హైదరాబాద్: చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రభాత్‌నగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. మెడికల్ డిస్టిబ్యూషన్ గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో మందులతోపాటు ఫర్నీచర్ సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది.
అదే భవనంలోని మూడో అంతస్తులో నివాసముంటున్న మెడికల్ గోడౌన్ యజమాని సురేష్ తెల్లవారుజామున పోగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో మలక్‌పేట సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. కాలిపోయిన మందుల విలువ సుమారు రెండు కోట్లు ఉంటుందని మెడికల్ గోడౌన్ యజమాని సురేష్ ఆవేధన వ్యక్తం చేశారు.