సికింద్రాబాద్ వారణాసి గూడలోని సాయి సంజీవని మెడికల్ షాపులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ వారణాసి గూడలోని సాయి సంజీవని మెడికల్ షాపులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులో ఉన్న మెడిసిన్స్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది.