
టైరు పంక్చరైందని చెప్పి దోచేశారు
హైదరాబాద్: దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. డబ్బు కంటపడితే చాలు కొట్టేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కాపలా కాసి కాసులపై కన్నేస్తున్నారు. దృష్టి మరల్చి సొమ్ము లాక్కుపోతున్నారు.
హైదరాబాద్ చైతన్యపురి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో గురుశంకర్ అనే వ్యక్తి దొంగలు రూ.9 లక్షలు అపహరించారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి బైకుతో వెళుతున్న సమయంలో ఈ చోరీ జరిగింది. బైక్ టైర్ పంక్చర్ అయిందని దృష్టి మరల్చి డబ్బు సంచి లాక్కపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుంటూరు జిల్లా తెనాలి గంగనమ్మపేటలో జరిగిన మరొక ఘటనలో రూ. 8 లక్షలు మాయమయ్యాయి. పంజాబ్ నేషనల్ నుంచి డబ్బులు డ్రా చేసి బైకుపై వెళుతుండగా టైరు పంక్చరైంది. మెకానిక్ షాపుకు వెళ్లి పంక్చర్ వేయించుకుని తిరిగొచ్చేసరికి డబ్బు సంచి మాయమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.