనే బతుకు గడవని బతుకాటలు మనవి. మనం ఇలా బతకాలనే ఆ భగవంతుడు మనల్ని పుట్టించాడు. మనకు తెలిసిన పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ కాలం గడపాలి తప్ప అనవసరంగా అందని వాటికోసం ఆశపడ కూడదు’’ అంది. చిట్టిబుర్రకేదో అర్థం అయినట్టూ ఉంది, కానట్టూ ఉంది. అడ్డంగా తలూపాడు. కొడుకుతో మాట్లాడుతుండగా తనకు చిన్నప్పుడు ఎదురైన అనుభవం గుర్తొచ్చింది సాయవ్వకి. బడికెళ్తానని మారాం చేస్తున్న తనకి పలకా బలపం కొనిచ్చి పంపించాడు తండ్రి. అవి తీసుకుని ఉత్సాహంగా వెళ్తున్న తను చూసుకోకుండా ఎదురొచ్చిన మోతుబరి రైతును గుద్దింది. కోపంతో ఏం చేయాలో తెలియక చేతిలోని పలక లాక్కుని నేలకేసి కొట్టి ‘‘ఊరూరూ తిరిగే నీకెందుకే చదువు, ఇప్పుడేలుతున్న ఊళ్ళు చాలవా? ఇంకే ఊళ్ళు ఏలాలంటా?’’ అన్నాడు వెటకారంగా. ముక్కలైన పలకవంక చూస్తూ గుండెలు పగిలేలా వెక్కివెక్కి ఏడ్చింది తను. పలక పగలగొట్టుకుని స్కూలుకెళ్ల లేదని ఇంటికెళ్లాక తండ్రి కొట్టాడు. దెబ్బలకి ఒళ్లంతా పులిసిపోయి రెండురోజులు ఒకటే జ్వరం. అప్పటినుండీ బడిని తల్చుకోగానే చేతికందని చందమామను చూసినట్టుంటుంది సాయవ్వకి. ఎంతైనా తన రక్తం కదూ... వీడికీ అనిపిస్తుందనుకుంటా కొడుకు వైపు చుసి నవ్వుకుంటూ ముందుకు సాగింది. మర్రిఊడల్ని పట్టుకుని ఉయ్యాలలూగుతున్న నాలుగేళ్ల కూతురు లచ్చి పిల్లిమొగ్గలేసుకుంటూ వచ్చి తల్లిని వాటేసు కుంది. జుట్టు రేగిపోయి, చిరిగిన గౌనుతో తనను అల్లుకుపోయిన కూతుర్ని కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది. ‘‘తొందరగా పని తెముల్చు. ఈరోజన్నా ఎక్కడో ఒకచోట ఆటాడితేగానీ కడుపులు నిండవు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్టా’’ అంటున్న యాదయ్యకు సమాధానంగా ‘‘ఆ..ఆ’’ అంటూ పొయ్యిదగ్గర కూర్చుంది. కాసేపటి తర్వాత ‘‘తాడు గట్టిగా ముడెయ్యి. మొన్న పైకెక్కినప్పుడు సాగిపోయి నడవడానికి ఇబ్బందయింది. పైకెక్కి నడవాలంటే ప్రాణాలమీదకొస్తంది. ఏంబతుకులో ఏంటో? కడుపూ నిండదు, గుడ్డా దొరకదు. ప్రాణాలు పణంగా పెట్టి గాల్లో ఎగిరితే రోజులు గడుస్తున్నాయి. లేదంటే దువ్వెనలూ అవీ అమ్మాలి. అవి కూడా సరిగా అమ్ముడు పోవట్లేదు’’ అంది దిగులుగా. యాదయ్య ఆలోచనలో పడ్డాడు. తాడుముడి జారిపోయి నడుముకి దెబ్బతగిలిన తండ్రి చివరిరోజుల్లో ఎంత నరక యాతన పడ్డాడో గుర్తొచ్చి కన్ను చెమ్మగిల్లింది. తన పరిస్థితి కూడా అలాగే అయితే తన భార్యాపిల్లలకి దిక్కెవరు? అని తల్చుకోగానే మనసంతా దిగులుపడి పోయింది. కొడుకూ కూతురూ ఫీట్లు చేసే ఇనుపరింగులు తుప్పుపట్టిపోతే తుడిచి ఒక పక్కన పెట్టాడు. తాడుముడి గట్టిగా బిగించాడు. కూర్చుని ముడేస్తే గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ రెండు గెడకర్రలకీ ముడేసినప్పుడే ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఆలోచిస్తూనే పని పూర్తిచేశాడు. మిట్టమధ్యాహ్నం ఎండ శరీరాన్ని కుంపట్లో పెట్టి వేపుతున్నట్లుంది. తెచ్చిన సామానంతా ఒక పక్కన పెట్టి రోడ్డు వారగా ఉన్న ఖాళీస్థలంలో గెడకర్రలు నిలబెట్టి దానికి తాడు బిగించి కట్టే పనిలో ఉన్నాడు యాదయ్య. సాయవ్వ అవసర మైనప్పుడల్లా సాయం అందిస్తోంది. రాజా తన చేతిలో ఉన్న డప్పు మీద ఆగకుండా దరువేస్తూ దారినపోయే అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పల్టీలు కొట్టడం నేర్చుకుంటున్న లచ్చి అటునుండి ఇటు ఇటు నుండి పల్టీలు కొడుతూ దానినొక ఆటలాగా భావించి ఆనందపడసాగింది. డప్పు చప్పుడు విని అక్కడక్కడా ఉన్నవాళ్లంతా దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి చేరారు. తాడును అటూఇటూ బలంగా లాగి కడుతున్న యాదయ్య సాయవ్వలకు అక్కడకు వస్తున్న వాళ్లను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఎలాగైనా మంచి విన్యాసాలు చేసి అందరిచేతా చప్పట్లు కొట్టించుకుని వాళ్ళిచ్చే డబ్బులతో మంచి కూర వండించుకుని తినాలి. కూర గురించి తల్చుకోగానే యాదయ్య నోట్లో నీళ్ళూరాయి. రోజూ పచ్చడిమెతుకులు, నీళ్ళు కలిసిన అన్నం తినీతినీ విసుగొచ్చింది. ఈ రోజైనా నోట్లోకి చుక్కా, పంటికిందకి ముక్కా తగలాల్సిందే అనుకుంటూ ఆనందపడుతున్నాడు. మూటలో కట్టిన బిందెలు తీసుకొచ్చి వరసగా పేర్చాడు యాదయ్య. వాటితో రాజా విన్యాసాలు చేస్తాడు. వయసుకి మించిన పనే అయినా ‘చేయను’ అనకుండా చేసే కొడుకుని చూసి ముచ్చటపడ్డాడు యాదయ్య. బిందెమీద బిందె పెట్టి పడిపోకుండా నడుచుకుంటూ అందరి దగ్గరకూ వెళ్ళి వాళ్లిచ్చే చిల్లర దోసిట్లో పోసుకుంటాడు. లచ్చి బుజ్జికుక్కపిల్లలా పల్టీలు కొట్టసాగింది. చేతుల్ని కిందకీ, కాళ్లని పైకీ లేపి అటూఇటూ నడుస్తున్న ఆ పిల్లను చూసి చప్పట్లు మారుమోగిపోయాయి. చెల్లి అలా నడుస్తుంటే ఆపకుండా డప్పు కొడుతున్నాడు రాజా. జారిపోతున్న నిక్కరును సరిచేసుకుంటూ పల్టీలు కొట్టసాగింది. కాసేపు చుట్టూ నుంచున్న వాళ్ల దగ్గర పల్టీలు కొట్టి ఆ తర్వాత ఇనుపరింగుల్లోంచి బయటికి రావడం చేసింది. చేతులకి మెడకీ, కాళ్లకీ మెడకీ ఇనుపరింగు తగిలించుకుని చాకచక్యంగా బయటికి వస్తున్న పిల్లను చూసి అందరూ రెట్టించిన ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారు. ఫీట్లు చేయడం అయ్యాక అందరి దగ్గరకీ వెళ్ళి డబ్బులడిగింది. ఎవరికి తోచినంత వాళ్లు ఇవ్వసాగారు. ఎండ ఎక్కువవుతోంది. సాయవ్వకి ఊపిరి తీసుకోవడానికి వీలుకానంత ఆయాసంగా అనిపించసాగింది. అలా అని కూర్చుంటే రోజు గడవదు. పిల్లలతో పాటు ఏదో ఒక విన్యాసం చేస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయనుకుంది. పొడుగ్గా ఉన్న ఇనుపఊచను తీసుకుని ఒకసారి అందరికీ చూపించింది. తర్వాత దాన్ని భూమిలోకి గుచ్చి పైకి కనిపిస్తున్న ఊచకి తన కంఠాన్ని ఆనించి మెల్లమెల్లగా వంచసాగింది. చూస్తున్న అందరికీ ఒళ్ళు గగుర్పొడవసాగింది. కంఠంలో ఊచ దిగిపోతుందేమో నన్నంత ఉత్కంఠ చుట్టూ చేరిన వారిలో కదలాడసాగింది. అలవాటైన పనే కాబట్టి మెల్లగా వంచడం పూర్తిచేసి ఆ వంగిన ఊచ పైకిలేపి అందరికీ చూపించింది. ఎండ ఎక్కువవసాగింది. ఊచ వంచడం అయిపోయాక నిలువునా పాతిన గెడకర్ర పైకెక్కి వెళ్లసాగింది. రెండుసార్లు పట్టుతప్పి కిందకి జారింది. మళ్ళీ ప్రయత్నించి పైకెక్కసాగింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారికి పెద్ద కొండ చిలువేదో చెట్టుమీదకి పాకుతున్నట్లుగా అనిపించింది. తాడుమీద నుంచుని భర్త అందించిన గెడకర్ర పట్టుకుంది. పంజాబీ డ్రస్సు ఒళ్లంతా కప్పినా అరికాళ్లలో చెమటలు పట్టసాగాయి. చుట్టూ చూసింది. కిందనున్నవాళ్లు తలలు పైకెత్తి తను చేసే విన్యాసాన్ని చూడడానికి ఆరాట పడుతున్నారు. అడ్డంగా పట్టుకున్న గెడకర్ర సాయంతో తాడు మీద ఒక్కో అడుగూ తీసి నడవసాగింది. ఒకసారి నడవడం పూర్తయింది. కాళ్లనేదో నిస్సత్తువ ఆవరిస్తున్నట్లుగా అనిపించింది. శరీరం తేలికైపోతున్నట్లూ, తననెవరో బలవంతంగా ఈడ్చుకుపోతున్నట్లూ అనిపించింది. డప్పు మారుమోగిపోతోంది. పిల్లవాడు శక్తినంతా ఉపయోగించి డప్పు వాయిస్తున్నాడు. తన పేగుల్ని డప్పుకొట్టడానికి కర్రల్లాగా వాడుతున్నట్లనిపించింది. ముఖానికి చేయి అడ్డంపెట్టుకుని పైకి చూస్తున్నాడు యాదయ్య. చప్పట్లు కొట్టి సాయవ్వను మరింత ఉత్సాహపరుస్తున్నారు చుట్టూ చేరినవాళ్ళు. ఊతగా ఉన్న గెడకర్రను పట్టుకుని ముందుకి అడుగేసింది సాయవ్వ. రెండువేళ్లకీ మధ్య చిక్కాల్సిన తాడు పట్టు తప్పిపోయింది. బిగించి కట్టిన తాడు ఊడి పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి అందరూ బిత్తరపోయారు. నేలకూలిపోతున్న ఒక మహావృక్షంలా పడుతున్న సాయవ్వను చూస్తూ దిగ్భ్రాంతి చెందారు. ఒక్కసారిగా చప్పట్లు ఆగిపోయాయి. బలంగా వీచిన గాలికి చెట్టుకొమ్మల్లో చిక్కుకున్న గాలిపటం ఆకాశానికి ఎగరసాగింది. బతుకే ఒక ఆటగా బతికి చివరికి బతుకాటలోనే ఓడిపోయిన సాయవ్వను చూస్తూ ముందుకు కదిలారు. -
మనసున్న మారాజు
యానాం: పది రూపాయలిచ్చి లక్షలాది రూపాయల ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో కూడా యానాంకు చెందిన ఓ దళితుడు నిస్వార్థంగా తనకున్న రూ.కోటి విలువ చేసే భూమిని పేదలకు పంచిపెట్టారు. కుల మతాలకు అతీతంగా 54 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. యానాం మున్సిపాలిటీ పరిధిలోని దరియాలతిప్పకు చెందిన మెల్లం సుబ్బారావు గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తన పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్నన పొందారు. సుబ్బారావుకు దరియాలతిప్పలో రెండు ఎకరాలు కొబ్బరి తోట ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయినా కూడా పేదలకు సొంత గూడు కల్పించేందుకు ఆ భూమిని ఆదివారం ఉదారంగా పంచి పెట్టాడు. 65 చదరపు మీటర్ల చొప్పున విభజించి ఎస్సీలు, మత్స్య కారులు, బ్రాహ్మణులు, కాపులు, శెట్టిబలిజకు చెందిన 54 మంది పేదలకు పంపిణీ చేశారు. కాగా, సుబ్బారావుకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా మిగిలిన వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు మాట్లాడుతూ ‘సొంత ఇళ్లు లేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఎప్పటికైనా వారికి సాయపడాలని అనుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇళ్లు లేని వారికి ఏదో నా వంతు సాయం చేశాననే సంతృప్తి కలిగింది’ అని పేర్కొన్నారు. -
విద్య ఘనం, విలువ శూన్యం
విశ్లేషణ ఉన్నత విద్య అనేది అందుకోగలిగేవారికే కాదు, అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ లక్ష్యంతోనే 2006లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటయిన పాలనా సంస్కరణల కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఉన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రవేశాలు కల్పించాలని ఆ కమిటీ చెప్పింది. తగినన్ని కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా విశ్వవిద్యాలయాల మీద ఒత్తిడి తగ్గించాలన్నది మరొక సిఫారసు. అలా జరిగినప్పుడు ఎక్కువ మంది బడుగు, బీద దళిత, ఆదివాసీ వర్గాల పిల్లలు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో ప్రవేశించగలుగుతారు. ఈ ఆశయాలూ, సిఫారసులూ ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలు నిధులు లేక కునారిల్లిపోతున్నాయి. విశ్వవిద్యాలయాలు మూడు రకాలు. ఒకటి: రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, రెండు: కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మూడు: డీమ్డ్ విశ్వవిద్యాలయాలు. మూడో రకం విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న 200 విశ్వవిద్యాలయాలలో మన దేశానికి చెందిన విశ్వవిద్యాలయాలు ఒకటో, అరో మాత్రమే చోటు దక్కించుకున్నాయి. వీటిలో ఏ ఒక్క రాష్ట్ర విశ్వవిద్యాలయానికీ స్థానం లేకపోవడం మరింత శోచనీయం. దీనికి కారణం కులపతి పదవి నుంచి కింది స్థాయి అధికారి వరకు నియామకం విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండడమే. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి విలువ లేకుండా చేయడం మరొక కారణం. విద్యార్థులకు రాజకీయాలు ఉండరాదని చెబుతూనే, విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికలుగా తయారు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం నడిపే విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలకు అనేక కారణాలు కనిపిస్తాయి. వాటిలో ఇవి ముఖ్యమైనవి మాత్రమే: విద్యార్థుల ప్రవేశ సంఖ్య, ముఖ్యంగా సామాజిక, ప్రాథమిక విజ్ఞానశాస్త్రాలలో తగ్గిపోవడం. ఇందువలన ఫీజుల రూపేణా వచ్చే ఆదాయం తగ్గిపోతున్నది. కొత్తగా విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి. కానీ అవి ఒకటి రెండు జిల్లాలకే పరిమితమవుతున్నాయి. దీనితో విద్యార్థుల సంఖ్య, కళాశాలల సంఖ్య తగ్గిపోతున్నది. ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల ఏ రకమైన వాణిజ్య ప్రకటనలు పత్రికా ముఖంగా గానీ, మీడియా ద్వారా గానీ ఇవ్వకపోవడంతో సమాచారం లోపిస్తున్నది. ఇది ఖర్చుతో కూడినదే కాకుండా, నైతికమైనవి కూడా. విశ్వవిద్యాలయాలు కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అనుసరించాలి. ఆయా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు అంతర్భాగంగా పనిచేస్తున్న కళాశాలలకు సెంటర్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ పర్టిక్యులర్ ఏరియా గుర్తింపు ఉంటే రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్ (రూసా) నుంచి నిధులు వస్తాయి. ‘రూసా’అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సహాయ పథకం. దాదాపు ఎలాంటి సహాయం లేనట్టే. పై వాటిని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాలు సవ్యంగా పరిపాలన చేయవలసి ఉంటుంది. విశ్వవిద్యాలయాలకిచ్చే స్వయంప్రతిపత్తి రెండు రకాలు. ఒకటి పాలనా సంబంధమైనది. రెండోది ఆర్థికపరమైనది. ఎన్నడూ లేనిది ఇటీవల ప్రభుత్వ అధికారిని విశ్వవిద్యాలయం ఫైనాన్స్ ఆఫీసరుగా నియమించారు. ఇక మిగిలింది పాలనా స్వయంప్రతిపత్తి. ఇదీ నామమాత్రంగా మారిపోతున్నది. విశ్వవిద్యాలయాలు అధికార పార్టీకి వేదికలుగా మారిపోతున్నాయి. విశ్వవిద్యాలయాలలో జరిగే అన్ని మతాల పండుగలకు స్వయంగా ఉపకులపతి, రిజిస్ట్రార్లు, అధికారులు హాజరవడాన్ని చూస్తూనే ఉన్నాం. తమ రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవడానికి రేపు అన్ని పార్టీలు ప్రయత్నం చేయవచ్చు. ఎనభై దశకంలో మొదలైన ఉదార ఆర్థిక విధానాలు తొంభయ్యవ దశకం వచ్చినప్పటికి పూర్తి రూపాన్ని సంతరించుకున్నాయి. నూతన ఆర్థిక విధానాల ఆధారంగా 1986లో ‘నూతన విద్యా విధానాన్ని’ఆనాటి కేంద్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి 1992లో కార్యాచరణను తయారుచేసి వ్యవస్థాగత సర్దుబాటులో భాగంగా ఉన్నత విద్యలో సరళీకరణ తీసుకొని రావడంతో ప్రైవేటీకరణ మొదలైంది. ఉన్నత విద్యారంగంలో ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పెరిగాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు దారి సుగమమయ్యింది. ప్రపంచ మార్కెట్‌కు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు అందిస్తే సరిపోతుందనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వమిచ్చింది. దీనితో ఉన్నత విద్య మార్కెట్ సరకుగా తయారైంది. పబ్లిక్ రంగంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఆ అవకాశం లేదు. అవి కొన్ని పరిధులలోనే పనిచేయాలి. ఆర్థిక వనరులను తమకు తామే సమీకరించుకొనడంలో ఈ విశ్వ విద్యాలయాలు వెనుకబడి పోతున్నాయి. దీనికితోడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తగ్గిపోతున్నాయి. అరకొర నిధులతో కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిని రాజకీయ నాయకులు ఆసరాగా తీసుకొంటున్నారు. ప్రశ్నించే గొంతులను ‘జాతీ యత’ పేరుతో నొక్కి ఉంచుతున్నారు. మత రాజకీయాలకు అతీతంగా విశ్వవిద్యాలయాలు పనిచేస్తేనే వాటికి భవిష్యత్తు ఉంటుంది. వ్యాసకర్త గౌరవ ఆచార్యులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రొ‘‘ కేపీ సుబ్బారావు మొబైల్ : 99633 66788 -
ఎద్దుల బండిని ఢీ కొని గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: ఎద్దుల బండిని ఢీ కొనడంతో బైక్‌లో వెళ్తున్న సుబ్బారావు గాయ పడ్డాడు. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన సుబ్బారావు కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతను బైక్‌లో గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రాజుపాళెం సమీపంలోకి వెళ్లగానే ప్రమాదవశాత్తు ఎడ్ల బండిని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపు భాగంలో తీవ్ర గాయం కావడంతో బెంగుళూరు లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యుడు సూచించారు. -
బీటెక్ ప్రశ్నాపత్రం లైవ్లీగా ఉంటుందని..!
కాకినాడ: బీటెక్ కంప్యూటర్ సైన్స్ పరీక్షా పత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లు రావడం పొరపాటే అని జేఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సుబ్బారావు ఒప్పుకున్నారు. ఇంత వరకు యూనివర్సిటీ పరిధిలో ఇలాంటి ఘటన జరగలేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై సబ్జెక్టు నిపుణులను వివరణ కోరగా.. పేపర్ లైవ్లీగా ఉంటుందని ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినట్లు తెలిపారని సుబ్బారావు వెల్లడించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు సోమవారం నిర్వహించిన 'మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్'(ఎమ్ఈఎఫ్ఏ) పరీక్షలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను అధికారులు ప్రశ్నపత్రంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో సుబ్బారావు పొరపాటు జరిగిందని తెలిపారు. -
రూ.5 లక్షల నగదు ఆటోలో మరిచిన రియల్టర్
గుంటూరు : రూ. 5 లక్షల నగదు సంచిని ఆటోలో మర్చిపోయాడు సుబ్బారావు అనే రియల్టర్. ఆ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ సదరు నగదు సంచితో ఉడాయించాడు. ఆటోలో నగదు మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చిన సుబ్బారావు వెంటనే మరో వాహనంలో ఆటో కోసం గాలించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
అత్తిలిలో భారీ చోరీ
అత్తిలి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అత్తిలి గ్రామానికి చెందిన బొర్రా సుబ్బారావు అనే ధాన్యం వ్యాపారి ఇంట్లో బుధవారం వేకువజామున దొంగలు పడ్డారు. ప్రధాన ద్వారం ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి రూ.4 లక్షల నగదు, 23 కాసుల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లందరూ మేడ మీద నిద్రిస్తున్నారు. ఉదయం చోరీ జరిగిన విషయం గమనించిన సుబ్బారావు పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. తణుకు సీఐ రాంబాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్రమ్ చెప్పిన కథ
సమాజాన్ని ఎప్పటినుంచో వెంటాడుతున్న ఓ సమస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా కొడాలి సుబ్బారావుతో కలిసి జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు నెలలో విడుదల కానుంది. నిర్మాత కొడాలి సుబ్బారావు మాట్లాడుతూ -‘‘సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల విడుదలను అక్టోబరుకు వాయిదా వేశాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడైన జె.ప్రభాకర్‌రెడ్డి రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. -
ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా
-
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం
-
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం
కృష్ణా జిల్లా పామర్రులో ఉరి వేసుకున్న వ్యక్తి నేతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పెళ్లి రోజునే ఘటన.. నిలకడగా బాధితుడి ఆరోగ్యం పరామర్శించిన సీఎం చంద్రబాబు... బాధితుడి తండ్రితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్ హైదరాబాద్/పామర్రు/పెనమలూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగావకాశాలు దక్కవని భావించిన ఓ వ్యక్తి తన పెళ్లి రోజునే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా పామర్రులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పామర్రు సాయినగర్‌కు చెందిన చావలి సుబ్బారావు(గిరి) భార్య, ఇద్దరు పిల్లలతో తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. తమ డాబాపై ఉన్న పాకలో శనివారం ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన అతడి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి తాడును కోసి కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని తొలుత స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సుబ్బారావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రాంతంలో సూసైడ్ నోట్‌ను కుటుంబసభ్యులు గుర్తించారు. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్... బాధితుడి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి సుబ్బారావును చూస్తానని ఓదార్చారు. హోదా లేదు.. ఉద్యోగం రాదు సుబ్బారావు సూసైడ్ నోట్లోని వివరాలివీ... ‘‘నేను ఎస్ఎస్సీ, ఐటీఐ పూర్తిచేశాను. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)లో శిక్షణ పొందాను. ఉద్యోగం కోసం 18 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్న విషయం నన్ను బాధించింది. ఇక జన్మలో నాకు ఉద్యోగం రాదని అర్థమైంది. ఇటువంటి పరిస్థితులలో ప్రాణ త్యాగమే కచ్చిత నిర్ణయంగా భావించాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక ఆటో లోన్ కూడా తీసుకోలేకపోయా. నా భార్యా పిల్లలకు కూడు పెట్టలేక సంఘంలో ఎలా బతకాలో అర్థంకాక ఆత్మహత్యకు పాల్పడుతున్నా. మూడు నెలలుగా ఆలోచించి నా పెళ్లి రోజున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించున్నా. చంద్రబాబు, జగన్, ఇతర నాయకులు... మీకు వీలుంటే నా కుటుంబాన్ని ఆదుకోండి. డాడ్, మామ్, వైఫ్, డాటర్, సన్.. ఐ మిస్ యూ. బట్ ఆంధ్రా లైక్. ఇప్పటివరకు నాతో కలిసి ఉన్న వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. నిలకడగా సుబ్బారావు ఆరోగ్యం ఆత్మహత్యాయత్నం చేసిన సుబ్బారావు ఆరోగ్యం నిలకడగా ఉందని పెనమలూరు మండలం పోరంకిలోని బొప్పన ఆసుపత్రిలో ఎండీ బొప్పన వెంకటరత్నం తెలిపారు. బాధితుడికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ తీసిన తర్వాత కానీ వివరాలు చెప్పలేమన్నారు. ఆసుపత్రిలో సుబ్బారావు భార్య సుజాత అస్వస్థతకు గురైంది. ఆమెకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో కుప్పకూలింది. ఆమెకు అదే ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలు అధైర్యపడొద్దు: సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలు అధైర్యపడొద్దని, తాను కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసి, బొప్పన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చావలి సుబ్బారావును శనివారం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాపై ప్రగాఢమైన కోరిక ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయం జరగాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే తాను కేంద్రంతో చర్చలు జరుపుతున్నానని చెప్పారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉందని అన్నారు. ఈ నెల 25న ప్రధానమంత్రితో చర్చలు జరుపుతానని వెల్లడించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, తాను ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. ప్రజలు తొందరపాటుతో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, డీజీపీ జె.వి.రాముడు, ఇతర అధికారులు చంద్రబాబు వెంట ఉన్నారు. -
సుబ్బారావుకు చంద్రబాబు పరామర్శ
విజయవాడ : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సుబ్బారావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని శనివారం సాయంత్రం సీఎం చంద్రబాబు పరామర్శించి, ఆరోగ్యంపై ఆరా తీశారు. సుబ్బారావుకు మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. కాగా కృష్ణాజిల్లా పామర్రులో సుబ్బారావు అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని ఉత్తరం రాసి ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. -
'నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి'
కడప : తన కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని నందిని తండ్రి సుబ్బారావు వ్యాఖ్యానించారు. నందిని కాళ్లకి, మంచానికి జానెడు తేడా లేకుండా ఆత్మహత్య ఎలా జరుగుతుందని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు. 'ఆత్మహత్య చేసుకునే సమయంలో పెనుగులాట జరిగి ఉంటే ఆమె కళ్లజోడు కిందపడేది కదా?, ఇంతవరకూ కనీసం మాతో కళాశాల యాజమాన్యం మాట్లాడలేదు? నా కూతురికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదన్నదే నా ఆవేదన' అని సుబ్బారావు కన్నీటిపర్యంతమయ్యారు. కడప శివారులోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా కడపలో ఆర్యవైశ్య సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం డిమాండ్ చేసింది. -
కరెంట్ షాక్‌తో రైతు మృతి
నెల్లూరు : మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాకు తగిలి మృతి చెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎం. సుబ్బారావు (43) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ రోజు తెల్లవారుజామున వేరుశనగ పంటకు నీళ్లు పెట్టడానికి బావి వద్దకు వెళ్లి... మోటర్ స్విచ్ ఆన్ చేశాడు. ఇంతలో కరెంట్ షాక్ తగిలి అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే సుబ్బారావు ఎంతకీ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలం వచ్చారు. బావి వద్ద సుబ్బారావు మృతదేహం పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు హాతాశులయ్యారు. దాంతో మృతదేహన్ని కుటుంబ సభ్యులు స్థానికులు సహాయంతో ఇంటికి చేర్చారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముంబై రైల్వే స్టేషన్ వద్ద చోరీ
-
ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి
ముంబయి : ముంబై రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం దారి దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లా ఆంధ్రాబ్యాంక్ లో పీవోగా పనిచేస్తున్న సుబ్బారావు దోపిడీకి గురయ్యారు. రైల్వే స్టేషన్ కు వస్తున్న ఆయనను దుండగులు చితకబాది అయిదు లక్షల నగదును దోచుకు వెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా సుబ్బారావు సింగరాయకొండకు చెందినవారు. ఆయన వద్ద దుండగులు నగదుతో పాటు విలువైన వస్తువులు దోచుకు వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ముంబయి రైల్వే పోలీసులు చెబుతున్నారు. -
నిను మరువము రాజన్నా..
సాక్షి, కాకినాడ :తమ గుండెగుడిలో కొలువైన వైఎస్సార్‌కు జిల్లావాసులు ఘనంగా నివాళులర్పించారు. దశాబ్దాలు గడిచినా ఆ మహనీయుడిని మరువబోమని నిరూపించారు. ఊరూవాడా ‘వైఎస్సార్ జోహార్’ అంటూ నినదించాయి. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజలు సైతం పార్టీ లు, మతాలకతీతంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమాన నేతకు ఘనంగా నివాళులర్పించారు. శాసన సభలో పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు ముఖ్య నేతలు హైదరాబాద్ పంజగుట్ట సెంటర్లోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలు సేవా కార్యక్రమాలతో వైఎస్‌కు నివాళులర్పించారు. కాకినాడ గొడారిగుంటలోని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహర్షి సాంబమూర్తి వికలాంగ పాఠశాల విద్యార్థులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రపాలెంలో నిరుపేదలకు అన్నదానం చేసి, దుస్తులు పంపిణీ చేశారు. కొవ్వాడ, కొవ్వూరు, రాయుడుపాలెంలలో వృద్ధుల ఆశ్రమాల్లో పండ్లు, పాలు పంపిణీ చేసి, ఆర్థికసాయం అందజేశారు. రాజమండ్రి సిటీలోని కోటగుమ్మం, లాలాచెరువు సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, ఆదిరెడ్డి వాసు తదితరులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాష్ర్ట కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేశారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో పేదలకు వస్త్రదానం చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో అంబాజీపేట సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్ తదితరులు క్షీరాభిషేకం చేశారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు, కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెదపూడిలో సుమారు 10 వేల మందికి అన్నదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో కడియం మండలం బుర్రిలంకలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, ఆర్థికసాయం అందజేశారు. పలుకు ఆశ్రమ పాఠశాలలో బధిరులకు పలకలు, పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జక్కంపూడి రాజా, సుంక ర చిన్ని తదితరులు పాల్గొన్నారు. కోరుకొండలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. జగ్గంపేట సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, ఆస్పతిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.మండపేటలో పార్టీ రైతువిభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, పార్టీ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో అర్తమూరులో వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో పార్టీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సామర్లకోటలోని సిరి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ముమ్మిడివరంలో పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆలమూరులో మహిళా విభాగం మాజీ రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కొత్తపేటలో జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల్లో సైతం వైఎస్సార్ అభిమానులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించడంతో పాటు స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
కవ్వింత: అదే బాపతు
మేనేజరు: రోజూ ఎందుకు ఆఫీసుకు లేటుగా వస్తున్నావు? ఉద్యోగి: నాకు పెళ్లయ్యింది. నాకు వంట వచ్చని మా ఆవిడకు తెలుసు సార్. మేనేజరు: ఓకే గ్రాంటెడ్. టేక్ యువర్ ఓన్ టైం! వాడొక్కడే! సుబ్బారావు: ఎన్నాళ్లకు కలిశావురా? 20 ఏళ్లయ్యింది నిన్ను చూసి...ఎలా ఉన్నావు? ఎంత మంది పిల్లలు? రామారావు: బాగున్నాను. నలుగురు. మొదటి వాడు ఇంజినీరింగ్, రెండో వాడు ఎంసీఏ, మూడోవాడు పీహెచ్డీ చదివారు. సుబ్బారావు: మరి నాలుగో వాడు రామారావు: చదువుకోకుండా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. సుబ్బారావు: మరి ఇంటి పరువు తీస్తుంటే గెంటేయకుండా ఇంట్లో పెట్టుకున్నావా? రామారావు: ఏం చేద్దాం? సంపాదిస్తున్నది వాడొక్కడే ఇపుడు. తాగుబోతు భాష డాక్టరు: తాగుడు మానడానికి మందిచ్చాను కదా, రోజూ వేసుకుంటున్నావా? తాగుబోతు పేషెంటు: అవును డాక్టర్, మూడు పూటలా మూడు పెగ్గులు వేసుకుంటున్నా. బరువైన ప్రశ్న బుజ్జిగాడు: నాన్నా నాకు సైకిల్ కొనివ్వవా? నాన్న: సైకిలంత బరువు లేవు నీకు సైకిల్ కావాలట్రా? బుజ్జిగాడు: మరి నువ్వు కారంత బరువున్నావా? కారు కొనుక్కున్నావు? హోంవర్క్! హోంవర్క్‌లు ఎన్నిరకాలో తెలుసా? రెండు రకాలు- ఒకటి భర్తకు భార్య చెప్పేది, రెండు టీచరు స్టూడెంట్‌కు చెప్పేది. -
రాశి ఫలాలు
ఆగస్టు 3 నుండి 9 వరకు మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. సోదరులు, మిత్రుల సహకారంతో కొన్ని పనులు చక్కదిద్దుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయరంగం వారికి పదవీయోగం. వారం చివరిలో ఆరోగ్యభంగం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పనుల్లో విజయం సాధిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగయత్నాలు ఫలించే సూచనలు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ప్రారంభంలో నెలకొన్న చికాకులు క్రమేపీ తొలగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే సూచనలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) రుణాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనయోగం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్నంతగా లాభాలు రాగలవు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవర్గాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం చివరిలో అనారోగ్యం, బంధువులతో విభేదాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి ఊహించని సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు సహాయం అందిస్తారు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. బంధువులు, మిత్రులతో కొన్ని వివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు, పెరిగే బాధ్యతలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధువులు, మిత్రుల నుంచి మాటసహాయం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. -
సమైక్యంగా ఉందాం.. సమరం చేద్దాం
తాడేపల్లిగూడెం : వ్యాపారులంతా సమైక్యంగా ఉంటూ.. సమస్యల పరి ష్కారం కోసం సమరం సాగించాలని సీమాంధ్రలోని వ్యాపార రంగాని చెందిన ప్రతినిధులు నినదించారు. స్థానిక గమిని ఫంక్షన్ ప్లాజాలో మంగళవారం సీమాంధ్ర ప్రాంత వర్తక సంఘ ప్రతిని ధుల సమావేశం తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ మిల్లర్స్ అధ్యక్షుడు గమిని సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించి, నాన్‌బెయిలబుల్ సెక్షన్ చొప్పిస్తే వ్యాపారులంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి సెక్షన్ల వల్ల చాలామంది ఆస్తులు కోల్పోయి, అనారోగ్యం పాలయ్యూరని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నాన్‌బెయిలబుల్ సెక్షన్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయూలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ చాంబర్ ఆఫ్ మర్చంట్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ వ్యాపారాలకు దశ, దిశ లేకపోవడంతో చాలా నష్టం జరిగిందన్నారు. అంతా కలసి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేశామని, రాష్ట్రం విడిపోవడంతో రాత్రికి రాత్రే వ్యాపారాలను వదిలేసి సొంత జిల్లాలకు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోధుమ ఆధారిత పరిశ్రమలు తెలంగాణలో ఉండిపోవడం వల్ల ఆ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చుకోవడానికి వ్యాట్, సీఎస్టీ చెల్లించాల్సి వస్తుందన్నారు. రోజువారీ అవసరాల కోసం తెలంగాణలోని 39 మిల్లుల నుంచి 1,260 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. పంచదారపై ఏ రాష్ట్రంలోనూ వ్యాట్ లేదని, మన రాష్ట్రంలో మాత్రం వసూలు చేస్తున్నారని తెలి పారు. చాలా సరుకులను ఇక్కడ వ్యాట్ పరిధిలోకి తీసుకెళ్లారన్నారు. ఇవి చాలవన్నట్టుగా నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి ఉల్లిపాయలు, బంగాళా దుంపలను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో సిద్ధం చేసిందని, అది ఎప్పుడైనా బయటకు రావచ్చని అన్నారు. నిత్యావసర సరుకుల చట్టంలో నాన్‌బెరుులబుల్ సెక్షన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని, దీనిని అడ్డుకునేందుకు వ్యాపారులంతా సమైక్యంగా పోరాడాలన్నారు. ఇలాం టి జీవోలు వస్తే అధికారులు తీసుకునే మామూళ్లను పెంచేసి వేధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయూలపై సీమాంధ్రలోని అన్ని జిల్లాల వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు. భీమవరం వర్తక సంఘ ప్రతినిధి సభాపతి, అత్తిలి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం వ్యాపార వర్గ ప్రతినిధి కర్పూరం నారాయణరావు, తణుకు చాంబర్ ప్రతినిధి గమిని రాజా, తాడేపల్లిగూడెం చాంబర్ కార్యదర్శి నరిశే సోమేశ్వరరావు, వివిధ జిల్లాల వ్యాపార సంఘాల ప్రతినిధులు నాన్ బెయిలబుల్ సెక్షన్‌ను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని నిరసించారు. వ్యాపారుల్ని సంప్రదించాలి వ్యాపారాలకు సంబంధించి చట్టా లు చేసే సమయంలో ప్రభుత్వం ఆయా విభాగాల వారితో సంప్రదించాలి. భయంకర యాక్టులు వ్యాపారులపై రుద్దకండి. పన్నులు చెల్లించకుంటే ఖజానా ఎలా నిండుతుందని అడుగవద్దు. వ్యాపారుల నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తుందో చెప్పండి. ఈసీ యాక్టులో నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే వ్యాపారులకు వేధింపులు, అధికారులకు ఆదాయం పెంపుదల తప్ప వేరే ప్రయోజనం ఉండదు. - కొప్పు సత్యనారాయణ, పాలకొల్లు భారాలు మాపై మోపుతారా ప్రజలకు అవి ఉచితంగా ఇస్తాం.. ఇవి ఉచితంగా ఇస్తాం అని హామీలు ఇస్తారు. ఆ భారం మోయడానికి వ్యాపారులే ప్రభుత్వానికి కనిపిస్తున్నారు. రెవెన్యూ లోటు పూడాలంటే వ్యాపారులే దొరికారా. జంబ్లింగ్ తనిఖీల పేరిట వ్యాపారులను భయాందోళనలకు గురి చేయవద్దు. ఈసీ యాక్టులో నాన్ బెయిలబుల్ సెక్షన్ వద్దే వద్దు. - కాగిత వెంకటరమణారావు, ప్రధాన కార్యదర్శి, జిల్లా వర్తక, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య -
పోరుునోళ్లకు పింఛన్.. బతికున్నోళ్లకు టెన్షన్
తాడేపల్లిగూడెం : చుక్కా అచ్చయ్య చనిపోయి 24 నెలలు కావస్తోంది. ఇనుగంటి వెంకటేశ్వర్రావు పరమపదించి 13 నెలలు అవుతోంది. చిన్ని నూకాలమ్మ పెదకార్యం జరిగి ఎనిమిది నెలలైంది. అయినా వారందరికీ క్రమం తప్పకుండా పింఛన్ వస్తోంది. కట్టా సుబ్బారావు కుష్టు వ్యాధిబారిన పడటంతో అతడి పదివేళ్లు దెబ్బతిన్నాయి. ఆయనకు వృద్ధాప్య పింఛన్ ఉంది. కానీ.. పింఛను మొత్తం తీసుకోవడానికి ప్రతినెలా ఒక ప్రాంతానికి రిక్షాపై వెళ్లాలి. పింఛన్ సొమ్ములో కొంత మొత్తం రిక్షా వాలాకు ఇవ్వాలి. ఆ బాలుడు మూగ, చెవుడుతో బాధపడుతున్నాడు. చేతివేళ్లు ముడుచుకుపోయూరుు. వేలి ముద్రవేస్తే కాని ఆ బాలుడికి పింఛన్ ఇవ్వనంటారు. ‘ఆధార్ నంబర్ ఉందా.. వేలిముద్ర పడటం లేదు. మళ్లీ రా’ అంటున్నారు. అన్నీ బాగుంటే ‘బ్యాటరీ డౌనయ్యింది. రెండు రోజులు ఆగి రా’ అని పంపేస్తున్నారు. ఇలా పండుటాకుల జీవితాలతో పింఛన్ సొమ్ము పంపిణీ చేసే బాధ్యత చేపట్టిన ఏజెన్సీలు ఆటలాడుకుంటున్నారుు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఠంచనుగా పింఛన్ వచ్చేది. ఇప్పుడు టెన్షన్‌గా తయూరైంది. చనిపోయిన వారి పేర్లను అర్హుల జాబితాంచి తొలగించని అధికారులు, బతికున్న వారిని మాత్రం పదేపదే తిప్పించుకుంటూ వారి ఓపికను పిప్పి చేస్తున్నారు. చేయి ఉండి, దానికి వేళ్లుండి, వేలిముద్రలు మెషిన్లో పడకపోయినా ఆ పాపం వృద్ధులదే అన్నట్టుగా నెలల తరబడి పింఛన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే లబ్డిదారులు అనర్హుల జాబితాలో చేరతారు. తర్వాత పునరుద్ధరణ దేవుడికే ఎరుక. ఇది ఒకరిద్దరు వృద్దుల కష్టం కాదు. జిల్లాలో 70వేల మంది పింఛనుదారులు 90 రోజు లుగా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్నారు. పట్టించుకోని అధికారులు జిల్లాలో అన్నిరకాల పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు 3.60 లక్షల మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలలో మొదటి వారంలో వీరికి ఠంచన్‌గా పింఛన్ అందేది. కేవలం రెండు గంటల వ్యవధిలో నిర్దేశించిన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ చకచకా జరిగిపోయేది. జాబితా ఆధారంగా సొమ్ములు పంపిణీ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ కార్డులు అన్నారు. వీటివల్ల కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తిం చి తపాలా శాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ప్రాంతాల వారీగా కొన్ని బ్యాంకులకు వీటి పంపిణీ బాధ్యతను అప్పగించారు. బ్యాంకులు మణిపాల్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించాయి. వీటి ఆధ్వర్యంలో పంపిణీ తంతు హైడ్రామాగా సాగుతోంది. విషయ పరిజ్ఞానం తక్కువగా ఉన్న సిబ్బంది వృద్ధులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి జేబులోని సొమ్ము ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలుగా పింఛన్ సరిగా అందక లబ్దిదారులు చాలాపాట్లు పడుతున్నారు. ఇచ్చే రెండొందల కోసం నెలలో పది రోజు లకు పైగా ఆయా ప్రాంతాల వద్ద పడిగాపులు పడుతున్నారు. పంపిణీ వ్యవహారం అంతా దైవాధీనం సర్వీసులా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పెంచుతారా.. ముంచుతారా అక్టోబర్ నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. అరుుతే, దీనికి ముందుగానే లబ్ధిదారుల సంఖ్యను కుదించాలంటూ అధికారులకు ఆదేశాలు అందారుు. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా వేలి ముద్రలు పడటం లేదు, ఆధార్ నంబర్ లేదని, బ్యాటరీ డౌన్ అరుు్యందని, సాంకేతిక సమస్య వచ్చిందంటూ లబ్ధిదారులను మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇలా మూడు నెలలు తిప్పించుకున్నాక పింఛన్ రద్దరుు్యందని చెప్పి చేతులు దులుపేసుకునే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
