చైతన్యపురి హిట్ అండ్‌ రన్‌: ఇద్దరి పరిస్థితి విషమం | Hit And Run Accident At Chaitanyapuri In Hyderabad | Sakshi
Sakshi News home page

చైతన్యపురి హిట్ అండ్‌ రన్‌: ఇద్దరి పరిస్థితి విషమం

Published Mon, Dec 18 2023 12:39 PM | Last Updated on Mon, Dec 18 2023 2:57 PM

Hit And Run Accident At Chaitanyapuri In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైతన్యపురి హిట్‌ అండ్‌ రన్ ‍కేసులో పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైతన్యపురి సీఐ తెలిపారు. మరో ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్‌వో హరికృష్ణదిగా గుర్తించారు.

ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఎల్బీనగర్-ఉప్పల్ రోడ్‌లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీనగర్ కమాన్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు చౌటుప్పల్ ఎంఆర్‌ఓ హరికృష్ణ సతీమణి పేరుతో ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణ కొడుకు సాయికార్తీక్‌ అతని ఫ్రెండ్స్‌ ఆ కారులో ఉ‍న్నటులు సమాచారం.

కమాన్‌ను డీకొట్టడంతో కారులో ఉన్నఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కమాన్ వద్ద ఉన్న యువకుడికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కార్తీక్  తన తండ్రి కారును  తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో.. నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి, సాయి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్తపేట ఓమ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement