హైదరాబాద్ : రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.