
ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి
ముంబయి : ముంబై రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం దారి దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లా ఆంధ్రాబ్యాంక్ లో పీవోగా పనిచేస్తున్న సుబ్బారావు దోపిడీకి గురయ్యారు. రైల్వే స్టేషన్ కు వస్తున్న ఆయనను దుండగులు చితకబాది అయిదు లక్షల నగదును దోచుకు వెళ్లారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా సుబ్బారావు సింగరాయకొండకు చెందినవారు. ఆయన వద్ద దుండగులు నగదుతో పాటు విలువైన వస్తువులు దోచుకు వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ముంబయి రైల్వే పోలీసులు చెబుతున్నారు.