chaitanyapuri
-
చైతన్యపురి హిట్ అండ్ రన్: ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైతన్యపురి సీఐ తెలిపారు. మరో ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్వో హరికృష్ణదిగా గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఎల్బీనగర్-ఉప్పల్ రోడ్లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీనగర్ కమాన్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ సతీమణి పేరుతో ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణ కొడుకు సాయికార్తీక్ అతని ఫ్రెండ్స్ ఆ కారులో ఉన్నటులు సమాచారం. కమాన్‌ను డీకొట్టడంతో కారులో ఉన్నఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కమాన్ వద్ద ఉన్న యువకుడికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కార్తీక్ తన తండ్రి కారును తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో.. నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి, సాయి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్తపేట ఓమ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైతన్యపురి నర్స్ అనురాధ హత్య కేసులో సంచలన విషయాలు
-
ఐపీఎల్ క్రికెట్ సీజన్ ను క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ ముఠాలు
-
ఖాళీ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం: ఆర్. కృష్ణయ్య
చైతన్యపురి: ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉన్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏ సీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తెలంగాణలో 44 వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం కావటంతో లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ..
చైతన్యపురి(హైదరాబాద్): మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్ అనే డెలివరీ బాయ్ శనివారం ఉదయం భవానీనగర్‌లోని వరలక్ష్మి టిఫిన్స్ వద్దకు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు. హోటల్లోకి వెళుతుండగా బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు కిరణ్‌కు తగిలాడు. దీంతో చూసి వెళ్లాలని చెప్పటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కిరణ్‌పై దాడికి దిగారు. తప్పించుకొని రోడ్డుపై పరుగెత్తుతుండగా వెంటపడి మరీ పిడిగుద్దులు, చెప్పులతో తీవ్రంగా కొట్టారు. చదవండి: నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన.. అక్కడే ఉన్న స్విగ్గీ డిలివరీ బాయ్స్ కొందరు వారిని అడ్డుకొనేందుకు యత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. స్విగ్గీబాయ్స్, స్థానికులు కొందరు వారి వెంటపడగా ముగ్గురూ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన కొందరు సరూర్‌నగర్‌లో పట్టుకుని ముందుగా సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఘటన చైతన్యపురి పరిధిలో జరగడంతో వారిని అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కెనడా నుంచి ఇటీవలే వచ్చిన మలక్‌పేటకు చెందిన ఎన్ఆర్ఐ పి.ఆకాష్‌రాజ్ (26), సైదాబాద్‌కు చెందిన పి.శివ (22), ఎం.శివ (21)గా గుర్తించారు. కారులో ఓ యువతి కూడా ఉందని సమాచారం. నిందితులంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. -
Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై సరూర్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సాగర్ మొండల్ అలియాస్ రాజు అలియాస్ బిల్లు (31), రోహన్ మండల్ (22) నగరానికి వచ్చి సరూర్‌నగర్ అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వెబ్సైట్లో యువతుల ఫొటోలు పెట్టి కస్టమర్లకు సఫ్లై చేస్తున్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ తమ దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. వీరితో పాటు సహకరిస్తున్న మరో ముగ్గురిని గత డిసెంబర్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నాగర్మండల్, రోహన్మండల్పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
సూసైడ్ నోట్ రాసి.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చైతన్యపురి: ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, రాచూరు గ్రామానికి చెందిన గుత్తి బాలయ్య కుమారుడు అనిల్ కుమార్ అవంతి కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను స్నేహితుడితో కలిసి న్యూ దిల్‌సుఖ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 6న స్నేహితుడు సొంతూరుకు వెళ్లగా అనిల్ ఒక్కడే గదిలో ఉన్నాడు. రెండు రోజులుగా అద్దెకు ఉంటున్న వారు కనిపించకపోవడంతో సోమవారం ఇంటి ఓనర్ గది వద్దకు వెళ్లి చూడగా లోపల గడియ పెట్టి వుంది. కిటికీ లోనుంచి చూడగా అనిల్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గదిలో పోలీసులు తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
ఈనెల 24న యువతి నిశ్చితార్థం.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని
సాక్షి, చైతన్యపురి: ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఓ యువతి అదృశ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ లాలయ్య తెలిపిన వివరాల ప్రకారం...దిల్సుఖ్నగర్ దుర్గానగర్‌లో కాటిరెడ్డి అంజిరెడ్డి హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇతని మేనమామ కూతురు మాధవీలత(19) పంజగుట్టలోని మరో హాస్టల్లో అమ్మమ్మ వద్ద ఉంటోంది. కాగా, ఇటీవల ఈమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. శనివారం ఉదయం మాధవిలత పంజగుట్టలో మెట్రో రైల్ ఎక్కి దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్‌కు వచ్చింది. అక్కడి నుంచి తమ పిన్ని ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం మేనబావ అంజిరెడ్డి బంధు,మిత్రులను వాకబు చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో సోమవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 24న మాధవీలతకు పెళ్లి నిశ్చితార్థం కావాల్సి ఉందని, అయితే, ఈ పెళ్లి ఇష్టంలేని గతంలో చెప్పిందని, ఈ కారణంతోనే అదృశ్యమై ఉంటుందని అంజిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... -
కుక్కకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
చైతన్యపురి: కుక్కకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారని ఓ వ్యక్తి చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురి డివిజన్ గణేష్‌పురి కాలనీలో నివసించే శంకర్ వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటాడు. మంగళవారం ఒక కుక్క చనిపోయింది. చదవండి: అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం పక్కింట్లో ఉండే మనోజ్ కుటుంబ సభ్యులు విద్యుత్ షాక్ ఇవ్వటంతో అది చనిపోయిందని అనుమానం వ్యక్తం చేస్తూ శంకర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శునకం కళేబరాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శంకర్, మనోజ్‌ల మధ్య కొంత కాలంగా ఉన్న గొడవల కారణంగా ఫిర్యాదు చేశాడా...? లేదా నిజంగానే విద్యుత్ షాక్ ఇవ్వటం వల్ల కుక్క చనిపోయిందా...? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
‘జైలు’లో పెళ్లి సందడి హీరోయిన్
ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు... చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్ మండి రెస్టారెంట్. పెళ్లి సందడి సినిమా ఫేం శ్రీలీల ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లో మొత్తం జైలు వాతావరణం ఉండేలా..ఫన్నీగా తీర్చిదిద్దారు. -
వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం..
సాక్షి, చైతన్యపురి: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని మరో ఇద్దరిపై చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం (49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య (32) హైదరాబాద్‌కు వచ్చి సులువుగా డబ్బు సంపాదించేందుకు లొకాంటో వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న చిత్రాలు పెట్టి ఆన్లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించాడు. పేదలు, కార్మికుల, ఒంటరి మహిళలకు డబ్బు ఆశచూపి వారి ద్వారా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో అల్కాపురిలోని ఓ అపార్టుమెంటులో పోలీసులు దాడి చేసి నిర్వహకులతో పాటు పలు యువతులను రక్షించారు. అనంతరం నిందితులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇద్దరి పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. -
ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి..
సాక్షి, చైతన్యపురి: ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగాండా వాసులు అయిదుగురిని రాచకొండ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన మేరకు.. లొకాంటో యాప్ ద్వారా యువతుల చిత్రాలు పోస్ట్ చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి వారి ఆటకట్టించాలని పోలీసులు నిర్ణయించారు. డెకాయ్ బృందంలోని సభ్యుడు కస్టమర్‌గా యాప్‌లోని ఫోన్‌కు కాల్ చేసిన సాలి మిల్లి అలియాస్ నాగబాలా షేక్ అలియాస్ షీలాను సంప్రదించాడు. ముగ్గురు యువతులు ఉన్నారని చెప్పడంతో దిల్సుఖ్నగర్ రాజధాని థియేటర్ వద్దకు రావాలని లోకేషన్ షేర్ చేశాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఇద్దరు నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులు రావడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నిషేధిత నార్కోటిక్స్ డ్రగ్స్ (మత్తుమందు) కలిగి ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి అయిదు సెల్ఫోన్లు, రూ.5500 నగదు, 5గ్రాముల కెటామైన్ డ్రగ్, 17 గ్రాముల గుర్తుతెలియని మత్తుమందు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి చట్టవిరుద్ధంగా ఇక్కడే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. టోలిచౌకిలో వీరు నివాసముంటున్నారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. -
పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం!
సాక్షి, చైతన్యపురి: బకాయి జీతాలు చెల్లించాలని... తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కళాశాల పాకాల ప్లాజా బ్రాంచ్ లెక్చరర్ల ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. సుమారు 45 మంది లెక్చరర్లు చేస్తున్న ధర్నాకు ప్రైవేట్ లెక్చరర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు లాక్డౌన్లో చెల్లించాల్సిన సగం జీతం చెల్లించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సీనియారిటీ ఉండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేయటంలో విద్యాబుద్ధులు నేరి్పన లెక్చరర్లను పక్కన పెట్టి ఫ్రెషర్స్‌ను తీసుకోవటం అన్యాయమని అన్నారు. జీతాలు లేక కుటుంబ సభ్యులను పస్తులుంచాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నం... శ్రీచైతన్య కళాశాల వద్ద నిరాహార దీక్షలో జువాలజీ లెక్చరర్ డాక్టర్ హరినాథ్ బలవన్మరణానికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తోటి అధ్యాపకులు అతడిని అడ్డుకున్నారు. 25 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలు అందించిన తనకు జీతాలు చెల్లించడం లేదన్నారు. భార్య, పిల్లలకు ఒక్కపూట కడుపునిండా తిండిపెట్టలేని తనకు ఆత్మహత్యే శరణ్యమని హరినాథ్ విలపించాడు. వయసు కారణంగా చూపి కళాశాల డీన్ రవికాంత్ వేధింపులకు గురి చేసి తనను విధుల్లోకి తీసుకోలేదన్నారు. ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హరినాథ్‌ను స్టేషన్‌కు తరలించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో ప్రశాంత్, భగవంత్‌రెడ్డి, చందు, మహేష్, నిర్సింహ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: పేరాల శేఖర్‌రావు చైతన్యపురి: లెక్చరర్లను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. హరినాథ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న వారు గురువారం చైతన్యపురి పీఎస్‌కు చేరుకుని ఇన్స్పెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, లెక్చరర్ల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు కనీసం స్పందించకపోవటం సిగ్గు చేటన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో యువతుల హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఫూటుగా మద్యం సేవించిన నలుగురు యువతులు చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో హల్చల్ చేశారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్ ఎదురుగా ఉన్నబస్‌స్టాప్‌లో తిష్ట వేశారు. వైట్నర్ పీల్చుతూ మద్యం కొనేందుకు వచ్చిన వారితో, రోడ్డు వెంట వెళ్తున్నవారితో అకారణంగా గొడవకు దిగారు. వారిపై దాడులు కూడా చేస్తూ నానా హంగామా సృష్టించారు. తమ వద్ద ఆ యువతులు డబ్బులు కూడా లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. రాత్రి 9 గంటల సమయంలో ఓ యువకుడిపై దాడి చేసి, అక్కడే బస్‌స్టాప్‌లో పడుకుని ఉన్న మరో యువకుడి బట్టలిప్పి మైకంలో ఉన్న యువతులు రౌడీల్లాగా ప్రవర్తించారని తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (చదవండి: దారుణం: మందలించాడని మర్డర్ చేశాడు) -
ట్రాక్టర్ బీభత్సం
చైతన్యపురి: నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో శనివారం ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. అయితే ఈ ఘటనలో రెండు కార్లు, ఐదు బైక్‌లు ధ్వంసం కాగా అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గణేశ్పురి కాలనీలోట్రాక్టర్లో బిల్డింగ్ వ్యర్థాలను తీసుకెళ్తున్న డ్రైవర్ లింగయ్యకు ఫిట్స్ వచ్చి డ్రైవింగ్ సీటునుంచి కిందికి పడిపోయాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన బైక్‌లు, కార్లను ఢీకొంటూ వెళ్లి ఆగింది. ఫిట్స్ తో కిందపడిపోయిన లింగయ్యను స్థానికులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జానకిరెడ్డి తెలిపారు. -
డబ్బుల కోసం డాక్టర్‌కు బెదిరింపులు..
సాక్షి, చైతన్యపురి: డబ్బులు ఇవ్వాలని ఓ డాక్టర్‌ను బెదిరిస్తున్న ముగ్గురు వ్యక్తులను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్ ఏసీపీ పృద్వీధర్ వివరాలు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ శ్రీనగర్‌కాలనీకి చెందిన డాక్టర్ గంజి శ్రీనివాస్ కన్సల్టెంట్ ఆడియోలజిస్టుగా పనిచేస్తున్నాడు. ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే భీమా లక్ష్మణ్ ద్వారా అతను వినికిడి యంత్రాలను కొనుగోలు చేసేవాడు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి పేషెంట్లకు ఎక్కువ ధరకు ఇస్తున్నట్లు గుర్తించిన లక్ష్మణ్ తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు శ్రీనివాస్ అంగీకరించకపోవడంతో నల్గొండ జిల్లాకు చెందిన తన స్నేహితుడు మేకల రఘురాంరెడ్డికి చెప్పడంతో అతను డాక్టర్‌కు ఫోన్‌చేసి వ్యవహారం త్వరగా సెటిల్ చేసుకోవాలని సూచించాడు. అనంతరం వరంగల్‌కు చెందిన పొగాకుల నాగరాజు విలేకరినని పరిచయం చేసుకుని డాక్టర్‌కు ఫోన్‌చేసి త్వరగా డబ్బులు ఇవ్వకపోతే వార్త రాస్తానని బెదిరించాడు. డాక్టర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మన్మదకుమార్ కేసు నమోదు చేశారు. శుక్రవారం హయత్‌నగర్‌లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చైతన్యపురిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
-
ఆడపిల్లల మనసు అర్థం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్ : ‘బాల్యవివాహాలు చేయకండి.. ఆడపిల్లల మనసు అర్థంచేసుకోండి.. రోజూ ఏడ్చుకుంటూ వుండలేను...అందుకే వెళ్లిపోతున్నా... అందరూ నన్ను క్షమించండి...’ అంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎల్ కాలనీ గాయత్రిపురంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన నర్సయ్య, లక్ష్మి దంపతుల కూతురు గీతాంజలి (26)కి ఖడెం మండలం లక్ష్మీపురానికి చెందిన శంకర్‌తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. శంకర్ మహారాష్ట్రలో ప్రయివేటు లెక్చరర్‌గా చేస్తుంటాడు. శనివారం సాయంత్రం గీతాంజలి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గీతాంజలి రాసిన ఏడు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్న తనంలోనే వివాహం చేయటం.... అర్ధం చేసుకోలేని భర్త...చదువుకుని ఉద్యోగం చేయాలన్న కల నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ వల్ల అర్ధం అవుతుందని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ చివర తన పేరు గీతాంజలి, ఐపీఎస్ అని వ్రాసింది, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చైతన్యపురి: కారుతో బాలుడి బీభత్సం
-
రోడ్డు మధ్య డివైడర్‌తో ప్రజల అవస్థలు
-
వరకట్న కాటుకు వివాహిత ఆత్మహత్య
-
రెండు కార్లు ఢీ..నలుగురికి గాయాలు
-
కిల్లర్స్‌గా మారుతున్న మెట్రో పిల్లర్స్!
⇒ చైతన్యపురిలో మెట్రో రైల్ పిల్లర్‌ను ఢీకొన్న కారు ⇒ ఇద్దరు యువకుల మృతి, నలుగురికి గాయాలు ⇒ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడికి తీవ్ర గాయాలు ⇒ మద్యం మత్తు, మితిమీరిన వేగమే కారణం ⇒ అంతా 25 ఏళ్లలోపు యువకులే.. హైదరాబాద్: మద్యం మత్తు.. మితిమీరిన వేగం మరో రెండు ప్రాణాలను బలిగొన్నాయి. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మద్యం తాగిన యువకులు కారులో అత్యంత వేగంగా వెళుతూ హైదరాబాద్ మెట్రో రైలు పిల్లర్‌ను ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పుట్టినరోజు పార్టీ చేసుకుని.. వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన గుండగోని సాయికుమార్‌గౌడ్ (25), ఎటికల శ్రీనాథ్ (24), మన్సూరాబాద్‌కు చెందిన మాచర్ల చైతన్య (25), వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌కు చెందిన కొమ్మరాజు చక్రపాణి (25), కొణితి జయచంద్రారెడ్డి (25), పందిళ్లపల్లి కృష్ణప్రసాద్ (24)లు స్నేహితులు. బుధవారం సాయికుమార్ పుట్టినరోజు కావటంతో వారంతా రాత్రి ఎనిమిది గంటల సమయంలో వనస్థలిపురం రామాలయం వద్ద కలుసుకున్నారు. తర్వాత అదే ప్రాంతంలోని ఓ బార్‌కు వెళ్లి అర్ధరాత్రి దాటే వరకు మద్యం తాగారు. బార్ నుంచి బయటికి వచ్చాక బిర్యానీ తినేందుకు సంతోష్‌నగర్‌లోని బిర్యానీ మండి సెంటర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాయికుమార్‌కు చెందిన స్విఫ్ట్ కారు (ఏపీ29బీవీ 2888)లో బయలుదేరారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న సాయికుమార్ కారును మితిమీరిన వేగంతో నడిపాడు. చైతన్యపురి కళామందిర్ సమీపంలో ముందు వెళుతున్న మరో కారును తప్పించే యత్నంలో.. ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. అతివేగంతో ఉన్న కారు డివైడర్‌కు తగిలి పల్టీలు కొడుతూ.. వేగంగా వెళ్లి మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొట్టే సమయంలో కారు పక్కకు తిరిగి.. దాని ముందుభాగం కాకుండా వెనుకభాగం పిల్లర్‌కు తగలింది. దీంతో కారు వెనుకభాగం నుజ్జునుజ్జు అయి.. ఆ వైపు కూర్చున్న చైతన్య అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ప్రమాదంతో పెద్ద శబ్దం రావటంతో సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్లు, వాహనదారులు అక్కడికి చేరుకుని.. పోలీసులు, 108కు సమాచారమిచ్చారు. గాయపడిన నలుగురిని బయటకు తీసి సమీపంలోని కొత్తపేట ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో సీటు బెల్టు పెట్టుకుని ఉన్న సాయికుమార్ ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. అయితే ప్రమాద స్థలంలోని పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న గణేశ్ (28) అనే యాచకుడి రెండు కాళ్లు విరిగాయి. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శ్రీనాథ్ మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇక తీవ్రంగా గాయపడిన చక్రపాణి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అతడిని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. కృష్ణ ప్రసాద్‌కు కుడికాలు విరగడంతో సాయిసంజీవని ఆసుపత్రిలో, జైచంద్రారెడ్డి స్వల్ప గాయాలతో ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలిలోనే మృతి చెందిన చైతన్య మన్సూరాబాద్ హేమపురి కాలనీలో నివసించే ప్రైవేటు ఉద్యోగి కృష్ణారావు, పద్మ దంపతుల రెండో సంతానం. వారి స్వస్థలం ఏపీలోని గుంటూరు. చైతన్య బీటెక్ పూర్తి చేసి గచ్చిబౌలిలోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇక ఆస్పత్రిలో మరణించిన శ్రీనాథ్ తండ్రి యాదగిరి డ్రైవర్. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురానికి చెందిన వారి కుటుంబం వనస్థలిపురం ద్వారకామయి కాలనీలో నివసిస్తోంది. మితిమీరిన వేగం వల్లే.. మద్యం మత్తులో కారు నడపడమే కాకుండా మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సరూర్‌నగర్ సీఐ లింగయ్య తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన సాయికుమార్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నామని... మోటారు వాహనాల చట్టం 304, 185 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. కారు పల్టీలు కొట్టడం చూశా.. కారు అతివేగంగా వచ్చి పిల్లర్‌ను ఢీ కొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఆర్.శ్యామ్ తెలిపారు. తాను చైతన్యపురి బస్టాప్‌లో దిగిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగిందని.. కారు పల్టీలు కొట్టడం తాను చూశానని చెప్పారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, వాహనాల్లో వెళ్లేవారు ఆగి గాయపడ్డ వారిని బయటకు తీసి, 108కు సమాచారమిచ్చారని తెలిపారు. -
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో భారీ కుంభకోణం
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ చైతన్యపురి శాఖ మేనేజర్ మురళినాయక్ ఇందుకు సూత్రధారిగా భావిస్తున్నారు. అనర్హులకు రుణాలు మంజూరు చేసి రూ. 3 కోట్ల మేర ధనాన్ని దుర్వినియోగం చేసిన మేనేజర్ తన తప్పు బయట పడేసరికి ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే, బ్యాంకు లీగల్ సెల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి మురళినాయక్‌ను దోషిగా తేల్చారు. ఈ మేరకు అతడినిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్నారు. -
నోటీసులివ్వకుండానే.. 150 ఇళ్లు కూల్చివేత
హైదరాబాద్ : చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న నిరుపేదలకు చెందిన 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని పేదలు వాపోయారు. ఇళ్లు కూల్చినందుకు నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. -
పనిమనిషిపై లాయర్ లైంగిక దాడి
హైదరాబాద్: నగరంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే బాలికపై ఇంటి యజమాని కొడుకు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉండే హైకోర్టు న్యాయవాది సుధాకర్‌రెడ్డి ఇంట్లో ఓ బాలిక(14) పనిచేస్తోంది. ఆమెపై అతని కుమారుడు, లాయర్ అయిన భరత్‌కుమార్‌రెడ్డి గత కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆమె ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు మహిళా సంఘాల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సరూర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి
-
స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి
హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లో ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత వివాదాలు దాడికి దారి తీశాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి, శంకర్ ఇరువురు చాలాకాలంగా స్నేహితులు. వీరిద్దరూ ఒకే గదిలో నివాసం ఉండేవాళ్లు. అయితే వారిమధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఓ విషయమై శుక్రవారం కలుసుకున్న వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ ఆగ్రహంతో భాస్కర్‌రెడ్డిపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు పట్టుకోబోగా శంకర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయపురికాలనీలో వివాహిత ఆత్మహత్య
చైతన్యపురి పరిధిలోని విజయపురి కాలనీ రోడ్ నెంబర్-2లో ప్రశాంతి(24) అనే వివాహిత తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు వచ్చినా..జాబులు రాలేదు
చైతన్యపురి: ‘బాబు వస్తే జాబులు’ వస్తాయని నిరుద్యోగులు కలలుగన్నారని..అయితే బాబు వచ్చినా జాబులు మాత్రం రాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 1.50 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేని పక్షంలో లక్ష మందితో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం దిల్సుఖ్నగర్ ఏపీ నిరుద్యోగ గర్జన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఖాళీగా ఉన్న 18వేల కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో పోరాడి సాధించుకున్న ఐదేళ్ల వయోపరిమితిని సడలింపును ఏపీలో కూడా ఇవ్వాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్, రాంబాబు, కరుణ, వెంకటేశ్వర్లు, వినోద్, అశోక్ పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆందోళన: కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్ : చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. సెలవులు అడిగినందుకు కాలేజీ సిబ్బంది తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు. అందుకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సదరు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వారు కూడా ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో విద్యార్థులు కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాంతో కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలో దిగి.. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. -
10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపూరిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.36,210 నగదుతోపాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చైతన్యపురిలోని ఓ ఇంట్లో యువకులు పేకాట ఆడుతున్నారని ఆగంతకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సదరు ఇంటిపై దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. -
బంగారు ఆభరణాల బ్యాగు మాయం
హైదరాబాద్ : నగరంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి బంగారు ఆభరణాల బ్యాగు పోగొట్టుకున్నాడు. దీనిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నగేష్‌బాబు (48) నగరంలో సోమవారం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. ఆటోలో లాడ్జి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న అతడు వెంట తెచ్చుకున్న 25 తులాల బంగారు ఆభరణాల బ్యాగు కనిపించకపోయేసరికి కంగారుతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చైతన్యపురిలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ : రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. -
