వడ్డీ చెల్లించలేదని దాడి: ఇద్దరికి గాయాలు | 2 injured in call money gang attack | Sakshi
Sakshi News home page

వడ్డీ చెల్లించలేదని దాడి: ఇద్దరికి గాయాలు

Published Fri, Feb 26 2016 2:04 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

2 injured in call money gang attack

హైదరాబాద్‌: వడ్డీ డబ్బులు చెల్లించలేదని చైతన్యపురిలోని ఓ ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడికి దిగారు. వివరాలు..దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని చైతన్యపురికి చెందిన కృష్ణ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న కిరణ్ అలియాస్ లడ్డూ నుంచి రూ.4 లక్షలు అప్పు తీసుకున్నాడు. దీనిపై చక్రవడ్డీ, బారువడ్డీ చేసి కిరణ్ సుమారు రూ.17 లక్షల వరకు చెక్కులు తీసుకున్నాడు.
 
అప్పు తీసుకున్న కృష్ణ ఇళ్లు ఖాళీ చేసి వేరొక చోట ఉంటున్నారు. వడ్డీ కట్టలేదని కిరణ్ తన అనుచరులతో కలిసి శుక్రవారం, కృష్ణ సోదరుడు శ్రీనివాస్‌తో సహా కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పార్వతి, బాలముని అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement