looty
-
PM Narendra Modi: లూటీ లైసెన్స్ రద్దు చేశా
రాయ్‌పూర్/జగ్దల్పూర్/చంద్రాపూర్: దశాబ్దాలు గా పేదల అవసరాలు, వారి బాధలు అవినీతి కాంగ్రెస్‌కు పట్టలేదని ప్రధాని మోదీ విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఛోటే అంబాల్ గ్రామంలో సోమవారం బీజేపీ ‘విజయ్ సంకల్ప్ శంఖనాదం’ ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో అవినీతిని దేశ గుర్తింపుగా మార్చేశాయి. అధికారంలో ఉండటమంటే లూటీ చేయడానికి లైసెన్స్ సంపాదించినట్లుగా కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి పేదల బాధను కాంగ్రెస్ ఏనాడూ అర్ధంచేసుకోలేదు. అలాంటి పేదలు కోవిడ్ విలయకాలంలో ఏమైపోతారో అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. వాళ్లకేమీ కాదు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ఆహారధాన్యాలు అందిస్తానని ఆనాడే చెప్పా. మా ప్రభుత్వ కృషి కారణంగానే దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం కోరల నుంచి బయటపడ్డారు’’ అని చెప్పారు. పేదల హక్కులను కాంగ్రెస్ హరించింది ‘‘పేదల హక్కులను అవినీతి కాంగ్రెస్ మింగేసింది. 2014కు ముందు పలు కుంభకోణాలతో లక్షల కోట్ల ప్రజాధనం నొక్కేశారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించే ప్రతి రూపాయిలో లబ్ధిదారునికి కేవలం 15 పైసలే చేరుతున్నాయని స్వయంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీయే ఒప్పుకున్నారు. మిగతా 85 పైసలను ఎవరు కొట్టేశారు?. కాంగ్రెస్ కొనసాగించిన ఈ లూటీ లైసెన్స్ విధానానికి నేనే చరమగీతం పాడా. గత పదేళ్లకాలంలో బీజేపీ సర్కార్ లబ్దిదారుల ఖాతాలకు నేరుగా రూ.34 లక్షల కోట్ల మొత్తాలను బదిలీచేసింది. హస్తిన నుంచి విడుదలైన ప్రతి రూపాయి 100 శాతం పేదల చెంతకు చేరింది. ఇప్పటికీ కాంగ్రెస్సే అధికారంలో ఉండి ఉంటే ఈ రూ.34 లక్షల కోట్లలో 85 పైసలు అంటే రూ.28 లక్షల కోట్ల స్వాహా చేసేవారు’ అని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే కారణం దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాకరకాయతో పోలి్చన ఆయన..నెయ్యిలో వేయించినా, చక్కెర కలిపినా కాకర రుచి మాత్రం మారదన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సోమవా రం ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఆయన స్థిరత్వానికి, అస్థిరతకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేందుకే ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకుంటున్నాయన్నారు. -
పగలు భక్తి, రాత్రి లూటీ
యశవంతపుర: కలబురిగి నగరంలో దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు దొంగలకి గాయాలయ్యాయి. వివరాలు... మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా తుళజాపూర్ తాలూకా ఝళకోళ గ్రామానికి చెందిన ముఠా దేవుని విగ్రహాల బండితో తిరుగుతూ డబ్బులు సేకరించేవారు. రాత్రి సమయంలో దోపిడీలు చేసేవారు. ఇటీవల కలబురిగి నగరంలో ఇళ్లు చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ప్రజలు, పోలీసులకు తలనొప్పిగా మారింది. దుండగులు పగటిపూట దేవుని బండిని ఊరంతా తిప్పి తాళం వేసిన ఇళ్లు, ధనవంతుల నివాసాలను గుర్తుంచుకునేవారు. రాత్రి కాగానే లూటీ చేస్తుండేవారు. అర్ధరాత్రి దోపిడీకి యత్నం... మంగళవారం అర్ధరాత్రి బిద్దాపూర కాలనీలో దోపిడి చేయటానికీ చొరబడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటాడారు. దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో సీఐ పండిత్ సాగర్, పోలీసులు కాల్పులు జరిపారు. లవ, దేవిదాస్ అనే ఇద్దరు నిందితులకు తూటాలు తగిలి కిందపడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. (చదవండి: కి‘లేడీ’లు.. క్లోజ్‌గా మాట్లాడి హానీట్రాప్ చేసి ఆ తర్వాత..) -
ఊరికి పోతే... జేబుకు వాతే!
సాక్షి హైదరాబాద్: ఏటా అదే తంతు. అదే దోపిడీ. పండగొచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు లూటీ. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు సంక్రాంతి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేసి ‘పండగ’ చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. చార్జీలను పెంచొద్దంటూ ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. ఆన్లైన్లో ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. అయినప్పటికీ రవాణా అధికారులు మొక్కుబడి తనిఖీలకు పరిమితమవుతున్నారు. అడ్డగోలుగా.. ఈ నెల 8 నుంచి 16 వరకు పిల్లలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఏపీలో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సొంత ఊరుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్‌లోనూ ముందస్తు బుకింగ్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు సాధారణ రోజుల్లో రూ.900 వరకు ఉంటే ఇప్పుడు రూ.1600పైనే తీసుకుంటున్నారని కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సొంతంగా కారు బుక్ చేసుకొని వెళ్లాలన్నా, కొంతమంది ప్రయాణికులు మినీ బస్సు బుక్ చేసుకోవాలనుకున్నా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. ‘సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరెళ్లాలని ఉంది. కానీ నలుగురం వెళ్లి, తిరిగి రావడానికి చార్జీలే రూ.10 వేలు దాటేటట్లుంది’ అని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ 4,318 అదనపు బస్సులు.. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 550 బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ఇవి నడుస్తాయి. -
మరీ ఇంత మోసమా! స్నేహితుడే కదా అని నమ్మి ఇంట్లోకి రమ్మంటే..
బంజారాహిల్స్: స్నేహితుడని నమ్మి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడో నమ్మకద్రోహి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ సమీపంలోని రహమ్మత్‌నగర్‌లో నివాసం ఉండే పోతాల కుమార్‌కు తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు తిప్పన షాలేమ్‌రాజ్ ఈ నెల రెండో వారంలో ఫోన్ చేసి తాను వారం రోజుల్లో గది అద్దెకు తీసుకుంటానని... అప్పటి వరకు ఇంట్లో ఉంటానంటూ కోరాడు. (చదవండి: రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో ఎక్కడుంది?) ఇందుకు కుమార్ అంగీకరించి షాలేమ్‌రాజ్‌తో పాటు తన భార్యను తన గదిలో ఉంచుకున్నాడు. ఈ నెల 14వ తేదీన కుమార్ కూకట్‌పల్లికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉండాల్సిన రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు బైక్ చోరీకి గురయ్యాయి. స్నేహితుడు షాలేమ్‌రాజ్‌తో పాటు ఆయన భార్య ఇంట్లో నుంచి ఉడాయించారు. కొద్దిసేపట్లోనే ఆయనకు బ్యాంక్ నుంచి రూ. 1.70 లక్షలు డ్రా అయినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా తన అకౌంట్ నుంచి షాలేమ్‌రాజ్ బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బు బదిలీ అయినట్లుగా తెలిపారు. తన మొబైల్ నంబర్‌కు బ్యాంక్ అకౌంట్ అనుసంధానంగా ఉందని మొబైల్ ఫోన్లోంచి సిమ్ కార్డు దొంగిలించి షాలేమ్‌రాజ్ ఈ డబ్బులు బదిలీ చేయించుకున్నట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు షాలేమ్‌రాజ్‌పై ఐపీసీ సెక్షన్ 380 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వాక్‌వేలో కుక్క పిల్లలను చంపిన బాలుడు) -
అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!
సాక్షి, మదనపల్లె టౌన్: మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆ షాపులో పనిచేసే సేల్స్‌మెన్ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మదనపల్లె–పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం (దినేష్ వైన్స్)లో ఈ నెల 28న అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడటం విదితమే. కేసు నమోదు అనంతరం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్‌కుమార్, క్లూస్ టీం బృందం సేకరించిన ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బుధవారం డీఎస్పీ రవిమనోహరాచారి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించిన వివరాలు..మద్యం షాపు చోరీ కేసులో ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన పి.సుజిత్(23) ప్రధాన నిందితుడు అని తేలింది. ఇతడు మద్యం షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ చోరీకి స్కెచ్ వేశాడు. నాలుగు రోజులుగా బ్యాంకులో మద్యం షాపు సొమ్మును జమ చేయకపోవడంతో దీనిని చోరీ చేసి అప్పులు తీర్చాలని తలపోశాడు. అదే ఊరులో ఉంటున్న తన స్నేహితుడు ఎస్. అబ్దుల్ కలాం అలియాస్ రంజాని(20) సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 28న రాత్రి మద్యం షాపు తాళాలు చాకచక్యంగా తెరచి క్యాష్ చెస్ట్లాకర్తో పాటు రూ.8,99,720 లక్షల నగదును చోరీ చేశారు. ఆ తర్వాత లాకర్‌ను మాత్రం తురకపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేశారు. చోరీ సొమ్ముతో అప్పులు తీర్చడానికి రుణదాతల వద్దకు వెళ్తుండగా స్థానిక సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్లో వారిని సీఐ, ఎస్ఐల బృందం మంగళవారం ఉదయం అరెస్ట్ చేసింది. కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులు ప్రకటించారు. నాన్న కోసం..! ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన ప్రశాంత్ బాబుకు ఏకైక కుమారుడు పి.సుజిత్. డిగ్రీ వరకు చదివాడు. ప్రశాంత్‌బాబు అనారోగ్యం బారిన పడడంతో చేసిన వైద్యపరీక్షల్లో గుండె వాల్వులు చెడిపోయాయని తేలింది. దీంతో డాక్టర్లు గుండెకు స్టంట్ ఏర్పాటు చేశారు. సుజిత్ చేసిన అప్పులకు తోడు తన తండ్రి గుండె ఆపరేషన్‌కు చేసిన అప్పులు తీర్చడం భారమయ్యాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్ ఉద్యోగం పొందాడు. వచ్చే జీతంతో అప్పులు తీర్చలే క, మద్యం దుకాణం సొమ్ముపై కన్నేశాడు. చోరీకి స్కెచ్ వేసి, చివరకు అరెస్టయి, తన స్నేహితుడిని కూడా కటకటాల పాల్జేశాడు. -
చెరువులో చేపలు లూటీ చేశారని..
మేళ్లచెరువు (హుజూర్నగర్) : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని కంది బండ గ్రామ పరిధిలోని ఊరచెరువులో చేపలు గురువారం లూటీకి గురయ్యాయి. వివరాలు.. మండలంలోని కందిబడం గ్రామం పరిధిలోని ఊరచెరువు స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఉండగా దాన్ని కొంతమంది గ్రామస్తులు రూ.30లక్షల లీజుకు తీసుకుని చేప పిల్లలు పోసి పెంచారు. కాగా రెండురోజులుగా చేపలు పడుతున్నారు. గురువారం కూడా చేపలు పట్టే సమాయానికి మండలంలోని పలు గ్రామాలతో పాటు కోదాడ, హుజూర్నగర్, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు వందల మంది చెరువులోకి దిగి ఇష్టం వచ్చనట్లు చేపలు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన లీజు దారులు చేపలు పట్టె వారికి చెందిన సుమారు 20బైక్‌లకు నిప్పంటించారు. దీంతో బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో హుజూర్నగర్ ఫైర్ స్టేషన్ వారు వచ్చి మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కాలిపోయిన సుమారు 8 బైక్‌లను స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వారు తెలిపారు. దగ్ధమవుతున్న లూటీదారుల బైక్‌లు -
కెనరా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
సాక్షి, వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట కెనరాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. వెల్దుర్తి సెంట్రల్‌బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించిన ఘటన మరువకముందే మళ్లీ దుండగులు మరో బ్యాంకులో చోరీకియత్నించారు. గ్యాస్‌కట్టర్ సహాయంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అప్రమత్తతతో దుండగులు పరారయ్యారు. బ్యాంక్‌లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ కెనరాబ్యాంక్‌లో దుండగులు చొరబడి బంగారు నగలతో పాటు లాకర్లలోని నగదు ఎత్తుకెళ్లండంతో, చోరీ ప్రయత్నం ఘటన తెలుసుకున్న ఖాతాదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. చివరికి లోనికి ప్రవేశించకుండానే దుండగులు పరారయ్యారని తెలుసుకుని ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. సంఘటనకు సంబంధించిన వివరాలను చేగుంట ఎస్సై సత్యనారాయణ, బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల 30నిమిషాల సమయంలో బ్యాంక్‌లో అలారం మోగింది. దీంతో అక్కడే కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు గణేష్ అప్రమత్తమై బ్యాంకు చుట్టూ కలియతిరిగాడు. ఈ క్రమంలో బ్యాంక్ వెనుక భాగంలో ఇద్దరు దుండగులు కిటికీ గ్రిల్స్ గ్యాస్‌కట్టర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్యూరిటీ గట్టిగా అరుపులు చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు గ్యాస్ సిలిండర్లను అక్కడే వదిలి పరారయ్యారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, బ్యాంక్‌మేనేజర్ బ్యాంక్‌లో పరిశీలించి ఎలాంటి అపహరణ జరగలేదన్నారు. బ్యాంక్ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ గార్డును ఉంచడంతో పాటు బ్యాంకులో రక్షణ చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. -
చెరువును లూటీ చేశారు..
కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలల సాయంతో చేపలను పట్టుకెళ్లారు. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయిందనే దష్ప్రచారంతోనే జనం తమ చెరువును లూటీ చేసినట్లు కార్మికులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవిలోని పెద్ద చెరువులో మత్స్యకార్మికులు కొన్నేళ్లుగా చేపలను పెంచుకుంటున్నారు. అయితే మత్స్యకార్మికులు చేపలు పట్టడం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు వద్ద కాపలాగా ఉన్న కార్మికులపై వందలాది మంది దాడి చేసి చెరువులోకి దిగి చేపలను పట్టుకున్నారని మత్స్యకార్మికులు లింగరబోయిన శ్రీను, రేషబోయిన నారాయణ, కొణతం పెంటయ్య, మామిడి యాకన్న, వెంకన్న, వీరన్న, రాజు, కృష్ణ, వీరేందర్ తెలిపారు. చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నాయని చెరువును వదిలిపెట్టలేదని వారు తెలిపారు. కురవికి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర చేసి చెరువులో చేపలు పట్టడం పూర్తయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో కురవి గ్రామస్తులు, తండా గిరిజనులతోపాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వలలతో చేపలను పట్టుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయమై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు. చేపలు అయిపోయాయనే.. చెరువులో చేపలు పట్టడం పూర్తయిందనే సమాచారంతో కురవితో పాటు చుట్టుపక్కల తండాలకు చెందిన గిరిజనులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని చెరువులో చేపలు పట్టుకున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. -
ఏటీఎం పగులగొట్టి రూ.26లక్షలు చోరీ
అన్నానగర్(చెన్నై): కోయంబత్తూరులోని ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. కోయంబత్తూరు తన్నీర్పందల్ రోడ్డులో ఆక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉంది. దీనికి రెండు షట్టర్లు ఉన్నాయి. ఇందులో ఓ షట్టర్‌కు ఆదివారం రాత్రి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఏటీఎం మరమ్మతుకు గురైందని భావించి ఎవరూ అక్కడ నగదు తీయడానికి రాలేదు. ఈ స్థితిలో సోమవారం సాయంత్రం ఆక్సిస్ బ్యాంక్ అధికారులు ఆ దారిన గస్తీకి వచ్చారు. ఎటీఎం మెయిన్ షట్టర్ మూసి ఉండడం చూసి లోపలికి వెళ్ళి చూశారు. ఏటీఎం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఏటీఎం నుంచి రూ.26 లక్షల నగదు చోరీ అయినట్టు తేలింది. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. -
6 కిలోల బంగారం చోరీ!
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో.. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు కోవెలకుంట్ల (బనగానపల్లె): కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఓ బంగారు నగల షాపు యజమాని ఇంట్లో భారీ చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో బంగారు నగలు, సొత్తు దొంగలు దోచుకెళ్లారు. యజమాని కోవెలకుంట్లలోని అమ్మవారిశాల సమీపంలో పెండేకంటి ఆంజనేయులు జ్యూవెలరీ షాపు నిర్వహిస్తు న్నాడు. భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి శనివారం కుటుంబ సమేతంగా హైదరా బాద్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. అదను చూసుకొని దొంగలు శనివారం అర్ధరాత్రి ఇంటి గేటు దూకి తాళాలు పగలగొట్టి బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్న రూ.1.95 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున హైదరా బాద్ నుంచి వచ్చిన బాధితుడు ఇంట్లోకి వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ వివరాలను తెలుసుకున్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
హిందూపురంలో దోపిడీ
- కొరియర్ బాయ్‌నంటూ వచ్చి ఇంట్లోకి జొరబడి.. - పట్టపగలే రూ.4 లక్షల బంగారు నగలు, రూ.లక్ష నగదుతో పరారీ హిందూపురం అర్బన్ : హిందూపురంలో నిత్యం రద్దీగా ఉండే ఎంఎఫ్ రోడ్డులోని ఓ ఇంటిలోకి దొంగలు పథకం ప్రకారం చొరబడ్డారు. ఇంట్లోని వృద్ధురాలిని మరణాయుధాలతో బెదిరించారు. ఆనక బంగారు నగలు, నగదుతో ఉడాయించారు. గురువారం పట్టపగలు జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక ఎంఎఫ్ రోడ్డులోని మండి మార్చెంట్ కృష్ణమూర్తి, అతని కుమారులందరూ సొంత పనుల కోసం బయటకు వెళ్లారు. దొంగలు అదే ఇంటిని టార్గెట్ చేశారు. ఇంట్లో వృద్ధురాలు మంజుల మాత్రమే ఉందని పసిగట్టి, దోపిడీకి పథకం పన్నారు. గడియ పెట్టిన తలుపు వద్దకు ఇద్దరు వచ్చి ‘మీకు అర్జెంట్ కొరియర్’ వచ్చిందని తెలిపారు. వృద్ధురాలు తలుపుతీసే లోపే వారే గడియాను తీసి లోనికి చొరబడ్డారు. ఆ వెంటనే వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. డబ్బు ఎక్కడ దాచోరో చెప్పాలని గద్దించారు. ఆమెను వెంటబెట్టుకుని ఇల్లంతా కలియతిప్పారు. డబ్బు లేదని, దేవుడి గదిలో వెండి పూజ సామగ్రి ఉందని ఆమె చెప్పగా.. ఒంటిపైనున్న నగలు తీసుకొని, తనను వదిలేయాలని ఆమె ప్రాధేయపడింది. దీంతో దొంగలు ఆమె నోటికి ప్లాస్టర్ వేసి.. చేతులు కట్టేసి వంటింట్లో బంధించారు. తర్వాత రూ.4 లక్షలు విలువ చేసే బంగారు మంగళ్యం చైను, రెండు గాజులు, చెవి కమ్మలు, రూ.లక్ష నగదు ఎత్తుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా తమ సిబ్బందితో కలసి ఆ ఇంటిని పరిశీలించారు. ఆధారాల కోసం క్లూస్ టీంను రప్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదో రకం దోపిడీ!
-
ఇదో రకం దోపిడీ!
హైదరాబాద్: లంబోదరుడి లడ్డూకు ఎంత కష్టం వచ్చింది. ఖైరతాబాద్ భారీ గణనాథుడి చేతిలో ఠీవిగా కొలువై పూజలందుకున్న లడ్డూ నేడు దోపిడీదారుల చేతుల్లో పడి చిన్నాభిన్నమైంది. సర్వం దోచుకుతింటున్న లూటీదారులు చివరకు వినాయకుడి లడ్డూను వదల్లేదు. ఖైరతాబాద్ గణేశుడి లడ్డూను భక్తులకు పంపిణీ చేయలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రసాదం కోసం ఎగబడడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పాడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. చేసేదీ లేక లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. తయారీదారులకే దీన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. భారీ లడ్డూను లారీలో తాపేశ్వరంకు పంపారు. లడ్డూ ఉన్న లారీని హయత్ నగర్ లో ఆపేసి దోపిడీదారులు తమకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. దేవుడి ప్రసాదాన్ని డబ్బులకు అమ్ముతూ సరికొత్త దోపిడీకి తెరతీశారు. వీరి లూటి వ్యవహారం మీడియా కంటపడడంతో దుండగులు జారుకున్నారు. -
ముంబై రైల్వే స్టేషన్ వద్ద చోరీ
-
ముంబైలో ఆంధ్రాబ్యాంక్ పీవోపై దాడి, 5లక్షల దోపిడి
ముంబయి : ముంబై రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం దారి దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లా ఆంధ్రాబ్యాంక్ లో పీవోగా పనిచేస్తున్న సుబ్బారావు దోపిడీకి గురయ్యారు. రైల్వే స్టేషన్ కు వస్తున్న ఆయనను దుండగులు చితకబాది అయిదు లక్షల నగదును దోచుకు వెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా సుబ్బారావు సింగరాయకొండకు చెందినవారు. ఆయన వద్ద దుండగులు నగదుతో పాటు విలువైన వస్తువులు దోచుకు వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ముంబయి రైల్వే పోలీసులు చెబుతున్నారు. -
కళ్లల్లో కారం కొట్టి రూ.11 లక్షలు లూటీ
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్ బ్యాంక్ అధికారి ఇంట్లో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. అధికారి రాంప్రసాద్ కళ్లల్లో కారం కొట్టి ఏటీఎంలో ఉంచేందుకు దాచిన రూ.11 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. ఇల్లు అద్దెకు ఉందా అంటూ వారు తమింట్లోకి చొరబడ్డారని, లేదని చెప్పేలోపే తన కంట్లో కారం చల్లారని చెప్పాడు. తర్వాత ఇంట్లోకి చొరబడి డబ్బు ఎత్తుకుపోయారని వివరించాడు. వారిని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వాపోయాడు. అయితే కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న రాంప్రసాద్ వ్యహారశైలిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి మాటలకు పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సెక్యూరిటీ గార్డు, వ్యాన్ డ్రైవర్ బయటే ఉన్నప్పటికీ దొంగలను పట్టుకోలేకపోయారు. దొంగలు పారిపోయిన తర్వాతే రాంప్రసాద్ కేకలు పెట్టడంతో అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
టైరు పంక్చరైందని చెప్పి దోచేశారు
హైదరాబాద్: దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. డబ్బు కంటపడితే చాలు కొట్టేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కాపలా కాసి కాసులపై కన్నేస్తున్నారు. దృష్టి మరల్చి సొమ్ము లాక్కుపోతున్నారు. హైదరాబాద్ చైతన్యపురి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో గురుశంకర్ అనే వ్యక్తి దొంగలు రూ.9 లక్షలు అపహరించారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి బైకుతో వెళుతున్న సమయంలో ఈ చోరీ జరిగింది. బైక్ టైర్ పంక్చర్ అయిందని దృష్టి మరల్చి డబ్బు సంచి లాక్కపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా తెనాలి గంగనమ్మపేటలో జరిగిన మరొక ఘటనలో రూ. 8 లక్షలు మాయమయ్యాయి. పంజాబ్ నేషనల్ నుంచి డబ్బులు డ్రా చేసి బైకుపై వెళుతుండగా టైరు పంక్చరైంది. మెకానిక్ షాపుకు వెళ్లి పంక్చర్ వేయించుకుని తిరిగొచ్చేసరికి డబ్బు సంచి మాయమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సీబీఐ పేరుతో భారీ దోపిడీ
* రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారంతో ఉడాయించిన ఆగంతకులు వరంగల్, న్యూస్‌లైన్ : సీబీఐ పేరుతో వచ్చిన నలుగురు ఆగంతకులు ఆ ప్లాట్లోని నగదు, బంగారు ఆభరణాలను దర్జాగా తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఇంట్లో వారు అడగగా మిమ్మలందర్నీ తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేయాల్సి ఉంటుందని భయపెట్టి మరీ వెళ్లిపోయారు. జరిగిన మోసం తెలిసి బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నారుు.. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వైష్ణవి ఆపార్టుమెంట్ డి-2 బ్లాక్‌లో నివాసముంటున్న బానోతు రాజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం ఆఫీస్‌కు వెళ్లాడు. ఇంట్లో రాజు భార్యాపిల్లలతో పాటు బంధువులు కూడా ఉన్నారు. అయితే మూడు రోజుల క్రితం అతని బావమరిది ఓ ఫ్లాట్ కొనుగోలు కోసం రూ.50 లక్షలను బానోతు రాజు ఇంట్లో ఉంచాడు. మూడు రోజులుగా నగరంలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజు ఇంట్లో భారీ ఎత్తున డబ్బున్న విషయం గమనించిన నలుగురు వ్యక్తులు గురువారం మధ్యాహ్నం సీబీఐ పేరుతో వారి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి తాము సీబీఐ అధికారులమని ఇల్లంతా సోదాలు ప్రారంభించారు. రూ.50 లక్షల నగదు ఉంది.. ఎక్కడివంటూ బెదిరించడంతో.. నిజంగా అధికారులేనని రాజు కుటుంబ సభ్యులు నమ్మారు. ఆగంతకులు రూ.50 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాజు కుటుంబ సభ్యులు ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు డబ్బు, బంగారంతో పాటు వారిని కూడా ఆఫీస్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తామంటూ బెదిరించడంతో వెనక్కి తగ్గారు. ఇదే అదునుగా భావించిన ఆ నలుగురూ అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, రూ.50 లక్షలు ఇంట్లో ఉన్న విషయం దగ్గరి వారికే తెలిసి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన ప్రదేశానికి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి, క్రైం డీస్పీ రాజమహేంద్రనాయక్ చేరుకుని విచారణ చేపట్టారు. -
పట్టపగలే హత్య, దోపిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పట్టపగలే దారుణం జరిగింది. జ్వరంతో బాధపడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న శివకుమార్ (19) అనే యువకుణ్ని కాళ్లు, చేతులు కట్టేసి లుంగీతో ఉరేసి దారుణంగా హతమార్చిన దుండగులు... బీరువాలోని కిలో బంగారం, రూ.12 లక్షల నగదు దోచుకుపోయారు. హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ ఆగాపుర డి-బ్లాక్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. ఇసుక వ్యాపారులైన కావడి ఎల్లమ్మ, పోచయ్య దంపతుల దత్త పుత్రుడైన శివకుమార్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పోచయ్య బంధువుల ఇంట్లో శుభకార్యానికి, ఎల్లమ్మ దుకాణానికి వెళ్లారు. పోచయ్య సోదరుని మనవడైన శివకుమార్ జ్వరంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వంట గ్యాస్ రాగా ఎల్లమ్మ వచ్చి తీసుకుని తిరిగి దుకాణానికి వెళ్లింది. అనంతరం దుండగులు ప్రణాళిక ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. పెంపుడు కుక్క మొరగకుండా దానికి మత్తు మందిచ్చారు. పడుకుని ఉన్న శివకుమార్‌ను చంపేసి, మరో గదిలోని బీరువాలో దాచిన బంగారం, నగదు కాజేశారు. వెళ్తూ టీవీ ఆన్ చేసి, బయట నుంచి గొళ్లెం వేసి పారిపోయారు. ఇంటిపై అంతస్తుల్లో అద్దెకుంటున్న వారికి అలికిడి కూడా విన్పించలేదని తెలిసింది. సాయంత్రం నాలుగింటికి ఇంటికొచ్చిన ఎల్లమ్మ, నిర్జీవంగా పడున్న శివను చూసి తల్లడిల్లింది. ఆమె ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో రాత్రి పదింటి దాకా పోలీసులు ఆధారాల కోసం ప్రయత్నించారు. పోలీసు జాగిలం సమీపంలోని మాజీ పోలీస్ అధికారి ఇంటిదాకా వెళ్లి ఆగింది. పోచయ్య ఎదురింట్లోని సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది తెలిసిన వారి పనిగా అనుమానిస్తున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.