యువకుడి దారుణహత్య
వివాహేతర సంబంధమే కారణం నిందితుల్లో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు మహిళలు ! నిందితులపై దాడికి యత్నం రోడ్డుపై బైఠాయించిన ప్రజలు కోట: ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన చిట్టేడు పంచాయతీలోని మైక్రోటవర్ కాలనీలో కలకలం సృష్టించింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, తర్వాత హత్యగా తేలడంతో పలు గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం మేరకు..ఊనుగుంటపాళెం మాజీ సర్పంచ్ గడ్డం మస్తానయ్య, వజ్రమ్మల కుమారుడు సుబ్బారావు(19). ఆటో తోలుకుని జీవనం సాగిస్తున్నాడు. మైక్రో టవర్ కాలనీలో దుకాణం నిర్వహిస్తున్న ఓ యువతితో సుబ్బారావు కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నాడు. మరోవైపు కోట హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్‌తో పాటు పలువురు హోంగార్డులు ఆ యువతి ఇంటికి తరచూ వచ్చివెళ్లేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుబ్బారావు ఫోన్ నుంచి ఆ యువతి అతని స్నేహితుడికి ఫోన్ చేసి తన ఇంటి వద్ద గొడవ జరుగుతోందని, వచ్చి ఆయనను తీసుకెళ్లాలని కోరింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు వచ్చేసరికి యువతి ఇంటి సమీపంలోని ఓ పూరి గుడిసెలో సుబ్బారావు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉరికి వేలాడదీశారని తల్లిదండ్రులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన ప్రజలు యువకుడి హత్య విషయం తెలుసుకున్న ఊనుగుంటపాళెం, చిట్టేడువాసులు సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. మైక్రోటవర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు తెలిపినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సుమారు 500 మంది రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఉదయం సంఘటన స్థలంలో తిరుగుతున్న హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్‌ను కోట ఎస్సై పంపించేశాడని ఆరోపించారు. అత నిని తీసుకువస్తే తప్ప నిరసన విరమింపబోమని స్పష్టం చేశారు. సీఐ కరుణాకర్, కోట మండలాధ్యక్షుడు నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి నచ్చజెప్పినా శాంతించలేదు. హెడ్‌కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ఉదయం సంఘటన స్థలంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ జనం పెరుగుతుండడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం పూటుగా మద్యం తాగి చిట్టేడు సమీపంలోని తెలుగుగంగ కాలువ గట్టుపై తిరుగుతుండగా మృతుడి బంధువులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు ఎస్సైలు హెడ్‌కానిస్టేబుల్‌కు రక్షణగా నిలిచారు. ఆయనను తమకు అప్పగించాలని ఆందోళన ఉధృతం చేయడంతో సమాచారం అందుకున్న డీఎస్పీ చౌడేశ్వరి సంఘటన స్థలాని కి చేరుకున్నారు. ఆమె నచ్చజెప్పినా జనం శాం తించలేదు. కొందరు మహిళలు దాడికి దిగడం తో పోలీసు రక్షణ మధ్య జీపులో కూర్చోబెట్టా రు. మృతుడి తండ్రి ఫిర్యాదు ఫిర్యాదు మేరకు మహమ్మద్, ఆ యువతితోపాటు ఆమె తల్లిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. హత్య అని తెలిసిందిలా.. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు నెల్లూరు నుంచి క్లూస్‌టీం, జాగిలంను పిలిపించారు. జాగిలం లక్కీ మృతదేహం ఉన్న గుడిసెలో నుంచి నేరుగా యువతి ఇంటి వద్ద ఆగింది. అనంతరం తలుపులు తెరవగానే ఇంట్లో కలియదిరిగి మళ్లీ సంఘటన స్థలానికి చేరుకుంది. మధ్యలో హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ మోటారు బైక్ వద్ద ఆగింది. దీంతో అనుమానాలు బలపడ్డాయి. ఇంతలో యువతి తో సన్నిహితంగా మెలిగే సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడినట్లు తెలిసింది. ఆదివారం సురేఖ ఇంటికి వచ్చిన సుబ్బారావు అప్పటికే అక్కడ హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ ఉండడంతో ఆమెతో గొడవపడ్డాడు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో సుబ్బరావు ఆమె ఇంటికి వచ్చాడు. మద్యం తాగి అక్కడే నిద్రపోయాడు. అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ అక్కడకు చేరుకున్నాడు. అక్కడే నిద్రపోతున్న సుజాతను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. తెల్లవారుజామున సురేఖ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో సుజాత బావి చాటున చేరి గమనించింది. మహమ్మద్‌పై దాడిచేసిన సుబ్బారావు పారిపోతుండగా ఆయనతో పాటు సురేఖ, రమణమ్మ వెంటపడ్డారు. సమీపంలోని జామాయిల్ తోటలో పట్టుకుని విచక్షణ రహితంగా కొట్టారు. ముగ్గురూ కలిసి సమీపంలోని గుడిసెలోకి తీసుకెళ్లి చీరతో ఉరివేసినట్లు సుజా త పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. -
బిక్కుబిక్కుమంటూ..
ఇరగవరం/తణుకు రూరల్ : ఇరాక్‌లో అంతర్యుద్ధంతో అక్కడ ఉన్న జిల్లావాసులు అవస్థలు పడుతున్నట్టు సమాచారం. తినేం దుకు తిండి లేక.. కనీసం తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్టు ఇరాక్ బాధితులు ఫోన్ ద్వారా ఇక్కడ వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. ఇరగవరం మండలంలోని తూర్పు విప్పర్రు నుంచి ఐదు నెలల క్రితం పలువురు యువకులు ఇరాక్ పయనమయ్యారు. వారంతా అక్కడ నరకయాతన అనుభవించడంతో కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను స్వగ్రామాలకు రప్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన కొండేటి సుబ్బారావు, లక్ష్మి దంపతుల కుమారుడు పద్మారావు, అడ్డాల రాంబాబు, వెంకటలక్ష్మిల కుమారుడు నరేష్ గత జనవరిలో ఇరాక్‌లోని భాష్రా యూనివర్సిటీలో లేబర్ పని కోసం వెళ్లారు. వీరితో పాటు మరిం త మంది తెలుగువాళ్లు అక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం. చర్యలు తీసుకున్నాం.. అధైర్యపడొద్దు తణుకు : ఇరాక్‌లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ద్వారా ఢిల్లీలోని ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినట్టు పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలు అధైర్యపడవద్దని తెలిపారు. దువ్వవాసులు 15 మంది.. ఇరాక్ లో చిక్కుకున్న జిల్లావాసుల్లో తణుకు మండలానికి చెందిన దువ్వ గ్రామస్తులు 15 మంది ఉన్నారు. వీరంతా ఐదు నెలల క్రితం రూ. లక్ష వరకు ఖర్చుచేసి ఇరాక్‌లో జీవనోపాధి కోసం వెళ్లారు. ఇరాక్‌లో అంతర్యుద్ధంతో వీరి పాస్‌పోర్టులు అక్కడ ఏజెంట్లు తీసుకోవడంతో ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి దుర్గారావు, వెలగన శ్రీనివాస్, తూము అర్జున్, శ్రీరాములు గంగయ్య, రాయుడు శ్రీను, రాయుడు అంజి, రాయుడు గోపాల కృష్ణ, కాపకాయల రామకృష్ణ, బందెల కోటేశ్వరరావు, దైబాల గోపాలం, కోటిపల్లి నరశింహమూర్తి, గుత్తికొండ వెంకటేశ్వరరావు, గరగ సాయి, గరగ గోపాలకృష్ణ ఇరాక్‌లో చిక్కుకున్న వారిలో ఉన్నారు. పది రోజుల నుంచి తమ బిడ్డ ఫోన్ కూడా చేయడం లేదని గుత్తికొండ వెంకటేశ్వరరావు తండ్రి ధనరాముడు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డలను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి బాధితుల కుటుంబసభ్యులు వేడుకున్నారు. -
రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు
నల్లజర్ల రూరల్ : ఫోర్జరీ డాక్యుమెంట్లకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారంలో నల్లజర్ల తహసిల్దార్‌గా పనిచేసిన డీవీ సుబ్బారావు, వీఆర్వోలు అద్దంకి వరప్రసాద్, ఆర్ వీ శ్రీనివాస్‌లకు ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం గుండేపల్లిలో 2013 ఫిబ్రవరిలో కొంతమంది రైతుల భూము లు వారికి తెలియకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలతో వేరొకరికి రిజిస్ట్రేషన్ అయిపోయూయి. ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు భూసేకరణ సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది మే 23వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అప్పటి తహసిల్దార్ కె.పోసియ్య, ఆర్ఐ పోతురాజు విచారణ చేశారు. కొత్త వ్యక్తుల పేర్లతో వెలుగులోకి.. ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం సేకరించిన భూములపై గెజిట్ పబ్లికేషన్ జాబి తాలో కొత్త వ్యక్తుల పేర్లు ఉండటంతో అసలు రైతులు ఆరా తీశారు. ఆర్ఎస్ నంబరు 351బై1ఎలో రైతులు ఆలపాటి శివరామకృష్ణ, అయినాల రాజారావులకు చెందిన 4.35 సెంట్లు భూమిని అదే గ్రామానికి చెందిన ఎటువంటి భూములు లేని ఈదరాడ రామబ్రహ్మం, జొన్న వెంకటేశ్వరరావు పేరిట ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు సృష్టించి వారితోనే ఆరెళ్ళ రం గారావు, కంకటాల భూషణరావు పేర రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూములు కోల్పోయిన నిర్వాసితుల జాబితాలో వీరి పేర్లే ఉండడంతో దానిపై మార్చి 3న రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. విచారణలో ఈ విషయాలన్నీ నిజమని వెల్లడయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో రికార్డులను తారుమారు చేసిన అప్పటి వీఆర్వో అద్దంకి వరప్రసాద్, మరో వీఆర్వో ఆర్వీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఒక్కొక్కటిగా.. మండల రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారుు. ఆర్ఎస్ నంబరు 84లో మందపాటి వెంకట్రామయ్య, దొడ్డిపట్ల వీరయ్య, మాండ్రాజు వెంకన్న, పెనుమత్స బద్రా యమ్మలకు చెందిన 6 ఎకరాల భూమి కూడా అన్యాక్రాంతమైనట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందారుు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. విచారణలో వెల్లడైన విషయాలను ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని, ఫోర్జరీ పాస్ పుస్తకాలు రద్దు చేస్తామని విచారణ అధికారి కె.పోసియ్య అప్పట్లో ప్రకటించారు. -
యువకుడి దారుణ హత్య
ఈనెల 11న తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు గోనె సంచిలో మృతదేహం లభ్యం జి.మాడుగుల: ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై తేలాడు. నుర్మతి గెడ్డ వద్ద గోనె సంచిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నుర్మతి పంచాయతీ మద్దివీధి గ్రామానికి చెందిన గొల్లోరి సుబ్బారావు(30)ను ఈ నెల 11వ తేదీన ఎన్.కొత్తూరు గ్రామానికి ఇద్దరు వ్యక్తులు బయటకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కనిపించలేదు. ఆదివారం సాయంత్రం నుర్మతి గెడ్డ వద్ద గోనె సంచిలో సుబ్బారావు మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన కొంతమందితో సుబ్బారావుకు పాత కక్షలున్నాయని, వారే హత్య చేశారని మృతుడు తమ్ముడు గొల్లోరి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతొద్దు గురూ!
ఫన్ లింగారావుకు ఒక గట్టి నమ్మకం... తాను ఈ ప్రపంచంలో ఎవరినైనా తేలికగా మోసం చేయగలనని. ఒకరోజు పేపర్లో డాక్టర్ సుబ్బారావు ప్రకటన చేశాడు. అందులో ఇలా ఉంది:‘ఎలాంటి జబ్బుకైనా మెరుగైన చికిత్స ఇవ్వబడుతుంది. ఒకవేళ జబ్బు నయం కాకపోతే మీ ఫీజు 300లు తిరిగి ఇవ్వడంతో పాటు 1000 రూపాయలు ఇవ్వబడుతుంది’ డాక్టర్ సుబ్బారావును మోసం చేసి 1000 రూపాయలు కొట్టేయాలనుకున్నాడు లింగారావు. సుబ్బారావు ఆస్పత్రికి వెళ్లి ‘‘సార్... నా నాలుక ఏ రుచినీ గుర్తించడం లేదు’’ అన్నాడు. ‘‘బాక్స్ నంబర్ 22 నుంచి మెడిసిన్ డ్రాప్స్ పట్టుకు రా’’ అని నర్స్‌కు చెప్పాడు డాక్టర్ సుబ్బారావు. నర్స్ ఆ మెడిసిన్ తెచ్చి నాలుగైదు చుక్కలు లింగారావు నాలుక మీద వేసింది. ‘‘ఛీ...ఛీ... ఇవి పేడనీళ్లు’’ అని అరిచాడు లింగారావు. ‘‘కంగ్రాచ్యులేషన్స్... మీ నాలుకకు రుచులను గుర్తు పట్టే శక్తి వచ్చింది’’ అన్నాడు డాక్టర్. 300 రూపాయలు కోల్పోయినందుకు తెగ బాధ పడిపోయాడు లింగారావు. ఈసారి ఎలాగైనా డాక్టర్‌ను మోసం చేయాలని రెండు వారాల తరువాత ఆస్పత్రికి వచ్చాడు లింగారావు. లింగారావు: డాక్టర్ నేను పూర్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోయాను. డాక్టర్: బాక్స్ నెంబర్ 22 నుంచి మెడిసిన్ తెచ్చి ఇవ్వు. లింగారావు: డాక్టర్.. నా నాలుకకు ఎలాంటి సమస్యా లేదు. సమస్య నా జ్ఞాపకశక్తి గురించే! డాక్టర్: కంగ్రాచ్యులేషన్. మీ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది! -
చదివింది బీటెక్.. చేసేది గంజాయి వ్యాపారం
నాగోలు,న్యూస్‌లైన్: చదువు మధ్యలో ఆపేసి గంజాయికి అలవాటుపడి..చివరకు గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ సీతారాం కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కంచర్ల రాకేష్ అలియాస్ సుబ్బారావు (22) బీటెక్ తృతీయ సంవత్సరం చదివి మధ్యలోనే ఆపేసి ఎల్బీనగర్లో పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. రాకేష్ కళాశాలలో చదివేప్పుడు స్నేహితుల ద్వారా గంజాయికి అలవాటుపడ్డాడు. అది ఎక్కడ్నుంచి సరఫరావుతుందో తెలుసుకుని తానే గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పాన్‌షాప్ ద్వారా యువతను పరిచయం చేసుకుని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, ధూల్‌పేట నుంచి గంజాయిని తెచ్చుకుని విక్రయిస్తున్నాడు. సమాచారమందుకున్న ఎస్ఐ అవినాష్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి మంగళవారం రాకేష్ గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అతడివద్ద 20 ప్యాకెట్లలో ఉన్న 900 గ్రాముల గంజాయి, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.100 గ్రాములు గంజాయి ప్యాకెట్ రూ.300, 50 గ్రాముల ప్యాకెట్ రూ.200ల చొప్పున విక్రయిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, డీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అవినాష్‌బాబు తదితరులున్నారు. -
బరిలోకి దిగితే బంగారు పతకమే
బరిలోకి దిగితే బంగారు పతకమే! గుంటూరు స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ట్రాక్‌లో అడుగుపెడితే బంగారు పతకాన్ని సాధించడం ఖాయం. ఆ పసిడి పతకాల విజయపరంపరే ఆయన ఇంటిపేరును సైతం గోల్డ్‌గా మార్చేసింది. ఆయనే గుంటూరుకు చెందిన వెటరన్ అథ్లెట్ తోట సుబ్బారావు అలియాస్ గోల్డ్ సుబ్బారావు. గుడికి వెళ్లడం కంటే గ్రౌండ్‌కు వెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటున్న సుబ్బారావు విజయగాథ ఇదీ... మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన తోట సుబ్బారావు అమినాబాద్లోని స్కూల్లో విద్యనభ్యసిస్తూ అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందారు. స్కూల్ స్థాయి టోర్నమెంట్లో రెండు రజత, ఒక కాంశ్య పతకాలు సాధించడంతోపాటు స్కూల్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పేదరికం వల్ల పదో తరగతితో చదువు ఆపేసి, ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే పేరేచర్లలోని ఎస్‌జీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో సాధన కొనసాగిస్తూ అనేక పతకాలు సాధించారు. ఇటీవల గుంటూరులో స్థిరపడ్డాక స్థానిక ఎన్టీఆర్‌స్టేడియంలో సాధన కొనసాగిస్తున్నారు. సీనియర్ వెటరన్ క్రీడాకారుడు సత్యనారాయణరెడ్డి ప్రొత్సాహంతో 2005 నుంచి రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లలో పాల్గొని 21 బంగారు, ఏడు రజత, ఒక కాంశ్య పతకాలు ఆయన సాధించారు. జాతీయ స్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఒక బంగారు, ఒక కాంస్య పతకాన్ని కైవశం చేసుకున్నారు. వెటరన్ విభాగంలో 200, 400, 800 మీటర్ల పరుగు పందెంలో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈపూరులో జరిగే జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని మరికొన్ని పతకాలు తన ఖాతాలోకి వేసుకొనేందుకు కఠోర సాధన చేస్తున్నారు. ఇదీ ఆశయం.. జయ్‌పూర్‌లో జరిగే జాతీయ స్థాయి వెటరన్ టోర్నమెంట్లో బంగారు పతకాలు సాధించేందుకు నిరంతరం సాధన చేస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కనబర్చిన అండర్-14, 16 విభాగాల్లో 20 మంది అథ్లెట్సిను దత్తత తీసుకుని వారికి అవసరమైన పౌష్టికాహారం, క్రీడా దుస్తులు అందించి, అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది జిల్లాను అథ్లెటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలపాలన్నదే నా ఆశయం. దీనికి త్వరలో శ్రీకారం చుడతాను. - తోట సుబ్బారావు -