చైతన్యపురిలో కుక్కల స్వైరవిహారం
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రణీత(4)పై కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే భాను(20) అనే యువకుడిపై కూడా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి ఇద్దరినీ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. -
వడ్డీ చెల్లించలేదని దాడి: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: వడ్డీ డబ్బులు చెల్లించలేదని చైతన్యపురిలోని ఓ ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడికి దిగారు. వివరాలు..దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురికి చెందిన కృష్ణ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న కిరణ్ అలియాస్ లడ్డూ నుంచి రూ.4 లక్షలు అప్పు తీసుకున్నాడు. దీనిపై చక్రవడ్డీ, బారువడ్డీ చేసి కిరణ్ సుమారు రూ.17 లక్షల వరకు చెక్కులు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న కృష్ణ ఇళ్లు ఖాళీ చేసి వేరొక చోట ఉంటున్నారు. వడ్డీ కట్టలేదని కిరణ్ తన అనుచరులతో కలిసి శుక్రవారం, కృష్ణ సోదరుడు శ్రీనివాస్‌తో సహా కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పార్వతి, బాలముని అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చిపోయారు. పట్టపగలే దోపిడీలకు దిగారు. కంచన్ బాగ్ పరిధిలోని మారుతీ నగర్ వద్ద నాగమణి అనే మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేశారు. రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు గొలుసు తెంచుకెళ్లారు. బాధితురాలు కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో జరిగింది. రోడ్డు మీద నదుచుకుంటూ వెళుతున్న రాధా దేవి(63) అనే మహిళ మెడలో చైన్ తెంపుకు పోయారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోయిన బంగారు గొలుసు 4తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మరో రెండు రోజుల్లో పెళ్లి: యువతి ఆత్మహత్య
హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన చైతన్యపురి పరిధిలోని సమతాపురి కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన కిమీరా(29) అనే వైద్య విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి ఇంజక్షన్ ద్వారా విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న కిమీరాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది. మరో రెండు రోజుల్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కిమీరా ఆత్మహత్య చేసుకోవటంతో తోటి విద్యార్థులు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కిమీరా ఉస్మానియాలో పీజీ చదువుతోంది. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
14 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం జరిపిన ఈ దాడుల్లో 14 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. తనిఖీలలో రూ. 1.80 లక్షల నగదు, సెల్‌ఫోన్స్, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేప్టటారు. -
పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు
హైదరాబాద్ : చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో శుక్రవారం పెట్రోలు కొట్టించుకున్న వాహనదారులకు పెట్రోలుతో పాటు నీరు కూడా వచ్చింది. ఓ వ్యక్తి బాటిల్లో పెట్రోల్ పోయించుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి పెట్రోల్ బంకు యజమాన్యాన్ని ఈ విషయం గురించి అడగటంతో.. వారు భూగర్భంలోని ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెట్రోలు కొట్టించుకున్నవారికి తిరిగి డబ్బులు ఇచ్చేశారు. కాగా కొంతమంది వ్యక్తులు ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు
హైదరాబాద్ : నగరంలోని కొత్తపేటలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన పోలీసులు మంగళవారం అతనిని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. అమిత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిందుతుడి సెల్‌ఫోన్ సిగ్నిల్స్ ఆధారంగా గుజరాత్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈనెల 14 న కొత్తపేట గాయత్రీపురం రోడ్ నెం-1లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులు చికిత్స పొందుతూ మృతిచెందారు. అక్కాచెల్లెళ్ల లను హత్య చేసిన తర్వాత అమిత్‌సింగ్ ఉప్పల్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ గాలించారు. 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు ఆ కోణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిగ్నల్స్ ఆధారంగా మంగళవారం గుజరాత్ లో అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. -
అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో అక్కాచెళ్లల్లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులు చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కృష్ణారెడ్డి, హైమావతి దంపతులకు యామిని సరస్వతి, శ్రీలేఖ సంతానం. కాగా, వీరు చైతన్యపురి పీఎస్ పరిధిలోని మోహన్‌నగర్‌లో నివాసముంటున్నారు. యామిని గీతం కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేయగా, శ్రీలేఖ చేవెళ్లలోని సాగర్ ఇంజనీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతుంది. అదే కాలేజీకి చెందిన అమిత్ సింగ్ శ్రీలేఖను ప్రేమించమని రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా అమిత్ లో ఎటువంటి మార్పురాలేదు. తాజాగా మంగళవారం ఉదయం మోహన్‌నగర్‌లోని శ్రీలేఖ ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న కత్తితో శ్రీలేఖపై దాడి చేశాడు. పక్కనే ఉన్న అక్క యామిని అడ్డురావడంతో ఆమెపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దాడి సమయంలో శ్రీలేఖ తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వైద్యం కోసం స్థానిక ఒమిని ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన యామిని, శ్రీలేఖ వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
చైతన్యపురిలో భారీ చోరి
హైదరాబాద్:ఇంట్లోవాళ్లంతా నిద్రిస్తున్న సమయంలో దొంగలు తెగబడ్డారు. చడి చప్పుడు కాకుండా ఇంట్లో ఉన్న 85 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మలక్‌పేట్ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రభాకర్ అనే వ్యాపారి ఇంట్లో ఈ చోరి జరిగింది. గురువారం అర్థరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు 85 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చోరి జరిగిన విషయం శుక్రవారం ఉదయం గుర్తించిన ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
మనస్పర్ధలతో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ :నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉంటున్న షిరిడినాథ్(28) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను గతంలో ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసేవాడు. అయితే ఇటీవలే స్టాఫ్ సెలక్షన్స్‌లో ఎంపికయ్యాడు. ఒక నెలలో డిల్లీ సెక్యూరిటీ సర్వీసెస్‌లో జాయిన్ కావాల్సి ఉండగా ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. కాగా ఇతని భార్య విజయ కర్నూలు ట్రెసరీ ఆఫీసులో క్లర్క్‌గా పనిచేస్తోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే షిరిడినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. -
మహిళపై కత్తితో దాడి.. మృతి
హైదరాబాద్: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటిరిగా మహిళలు కనిపిస్తే చాలు.. వారిపై దాడిచేసి మహిళల మెడనుంచి అభరణాలు అపహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా చైతన్యపురి మారుతీనగర్‌లో గురువారం ఓ మహిళపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మహిళ మెడ నుంచి చైన్ స్నాచింగ్‌కు యత్నించాడు. ఈ క్రమంలో మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రగాయాల పాలైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రభాత్‌నగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. మెడికల్ డిస్టిబ్యూషన్ గోడౌన్లో మంటలు చెలరేగడంతో మందులతోపాటు ఫర్నీచర్ సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది. అదే భవనంలోని మూడో అంతస్తులో నివాసముంటున్న మెడికల్ గోడౌన్ యజమాని సురేష్ తెల్లవారుజామున పోగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో మలక్‌పేట సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. కాలిపోయిన మందుల విలువ సుమారు రెండు కోట్లు ఉంటుందని మెడికల్ గోడౌన్ యజమాని సురేష్ ఆవేధన వ్యక్తం చేశారు. -
టైరు పంక్చరైందని చెప్పి దోచేశారు
హైదరాబాద్: దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. డబ్బు కంటపడితే చాలు కొట్టేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కాపలా కాసి కాసులపై కన్నేస్తున్నారు. దృష్టి మరల్చి సొమ్ము లాక్కుపోతున్నారు. హైదరాబాద్ చైతన్యపురి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో గురుశంకర్ అనే వ్యక్తి దొంగలు రూ.9 లక్షలు అపహరించారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి బైకుతో వెళుతున్న సమయంలో ఈ చోరీ జరిగింది. బైక్ టైర్ పంక్చర్ అయిందని దృష్టి మరల్చి డబ్బు సంచి లాక్కపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా తెనాలి గంగనమ్మపేటలో జరిగిన మరొక ఘటనలో రూ. 8 లక్షలు మాయమయ్యాయి. పంజాబ్ నేషనల్ నుంచి డబ్బులు డ్రా చేసి బైకుపై వెళుతుండగా టైరు పంక్చరైంది. మెకానిక్ షాపుకు వెళ్లి పంక్చర్ వేయించుకుని తిరిగొచ్చేసరికి డబ్బు సంచి మాయమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
హాస్టల్ గదిలో అభినవ్ ఆత్మహత్య
హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురిలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేటలోని ఓ కార్పొరేట్ కళాశాల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి అభినవ్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. మృతుడు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టింది. అభినవ్ వివరాలు తెలియాల్సి ఉంది.