విద్యార్థులకు ప్రేమతో బోధించండి
నల్లజర్ల, న్యూస్‌లైన్ : విద్యార్థులనుభయంతో కాకుండా ప్రేమతో చేరదీసి విద్యాబుద్ధులు నేర్పితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. శనివారం నల్లజర్ల ఏకేఆర్జీ కళాశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై డివిజన్లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతిని తరిమి కొడదాం అంటూనే కొందరు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్యను బోధించాలని ఆదేశించారు. నిర్ధిష్ట ప్రణాళికలు తయారు చేసుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు అంటే రిజల్ట్ కాదని, ఉత్తమంగా బోధించడమని కలెక్టర్ చెప్పారు. డీఈవో నరసింహారావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి డీవైఈవో తిరుమలదాస్, తహసిల్ధార్ సుబ్బారావు పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించండి ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. స్థానిక జలభవన్లో శనివారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణ, ఫొటో ఓటరు గుర్తింపుకార్డుల జారీ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు ఈ నెల 25 జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఫొటో ఓటరు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఇఆర్వోలు వై.రామకృష్ణ, నాగరాజువర్మ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నక్సలైట్ల అరెస్టు
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : నగరాల్లో ప్రముఖ వ్యక్తులను నక్సలైట్లమని బెదిరించి, లక్షల రూపాయలను వసూలు చేసిన, పాత నేరస్తులైన ముగ్గురు నకిలీ నక్సలైట్లను రాజమండ్రి అర్బన్‌జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, 4 సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, రూ.2.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతానికి చెంది న పాత నేరస్తుడు మొహమ్మద్ రఫీవుద్దీన్ అలియా స్ జాకిర్, అతడి రెండో భార్య జమీదున్నీసాబేగం అలియాస్ షకీలా సోహానీ తాము నక్సలైట్లమని ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేస్తుం టారు. ఇంటర్ చదివిన జాకిర్ 1993 నుంచి 1999 వరకు గల్ఫ్, రియాద్, 2001 నుంచి దుబాయ్‌లోను పనిచేశాడు. 2006-07లో కరీంనగర్ జిల్లాలో హా ర్వెస్ట్ ట్రాక్టర్ కొని, వ్యవసాయ పనులకు అద్దెకివ్వడంతో నష్టం వచ్చింది. తన సహచరులతో కలిసి నక్సలైట్లుగా బెదిరించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. ఇందుకు డాక్టర్లు, వ్యాపారులు, సంపన్నుల ఫోన్ నంబర్లు సేకరించారు. నకిలీ అడ్రస్సులతో సిమ్‌కార్డులు తీసుకున్నారు. 2008 నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ సిటీ, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేశారు. కొన్ని కేసుల్లో పట్టుబడి జైలుకు కూడా వెళ్లారు. మరో నిందితుడు మొహమ్మద్ అన్వర్‌షరీఫ్ మాత్రం కాబోయే అల్లుడు కావడంతో మొదటిసారిగా వీరితో కలి శాడు. ఈ నెల 16న రాజమండ్రికి చెందిన బిల్డర్ మన్యం ఫణికుమార్‌కు జాకిర్, షకీలా సోహానీ, అన్వర్‌షరీఫ్ కలిసి సుదర్శన్ పేరుతో ఫోన్ చేశారు. నక్సలైట్లమని చెప్పి.. పేలుడు పదార్థాలు కావాలని అతడిని బెదిరించారు. లేనిపక్షంలో రూ.రెండు లక్ష లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఫణికుమార్ రూ.60 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వారి సూచన మేరకు లాలాచెరువు-ఆటోనగర్ మధ్య ఓ ప్రదేశంలో ఆ నగదు పెట్టాడు. రాజమండ్రిలోని ఓ కార్డియాలజిస్ట్ వద్ద రూ.లక్ష, కాకినాడలోని రాచూరి రాఘవేంద్రరావు అనే వ్యక్తి ని బెదిరించి రూ.70 వేలు, విశాఖపట్నంలోని డాక్టర్ కామేశ్వరరావును బెదిరించి రూ.లక్ష కాజేశారు. విశాఖపట్నంలోనే మరో ముగ్గురిని బెదిరించారు. నింది తులు ఈ నెల 17న రాత్రి తునిలో బస చేసి, 18న ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు. విజయవాడ వరకు వెళ్లిన తర్వాత రాజమండ్రికి చెందిన బి ల్డర్ ఫణికుమార్‌కు ఫోన్ చేశారు. రూ.రెండు లక్షలు అడిగితే రూ.60 వేలే ఇచ్చావని, మిగిలిన సొమ్ము ఇవ్వాలని బెదిరించారు. దీంతో రూ.40 వేలు ఇచ్చేందుకు ఫణికుమార్ ఒప్పుకున్నాడు. ఈ క్రమం లో నిందితులు రాజమండ్రి వచ్చారు. ఈ మేరకు ఫణికుమార్ స్థానిక ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు కేసు నమోదు చేశారు. అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్ మూర్తి పర్యవేక్షణలో క్రైం డీఎస్పీ పి.ఉమాపతివర్మ, తూర్పు మండల డీఎస్పీ ఆర్.సత్యానందం,ప్రకాష్‌నగర్, కడియం,క్రైం ఇన్స్పెక్టర్లు సుబ్బారావు, కె.వరప్రసాద్, జి.కెనెడీ, ఎస్.గంగరాజు వలపన్నారు. రూ.40 వేలు తీసుకునేందుకు రావాలని ఫణికుమార్ చెప్పగా, ఆటోనగర్-లాలాచెరువుల మధ్య డబ్బు పెట్టాలని జాకిర్ సూచించాడు. నిందితులు కారులో దివాన్‌చెరువు రోడ్డులోకి రాగానే, పోలీసులను గమనించి కోరుకొండలోని ఖాళీ ప్రదేశంలో కారు విడిచి పరారయ్యారు. ఆదివారం రాజమండ్రిలోని ఓ వైద్యుడిని బెదిరించేందుకు వచ్చిన ముగ్గురు నిందితులను ప్రకాష్‌నగర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అరెస్టు చేశారు. వీరు విడిచిపెట్టిన కారులో రూ.2.70 లక్షలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ రవికుమార్ మూర్తి రివార్డులు ప్రకటిం చారు. -
ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి శరాఘాతంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించి, డీఆర్సీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి టి.జి.వెంకటేష్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి బయటకు రాకపోవడంతో వినతిపత్రాన్ని ఆయన కారుకు అంటించారు. డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోహరించిన పోలీసులుకు నిరసనకారులకు మధ్య తోపులాట జరగగా కొందరు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు మన్నవ సుబ్బారావు, శనక్కాయల అరుణ, జియావుద్దీన్, మల్లి తదితర నాయకులను అరెస్టు చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్ ముందు బైటాయించి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరుణ మాట్లాడుతూ నీటి పారుదల నిపుణులు చేసిన సూచనలు, ప్రతిపక్షాల ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ ఫిరోజ్, రావిపాటి సాయికృష్ణ, సిహెచ్. ఏడుకొండలు, షేక్ లాల్‌వజీర్, కసుకుర్తి హనుమంతరావు, గని, వి.హర్షవర్ధన్, కె.నాగేశ్వరరావు, సిహెచ్ చిట్టిబాబు, ఎస్ఎస్పి జాదా, పి.థామస్, ఎస్.కిరణ్, ఈర్ల గురవయ్య, కె.మాలకొండయ్య, బి.సాయి, జి.దయారత్నం, ఎం.లక్ష్మీనారాయణ, ఎన్.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.